outsourcing
-
ఆర్టీసీలో తొలిసారి ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు డ్రైవర్లు!
సాక్షి, హైదరాబాద్: బస్సులు నడిపేందుకు ఆర్టీసీ తొలిసారి ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్లను సమకూర్చుకోనుంది. గతంలో పలు సందర్భాల్లో డిపోల్లో బస్సులను పార్క్ చేయటం, అటూ ఇటూ మార్చటం కోసం ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొంతమందిని నియమించుకున్నారు. కానీ రూట్లలో నడిపేందుకు మాత్రం తీసుకోలేదు. ప్రస్తుతం డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండటం, శాశ్వత నియామక ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేకపోవటంతో ప్రైవేటు ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించింది. 1,500 మంది డ్రైవర్లను వెంటనే నియమించుకుని, రెండు వారాల శిక్షణ ఇచ్చి బస్సులు అప్పగించనుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. పెరుగుతూ వచ్చిన కొరత భవిష్యత్తులో సొంతంగా బస్సులు అంతగా కొనాల్సిన అవసరం లేకుండా అద్దె ప్రాతిపదికన పెద్ద సంఖ్యలో బస్సులు (ఎలక్ట్రిక్ సహా) సమకూర్చుకుంటున్న ఆర్టీసీ, సిబ్బంది విషయంలోనూ భారం లేకుండా చూసుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 50 మంది చొప్పున డ్రైవర్లు రిటైర్ అవుతున్నారు. మరోవైపు చాలాకాలంగా నియామకాలు లేకపోవటంతో క్రమంగా డ్రైవర్లకు కొరత పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 1,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రత్యేక సందర్భాల్లో అదనపు బస్సులు తిప్పేందుకు డ్రైవర్లు లేని పరిస్థితి ఎదురవుతోంది. వేసవి సెలవుల్లో రద్దీ భారీగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పాల్సి ఉంటుంది. 1,500 మంది డ్రైవర్ల కొరతతో ఇది సాధ్యం కాదు. ఇప్పటికే చాలామంది డ్రైవర్లకు అవసరాన్ని బట్టి డబుల్ డ్యూటీలు వేయాల్సి వస్తోంది. నియామక ప్రక్రియ జాప్యంతో.. దాదాపు ఏడాది క్రితమే 3 వేల డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించగా, 2 వేల పోస్టుల భర్తీకి అనుమతి వచ్చిoది. అయితే ఆర్టీసీ కాకుండా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి టీఎస్పీఎస్సీ, మెడికల్ సిబ్బందికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియలు చేపడతాయని పేర్కొంది. కానీ ఆ మూడు సంస్థలు ఇప్పటివరకు జాబ్ కేలండర్‌ను ప్రకటించలేదు. ఆర్టీసీ సిబ్బంది కోసం ఎదురు చూస్తూనే ఉంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియల్లో మరింత జాప్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఔట్సోర్సింగ్ పద్ధతి తెరపైకి వచ్చింది. 4 నెలల కాలానికే.. భవిష్యత్తులో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు, సాధారణ అద్దె ప్రాతిపదికన డీజిల్ బస్సులు తీసుకోనున్నందున, ఆర్టీసీకి సొంత డ్రైవర్ల అవసరం తగ్గుతుంది. బస్సులను అద్దెకు ఇచ్చే సంస్థలే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోనుండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే డ్రైవర్లను నియమించుకోవటం కంటే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవటం మంచిదనే అభిప్రాయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనివల్ల ఆర్టీసీపై జీతాల భారం తగ్గుతుంది. ఇప్పుడు తీసుకోబోతున్న 1,500 మంది డ్రైవర్ల ఉద్యోగ కాలం మార్చి నుంచి జూన్ వరకు అని ఆర్టీసీ సర్క్యులర్‌లో పేర్కొంది. తదుపరి అవసరాలను బట్టి వీరి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే వీరిని భవిష్యత్తులో కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని కారి్మక సంఘాలు చెబుతున్నాయి.నియామకం ఇలా.. » ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో నమోదైన అర్హులను నేరుగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. » మ్యాన్‌పవర్ సప్లయింగ్ సంస్థల నుంచి తీసుకుంటే ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. » హెవీ వెహికిల్ లైసెన్స్, భారీ వాహనాలు నడపడంలో 18 నెలల అనుభవం ఉండాలి. ఎత్తు 160 సెం.మీ.కు తగ్గకుండా ఉండాలి. ఏదైనా ప్రాంతీయ భాషలో చదవటం, రాయటం వచ్చి ఉండాలి. 60 ఏళ్లలోపు వారై ఉండాలి. » వీరికి 2024లో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ రూ.22,415 చెల్లించనున్నారు. ప్రతి డ్యూటీకి బత్తాగా జంటనగరాల పరిధిలో అయితే రూ.200, జంట నగరాల వెలుపల అయితే రూ.100 చొప్పున చెల్లిస్తారు. » ఎంపికైన వారికి ఆర్టీసీ శిక్షణ సంస్థల్లో 15 రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో రోజుకు రూ.200 చొప్పున చెల్లిస్తారు. » డ్రైవర్ల అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ, డ్రైవింగ్ నైపుణ్యం అంచనా వేసేందుకు ఓ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. -
ప్రజావాణి ప్రహసనం.. ప్రజాపాలన డొల్ల: మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చిన ప్రజాపాలన డొల్లగా మారి, ప్రజాపీడన జరుగుతోందని, ప్రజావాణి ఉత్త ప్రహసనంగా తేలిపోయిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతీరోజూ ప్రజాదర్భార్ నిర్వహిస్తామని ప్రకటించి, ప్రజావాణిగా పేరు మార్చారన్నారు. ఏడాది కాలంలో సీఎం రేవంత్(Revanth Reddy) కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజావాణికి హాజరై.. పది నిమిషాల పాటు పాల్గొన్నారన్నారు. గాం«దీభవన్‌కు వెళ్తున్న మంత్రులకు ప్రజావాణికి వచ్చే తీరిక లేదని ఎద్దేవా చేశారు. ప్రజావాణిపై ఆర్టీఐ చట్టం కింద సేకరించిన సమాచారంలో ఈ కార్యక్రమం ప్రహసనంగా మారిన వైనం బయటపడిందన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు(Harish Rao) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజావాణిని చివరకు ఔట్ సోర్సింగ్(Outsourcing) ఉద్యోగులతో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ప్రజావాణిలో దరఖాస్తుల సమర్పణ వృథా ప్రయాస అనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ (సమస్యలు) కిందకు వస్తాయని మిగతావి వాటి పరిధిలోకి రావని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అధికారులు సమాచారం ఇచ్చారు. అలాగే పరిష్కారం అయినట్లుగా చెపుతున్న దరఖాస్తుల్లో చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నట్లు క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి’అని పేర్కొన్నారు. వ్యయ, ప్రయాసలకోర్చి హైదరాబాద్‌కు వచ్చిన ప్రజలకు న్యాయం జరగడం లేదని హరీ‹Ùరావు విమర్శించారు. -
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నినదించారు. తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించి కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు(సీఆర్టీ)గా మార్చాలని డిమాండ్ చేస్తూ గురుకుల టీచర్లు చేపట్టిన సమ్మె శనివారం 22వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం లెనిన్ సెంటర్లో మోకాళ్లపై మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ 15ఏళ్లకు పైగా చాలీచాలని వేతనాలతో సేవలందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి, అధికారులు సైతం తమ సమస్యలను పట్టించుకోవడంలేదని చెప్పారు. తమ డిమాండ్లపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ ఉందన్నారు. ఆ వ్యవస్థను రద్దు చేసి తమను సీఆర్టీలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ స్పష్టంచేశారు.విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం నిరసన వ్యక్తంచేశారు. గిరిజన పిల్లల చదువులపై ప్రభావం చూపుతున్న ఔట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ కొందరు తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు.ఔట్ సోర్సింగ్ టీచర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో తమ పిల్లల చదువులకు ఇబ్బందికరంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ బిడ్డలకు ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ చేశారు. -
గిరిజన టీచర్లపై కత్తిగట్టిన సర్కారు
సాక్షి, అమరావతి: బతుకుపై భరోసా కోసం సమ్మెబాట పట్టిన గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లపై కూటమి సర్కారు కత్తిగట్టింది. వారి సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాల్నిన ప్రభుత్వం... కక్ష సాధింపునకు పాల్పడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో గిరిజన టీచర్లు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వారికి మద్దతుగా విద్యార్థులు సైతం ఆందోళనబాట పట్టారు. డీఎస్సీ నుంచి గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్ పోస్టులను మినహాయించాలని, తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆరీ్ట)గా పరిగణించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 1,656 మంది ఔట్ సోర్సింగ్ గిరిజన టీచర్లు సమ్మె చేస్తున్నారు.వారితో చర్చలు జరిపి సానుకూల పరిష్కారమార్గం చూపించి సమ్మెను విరమింపజేయాల్నిన ప్రభుత్వం... ఇందుకు విరుద్ధంగా మరింత రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోంది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వర్తించాలని 371 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 550 మందికిపైగా టీచర్లకు శనివారం తాత్కాలిక(డిప్యూటేషన్) బాధ్యతలు అప్పగించింది. వారు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 15 రోజులుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో బోధన నిలిచిపోయింది. తాత్కాలిక సర్దుబాటు వల్ల సుమారు 51వేల మంది ఉన్న గిరిజన గురుకులాల్లో పెద్దగా బోధన జరిగే అవకాశం లేదు. అదేసమయంలో ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో అక్కడి విద్యార్థులకు బోధన సక్రమంగా జరిగే అవకాశం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల గిరిజన సంక్షేమ గురుకులాలతోపాటు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.అమలుకు నోచుకోని హామీలు...సమ్మె చేస్తున్న గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లతో గతంలో ఒకసారి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్యలు జరిపి పలు హామీలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ వచ్చి కొన్ని హామీలు ఇచ్చారు. అవేమీ అమల్లోకి రాకపోవడంతో ఔట్ సోర్సింగ్ టీచర్ల సమ్మె కొనసాగుతోంది. పాడేరు ఐటీడీఏ వద్ద వర్షంలోను రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.విజయవాడ ధర్నా చౌక్‌లోను ధర్నాను కొనసాగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ టీచర్లకు మద్దతుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పి.కోనవలస గ్రామంలో శనివారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘తమ బడిలో ఉండే ఔట్ సోర్సింగ్ టీచర్లే తమకు కావాలి...’ అని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు. -
ఉద్యోగులకు ఉద్వాసన
సాక్షి, అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులపై పగబట్టి భారీగా తొలగింపుల పర్వానికి తెరలేపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో ఇప్పటివరకు విడతల వారీగా 400 మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. గడచిన మూడు రోజుల్లోనే సుమారు 200 మందిని ఉన్నట్టుండి తొలగిస్తూ ఎండీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలిచ్చారు.ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసే చిరుద్యోగులపై రాజకీయ ముద్రవేసి మరీ ప్రభుత్వం పక్కనపెట్టింది. 20వ తేదీన సుమారు 90 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు అవసరం లేదని ఎండీ ఆదేశాలిచ్చారు. అంతకుముందు 18వ తేదీన సుమారు వంద మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఎక్కువమంది మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.ఆ తర్వాత విజయవాడలోని ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసేవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో నియమించారనే కారణం చూపి వారందరినీ ఉన్న ఫళాన వెళ్లగొట్టారు. అంతకుముందు మరో 200 మందిలో సగం మందికి కాంట్రాక్టు ముగియడంతో పొడిగించకుండా బయటకు పంపారు. కాంట్రాక్టు ఇంకా మిగిలి ఉన్న వారిని సైతం ఏదో ఒక సాకు చూపి తొలగించారు. తొలగింపునకు గురైన వారిలో ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఉన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో డీఈఓలు, డీపీఓలు, ఇతర క్యాడర్ ఉద్యోగులున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన వారే కాకుండా పదేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా అన్యాయంగా తొలగించినట్టు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంఅవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగించకూడదనే నిబంధనలు ఉన్నా ఉన్నతాధికారులు లెక్క చేయలేదు. వారందరినీ నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి, ఇంటర్వ్యూ నిర్వహించి నియమించారు. కార్యాలయంలోనూ, సంబంధిత ప్రాజెక్టుల్లోనూ అవసరాన్ని బట్టి ఈ నియామకాలు జరిపినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. కానీ సహేతుకమైన కారణం లేకుండానే రాజకీయ కోణంలో అందరినీ ఒకేసారి పక్కనపెట్టేయడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం తీసేస్తే తమ కుటుంబాలు ఏం కావాలని వాపోతున్నారు. -
జనసేన ఆఫీస్ దగ్గరే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరీక్షణ
-
నిరుద్యోగులకు సర్కార్ షాక్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది. వారి పొట్టకొట్టే చర్యలు చేపట్టి.. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించడానికి గేట్లు తెరిచింది. సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన, లేదంటే ఉద్యోగాల కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫేస్టోలోస్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా తమకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమకు ఇక సర్కారు కొలువులు ఎండమావే అని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడమే.. ఖాళీ అయిన పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా తిరిగి రిటైర్ ఉద్యోగులతోనే భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తేనే నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉంటాయని, రిటైర్ వారితో వాటిని భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువతను నిండా ముంచడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకపక్క రిటైర్డ్ వారికే మళ్లీ అవకాశం ఇస్తూ.. కొత్త పోస్టులు మంజూరు చేయకపోవడంతో సర్కారు కొలువులు నిరుద్యోగ యువతకు అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నాయి. ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి.. ఆ నియామక ప్రక్రియను తాత్సారం చేస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది డీఎస్సీ ఉండే అవకాశం కనిపించకపోవడంతో నిరుద్యోగులు ఉస్సూరుమంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోనూ గత ప్రభుత్వం ఇచి్చన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రెండు స్క్రీనింగ్ కమిటీలు డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్, ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులతో స్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ కంటే దిగువ కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో తిరిగి తీసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి (హెచ్ఆర్), సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మరో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో ఖాళీల భర్తీ ప్రతిపాదనల పూర్తి వివరాలు సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు.. స్క్రీనింగ్ కమిటీలకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీల ఆమోదం తరువాత సీఎం ఆమోదం తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రెగ్యులర్ పోస్టుల్లోనే తీసుకోవాలని, మంజూరు కాని పోస్టుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లను 2018లో ఆరి్థక శాఖ జారీ చేసిన 48 జీవో మేరకు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని, అఖిల భారత సర్విసు, కేంద్ర సర్విసు ఉద్యోగులకు వర్తించవని పేర్కొన్నారు. -
హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు పూర్తిస్థాయి స్వేచ్ఛ కలి్పస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూలి్చవేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌పై కమిటీ ‘ఓఆర్ఆర్కు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించాం. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై హైడ్రాలో నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 12 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ కనీ్వనర్‌గా ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఐదారు జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ఆథారిటీ, జియోలాజికల్ విభాగాల అధికారులు ఉంటారు..’ అని పొంగులేటి తెలిపారు. 8 కొత్త వైద్య కళాశాలలకు 3 వేల పైచిలుకు పోస్టులు ‘హైదరాబాద్ నగరం కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించాం.తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు గాను 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించాం. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని రెవెన్యూ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయనున్నాం. ములుగు జిల్లా ఏటూరునాగారం ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బందిని మంజూరు చేశాం. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 వైద్య కళాశాలలకు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 3 వేల పైచిలుకు పోస్టులను మంజూరు చేశాం. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ, హకీంపేటకు జూనియర్ కళాశాల మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం..’ అని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యం: కోమటిరెడ్డి ‘కాంగ్రెస్ పారీ్టకి, తనకు పేరు వస్తుందనే అక్కసుతో కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. నల్లగొండ జిల్లాలో రూ.6 వేల కోట్ల మిషన్ భగీరథ పనులు జరిగితే, రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగింది. నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి ఫ్లోరైడ్ తీవ్రత పెరిగినట్టు కేంద్రం నివేదిక ఇచి్చంది..’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.2027 నాటికి ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి: ఉత్తమ్ ‘ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి 2027 సెపె్టంబర్‌లోగా ప్రారంభిస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించాం.డిండి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతుల సాధనకు, మిగిలి న 5 శాతం పనుల పూర్తికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఖరీఫ్‌లో సన్నాలను పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయి లో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుంది. వచ్చే నెలలో కొత్త తెల్లరేషన్ కార్డుల జారీని ప్రారంభిస్తాం. జనవరి నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తాం.. అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు.బిల్లులు రావట్లేదు సార్ కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం తాము మంజూరు చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదని పలువురు మంత్రులు..సీఎం రేవంత్ దృష్టికి తెచి్చనట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఆయా బిల్లులు త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
ఔట్ సోర్సింగ్ హబ్‌గా ఫిలిప్పీన్స్!.. ఒకటితో మొదలై..
పారిశ్రామిక విప్లవం సమయంలోనే ఔట్ సోర్సింగ్ అనేది ప్రారంభమైంది. 1970లలో కూడా పెద్ద కంపెనీలు పూర్తిగా స్వయం సమృద్ధి సాధించలేదు. ఆ సమయంలో సంస్థల పనితీరును మెరుగుపరుచుకోవడానికి మార్గాలను అన్వేషించడంలో భాగంగానే ఔట్ సోర్సింగ్ ఎంచుకున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే ఫిలిప్పీన్స్‌లో ఔట్ సోర్సింగ్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు ఫిలిప్పీన్స్ బీపీఓ పరిశ్రమ కేవలం ఓకే సంప్రదింపు కేంద్రం ఉండేది. నేడు ఆ దేశమే ప్రపంచంలో ప్రముఖ అవుట్సోర్సింగ్ హబ్‌గా ఎదిగింది. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం..👉1992: ఫిలిప్పీన్స్‌లో ఔట్ సోర్సింగ్ ప్రారంభమైంది.👉1995: ఫిలిప్పీన్ ఎకనామిక్ జోన్ అథారిటీ (PEZA) మొదలైంది. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాలలో తమ వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడంలో విదేశీ పెట్టుబడిదారులకు సహాయం చేయడంపై ఏజెన్సీ దృష్టి సారిస్తుంది.👉1997: సైక్స్ ఆసియా ఫిలిప్పీన్స్‌లో మొదటి మల్టీనేషనల్ బీపీఓ కంపెనీగా స్థిరపడింది.👉1999: మల్టినేషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మాజీ ఉద్యోగులు జిమ్ ఫ్రాంకే & డెరెక్ హోలీ ఈ-టెలీకాలర్ స్థాపించారు. ఇదే దేశంలో మొట్ట మొదటి కాల్ సెంటర్‌గా ప్రసిద్ధి చెందింది.👉2000: జీడీపీలో మొత్తం 0.075 శాతం బీపీఓ పరిశ్రమ ద్వారా లభించింది.👉2005: 2005 నాటికి ఫిలిప్పీన్స్ బీపీఓ పరిశ్రమ మార్కెట్ వాటా 3 శాతానికి చేరింది. ఇది దేశ జీడీపీలో 2.4 శాతంగా ఉంది.👉2006: 2006లో బీపీఓ పరిశ్రమ భారీగా వృద్ధి చెందింది. 2010లో ఫిలిప్పీన్స్ ప్రపంచానికే బీపీఓ రాజధానిగా మారింది. కాల్ సెంటర్లలో ఏకంగా 525,000 మంది ఏజెంట్లు పని చేస్తున్నారు. 2012లో బీపీఓ ఆదాయం 5.4 శాతానికి పెరిగింది. 👉2018: ఫిలిప్పీన్స్ థోలోన్స్లో రెండో స్థానంలో నిలిచింది.👉2019: ఫ్రీలాన్సర్ల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఫిలిప్పీన్స్ ఆరవ స్థానంలో నిలిచింది👉2020: థోలన్స్ టాప్ 50 డిజిటల్ నేషన్స్ జాబితాలో ఫిలిప్పీన్స్ ఐదవ స్థానంలో నిలిచింది.👉2022: ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) మార్కెట్ గ్లోబల్ మార్కెట్ షేర్లో 13 శాతం కలిగి ఉంది. దీని ఆదాయం దాదాపు 30 బిలియన్ డాలర్లు.కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫిలిప్పీన్ బీపీఓ పరిశ్రమ మాత్రం స్థిరమైన వృద్ధి సాగిస్తూనే.. తమ కార్యకలాపాలను విస్తరించడానికి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఔట్ సోర్సింగ్ విషయంలో ఇండియాకు ఫిలిప్పీన్స్ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ప్రధాన కారణం టైం జోన్ మాత్రమే కాకుండా.. అక్కడి ప్రజలు ఇంగ్లీషులో మనకంటే మరింత ప్రావీణ్యం ఉండడం కూడా అని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ చాలా కాలం పాటు బ్రిటిష్ కాలనీగా ఉండటం కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. -
రుణమాఫీలో మాది ఆల్ టైం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతోపాటు రుణమాఫీలో రైతులకు రూ.1.20లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హరీశ్‌రావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన లబ్ధిని వివరించారు.కేసీఆర్ పాలనలో వివిధ పథకాల కింద రైతులకు రూ.1.20 లక్షల కోట్లు నేరుగా సాయం అందించిందన్నారు. రైతుబంధు కింద 69 లక్షల మంది రైతులకు రూ.72,972 కోట్లు, రైతు బీమా కింద 1.11 లక్షల మంది రైతులకు రూ.6,488 కోట్ల తమ ప్రభుత్వ హయాంలో చెల్లించామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో కలుపుకుని రూ.29,144.61 కోట్లు చెల్లించామన్నారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.11,401 కోట్లు సాయం అందించామన్నారు. చిరుద్యోగుల వెతలు తీర్చండి ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారికి వేతనాలివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతీ నెలా 1న వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్‌తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్‌వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అదనంగా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సౌకర్యాన్ని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా కల్పించాలన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. దీంతో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఆరి్థకశాఖ జీవో నంబర్ 39 జారీచేసింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరుచేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! -
పరీక్షల నిర్వహణ యథాతథం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే అర్హత పరీక్షలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్న తపనతో లక్షలాది మంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారికి ఏమా త్రం అన్యాయం జరగకూడదనేదే మా లక్ష్యం. వాస్త వ పరిస్థితులకు భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. తొందరపడి వాటిని నమ్మి అభ్యర్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దు’అని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 4–5 రోజుల పరిణామాల దృష్ట్యా ఆయన మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు, కార్యదర్శితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, ఇతరత్రా అంశాలపై పలు ప్రచారాల నేపథ్యంలో అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 17 వేల పోస్టులు... 26 ప్రకటనలు... ‘వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. 17,134 కొలువులకు సంబంధించి ఏడాది కాలంలో 26 ప్రకటనలు జారీ చేశాం. ఇందులో 6 రకాల అర్హత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. గత ఏడేళ్లలో 35 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే కేవలం ఏడాదిలోనే 17 వేల కొలువులకు ప్రకటనలు జారీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేయనున్నాం. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన క్రమంలో అంతర్గత సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ రెండు పరీక్షల నిర్వహణను వాయిదా వేశాం. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీకైందని గుర్తించాం. ఇది ఎందరికి చేరింది... ఏయే సమాచారం ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సాంకేతికత ఆధారంగా లీకేజీని గుర్తించేందుకు ఫోరెన్సిక్, సైబ ర్ భద్రతా విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షపై బుధవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని జనార్దన్‌రెడ్డి వివరించారు. కార్యాలయానికి కొత్త సాంకేతికత... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సాంకేతికతను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. కంప్యూటర్ల మార్పుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్తగా తయారు చేసేందుకు చర్యలు మొదలుపెట్టాం. అతిత్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అర్హత పరీక్షల ప్రశ్నపత్రాలను తిరిగి రూపొందించాలని నిర్ణయించాం. అతిత్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నుంచి అన్ని రకాల పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహిస్తాం. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యంత పారదర్శకతతో అర్హతలున్న వారిని ఎంపిక చేయడయే మా పని’అని జనార్దన్‌రెడ్డి తెలిపారు. నమ్మించి గొంతు కోసినట్లుగా... ‘ఒక కార్యాలయం అన్నాక ఎంతో మంది ఉద్యోగులుంటారు. ప్రతి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాం. అదే సమయంలో సహోద్యోగులకు వివిధ బాధ్యతలు అప్పగించి కార్యక్రమాలను సజావుగా సాగేలా చూస్తాం. ప్రవీణ్‌కుమార్ ఇక్కడ ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతి ఉద్యోగి ఎలాంటివాడు? అతని నేప థ్యం ఏమిటని ఆరాతీసే పరిస్థితి ఉండదు. కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. ఏళ్లుగా నమ్మకంతో ఉన్నందున వివిధ బాధ్యతలు అప్పగించాం. రాజశేఖర్‌రెడ్డి నెట్వర్క్ విభాగంలో పనిచేస్తున్నా డు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నమ్మించి గొంతుకోసిన చందంగా ఉంది. ప్రవీణ్ శాఖా పరంగా అనుమతి తీసుకొని గ్రూప్–1 ప్రిలిమిన రీ పరీక్ష రాశాడు. 103 మార్కులు వచ్చినట్లు తెలిసింది. కానీ పేపర్ కోడ్ సరిగ్గా వేయలేదని అనర్హుడైనట్లు సమాచారం. అయితే గ్రూప్–1 ప్రిలిమిన రీ అర్హుల్లో అత్యధిక మార్కులు 103 కంటే ఎక్కు వ. ప్రిలిమినరీ పరీక్షలో ర్యాంకులను పరిగణనలోకి తీసుకోం. దీంతో ఎక్కడా మార్కులు వెల్లడించలేదు. అభ్యర్థులకు మాత్రం వారి మార్కు లు చూసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఓఎంఆర్ పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ఈ పరీక్ష లీకేజీపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. సామాజిక మాధ్యమాల్లో అనవసర రాద్ధాంతాన్ని పరిగణించొద్దు. ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదు. వాస్తవ పరిస్థితులను కనిపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం చర్యలుంటాయి’అని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రైవేటుకే ఉపాధి కల్పన.. ఉద్యోగాల నియామకాలకు జాబ్ మేళాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు కల్పతరువుగా మారింది. ఆయా సంస్థల కోసం జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగులను వెతికి పెడుతోంది. ఒకప్పుడు నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ శాఖ ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో బిజీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్హతలతో సహా పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా.. వయోపరిమితి దాటిపోయే వరకు ఒక్క ఉద్యోగం కూడా కలి్పంచలేని పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ఎంప్యానల్‌మెంట్‌కే పరిమితమైంది. పొరుగు సేవల్లో అంతంతే.. ► ఉపాధి కల్పనా శాఖ ప్రైవేటుపై దృష్టి సారించింది. సాధారణంగా కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు వ్యాపార ఆర్థిక లావేదేవీలను బట్టి ఉద్యోగుల సంఖ్యను కుదించడం, పెంచడం చేస్తుంటాయి. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి నిపుణులైన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనా శాఖ ఆయా సంస్థలకు ఉద్యోగులను వెతికిపెట్టే బాధ్యతను భుజానా ఎత్తుకుంది. జాబ్ మేళాలు నిర్వహిస్తూ చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగుల ఎంపిక కోసం సంధాన కర్తగా వ్యవహరిస్తోంది. ► ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కేవలం ఏజెన్సీల నమోదుకు పరిమితమైంది. కొత్త ఉద్యోగ భర్తీ లేక పొరుగుసేవల కింద నియామకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల్లో అర్హులైన వారికి సమాచారం అందించి ఎంపిక చేయాలి. ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఉపాధి కల్పనా శాఖ అధికారి కో కనీ్వనర్‌గా వ్యవహరించాలి. పొరుగుసేవల ఉద్యోగాలు నియామకాలు సాగుతున్నా.. అవి ఉపాధి కల్పనా శాఖ ద్వారా ఎంపిక జరిగిన దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా ఏజెన్సీలు తమకు నచ్చిన వారిని ఎంపిక చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అచేతనంగా.. రెండు దశాబ్దాల వరకు ఉపాధి కల్పనా శాఖ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా వెలిగి ప్రస్తుతం అచేతనంగా తయారైంది. అప్పట్లో ఏ శాఖకు లేని ప్రతిష్ట ఈ శాఖ ఉండేది. సర్కారు కొలువులకు ఉపాధి కల్పన శాఖలో నమోదు తప్పనిసరిగా ఉండేది. దీంతో నిరుద్యోగులు ఈ ఆఫీస్‌కు క్యూ కట్టి నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు సీనియారిటీ ప్రకారం విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం వర్తమానం అందేది. ప్రభుత్వ నోటిఫికేషన్ విధానం అందుబాటులో రావడంతో శాఖకు వన్నె తగ్గినట్లయింది. ప్రస్తుతం కేవలం అభ్యర్థుల పేర్లు నమోదు, పునరుద్ధరణ, ప్రైవేటు సేవలకు పరిమితమైంది. ఆశల్లోనే అభ్యర్థులు.. ఉపాధి కల్పనా శాఖపై అభ్యర్థుల్లో ఆశలు సన్నగిల్లలేదు. సర్కారు కొలువుపై ఆశతో నమోదు, పునరుద్ధరణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభ్యర్థుల నమోదు కొంత మేరకు పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2,72,124 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో పురుషులు 1,62,928 ఉండగా, మహిళా అభ్యర్థులు 1,09,196 ఉన్నారు. ఒక్క కాల్ లెటర్ రాలేదు ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఉపాధి కల్పనా శాఖలో విద్యార్హతతో పేరు నమోదు చేసుకున్నా.. ఒక్క కాల్ లేటర్ రాలేదు. కేవలం ప్రైవేటు ఉద్యోగాల జాబ్ మేళాలకే ఉపాధి కల్పనా శాఖ పరిమితమైంది. సర్కారు కొలువుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి – సీలం దీపిక, హైదరాబాద్ అవుట్ సోర్సింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి అవుట్సోర్సింగ్ లోనైనా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కలి్పంచి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. – పి.ప్రవీణ్ కుమార్ చదవండి: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్ సాగర్ -
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయి టేజీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు. వివిధ విభా గాల్లో 10,028 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వంటి స్పెషలిస్టు వైద్యులు.. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంపీహెచ్ఏ (స్త్రీ)/ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. ►స్పెషలిస్ట్ వైద్యులను పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివినవారికి గ్రేడ్లు, మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని అనుసరిస్తారు. గ్రేడ్ ఏలో 60%, ఆపై మార్కులుంటే ఎక్సలెన్స్.. బీగ్రేడ్‌లో 55%, ఆపై ఉంటే ‘గుడ్’.. 50%, అంతకంటే తక్కువ ఉంటే పాస్ గ్రేడ్‌గా నిర్ధారిస్తారు. ►సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంఓ ఎస్ తదితర పోస్టులకు ఎంబీబీఎస్‌లో పొందిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాల్లో పొందిన మొత్తం మార్కులను కలిపి 80%కి మార్చుతారు. ►విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినవారికి సంబంధించి.. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కుల ఆధారంగా 80వరకు పాయింట్లను నిర్ధారిస్తారు. ►స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలకు రాతపరీక్షలో పొందిన మార్కులకు 80 పాయింట్లు ఇస్తారు. ►అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్లు, జీడీఎంఓఎస్, ఆయుష్ వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ (స్త్రీ), ల్యాబ్–టెక్నీషియన్ గ్రేడ్– ఐఐ, ఫార్మసిస్ట్ గ్రేడ్– ఐఐ, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్తాల్మి క్ ఆఫీసర్, ఫిజియో థెరపిస్ట్ పోస్టులన్నింటిలో.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులకు 20 పాయింట్ల వరకు వెయిటేజీ ఇస్తారు. ►అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న నిర్దిష్ట కేటగిరీలో అన్ని పోస్టులకు ప్రాధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ధ్రువీకరణ తీసుకుని.. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అనుభవమున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అధికారులు ఈ దరఖాస్తులను 15 రోజుల్లోగా ఆమోదించి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి లేదా తిరస్కరించాలి. అభ్యర్థులు ఈ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరునెలల అనుభవానికి.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరునెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. ఏ సేవ అందిస్తే.. అదే కేటగిరీ ఉద్యోగానికి మాత్రమే వెయి టేజీ పాయింట్లు వర్తిస్తాయి. ►కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్ఐ, ఈపీఎఫ్, హాజరు రిజిస్టర్లు వంటి రికార్డులను సూచించవచ్చు. వాటి కాపీలను జత చేయవచ్చు. ►సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి అనుభవ ధ్రువీకరణను జిల్లా వైద్యాధికారులు ఇవ్వొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసేవారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. -
300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి పైగా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్) ఉద్వాసనకు గురయ్యారు. ఇటీవల వివిధ జిల్లాల్లో జీవో 317 ద్వారా బదిలీ చేసిన, మెటర్నిటీ లీవ్, లాంగ్ స్టాండింగ్ లీవ్ నుంచి వచ్చిన రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను ఆయా జిల్లాల్లోని డీపీవో (జిల్లా పంచాయతీ అధికారి)లు అకస్మాత్తుగా తప్పించారు. టీఎస్పీఆర్ఈ పోటీ పరీక్ష ద్వారా ర్యాంకు సాధించినా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జేపీఎస్‌లుగా నియమితులవడంతో ఈ పరిస్థితి తప్పలేదు. ఖాళీలను నింపేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో.. 2021 ఏప్రిల్ 12న జేపీఎస్‌లుగా 9,355 మందికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. వీరిలో 1,200 మంది ఆయా పోస్టింగ్‌లకు అసలు రిపోర్ట్ చేయలేదు. విధుల్లో చేరిన 8,200 మందిలో గత మూడేళ్లలో వెయ్యి మందికి పైగా వివిధ కారణాలతో రాజీనామా చేయడమో లేదా బాధ్యతలను మధ్యలోనే వదిలేయడమో చేశారు. అయితే ప్రతి పంచాయతీకి ఓ సెక్రటరీని నియమించాలనే లక్ష్యంతో.. భర్తీ కానీ జేపీఎస్ పోస్టుల్లో ఆయా జిల్లాలు, మండలాల వారీగా గతంలో పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాతి ర్యాంకుల వారీగా ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో నియామకాలు చేపట్టారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ మినహాయించి ఒక్కో జిల్లాలో ఒక్కోలా రూ. 10 వేల నుంచి రూ. 13 వేల దాకా జీతం ఇస్తున్నారు. ఇవి కూడా ఏ నెలకు ఆ నెల అందట్లేదని విమర్శలున్నాయి. పరీక్ష రాసి ఎంపికైనా తిప్పలే! జాతీయ స్థాయిలో యూపీఎస్సీ తరహాలో డిగ్రీ కనీస అర్హతగా నెగెటివ్ మార్కింగ్ (మైనస్ మార్కులు) పద్ధతితో పోటీ పరీక్ష రాసి ఎంపికైనా తమకు కష్టాలు తప్పట్లేదని ఔట్ సోర్సింగ్ జేపీఎస్‌లు అంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా చూపుతున్న 800 పంచాయతీ సెక్రటరీ పోస్టులను తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీకి నోటిఫై చేశారు. దీంతో కొత్త రిక్రూట్మెంట్ జరిగాక తమకూ ఉద్వాసన తప్పదేమోనని మిగతా జేపీఎస్‌లకు భయం పట్టుకుంది. -
ఔట్సోర్సింగ్ సెక్రటరీలను విధుల్లోకి తీసుకోవాలి’
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం తొలగించిన ఔట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ ఔట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ 2018లో పరీక్ష రాసి మెరిట్ లిస్టుతోపాటు రోస్టర్ పద్ధతి ద్వారా ఎంపికైన 370 మంది జూనియర్ పం చాయతీ కార్యదర్శులను తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిరుద్యోగులంతా రోడ్డుపై తిరుగుతుంటే రిటైర్మెంట్ అయినవారికి ఎక్కువ జీతాలిచ్చి నియమించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షురాలు అనసూర్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ హిమామ్ వల్లీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడు నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
నకిలీల ‘అవుట్ సోర్సింగ్’
వరంగల్ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్‌గా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్ సోర్సింగ్ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లతో బురిడీ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది. సబార్డినేట్ పోస్టులే ఎక్కువ.. గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో పాటు మెస్ మేనేజర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు. -
సీనరేజి వసూళ్లకు రాజస్థాన్ మోడల్
సాక్షి, అమరావతి: గనులు, భూగర్భ శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బూజు పట్టిన పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త విధానాలను అమల్లోకి తీసుకు రాబోతోంది. దీనిపై ఇప్పటికే పూర్తిస్థాయి అధ్యయనం, కసరత్తు చేసింది. లాంఛనాలన్నీ పూర్తిచేసి కొత్త విధానాన్ని త్వరలో ఆచరణలో పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు అంశాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానాలను పూర్తిగా మార్చివేయాలని నిర్ణయించింది. మారనున్న సీనరేజి వసూళ్ల తీరు చిన్నతరహా గనుల సీనరేజి వసూళ్ల విధానం మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,388 గనుల లీజులు ఉండగా.. వాటినుంచి సీనరేజిని గనుల శాఖ అధికారులే వసూలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న గనుల నుంచి సీనరేజి వసూళ్లు, జరిమానాలు వంటి పనులన్నీ పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, అధికారులు నిర్వహించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో అనధికారిక మైనింగ్, అక్రమ రవాణా వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. దీనిని అధిగమించే క్రమంలో సీనరేజి వసూళ్లను మిగిలిన రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారనే దానిపై గనుల శాఖ అధికారులు అధ్యయనం చేశారు. రాజస్థాన్‌లో అనుసరిస్తున్న అవుట్సోర్సింగ్ విధానం శాస్త్రీయంగా ఉందని నిర్థారించి.. అదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లాల వారీ సీనరేజి వసూళ్ల బాధ్యతను అవుట్ సోర్సింగ్‌కు అప్పగించనున్నారు. ఇసుక తప్ప అన్ని చిన్నతరహా గనులకు ఈ విధానాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు. దీనివల్ల 25 నుంచి 40 శాతం ఎక్కువ ఆదాయం ఖజానాకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలు సీనరేజి వసూలు చేయడం వల్ల అక్రమ రవాణా, అనధికారిక మైనింగ్ కూడా తగ్గినట్టు రాజస్థాన్ మోడల్లో స్పష్టమైందని.. ఇక్కడా అదే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. బరువును బట్టి సీనరేజీ నిర్థారణ కీలకమైన రెండో అంశం సీనరేజి ఎంత కట్టాలో నిర్థారించేది. ప్రస్తుతం మెటీరియల్ విలువ ఆధారంగా (వాల్యూ మెట్రిక్) సీనరేజిని నిర్థారిస్తున్నారు. రకరకాల సైజుల్లో ఉండే గ్రానైట్ ఇతర ఖనిజాల వాస్తవ విలువ ఎంతో అంచనా వేసి లెక్కించడం ఇబ్బందికరంగా మారింది. దీనికి బదులు బరువును కొలవడం ద్వారా శాస్త్రీయంగా సీనరేజిని నిర్థారించాలని నిర్ణయించారు. గనుల సమీపంలో వే బ్రిడ్జిలు ఏర్పాటు చేసి ఖనిజం బరువు కొలుస్తారు. దీనివల్ల 10 నుంచి 15 శాతం ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రతి వాహనాన్ని గనుల శాఖతో అనుసంధానం చేసి వే బ్రిడ్జి దగ్గర అందులో ఉన్న బరువును కొలవడం ద్వారా కచ్చితమైన విలువ తెలుస్తుంది. అక్కడ ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు, తనిఖీల వల్ల అక్రమ రవాణా కూడా తగ్గి మరో 15 నుంచి 20 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా, రాజస్థాన్, గుజరాత్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ప్రకాశం జిల్లాలో గ్రానైట్ మైనింగ్‌పై ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దీనివల్ల 25 శాతం ఆదాయం పెరిగినట్టు తేల్చారు. ఈ–వేలం ద్వారా చిన్నతరహా గనుల లీజులు మూడో అంశంగా.. చిన్నతరహా గనుల లీజులు కేటాయించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న మొదట వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం (ఫస్ట్ కమ్ ఫస్ట్) స్థానంలో ఈ–వేలాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత విధానం వల్ల సమర్థులైన, అర్హులైన పారిశ్రామికవేత్తలు క్వారీ లీజులు పొందలేకపోతున్నారు. దీనికి బదులు ఈ–వేలం ప్రవేశపెట్టి లీజులను ఆలస్యంగా లేకుండా జారీ చేయడం, అర్హులకు లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత విధానంలో 1,156 లీజుల్లో ఉన్న వ్యక్తులు మైనింగ్ జరపకపోవడం వల్ల ప్రభుత్వానికి రూ.136 కోట్ల నష్టం వస్తోంది. కొత్త విధానంలో ఈ సమస్యలను పరిష్కరించి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. చాలాకాలంగా మైనింగ్ చేయకుండా ఉన్న గనుల లీజులను కూడా రద్దు చేసి, వాటికి కూడా ఈ–ఆక్షన్ నిర్వహించనున్నారు. ఆదాయం పెంపే లక్ష్యంగా కొత్త విధానం గండి పడుతున్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని రూపొందించాం. సీనరేజి వసూళ్లు, బరువు ఆధారిత కొలత, మైనింగ్ మినరల్స్ ఈ–వేలం ద్వారా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం. దీని అమలుకు న్యాయ సలహా తీసుకుంటున్నాం. త్వరలో ఆచరణలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనులు, భూగర్భ శాఖ -
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి.. వేతన పెంపు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపును ఎలా వర్తింపజేయాలన్న విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంలో మరింత స్పష్టత తీసుకున్నాకే ముందుకు సాగాలని భావిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలోనూ ఆదే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,128 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 66,239 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నారు. కనిష్టంగా రూ.12 వేల నుంచి మొదలుకొని గరిష్టంగా రూ.40,270 వరకు వీరికి వేతనాలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ కొత్తగా కనీస వేతనాలను నిర్ధారించింది. అయితే పీఆర్సీ సిఫారసు చేసిన వేతనాలను వర్తింపజేయాలా? ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపును అమలు చేయలా? అన్న విషయంలో ఆర్థికశాఖ ఆలోచనలో పడింది. ఫిట్‌మెంట్‌పై సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తూ... ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సహా అన్నిరకాల ఉద్యోగులకు వేతన పెంపును వర్తింపజేస్తామని చెప్పారు. అంతకుమించి వివరాల్లోకి వెళ్లలేదు. దాంతో వీరికి పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత కరువైంది. తక్కువ వేతనాలు ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రం తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపు కాకుండా, పీఆర్సీ సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు పెద్దగా ప్రయోజనం చేకూరదని వాపోతున్నారు. మూడు కేటగిరీలుగా ఔట్సోర్సింగ్ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్/క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం నెలకు రూ. 12 వేలు మాత్రమే పొందుతున్నారు. వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసింది. మరోవైపు రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. అయితే నెలకు రూ.12 వేలు మాత్రమే పొందుతున్న కిందిస్థాయి ఔట్సోర్సింగ్ సిబ్బంది తమకు పీఆర్సీ సిఫారసు చేసిన రూ. 19 వేల కనీస వేతనం కంటే ఎక్కువ ఇవ్వాలని, లేదంటే దానినైనా కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వేతనాలపై 30 శాతం పెంపుతో వేతన స్థిరీకరణ చేస్తే ఒనగూరే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందని, దాని వల్ల తమకు న్యాయం జరగదని అంటున్నారు. గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు మాత్రమే వేతనం ఉంది. వారికి కనీస వేతనం రూ.22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. మరోవైపు ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కూడా కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. వారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. గ్రూపు–3ఏ కేటగిరీలోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ప్రస్తుతం ఆయా శాఖలు రూ. 17,500 ఇస్తున్నాయి. వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. తమకు ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంపు కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్నే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ పీఆర్సీ కొత్త వేతనాలను సిఫారసు చేసింది. తక్కువ వేతనాలున్న ఉద్యోగులు ఇపుడు తమకు వస్తున్న వేతనాలపై కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్ని చెల్లించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు. వారికి ఇపుడు రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ.40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. అయితే వీరికి వేతనాల పెంపును ఎలా చేయాలనే విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరిపాకే ముందుకు సాగాలని భావిస్తోంది. -
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్: పీఆర్సీ కీలక సిఫారసులు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకునే విషయంలో సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. తోచిన వారిని విధుల్లోకి తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని సూచించింది. వయసు, విద్యార్హతల ఆధారంగా ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిర్వహించే జాబితా తరహాలో నిర్వహించి, వారిని కామన్ టెస్ట్ కోసం ఏజెన్సీలు ప్రతిపాదించాలని పేర్కొంది. ప్రభుత్వం ఏయే విభాగాల్లో ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు వీరితో భర్తీ చేయాల్సి ఉంటుందో ఖాళీలు తెలుపుతూ నోటిఫై చేయాలని సూచించింది. ఆయా విభాగాల వారీగా అభ్యర్థులను తీసుకునే ముందు ప్రభుత్వం పరీక్ష నిర్వహించాలని, రాష్ట్ర స్థాయిలో జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ఖాళీల భర్తీ వేగంగా జరిగేలా చూడాలని తెలిపింది. పరీక్షల ఆధారంగా.. 1: 3 పద్ధతిలో అభ్యర్థుల వివరాలతో కూడిన తుది జాబితాలను ఆయా విభాగాలకు పంపి ఎంపికైన వారితో న్యాయబద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంది. చదవండి: (ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) రెమ్యునరేషన్ సిఫారసులు ఇలా.. ►గ్రూప్–4 స్థాయిలోకి వచ్చే ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కామాటి, కుక్, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, డఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు 2014 పీఆర్సీలో రెగ్యులర్ ఉద్యోగులకు రూ.13,000 నుంచి రూ.46,060 స్కేల్ పరిధిలో ఉంటే, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.12 వేలు ఉండగా, దాన్ని రూ.19 వేలకు పెంచాలి. ►గ్రూప్–3 పరిధిలోకి వచ్చే డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూ.స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిల్మ్/ఆడియో విజువల్/డేటా ఎం ట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్లకు పీఆర్సీ–2014 ప్రకారం రూ. 15,460–రూ.58330 పేస్కేల్ ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు తత్సమాన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.15,000లు ఉండగా, దాన్ని రూ.22,900లకు పెంచాలి. ►గ్రూపు–3(ఏ) కేటగిరీ పరిధిలోకి వచ్చే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ఆర్పీఎస్–2014 ప్రకారం రూ.21,230–రూ.77,030 పేస్కేల్ పరిధిలో ని కేటగిరీలకు ప్రస్తుతం నెలకు రూ.17,500 చెల్లిస్తుండగా, దాన్ని రూ.31,040లకు పెంచాలి. వీరికి భవిష్యత్తులో పే స్కేల్ రివిజన్ జరిగే వరకు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానందున ఇది హోం గార్డులకు కూడా వర్తిస్తుంది. ఎర్న్డ్ లీవ్స్ తప్ప రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఇతర వసతులు వర్తిస్తాయి. 6 నెలల ప్రసూతి సెలవు వర్తిసుంది. ఈపీఎఫ్, ఈఎస్ఐలు కూడా వర్తింపజేయాలి. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఏపీ ప్రభుత్వం
-
హమ్మయ్య.. సమ్మె విరమించారు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది సమ్మె విరమించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరైనట్టు అవుట్ సోర్సింగ్ స్టాఫ్‌నర్సుల యూనియన్ ప్రతినిధులు తెలిపారు. దశలవారీగా హామీలను నెరువేరుస్తామని మంత్రి హామీయిచ్చారని వెల్లడించారు. పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో 212 మంది స్టాఫ్‌నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించడంతో వారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో రెగ్యులరైజ్ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ ఈనెల 15 నుంచి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల బృందం నర్సింహ, మేఘమాల తదితరులు గురువారం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. తమ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం వారు ప్రకటించారు. ఈనెల 1న తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ 6 ద్వారా 1,640 నర్సింగ్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని, వారికి నెలకు రూ.25 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా రేగుల మధ్య విధులకు నిర్వహిస్తున్న తమకు కేవలం రూ.750 మాత్రమే ప్రోత్సాహం వస్తోందని, ఒక నెల జీతం ఇన్సెంటివ్‌గా ప్రకటించాలని మంత్రిని కోరగా సానుకూలత వ్యక్తం చేశారని వెల్లడించారు. నర్సులు సమ్మె విరమించడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కరోనా.. మరో రెండేళ్లు ఇదే కథ -
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. లంచాలకు తావు లేకుండా ఉద్యోగాలిస్తాం. నేరుగా వారి జీతాలు వాళ్లకే అందిస్తాం. సాక్షి, అమరావతి: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు వారికి పూర్తిగా చెల్లించడంతో పాటు.. ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేసేందుకే ఏపీ ఔట్సోర్సింగ్ సర్వీసుల కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఇంతకంటే పారదర్శకంగా, గొప్పగా ఎక్కడా ఉండదని, చాలా స్పష్టంగా మార్గదర్శకాల్లో రాస్తే ఎక్కడా లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్చార్జ్ మంత్రులను పెట్టి ఉద్యోగులను తీసేసే కార్యక్రమాలు చేస్తున్నామని నీచమైన ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టినా విపక్ష సభ్యులు బురద చల్లుతున్నారని, ప్రతీది రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షం నిత్యం దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ.. అసత్యాలు చెబుతున్నారని, అందుకే ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్‌కు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఈ వ్యవస్థలో మార్పు కోసమే.. ‘‘ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం కోసం లంచాలు, తర్వాత జీతాలు ఇవ్వాలంటే మాకింత ఇస్తేనే అంటూ వసూళ్లు.. మొత్తంగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ నష్టపోతున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. ఈ పేరుతో చివరకు గుళ్లలో శానిటేషన్ పనుల (క్లీనింగ్) కాంట్రాక్ట్ కూడా చంద్రబాబునాయుడు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు. మొత్తం మీద వాళ్లకు సంబంధించిన వాళ్లను పెట్టుకుని పూర్తిగా దోచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ వ్యవస్థ నడిపితే ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విధంగా మేం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం’’. -
ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్!
సాక్షి, ఒంగోలు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి జిల్లాలో భర్తీ కాని ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్ లభించింది. కటాఫ్ 5 మార్కులు తగ్గించడంతో వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియలో రోస్టర్ పాయింట్ల విడదీత పొరపాట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరిలో మార్కులు సాధించినా రిజర్వేషన్ కేటగిరిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. దీనిపై అర్హత కలిగిన అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎస్సీ, ఎస్టీల్లో ఓపెన్ కేటగిరిలో మార్కులు సాధించిన అబ్యర్థులను ఓపెన్ కేటగిరిలో చేర్చారు. దీంతో రిజర్వేషన్లో ఖాళీలు ఏర్పడ్డాయి. సర్టిఫికెట్ల పరిశీలన చివరిరోజు సుమారు 40 మంది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల ద్వారా అవకాశం కల్పించారు. అంతేగాకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని వారిని కూడా తొలగించి ఆ తర్వాత మార్కులు వచ్చిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా మరోసారి భర్తీ చేసేందుకు అనుమతి లభించింది. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న ఖాళీలను పూరించేందుకు ప్రభుత్వం కటాఫ్ మార్కులను తగ్గించి అన్ని కేటగిరిల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు శాఖల్లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అభ్యర్థులకు సంబంధించి వెయిటేజ్ మార్కుల పరిశీలన అనంతరం తగ్గించిన కటాఫ్ మార్కులతో మెరిట్ జాబితా జిల్లా కలెక్టర్‌కు చేరింది. ఆ మేరకు ఉద్యోగ నియామకాలపై కసరత్తు ప్రారంభించారు. రెండో విడతలో మరో వెయ్యిమందికి పైగా ఉద్యోగాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు 5,500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. -
గురుకుల నియామకాల్లో ‘ఔట్సోర్సింగ్’ అవినీతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నియామక సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అత్యధికంగా ఉద్యోగులు గురుకుల పాఠశాలల్లోనే నియామకమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. కాంట్రాక్టు సిబ్బందికి సొసైటీలే నేరుగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోగా.. వంట సిబ్బంది, వాచ్మెన్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లోని పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు. ఫిర్యాదులతో కదిలిన సొసైటీలు ఈ నియామకాల క్రమంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల గురుకుల సొసైటీలకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన సొసైటీ యంత్రాంగం ఒకట్రెండు చోట్ల క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రతి కేటగిరీలో 2 నెలల నుంచి 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు తేలింది. దీంతో కంగుతిన్న యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొత్త గురుకుల పాఠశాలల్లో నియమించిన ప్రతి ఉద్యోగి నుంచి సమాచారం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూ.లక్ష వరకు వసూలు గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ క్రమంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పెద్దమొత్తంలో వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వేర్వేరు జిల్లాలకు చెందిన దాదాపు 12 మంది ఉద్యోగులు ఇలా సొసైటీ కార్యదర్శులకు లేఖలు సమర్పించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు వారు అందులో పేర్కొన్నారు. కొంత మంది కిందిస్థాయి (వాచ్మెన్) ఉద్యోగుల దగ్గర 3 నెలల వేతనం, మరికొందరి దగ్గర 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదులపై సొసైటీ అధికారులు ప్రాథమికంగా విచారణ చేపట్టగా పై అంశాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాల తంతు బయటపడే అవకాశముంది. -
ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా?
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఔట్‌సోర్సింగే. ఆఖరికి హైకోర్టులో కూడా. శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా ఇలా ప్రతీ శాఖలోనూ ఔట్సోర్సింగ్ పద్ధతిని అనుసరిస్తూ పోతుంటే సగం పాలన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమించుకోవడం బాగానే ఉంది. మరి ఆ ఉద్యోగుల బాగోగులు, చట్ట నిబంధనల ప్రకారం వారికి దక్కాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడని ఔట్సోర్సింగ్ ఏజెన్సీల సంగతేంటి.. వారిని ప్రశ్నించే వారెవరు.. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకుని, ఔట్‌సోర్స్ ఉద్యోగులకు చాలీచాలని జీతాలిస్తుంటే నిలదీసే వారెవరు.. గొప్పగొప్ప కార్మిక నేతలంతా కన్నుమూశారు. ఔట్‌సోర్స్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీల వ్యవహారశైలిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న అనుమానం కలుగుతోంది..’ హైకోర్టు ధర్మాసనం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, వారికి చట్ట ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలు తదితర విషయాలపై పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందంది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రప్రభుత్వ వైఖరి కూడా తెలుసుకుంటామని, అందువల్ల ఈ వ్యాజ్యంలో కేంద్ర కార్మికశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏమేమి చేయొచ్చో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని, కనీస వేతనాలు, సెలవులు ఇవ్వడం లేదని, అలాగే పెద్ద ఎత్తున ఆ ఏజెన్సీలు ఆదాయ పన్ను ఎగవేస్తున్నాయని, వీటన్నింటిపై విచారణ జరిపి, తప్పు చేసిన ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టూరిజం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఇది చాలా విస్తృతమైన అంశమని తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేదంది. ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితేంటి? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న సందేహం కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఔట్సోర్సింగ్ ఇప్పుడు ఓ పెద్ద వ్యాపారంగా మారిపోయిందని, ఉద్యోగులను సరఫరా చేసినందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, అందులో నామమాత్రపు మొత్తాన్ని ఆ ఉద్యోగులకు ఇస్తున్నారంది. ఆస్పత్రి, ప్రభుత్వ కార్యాలయం, హైకోర్టు.. ఇలా ఎక్కడ చూసినా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కనిపిస్తున్నారంది. వీరికి జీతాలు చెల్లించకుండా ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితి ఏమిటనే దానిపై ఎవ్వరూ ఆలోచన చేయడం లేదని తెలిపింది. ఇటువంటి వాటి గురించి ప్రశ్నించేందుకు గతంలో గొప్ప గొప్ప కార్మిక నేతలు ఉండేవారని, వారిలో ఇప్పుడు ఎవరూలేరంది. నిచ్చెనలుండవు.. కోరలు చాచిన పాములే ‘వైకుంఠపాళి ఆటలోలాగా ఈ ఔట్‌సోర్స్ ఉద్యోగులు నిచ్చెన ఎక్కాలని చూస్తుంటారు. కానీ ఏజెన్సీలు పాముల్లా మింగేసేందుకు కాచుకుని ఉంటాయి. వాస్తవానికి ఈ ఔట్‌సోర్స్ వైకుంఠపాళిలో నిచ్చెనలు అసలే ఉండవు. కోరలు చాచిన పాములు తప్ప..’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఔట్‌సోర్స్ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న చట్ట ఉల్లంఘనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వీరి సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సర్కారీ కొలువులకు కోత
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం.. ఏటా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పట్టించుకోవడం లేదు. 2014 నుంచి ఏటికేడు సర్కారీ కొలువులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా 78 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత పడగా కొత్తగా ప్రవేశపెట్టిన 10శాతం రిజర్వేషన్ వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్న యువజనుల మదిని తొలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను వెల్లడిస్తూ.. వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నదీ చెబుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 55 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులను కూడా కేంద్ర సిబ్బందిగానే పరిగణిస్తారు. అయితే, రక్షణ దళాల సిబ్బందిని వీరితో కలపరు. 2018–19 బడ్జెట్ ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32 లక్షల 52వేలు. 2014 మార్చి 1వ తేదీ నాటికి వీరి సంఖ్య 33 లక్షల 30 వేలు. అంటే, ఈ నాలుగేళ్లలో సుమారు 78 వేల ఉద్యోగాలు తగ్గి పోయాయన్న మాట. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏడాదికి ఉద్యోగాలను 35 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే, కేంద్రం ఈ హామీని ఏ ఒక్క ఏడాది కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే సర్కారీ కొలువుల కోతకు కారణం. కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. ముఖ్యంగా ప్యూన్లు, డ్రైవర్లను ఈ పద్ధతిలో నియమిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను చాలా ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇదికూడా ఉద్యోగాల సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. రైల్వేలో 2010లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో 2018 నాటికి కూడా అంతమందే ఉన్నారు. 2016 నాటికి రైల్వేలో 13.31 లక్షల మంది ఉండగా, 2017లో 23వేల మందిని తొలగించారు. ఆ లోటు ఇప్పటికీ భర్తీ చేయలేదు. అయితే, పోలీసు శాఖలో ఉద్యోగుల సంఖ్య 10.24 లక్షల నుంచి 11.25 లక్షలకు పెరిగింది. అలాగే, ప్రత్యక్ష పన్నుల విభాగంలో ఉద్యోగులు 45 వేల నుంచి 80 వేలకు పెరిగారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాల్లో కూడా 54 వేల నుంచి 93 వేలకు పెరిగారు. కొన్ని విభాగాల్లో పెరిగినా మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో తగ్గుదలే స్పష్టంగా కనబడుతోంది. -
బతుక్కి ‘భద్రత’ లేదు!
సాక్షి, హైదరాబాద్: పేరుకు వారు భద్రతా సిబ్బంది.. కాని నిత్యం అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ అధికారి ఆగడాలకు అల్లాడిపోతున్నారు. ఆ అధికారికి మామూళ్లు ఇవ్వకుంటే బదిలీలు.. మాట్లాడితే సస్పెన్షన్.. ప్రశ్నిస్తే డిస్మిస్కు గురవుతున్నారు. ఇదీ ఆర్టీసీలోని భద్రతా సిబ్బంది దుస్థితి. ఆ అధికారి ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో ఉత్తర తెలంగాణకు సంబంధించి నిఘా బాధ్యతలు చూసే ఓ అధికారి రిటైర్డ్ అయి తిరిగి అదేపోస్టులో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధుల్లో చేరాడు. అతనికి సిబ్బంది నెలవారీ మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. ఇవ్వకపోతే కక్ష కట్టి ఎడాపెడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ అధికారికి మామూళ్లు ఇచ్చిన వారు ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతారు. వీరంతా బయట ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు’అని ఆరోపిస్తున్నారు. అందుకే, ఆర్టీసీలో నిఘా బాధ్యతలను పర్యవేక్షించాల్సిన కొంతమంది సిబ్బంది ఈ అధికారి అండ చూసుకుని ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని అంటున్నారు. ఈ అధికారి హైదరాబాద్‌లో ఉంటూ వారంలో ఒక్కరోజు మాత్రమే విధులకు హాజరవుతారని, అత్యవసర ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉంటే హైదరాబాద్‌కే తెప్పించుకుంటారన్నారు. ఆ అధికారి సస్పెండ్ చేసిన సిబ్బంది ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, మరికొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు వాపోతున్నారు. అతనికి అధికారాలే లేవు వాస్తవానికి ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే వారికి కార్మికులను డిస్మిస్ చేసే అధికారాలు లేవని పలువురు సిబ్బంది వాపోతున్నారు. నిజంగా ఆ అధికారికి అధికారాలు ఉంటే... ఆర్టీసీ బోర్డు స్వయంగా అతనికి ప్రత్యేకంగా అధికారాలు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అతని వద్ద ఉండాలని, కాని అవి ఆయన వద్ద లేవని సిబ్బంది వాదిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా బోర్డే పూర్తిస్థాయిలో ఏర్పడలేదని, అలాంటపుడు ఇతనికి డిస్మిస్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. బోర్డుకు పూర్తిస్థాయి ఎండీ లేడన్న ధీమాతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది ఆ అధికారి వ్యవహారంపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని, ఆయనపై చర్యల విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ రాజ్యమేలుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సర్వీసులు ఉండవన్న ప్రభుత్వం మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. 2011 తరువాత ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎలాంటి పోస్టులు భర్తీ కాకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల 5,000 పోస్టుల భర్తీకి సూత్రప్రాయ ఆమోదం తెలిపినా.. ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. వివిధ విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానం కొనసాగుతుం డటంతో పనిలో నాణ్యత కొరవడుతుండగా, ఔట్ సోర్సింగ్ విభాగాల కాంట్రాక్టర్లు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, 2011లో చివరిసారిగా? ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఆ తరువాత ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవు. ఇకపోతే.. 2009, 2010, 2011లో కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ అయిన డ్రైవర్లు, కండక్టర్లను దాదాపుగా 18,000 మందిని సంస్థ రెగ్యులరైజ్ చేసింది. ఆ సమయంలో కావాల్సిన అర్హతలు లేని కారణంగా 4,000 మంది క్రమబద్ధీకరణకు నోచుకోలేకపోయారు. కొందరు 2015 సమ్మె సందర్భంగా రెగ్యులరైజ్ అయినా, దాదాపు 570 మంది రెగ్యులరైజ్ కావాల్సి ఉంది. పెరుగుతున్న పనిభారం! ఆర్టీసీలో 2011 తరువాత ఆరు వేలకుపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇందులో 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల జూన్‌లో మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఇంత వరకూ ఈ విషయంలో ఎలాంటి అడుగు పడలేదు. మరోవైపు సంస్థాగతంగా ప్రమోషన్లు లేకపోవడం కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఔట్సోర్సింగ్ దయనీయం.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఔట్సోర్సింగ్ (పొరుగుసేవలు) కింద పలువురిని భర్తీ చేసు కున్నా రు. మెకానిక్‌లు, ఆర్టిజెన్స్ (వడ్రంగి, ఎలక్ట్రీషియన్లు తదితరులు)తోపాటు కీలకమైన సెక్యూరిటీ సిబ్బంది లోనూ ఔట్సోర్సింగ్ సిబ్బందే పనిచేస్తున్నారు. వీరికి నామమాత్రం జీతాలే ఇస్తుండగా, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామంటూ.. కార్మికుల వద్ద కొందరు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు వేలకువేలు వసూలు చేస్తున్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవు తాయన్న ఆశతో అప్పుచేసి కాంట్రాక్టర్ల చేతిలో పోసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మరన్ని ఇబ్బందులు పడుతున్నారు. -
వేతనాల్లేవ్..ఇక ఏడుపే
పాల్వంచ: జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా ప్రతి నెలా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు 86 ఉండగా వాటిలో 450 మంది కార్మికులు (స్వీపర్లు, కుక్‌లు, వాచ్మెన్లు, హెల్పర్లు, స్కావెంజర్లు) పనిచేస్తున్నారు. వీరికి రావాల్సిన వేతనాలు రూ.60 లక్షల మేర పేరుకు పోయాయి. అంతేగాక 2016లో వేసవి శిబిరాల సమయంలో పనిచేసిన వేతనాలు కూడా ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో పనిచేసిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈఎల్స్(సంపాదిత సెలవులు) ఇచ్చారు. సీఆర్టీలకు కూడా వేతనాలు అందించారు. వారితో పాటు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇంత వరకూ అతీగతీ లేదు. వేతనాలు అందించాలని ప్రపోజల్స్ పంపి నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. వెట్టి కష్టాలు ఇంకెన్నాళ్లో.. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ, మున్సిపాలిటీల పరిధిలో గల ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులందరిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రెండు, మూడు దశాబ్దాలకు పైగా ఐటీడీఏ పరిధిలోనే పనిచేసున్న వారు అనేక మంది ఉన్నారు. వీరిని పర్మనెంట్ చేయాలని కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. మరోవైపు జీతాలు కూడా సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెరిగిన పనిభారం.. హాస్టళ్లు, పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగింది. గతంలో ఉన్న మెనూకు, ప్రస్తుత మెనూకు చాలా తేడా ఉంది. విద్యార్థులకు ఉదయం రకరకాల టిఫిన్లు, భోజనం, వెజ్, నాన్ వెజ్ వంటలు పెడుతున్నారు. పాఠశాలల్లో తరగతి, వసతి గదులు కూడా పెరిగాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలి. ఇలా పనిభారం నానాటికీ పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగడం లేదు. సెలవులు వస్తే జీతాల్లో కోత విధిస్తున్నారని, ఆరోగ్యం సరిగా లేక సెలవులు తీసుకున్నా వేతనాలు తగ్గించి ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ సీహెచ్.రామ్మూర్తిని వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులో లేరు. జీతాలు సకాలంలో రావడం లేదు. జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మావి. ప్రతి నెలా జీతాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఐదారు నెలలకు కూడా ఇవ్వక పోతే కుటుంబాల పోషణ ఇబ్బందిగా ఉంది. – కాంతమ్మ, హెల్పర్ పనిభారం పెరిగింది గతం కంటే ఆశ్రమ హాస్టళ్లలో పనిభారం పెరిగింది. ఇప్పుడు మెనూ కూడా పెంచారు. అయినా కష్టపడి విద్యార్థులకు సమయానికి వండి పెడుతున్నాం. పనిభారం ఎక్కువైనా వేతనాలైతే పెరగలేదు. ఇన్ని నెలల పాటు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. – రాంబాయి, హెల్పర్ పర్మనెంట్ కాక ఇబ్బందులు రెండు, మూడు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి కూడా పనిభద్రత కరువైంది. ఐటీడీఏను నమ్ముకుని పనిచేస్తున్న మాకు పర్మనెంట్ చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. కష్టానికి తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సరోజిని, హెల్పర్ -
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీకి చెక్!
సాక్షి, హైదరాబాద్ : ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ల దోపిడీకి త్వరలో బ్రేక్ పడనుంది. రాష్ట్రంలోని పురపాలికల్లో పని చేస్తున్న వేలాది మంది పారిశుధ్య కార్మికులకు వేతనాల చెల్లింపులతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ నిధుల విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్లను ఇకపై నియమించరాదని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కొత్త ఏజెన్సీల నియామకం కోసం టెండర్లు నిర్వహించరాదని అన్ని పురపాలికలను ఆదేశించింది. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల స్థానంలో పారిశుధ్య కార్మికుల సంఘాలు(సానిటేషన్ వర్కర్స్ గ్రూప్స్/ఎస్‌డబ్ల్యూజీ) ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కార్మిక సంఘాలను రిజిస్ట్రర్ చేయించి వాటి ద్వారా ప్రస్తుతం పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వినియోగించుకోవాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇప్పటికే గ్రూపులను ఏర్పాటు చేసి వాటి ద్వారానే పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లోనూ కార్మిక సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రస్థాయి సలహా సంఘం చేసిన సిఫారసుల మేరకు పురపాలక సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీని మినహాయిస్తే మిగిలిన 73 పురపాలికల్లో సుమారు 16 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నారు. తాజా నిర్ణయంతో వీరందరికీ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ల వేధింపులు తప్పనున్నాయి. ఒక్కో గ్రూపులో ఏడుగురు ప్రతి ఏడుగురు పారిశుధ్య కార్మికులతో గ్రూపు ఏర్పాటు చేసి సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టర్ చేయాలని పురపాలక శాఖ సూచించింది. 2017 జూన్ నాటికి హాజరు పట్టికలో పేర్లున్న వారితోనే ఈ గ్రూపులు ఏర్పాటు చేయాలని, ఒక గ్రూపులో ఒకే కుటుంబం నుంచి ఒకరిని మించి నియమించరాదని కోరింది. సొసైటీల రిజిస్ట్రేషన్ విషయంలో పారిశుధ్య కార్మికులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు సహకారం అందించాలని సూచించింది. గ్రూపులోని కార్మికులందరూ ఒకే పనివేళకు చెందిన వారై ఉండాలని స్పష్టం చేసింది. కార్మికులకు జీతాలను బ్యాంకు ఖాతాల్లో వేయాలని, ఆధార్‌తో అనుసంధానం చేసి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాలని కోరింది. కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను నోడల్ ఏజెన్సీల ద్వారా జరపాలని సూచించింది. వారంలో 6 రోజులు గ్రూపులోని ఏడుగురు కార్మికుల్లో రోజూ ఆరుగురికి పని కల్పించడంతోపాటు ఒకరికి సెలవు ఇవ్వాలని పురపాలక శాఖ కోరింది. కార్మికుల మధ్య పరస్పర అవగాహనతో వారి అవసరాల కోసం సెలవులను మార్పు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తెలిపింది. మరోవైపు కార్మికుల గ్రూపులకు పని అప్పగింత విషయంలో స్పష్టమైన లెక్కలు ఇచ్చింది. 60 అడుగుల వెడల్పు కలిగిన రోడ్డును 500 మీటర్ల పొడవున ఊడ్చే పనిని ఒక్కో కార్మికుడికి అప్పగించాలని కోరింది. 80 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డయితే 350 మీటర్ల పొడవున, 40 అడుగుల వెడల్పు రోడ్డయితే 750 మీటర్ల పొడవున ఊడ్చే పనిని ఒక్కొక్కరికి అప్పగించాలని తెలిపింది. వేతన కష్టం రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.11,473 వేతనం చెల్లిస్తుండగా, ఈఎస్ఐ, పీఎఫ్, కాంట్రాక్టర్ కమీషన్, సర్వీస్ ట్యాక్స్ పోగా రూ.8,300 చేతికి అందుతోంది. నగర పంచాయతీల కార్మికులకు రూ.10,091 వేతనం చెల్లిస్తుండగా, కోతలన్నీ పోగా కార్మికుల చేతికి రూ.7,300 మాత్రమే అందుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 7.5 శాతాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కమీషన్‌గా పొందుతున్నాయి. దీంతో చాలీచాలని ఈ వేతనాలను పెంచాలని కార్మికులు మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల విధానాన్ని విరమించుకోవడంతో వారికి అందిస్తున్న 7.5 శాతం కమీషన్ పురపాలికలకు మిగిలిపోనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఉద్రిక్తత మధ్య వక్ఫ్ బోర్డు పాలకవర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు హజ్ హౌస్‌లోని మొదటి అంతస్తులో సమావేశం ప్రారంభం కాగానే.. పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీల సభ్యులు సమావేశ మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వక్ఫ్ చట్టం ప్రకారం కాకుండా బోర్డు ఇష్టానుసారం వక్ఫ్ కమిటీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. కమిటీలు, వక్ఫ్ నిర్వాహకుల నియామకాలతోనే సమావేశాలు ముగుస్తున్నాయని, వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. కాన్ఫరెన్స్ హాల్ ఎదుట బైఠాయించడానికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి ఎవరినీ అనుమతించలేదు. హజ్ హౌస్‌లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినఇతర కార్యాలయాలు ఉన్నాయి. దీంతో వాటికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం వాయిదా పడింది. మొక్కుబడిగా సమావేశం.. సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మసీదు, పలు సంస్థల పాలకవర్గ కమిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. ముస్లింల మ్యారేజ్ సర్టిఫికెట్ల ఆన్లైన్ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. వక్ఫ్ కార్యకలాపాలు వేగవంతం చేయడానికి 50 మంది యువకులను ఔట్సోర్సింగ్ విధానంలో నియామకంపై వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చిస్తామ న్నారు. 2018కి బడ్జెట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, దీన్ని వచ్చే సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే నెల 10న మళ్లీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
కొనుగోల్‌మాల్!
జిల్లాలోని భువనగిరి, ఆలేరులో ఏర్పాటు చేసిన హాకా కందుల కొనుగోలు కేంద్రాల్లో గోల్మాల్ జరుగుతోంది. రైతులు తెచ్చిన కందులను వెంటనే కొనకుండా వివిధ అడ్డంకులు సృష్టిస్తూ దళారులు తెచ్చిన కందులను క్షణాల్లోనే కొనేస్తున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు అక్రమాలకు అడ్డాలుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కందుల కొనుగోళ్ల విషయంలో దందా సాగుతున్నా.. ఎవరూ పర్యవేక్షించడం లేదు. ఫలితంగా జిల్లాలోని కందుల కొనుగోలు కేంద్రాలు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళారులకు సిరులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, యాదాద్రి : జిల్లాలోని భువనగిరి, ఆలేరు వ్యవసాయ మార్కెట్లలో ఐదురోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాలకవర్గాలు.. దళారులతో కుమ్మక్కై వారినుంచి టన్నుల కొద్దీ కందులను కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన కందులను మాత్రం కొనకుండా రేపుమాపు అంటూ కేంద్రాలకు తిప్పుకుంటూ దళారులు తేగానే క్షణాల్లో కొనేస్తున్నారు. ఇందంతా అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. ఇందుకు ఉదాహరణ ఆలేరులో ఐదు రోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించగా అదేరోజు ఆలేరు మండలానికి చెందిన ఓ రైతు 30 సంచుల కందులను తెచ్చాడు. ఆ రైతు తెచ్చిన కందులను ఈ రోజు వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజు కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిపోతున్నా.. స్పందన లేదు. మరోవైపు సోమవారం వరకు ఆలేరు మార్కెట్లో 1,400 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. భువనగిరిలో 1,100 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఈ మొత్తం కొనుగోళ్లపై విచారణ జరిపిస్తే భారీ కుంభకోణం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు. తాజా ఘటన ఇలా.. మంగళవారం అనంతపురం జిల్లా నుంచి లారీలో తెచ్చిన కందులను భువనగిరి కొత్త మార్కెట్ యార్డులో విక్రయిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకోవడంతో దళారుల దందా వెలుగు చూసింది. ఈ కందులు అనంతపురం నుంచి వచ్చాయా లేక స్థానిక దళారులు తెచ్చినవా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారుల కనుసన్నలలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. గత సంవత్సరం కూడా కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కందులు కొనుగోలు చేయడానికి పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లు, వీఆర్వోల ధ్రువీకరణలతో వందలాది క్వింటాళ్ల కందులు మార్కెట్ యార్డ్‌ల్లో కొనుగోలు జరుగుతోంది. రూ.5,450 మద్దతు ధర.. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మార్కెట్‌యార్డ్‌లలో హాకా ద్వారా ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5250, బోనస్ రూ.200 కలిపి ప్రతి క్వింటాల్‌కు రూ.5450 చెల్లిస్తున్నారు. సకాలంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రకరకాల కొర్రీలతో కొనుగోలు చేయకుండా రైతులను తిప్పుకోవడంతో విసిగిపోయిన రైతులు గ్రామాల్లో దళారులకు క్వింటాల్ రూ.3500నుంచి రూ.4000 వరకు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.5,450లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ కందులు ఎక్కడివి! ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన లారీలో 17 టన్నుల కందులు భువనగిరి మార్కెట్‌కు భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాకు ఇస్మాయిల్ ఉదయం లారీలో తెచ్చాడు. సుమారు 7 టన్నుల వరకు కందులను లారీలోంచి మార్కెట్లో దించారు. విషయం గమనించిన రైతులు విషయం తెలుసుకున్న భువనగిరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, బొల్లేపల్లి వీఆర్ఓ లక్ష్మినర్సయ్యను పిలిపించి లారీలోంచి దించుతున్న కందులను అడ్డుకున్నారు. ఇదేలారీ మార్కెట్ నుంచి మాయమై రాత్రి వరకు భువనగిరి పట్టణ శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం అక్కడినుంచి ఆ లారీ వెళ్లిపోయింది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో.. ఆ లారీ ఏమైనట్లో ఎవరికీ తెలియదు. అలాగే ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానిక దళారులతో కలిసి కందుల విక్రయాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాము పండించిన కందులను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం భువనగిరి మార్కెట్ యార్డ్‌లో గడ్డం శ్రీనివాస్ అనే వ్యాపారి విక్రయించిన 30 క్వింటాళ్ల కందులపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. కొనుగోళ్ల బాధ్యత ఔట్సోర్సింగ్ సిబ్బందిదే.. మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. మార్కెట్ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు కొనుగోలు బా«ధ్యతలను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు కనిపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిపై నిఘా లేకుండాపోయింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి తమకు నాయ్యం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
80 శాతం ఉద్యోగాలు అవుట్‌సోర్స్‌కు అర్హమైనవే
న్యూఢిల్లీ: దేశంలో 70–80 శాతం ఉద్యోగాలు పొరుగు సేవలకు మళ్లించేందుకు అవకాశమున్నవేనని, అయినా ఫ్రీలాన్సర్లను నియమించుకునే విషయంలో కంపెనీలు పునరాలోచనలో ఉన్నాయని ఐసీఆర్ఐఈఆర్, లిర్నేషియా సంయుక్త అధ్యయనం పేర్కొంది. ‘‘భారత కంపెనీలు ఇప్పటికీ ఫ్రీలాన్సర్లను (స్వతంత్రంగా పనిచేసేవారు) అవుట్సోర్స్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలను పట్టించుకోవడం లేదు. 70–80 శాతం ఉద్యోగాలు సరైన వసతులుంటే ఔట్‌సోర్స్‌కు మళ్లించతగినవే’’ అని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్, సూక్ష్మ పనులకు సంబంధించి దేశంలో ఉన్న సవాళ్లపై ఈ సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1976 మంది విద్యార్థులు, ఫ్రీలాన్సర్ల నుంచి అభిప్రాయాలను సమీకరించి నివేదిక రూపంలో విడుదల చేశాయి. -
సర్కారు కొలువులు సున్నా!
-
సర్కారు కొలువులు సున్నా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తతంగం ఒక అడుగు ముందుకెళ్తే నాలుగడుగులు వెనక్కన్న చందంగా మారింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా వారి ఆశ నెరవేరడం లేదు. పాత నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాక, కొత్త నోటిఫికేషన్లు రాక భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. ఏదో ఒక ఉద్యోగమొస్తే చాలని తృప్తి పడటానికీ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. ఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించినా ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ల ఊసే లేదు. ‘జూలైలోనే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామంది.. ఏ రోజున ఏ పరీక్ష ఉంటుందో కూడా కమిషన్ ప్రకటించింది.. తీరా వాటిసంగతేంటో కూడా చెప్పకుండా ఉసూరుమనిపించింద’ని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం వల్లే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. లక్షల్లో ఖాళీలున్నా విడుదలైన నోటిఫికేషన్ల మేరకైనా ఉద్యోగాలు భర్తీ కాలేదు. 1.8 లక్షల పోస్టులు ఖాళీ రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల పోస్టులు ఖాళీలుండగా తర్వాత రిటైరైన వారిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్య దాదాపు 1.80 లక్షలకు పైగా అవుతోంది. వీటన్నింటినీ భర్తీ చేయాల్సిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా కుదించింది. కేవలం 20 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. వాటిలోనూ కేవలం 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టులకు నోటిఫికేషన్లు రాగా, తక్కినవి పోలీస్ రిక్రూట్మెంటు ద్వారా భర్తీ చేపట్టారు. గత ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా 32 నోటిఫికేషన్లు విడుదలైనా అవేవీ ఇప్పటికీ పూర్తి కాలేదు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. నిబంధనలు, ప్రక్రియలో లోపాలు, కమిషన్ తప్పుల తడక నిర్ణయాల ఫలితంగా నోటిఫికేషన్లు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో, ఉన్నత న్యాయస్థానంలో విచారణలు సాగుతున్నాయి. పోస్టుల్లో కోత.. అయినా భర్తీ కాక.. ఏపీపీఎస్సీ ఈ ఏడాది మే 7వ తేదీన గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు 97 ఉన్నాయని తొలుత ప్రభుత్వం పేర్కొన్నా నోటిఫికేషన్లో మాత్రం 78 పోస్టులనే చూపించారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సంఖ్య తగ్గించి పంపడంతో వాటినే నోటిఫికేషన్లో పెట్టారు. ప్రిలిమ్స్ పరీక్షకు 93,504 మంది దరఖాస్తు చేయగా 54,956 మంది రాశారు. వారి నుంచి మెయిన్స్ పరీక్షకు 3,900 మందిని ఎంపిక చేసి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేసినా ఇంటర్వ్యూల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నల్లో తప్పులున్నాయని కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే సకాలంలో దరఖాస్తు చేయలేదని కోర్టు కొట్టివేసింది. మెయిన్స్‌లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకు దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ పోస్టుల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న అభ్యర్ధులు ఎప్పుడు ఇంటరŠూయ్వలు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అంతులేని వివాదాలు గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం 2016లో నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి గతంలో మూడు పేపర్లలో ఒక్కటే పరీక్ష ఉండేది. ఇపుడు 982 పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ పరీక్ష పెట్టి కమిషన్ కొత్త విధానానికి తెరలేపింఇ. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం ఎంపికలు చేయకుండా మెరిట్లో ఉన్న వారినే మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం వల్ల రిజర్వుడ్ వర్గాలకు అన్యాయం జరుగుతోందని అభ్యంతరాలు వెల్లువెత్తినా కమిషన్ పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో 6.50 లక్షల మంది దరఖాస్తు చేస్తే, దాదాపు 4.5 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 49,100 మందిని మెయిన్స్‌కు తీసుకున్నారు. కటాఫ్ మార్కులు ఒకేలా వచ్చినా కొంత మందిని తీసుకుని, మరి కొందరిని వదిలేశారు.74.49 కటాఫ్ మార్కు పెట్టారు. కటాఫ్ మార్కులు సాధించిన వారందరినీ తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నా వాటిని పాటించలేదు. దీంతో దాదాపు 1500 మంది అవకాశం కోల్పోయారు. ప్రిలిమ్స్‌లో కొన్ని ప్రశ్నలు తప్పులు రాగా వాటిని స్కేలింగ్ చేసి కటాఫ్ పెట్టారు. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్స్‌పై తీవ్ర వివాదం రేగింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఆలస్యంగా ఇవ్వడం, మెయిన్స్‌కు సరిపడా సమయం లేకపోవడం, దాదాపు 20 సబ్జెక్టులు 40 రోజుల్లో ప్రిపేర్ అవ్వడం ఇబ్బందిగా మారడంతో పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ముందు మొండి కేసినా చివరకు అభ్యర్థుల ఒత్తిడితో పరీక్షలను జూలై 16, 17లో నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో ఆరు తప్పులు దొర్లినా వాటిని సరిచేయలేదు. ఫలితంగా వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. మెయిన్స్‌ను ఆన్లైన్లో నిర్వహించగా దాదాపు 28 కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు ఆరోపణలు.. ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విశాఖలోని గీతం కాలేజీ, చీరాల తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. ఆందోళనలు చేసిన వారిలో కొంత మందిని డీబార్ చేశారు. ఈ పరీక్షలకు సంబంధించి దాదాపు 42 తప్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మాల్ ప్రాక్టీస్‌కు సంబంధించి ట్రిబ్యునల్‌లో కేసులు నడుస్తున్నాయి. మాల్ ప్రాక్టీస్ జరిగిన కేంద్రాల ఫుటేజీల్లో కొన్నిటిని కమిషన్ కోర్టుకు సమర్పించింది. ఈ వివాదాల నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గ్రూప్–3కి అవుట్ సోర్సింగ్ ముసుగు రాష్ట్రంలో గ్రూప్–3 కింద 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆగస్టులో స్క్రీనింగ్ పరీక్ష పెట్టారు. దీనికి 6 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్ రాసిన వారి నుంచి 1:50 చొప్పున మెయిన్స్‌కు తీసుకున్నారు. పిలిమ్స్, మెయిన్స్‌లో ప్రశ్నల్లో తప్పులు వచ్చాయి. ప్రిలిమ్స్ ‘కీ’లో తప్పులపై తప్పులు రావడంతో పలుమార్లు సరి చేయాల్సి వచ్చింది. మెయిన్స్ రివైజ్డ్ కీ ఇప్పటికీ పెట్టలేదు. ఈ నేపథ్యంలో వివాదాలను త్వరగా పరిష్కరించి పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం.. అవుట్ సోర్సింగ్ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, ఇతర పోçస్టుల భర్తీకి సంబంధించి కూడా అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జియాలిజిస్టు పోస్టుల భర్తీలో ప్రశ్న పేపర్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఏఈఈ పరీక్ష పత్రాల్లో కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి. 2011 గ్రూప్–1 మెయిన్స్దీ తేలని కథే.. కోర్టు ఉత్తర్వులతో 2011 గ్రూప్–1 మెయిన్స్ మళ్లీ నిర్వహించారు. పేపర్–5 (150 మార్కులు)లో 42 మార్కులకు సంబంధించిన ప్రశ్నల్లో తçప్పులు వచ్చాయి. వాటిపై న్యాయస్థానాల్లో కేసులు పడ్డాయి. చివరకు తప్పుడు ప్రశ్నలు తీసేసి స్కేలింగ్ చేసి జాబితా పెట్టారు. స్కేలింగ్ చేయకుండా కూడా అంతకు ముందు ఒక జాబితా ఇచ్చారు. ముందు ఇచ్చిన జాబితాలోని 32 మంది పేర్లు మలి జాబితాలో కనిపించలేదు. దీంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. స్కేలింగ్ చేయరాదని, 108 మార్కులతో జాబితా ప్రకటించడమో, లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించడమో చేయాలని కోర్టు ఆదేశించగా ప్రస్తుతం దీనిపై కమిషన్ పైకోర్టుకు అప్పీలుకు వెళ్తోంది. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయని, సమాధానాలు అసంబద్ధంగా ఉన్నాయని 10 ప్రశ్నలు తీసేశారు. డబుల్ ఆన్సర్లు తీసేశారు. అదే గ్రూప్–2కు వచ్చేసరికి డబులు, త్రిబుల్ ఆన్సర్లను యధావిధిగా కొనసాగించారు. ఒకే కమిషన్ పరీక్షల్లో ఒకసారి ఒకలా, మరోసారి మరోలా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. గ్రూప్–2 కేసులో ఆధారాలు సమర్పించాం గ్రూప్–2పై నడుస్తున్న కేసులో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు సీసీ ఫుటేజీ, ఇతర ఆధారాలు సమర్పించాం. కొంత మంది ఫేక్ క్లిప్పింగ్‌లను సృష్టించి వాట్సాప్‌లలో ప్రచారం చేశారు. వాటితో కమిషన్‌కు సంబంధం లేదు. దాదాపు 17 తేడాలున్నట్లు గుర్తించి వాటినీ కోర్టుకు ఇచ్చాము. వీటిపై సైబర్ కేసులు పెట్టామన్నారు. న్యాయస్థానాల్లో ఉన్న ఇతర కేసుల కారణంగా గ్రూప్–1 మెయిన్స్, ఇంటర్వ్యూలపై ముందుకు వెళ్లలేకపోతున్నాం. 2011 గ్రూప్–1 మెయిన్స్‌పై అప్పీలు చేస్తున్నాం. గ్రూప్–3లోని పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. మొత్తం 32 నోటిఫికేషన్లలో 20 వరకు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం ఆయా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చింది. తక్కినవి న్యాయ వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. – సాయి, ఏపీపీఎస్సీ కార్యదర్శి రాష్ట్ర విభజన నాటికి పోస్టుల ఖాళీలు 1.42 లక్షలు రిటైరైన వారితో కలుపుకొని ఖాళీలు 1.80 లక్షలు ప్రభుత్వం భర్తీ చేస్తామంటున్న పోస్టులు 20 వేలు ఏపీపీఎస్సీ నోటిషికేషన్ ఇచ్చిన పోస్టులు 4,275 ఇప్పటి వరకు భర్తీ అయిన గ్రూప్స్ పోస్టులు 0 -
దేవాదాయ శాఖలో ఔట్సోర్సింగ్ బాగోతం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవటం సాధారణం. వారి వేతన మొత్తాన్ని సిబ్బందిని సరఫరా చేసిన ఏజెన్సీకి ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది. తన కమీషన్ మినహాయించుకుని సిబ్బందికి ఆ సంస్థ వేతనాలు చెల్లిస్తుంది. అయితే అర్చకులను సరఫరా చేసే సంస్థ అంటూ ఇప్పటివరకు లేదు.. కానీ పలు దేవాలయాలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో అర్చకులను సరఫరా చేసినట్లు నియామకాలు జరిపేశారు. అసలు అర్చకులను సరఫరా చేసే ఏజెన్సీలే లేనప్పుడు దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ అర్చకులు ఎలా వచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి... అక్రమంగా నియమించిన అర్చకుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన సవరణ కోసం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దేవాదాయ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇక్కడే అసలు బాగోతం బట్టబయలైంది. దీంతో ఔట్సోర్సింగ్ పేరుతో నియమితులైన అర్చకులకు వేతన సవరణ చేయకుండా ఆపేయాలని ఆ శాఖ కమిషనర్ భావిస్తుండటంతో.. సదరు అర్చకులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. అక్రమాలకు నిదర్శనం.. సాధారణంగా నియామకాలు చేపట్టేప్పుడు అర్హతలను ప్రాతిపదికగా చేసుకుంటారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఇది అమలవుతున్నా, దేవాదాయ శాఖలో మాత్రం అడ్డగోలుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. సొంతంగా దేవాలయ పాలకమండళ్లే అడ్డగోలుగా నియామకాలు జరుపుతుండటంతో అర్హతలను పరిశీలించే పద్ధతే లేకుండా పోయింది. డబ్బులు దండుకుని సిబ్బందిని నియమించటం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఔట్సోర్సింగ్ వ్యవహారం చోటుచేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో అర్చకుల అవసరముందని ఆయా ఆలయాల నుంచి ప్రతిపాదనలు పంపారు. దాన్ని పరిశీలించిన అప్పటి అధికారులు అనుమతిచ్చేశారు. ఈక్రమంలో ఔట్ సోర్సింగ్ పేరుతో భారీ సంఖ్యలో అర్చకులను నియమించినట్లు రికార్డుల్లో రాసేశారు. కానీ.. ఏజెన్సీ పేరు, చిరునామా లాంటి వివరాలు ఎక్కడా లేవు. ఆలయ రిజిస్టర్లలో అర్చకుడి పేరు వేతన మొత్తం నమోదు చేశారు. అప్పటి నుంచి వారు అలాగే కొనసాగుతున్నారు. ఇప్పుడు వేతన సవరణ కోసం ఒక్కో అర్చకుడి వివరాలు సేకరిస్తున్న సమయంలో వారు ఔట్ సోర్సింగ్‌గా నియామకమైనట్లు గుర్తించారు. ఇటు అధికారులు, అటు పాలక మండళ్లు ఎడాపెడా డబ్బులు వసూలు చేసి ఈ నియామకాలు చేపట్టినట్టు తెలుస్తోంది. అభ్యంతరాలు రాకుండా తాత్కాలిక పద్ధతిపై నియమిస్తున్నట్లు చెప్పుకొనేందుకు ఔట్సోర్సింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని, అందరికీ డబ్బులు ముట్టడంతో దీనిపై అప్పట్లో ఎవరూ ప్రశ్నించి ఉండరన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కొందరు అర్చకులను ప్రశ్నిస్తే.. అసలు ఔట్సోర్సింగ్ సంగతే తమకు తెలియదని, తమను ఆయా నిర్వాహకులు, ఈఓలు నియమించారని పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించే విధానం సాధ్యం కాదని, ఇప్పుడు వేతన సవరణలో వారిని ఎలా పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరో చేసిన అక్రమాలకు అర్చకులను బలిచేయటం సరికాదని అర్చక సంఘాలు పేర్కొంటున్నాయి. వారిని సాధారణ అర్చకులుగానే భావించి వేతన సవరణ జరపాలని కోరుతున్నాయి. అర్హతలు లేకుండానే.. చాలా దేవాలయాల్లో పూజావిధానం తెలియని వారిని కూడా అర్చకులుగా నియమించారు. సాధారణంగా అర్చకులుగా నియమించాలంటే వేద పండితులై ఉండనప్పటికీ, షోడశోపచార పూజలు చేయటం వచ్చిన వారిని నియమిస్తారు. కానీ ఈ కనీస అర్హతలను కూడా చూడకుండానే నియమించిన దాఖలాలెన్నో. చాలా దేవాలయాల్లో కనీసం గణపతి పూజ కూడా రాని వారిని నియమించేశారు. డబ్బులు ముట్టచెబితే చాలు అర్హతల పరిశీలన కూడా అవసరం లేకుండా గుడ్డిగా నియామకాలు జరిపేశారు. -
వారిది దుర్భర జీవితం
♦ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటాం ♦ ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు విజయనగరం గంట స్తంభం : కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు పోరాడుతారని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం విజయనగరం ఏపీ ఎన్జీఓ సంఘం భవనంలో జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ భాగమన్నారు. 2001లో ఈ వ్యవస్థ ప్రారంభం అయినప్పటి నుంచి వారు బానిసలుగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ప్రసూతి సెలవులు కూడా దక్కడం లేదని తెలిపారు. ఏడాదిలో పదిన్నర నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో 28 వేల మంది కాంట్రాక్ట్, 55 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. వారి పక్షాన ఏపీ ఎన్జీఓల సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వివరించారు. అందుకే ఇక్కడ పోరాటానికి కార్యాచరణ కోసం సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు కూడా సామాజిక బాధ్యతగా ఈ పోరాటంలో పాల్గొనాల్సిందిగా సూచించారు. కొంతమందికే పరిమితమైన పెంపు.. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం వేతనాలు పెంచినప్పటికీ అది కొంతమందికే పరిమితమైనట్లు తెలిపారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సమానపనికి సమానవేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి వర్గ ఉపసంఘం దీనిపై తొందరలోనే చర్చించనుందని, వారి దృష్టికి సమస్య తీసుకెళ్తామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సి ంగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిందని, ఇప్పుడు హామీని అమలు చేయాలన్నారు. న్యాయ పరమైన సమస్య ఉంటే ముందుగా వారి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో అంతా కలిసి ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి.రమణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జరిగే పోరాటంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు ప్రభూజీ మాట్లాడుతూ జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి ఏపీ ఎన్జీఓల సంఘం అండగా ఉంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్వి.రమణమూర్తి, విజయనగరం తాలూకా సంఘం అధ్యక్షుడు సురేష్‌కుమార్, ఇతర సంఘం నాయకులు, ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
అయ్యో ఆర్టీసీ
ప్రైవేటుకు బాటలు..సంస్థకు బీటలు సొంత నియామకాలకు చెల్లుచీటీ.. ఇక అంతా ఔట్‌సోర్సింగే చివరకు సెక్యూరిటీ బాధ్యతా ‘ప్రైవేటు’కే.. 18 శాతం నుంచి 28 శాతానికి పెరిగిన ‘అద్దె’ బస్సులు తార్నాక ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుకు టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌కు తాళం.. రేపోమాపో సొంత ప్రింటింగ్ ప్రెస్ మూత ఆర్టీసీ.. సగటు ప్రయాణికుడిపైనే తప్ప మరెవరిపై ఆధారపడకుండా ఇన్నాళ్లూ తన మనుగడను సుస్థిరం చేసుకుంటూ సాగిన ఈ సంస్థ ఇప్పుడు క్రమంగా ‘పరాన్న జీవి’గా మారుతోంది! సంస్థ నిండా సొంత కార్మికులు.. అవసరాలను తీర్చుకునేందుకు సొంత అనుబంధ సంస్థలు.. ఈ రాజఠీవీని చరిత్ర పుటల్లోకి తోసి.. ‘ప్రైవేటు’పై ఆధారపడి కుంటి నడకకు సిద్ధమైంది. సొంతంగా సిబ్బందిని సమకూర్చుకోకుండా ప్రైవేటు సంస్థల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవటం, సొంత అనుబంధ సంస్థలను మూసేసి సేవలన్నింటినీ ప్రైవేటు సంస్థలకు అప్పగించటం... వెరసి ప్రపంచంలోనే గొప్ప రవాణా సంస్థగా గిన్నిస్ రికార్డు సాక్షిగా వెలుగొందిన ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు చాటున మిణుకుమిణుకుమంటోంది. ఐదేళ్లుగా నియామకాల్లేవ్ దేశంలో ప్రభుత్వపరంగా ప్రజా రవాణా వ్యవస్థలున్న రాష్ట్రాల్లో మన ఆర్టీసీ(ఉమ్మడి రాష్ట్రం)దే అగ్రస్థానం. లక్షన్నర మంది సిబ్బందితో కళకళలాడేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా 57 వేల మందితో ఉనికి చాటుకుంది. కానీ నష్టాల బూచీతో బుగులుపడి నియామకాల విషయంలో వెనుకడుగు వేసింది. దాదాపు ఐదేళ్లుగా నియామకాల్లేవు. దీంతో సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇద్దరి పనిని ఒకరితో చేయించే విధానం రావటంతో మరిన్ని పోస్టులు కాలగర్భంలో కలిసిపోయాయి. కండక్టర్ల నియామకం ఇక చేపట్టొద్దన్న ఆలోచనతో ఉంది. దూరప్రాంతాల సర్వీసుల్లో డ్రైవర్లకే టిమ్ యంత్రాలు ఇచ్చి కండక్టర్ లేని సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్‌లో కూడా స్మార్ట్ కార్డులు, వాటిని గుర్తించే సెన్సార్ల ఏర్పాటుతో కండక్టర్ పోస్టులకు మంగళం పాడబోతోంది. సిబ్బంది సంఖ్య.. 2015 మే: 56,000 ప్రస్తుతం: 53,700 ‘హైర్’ హవా.. కొత్త బస్సు వేయడమంటేనే భారంగా భావిస్తోంది ఆర్టీసీ. అందుకే హైర్(అద్దె) బస్సుల వైపు మొగ్గుచూపుతోంది. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న అద్దె బస్సులు ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. కొత్త రూట్లు గుర్తించి టెండర్లు పిలిచి అద్దె బస్సులను రోడ్లపైకి ఎక్కిస్తోంది. గతంలో మొత్తం బస్సుల సంఖ్యలో 18 శాతానికి మించకుండా అద్దె బస్సులు తీసుకునేవారు. ఇప్పుడు గేట్లు బార్లా తెరిచి దాన్ని 28 శాతానికి పెంచేశారు. అద్దె బస్సుల సంఖ్య..2015 మే:1,643ప్రస్తుతం:2,184 ∙తగ్గుతున్న షెడ్యూళ్లు... జనాభా పెరిగేకొద్ది వాహనాల సంఖ్య పెరగటం సాధారణం. పదేళ్ల క్రితం రాష్ట్రంలో 28 లక్షల వాహనాలుంటే ఇప్పుడు 77 లక్షలను మించాయి. ఈ సూత్రం ఆర్టీసీ బస్సులకు కూడా వర్తించాలి. కానీ కొంతకాలంగా ఆర్టీసీ బస్సు షెడ్యూళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఏటేటా వాటిని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇతర రవాణా సాధనాల వైపు మళ్లుతున్నారు. ఆర్టీసీ బస్ షెడ్యూళ్ల సంఖ్య..2015 మే: 8,842 ప్రస్తుతం: 7,822 అంతా ఔట్సోర్సింగ్ ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ హవా పెరుగుతోంది. కార్మికులు డిమాండ్ చేసిన దానికంటే ప్రభుత్వం ఎక్కువ ఫిట్మెంట్(44 శాతం) ప్రకటించడంతో సంస్థలో కొత్త పోకడ మొదలైంది. భారీగా పెరిగిన జీతాలను భరించటం సంస్థకు ఇబ్బందిగా మారింది. ఉన్న సిబ్బందికి జీతాలిచ్చేందుకే నెలనెలా దిక్కులు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొత్త నియామకాల ఊసే ఎత్తడం లేదు. విభాగాల వారీగా పత్రికా ప్రకటన జారీ చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తోంది. ఇటీవల సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి ఇదే పద్ధతి అనుసరించింది. తాజాగా ఉప్పల్ వర్క్‌షాపులోని టైర్ రీ ట్రేడింగ్, క్యాంటీన్, డిపో మెయింటెనెన్స్ సిబ్బందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకునేందుకు ప్రకటన విడుదల చేసింది. అనుబంధ సంస్థలకు తాళం ఆర్టీసీ అనుబంధ సంస్థలు ఒక్కొక్కటిగా ప్రైవేటుపరమవుతున్నాయి. ఇటీవల తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రిలో మందుల సరఫరా విభాగాన్ని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. వరంగల్‌లోని టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌ను మూసేసింది. కరీంనగర్, ఉప్పల్‌లోని యూనిట్ల ఉత్పత్తి తగ్గించుకుంది. కొద్ది రోజుల్లో అవి కూడా మూతపడతాయన్న వాదన వినిపిస్తోంది. మియాపూర్‌లో ఉన్న సొంత ప్రింటింగ్ ప్రెస్‌కు కొద్దిరోజుల్లో తాళం పడబోతోంది. ప్రింటింగ్ అవసరాలను ప్రైవేటుకు అప్పగించి సిబ్బంది సంఖ్యను భారీగా కుదించింది. ఇప్పటికే బస్ బాడీ తయారీ పనులను ఎక్కువగా ప్రైవేటుకు అప్పగిస్తోంది. వెరసి సొంత యూనిట్‌ను కూడా మూసే అవకాశం ఉందనే సంకేతాలిస్తోంది. సాక్షి, హైదరాబాద్ -
ఔట్సోర్సింగ్ క్రమబద్ధీకరణపై హైకోర్టు నోటీసులు
- 25వేల ఉద్యోగాల క్రమబద్ధీకరణను అడ్డుకోవాలన్న పిటిషనర్ - ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించరాదన్న కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు విద్యుత్ సంస్థల ఉన్నతాధికారు లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 25 వేల ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా ఈనెల 1, 2 తేదీల్లో ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వరంగల్‌కు చెందిన ఇంజనీరింగ్ నిరుద్యోగి ఎం.శ్రావణ్‌కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి టి.రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ‘‘ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం. పైగా ఆ ఉద్యోగులు కాంట్రాక్టర్ అధీనంలో ఉంటారు. 25 వేల ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ స్టాఫ్‌తో భర్తీ చేస్తే లక్ష మంది నిరుద్యోగులపై దాని ప్రభావం పడుతుం ది. కాబట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీ కరణను అడ్డుకుని, ప్రొసీడింగ్స్ అమలు కాకుండా స్టే ఆదేశాలివ్వాలి’’ అని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. కాగా, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాబోదని, ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన కేసు అని, పిల్‌గా పరిగణించరాదని విద్యుత్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని, ఇప్పుడే ఏదో జరిగిపోతోందనే ఆందోళనతో ముందే పిటిషనర్ కోర్టుకు వచ్చారని అన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాల్సి వుంటుందని, దానికోసం కనీసం వారం సమయం పడుతుందని, నిర్ణయం తుది దశకు చేరుకోనేలేదని, కాబట్టి పిటిషన్ చెల్లుబాటు కాదని వాదించారు. వాదనల అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధికారులు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని, 29న విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. -
వైద్యారోగ్యశాఖలో 2,101 పోస్టులు
- భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా - కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 2,101 పారా మెడికల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు తదితర పారామెడికల్ పోస్టులే కావడం గమనార్హం. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. డీఎంఈ పరిధిలో 474, వైద్య విధాన పరిషత్‌లో 270, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో 1,357 పోస్టులున్నాయి. శాశ్వత నియామకాలు జరిపే వరకు ఈ ఉద్యోగులు కొనసాగుతారని ఉత్తర్వులో తెలిపారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొందరు కలెక్టర్ల నుంచి వచ్చిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇవీ... డీఎంఈ పరిధిలో... పోస్టులు సంఖ్య స్టాఫ్ నర్సులు 279 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 121 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 74 మొత్తం 474 వైద్య విధాన పరిషత్ పరిధిలో.. పోస్టులు సంఖ్య నర్సింగ్ 129 ల్యాబ్ టెక్నీషియన్లు 51 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 48 రేడియోగ్రాఫర్లు 42 మొత్తం 270 ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం పరిధిలో.. పోస్టులు సంఖ్య స్టాఫ్ నర్సులు 1,109 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 131 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 100 ఎల్టీ మలేరియా 17 మొత్తం 1,357 -
అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు!
ఇంటర్వ్యూ తర్వాత హోటల్లో మళ్లీ దరఖాస్తుల పరిశీలన విజయవాడ స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టిన కోచ్‌ల నియామకం మరోసారి రచ్చకెక్కింది. కోచ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కూడా విజయవాడలోని ఓ హోటల్లో దరఖాస్తులను సెలెక్షన్ కమిటీ శుక్రవారం రహస్యంగా మళ్లీ పరిశీలించడం బయట పడింది. వివరాల్లోకెళితే... కోచ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ‘శాప్’ నియమించిన సెలెక్షన్ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించింది. నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహణ అనంతరం ఎంపికైన వారి జాబితాను ‘శాప్’ కార్యాలయంలో ఉంచాల్సి ఉంది. అయితే ‘శాప్’ ఉన్నతాధికారి, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ రహస్యంగా ఒక హోటల్లో దరఖాస్తులను స్క్రూటినీ చేయడం వివాదానికి కారణమైంది. దీనికి తోడు ‘శాప్’ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బంగారురాజు, సెలెక్షన్ కమిటీలోని మరో సభ్యుడు లేకుండా దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం జరగడం గమనార్హం. సెలెక్షన్ కమిటీలో ‘శాప్’ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బంగారురాజు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఎ.రమణరావు చైర్మన్‌గా, రామిరెడ్డి, వెంకటేశ్వరరావు సభ్యులుగా ‘శాప్’ ఉన్నతాధికారి దుర్గాప్రసాద్ కన్వీనర్‌గా ఉన్నారు. వాస్తవానికి ఇంటర్వ్యూ ప్రక్రియ మొత్తం ఎండీ పర్యవేక్షణలో ‘శాప్’ కార్యాలయంలో జరగాలి. హోటల్లో దరఖాస్తులు పరిశీలిస్తున్న గదికి మీడియా వెళ్లడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. కొద్దిసేపు ఏం చెప్పాలో వారికి తోచలేదు. పైగా ఇంటర్వూ్య లకు హాజరైన అభ్యర్థులు హోటల్లో కనిపించడంతో నియామకాలపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీనిపై సెలెక్షన్ కమిటీ కన్వీనర్ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా, ఎండీ పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఎండీ బంగారురాజు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ భోజనానికి వెళ్లారని, తాను విధి నిర్వహణలో ఉన్నట్లు చెప్పారు. ‘శాప్’ కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలనకు అనువైన వాతావరణం లేదని, అందుకే హోటల్‌కు వచ్చినట్లు చెప్పడం గమనార్హం. వాస్తవానికి ‘శాప్’ వీసీ అండ్ ఎండీ బంగారురాజు, కమిటీ చైర్మన్ ప్రస్తుతం నగరంలో లేరు. మొత్తం ఎంపిక ప్రక్రియ వివాదాస్పదం కావడంపై ఎండీ కార్యాలయం తరఫు నుంచి ఇంకా ఎలాంటి వివరణా రాలేదు. -
‘వీల్‌చైర్’ ఘటనపై గవర్నర్‌కు నివేదిక
-
‘వీల్‌చైర్’ ఘటనపై గవర్నర్‌కు నివేదిక
⇒ నరసింహన్‌కు వివరణ ఇచ్చిన వైద్య శాఖ ఉన్నతాధికారులు ⇒ బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ⇒ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన పలువురు రోగులు హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన వీల్‌చైర్ ఘటనపై వైద్య ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి నివేదిక అందించారు. ఇరువురు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన బేగంపేటకు చెందిన రాజును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకు రాగా వీల్చైర్లు అందుబాటులో లేవు. మరుసటిరోజు చిన్నపిల్లల సైకిల్‌ను వీల్‌చైర్‌గా వినియోగించి గాంధీ ఓపీ విభాగానికి వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న రాజు చిన్నపిల్లల సైకిల్‌తో వచ్చిన దృశ్యాలతో ‘హేరాం.. ఎంతటి దైన్యం’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పందించి వీల్‌చైర్ ఘటనతోపాటు గాంధీ ఆస్పత్రికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వైద్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ డాక్టర్ రమణి, గాంధీ ఇన్చార్జి సూపరింటెండెంట్ బీఎస్వీ మంజుల శనివారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలసి నివేదిక అందించారు. రాజు విద్యుదాఘాతానికి గురై గాంధీ ఆస్పత్రిలో చేరిన తర్వాత అందించిన వైద్యసేవలను కేస్‌షీట్లతో సహా చూపించారు. వీల్చైర్ల విషయంతో ఓపీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు పి.వెంకటరత్నం, ఎస్.మహేంద్రాబాయిలను విధుల నుంచి తొలగించినట్లు వివరించారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో ఓపీ, ఐపీ వివరాలతోపాటు మౌలిక సదుపాయాలు, వైద్యపరికరాలు, లిఫ్ట్‌లు, సీటీ, ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు, పడకలు, పారిశుధ్యం తదితర అంశాలపై రూపొందించిన నివేదికను గవర్నర్‌కు అందించారు. గాంధీ ఆస్పత్రిలో నిరుపేదలకు అందిస్తున్న వైద్యసేవలపై గతంలోనే గవర్నర్ నరసింహన్ అధికారులకు హెచ్చరించారు. గతేడాది ఫిబ్రవరి 19వ తేదిన గాంధీ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన గవర్నర్ అక్కడి వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న ఘటనలపై సాక్షి స్పందించిన తీరుపై పలువురు రోగులు, రోగి సహాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలోనే బస చేసి అన్ని అంశాలపై సమీక్షించనున్నారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- దూరవిద్య , రెగ్యులర్ బీఈడీ కోర్సులకు - అడ్హాక్ లెక్చరర్ల నియామకం - టైం స్కేలు ఉద్యోగులకు అద్దె భత్యం మంజూరు - పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు ఎస్కేయూ (అనంతపురం) : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఎస్కేయూ పాలక మండలి ఆమోదం తెలిపింది. మంగళవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం జరిగింది. తొలిసారిగా వర్సిటీలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఏజెన్సీని అప్పగించే వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకుంది. కార్తికేయ ఏజెన్సీకి అప్పగించే ముందే పలు ఆరోపణలు రావడంతో మాజీ ఉపకులపతులతో కమిటీ వేశారు. కార్తికేయ ఏజెన్సీపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కాలేదని నివేదిక ఆధారంగా పాలకమండలి తుది ఆమోదం తెలిపింది. కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో కార్తికేయ ఏజెన్సీ ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుననట్లు ప్రచారం జరగడంతో వాటి మినహా గార్డెనర్, స్క్రావెంజర్స్, డ్రైవర్స్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు పాలకమండలి సమ్మతించింది. త్వరలోనే కార్తికేయ ఏజెన్సీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. మరో వైపు సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన వెంగమాంబ ఏజెన్సీ ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము స్వాహా చేశారనే ఆరోపణలపై ప్రొఫెసర్ల కమిటీ వేసి, నిగ్గుతేల్చాలని పాలకమండలి తీర్మానించింది. అడ్హాక్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతి : దూరవిద్య బీఈడీ, రెగ్యులర్ బీఈడీ కోర్సుల్లో ఎన్సీటీఈ నిబంధనలకనుగుణంగా అడ్హాక్ లెక్చరర్లను నియమించాలనే ప్రతిపాదనకు అనుమతి లభించింది. ఏటా ఎ¯ŒSసీటీఈ అనుమతికి బోధన పోస్టుల భర్తీ లేకపోవడంతో అవరోధంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టైం స్కేలు ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంపుదల చేశారు. రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రూ. 65లు, సప్లిమెంటరీ పరీక్షలకు ఒక్కో విద్యార్థికి రూ.15లు అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు చెల్లిస్తారు. ఎన్నికల సంఘానికి అనుమతి : ఎస్కేయూ రెక్టార్ ఆచార్య శ్రీధర్, రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ పదవీ కాలం జనవరి 3 నాటికి ముగిసింది. వచ్చే పాలకమండలి సమావేశం వరకు కొనసాగించా లని గత పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. అయితే మంగâýæవారం జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని పదవుల మార్పు అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పాలకమండలి సమా వేశానికి ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ సుబ్రమణ్యం, ఆచార్య ఎ. మల్లికార్జున రెడ్డి, ఆచార్య బి.ఫణీశ్వరరాజు, రామయ్య, డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, విజయారావు, నాగజ్మోతిర్మయి, రెక్టార్ ఆచార్య జి.శ్రీధర్, రిజిస్ట్రార్ ఆచార్య ఎ .వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ప్రచారం కోసం 25 మంది జర్నలిస్టులు
- ఒక్కొక్కరికి నెలకు రూ.51,468 వేతనం - ఔట్ సోర్సింగ్‌లో ఏడాదిపాటు.. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రచారం కల్పించడానికి ఏకంగా 25 మంది జర్నలిస్టులతో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం ముఖ్యమంత్రి కార్యాలయం బ్యాక్ ఆఫీసు నుంచి పనిచేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో ఇతర పనులను ఈ బృందం చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో జర్నలిస్టుకు నెలకు రూ.51,468 వేతనం చెల్లించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఏడాదిపాటు ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ 25 మంది జర్నలిస్టులను తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రత్యేక వార్తలను ఈ బృందం రూపొందించనున్నట్లు తెలిపారు. -
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు రద్దు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు అందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, పత్రికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారంగా ఉద్యోగులను నియమించుకున్నారని ఫిర్యాదులు రావడంతో గత సంవత్సరం ఆసుపత్రిలో పనిచేసే 29 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తొలగించారు. తమను అక్రమంగా తొలగించారంటూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు పట్ల అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. -
డైట్ లెక్చరర్ల డిప్యుటేషన్లు రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ - డైట్లలో పనిచేస్తున్న టీచర్లు కూడా తిరిగి పాఠశాలలకు.. - ఉపాధ్యాయ విద్య కాలేజీల్లోని 83 ఖాళీలు ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ - కొత్త జిల్లాల్లో ఉప విద్యాధికారులు లేనట్లే! సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖలో ఉప విద్యాధికారులుగా (డిప్యూటీ ఈవో) డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) లెక్చరర్లను వెనక్కి పంపాలని విద్యాశాఖ నిర్ణయించింది. అలాంటి వారంతా తిరిగి డైట్లలో విధుల్లో చేరాలని ఆదేశించింది. వీరితోపాటు డైట్ కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డిప్యూటీ ఈవోలుగా పనిచేస్తున్న 16 మంది డైట్ లెక్చరర్లు, కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ)లో లెక్చరర్‌గా పనిచేస్తున్న మరొకరు తిరిగి డైట్ కాలేజీల్లో పాఠాలు బోధించనున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు నిర్వహిస్తున్న డైట్ కాలేజీల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న 30 మంది ఉపాధ్యాయులు కూడా తిరిగి పాఠశాలలకు వెళ్లనున్నారు. ఇక డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యా శాఖ ఆదేశించింది. గెస్ట్ లెక్చరర్ల నియామకం ప్రస్తుతం రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో 37 మంది రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తుండగా.. అర్హత కలిగిన మరో 27 మందిని ఔట్ సోర్సింగ్‌పై గెస్ట్ లెక్చర ర్లుగా నియమించారు. మరో 25 మంది లెక్చరర్ల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అర్హతలున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. ఈ 25 పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లను ఔట్ సోర్సింగ్‌పై నియమించాలని నిర్ణయించారు. ఇక ఎనిమిది ఉర్దూ మీడియం డైట్లలో ప్రస్తుతం ఏడుగురు రెగ్యులర్ లెక్చరర్లు, ఆరుగురు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. మరో 27 మంది లెక్చరర్లు అవసరం కావడంతో.. ఔట్‌సోర్సింగ్‌పై గెస్ట్ లెక్చరర్లుగా నియమించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును నిర్వహించే నాలుగు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో ప్రస్తుతం 59 మంది లెక్చరర్లు ఉన్నారు. మరో 15 మంది రిటైర్డ్ ఉద్యోగులు గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీటిలో అవసరం మేరకు మరో 31 మందిని గెస్ట్ లెక్చరర్లుగా నియమించనున్నారు. ఓవైపు డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ కాలేజీల్లో భారీగా ఖాళీలు ఉండగానే.. వాటిలో పనిచే యాల్సిన 17 మంది లెక్చరర్లు డిప్యుటేషన్లపై వెళ్లడమేమిటని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ అధికారులను ప్రశ్నించారు. ఉప విద్యాధికారి పోస్టులపై అస్పష్టత! కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉప విద్యాధికారి పోస్టులపై అస్పష్టత నెలకొంది. వాటిని ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదు. రద్దు చేసే ఉద్దేశం ఉన్నట్లు కూడా విద్యాశాఖ ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం ఉప విద్యాధికారుల్లో రెగ్యులర్‌గా, పదోన్నతులపై నియమితులైన వారిని కొత్త జిల్లాలకు ఇన్చార్జి డీఈవోలుగా నియమిస్తోంది. డిప్యుటేషన్లపై ఉప విద్యాధికారులుగా ఉన్న లెక్చరర్లను తిరిగి కాలేజీలకు పంపుతోంది. ఔట్ సోర్సింగ్‌పై భర్తీ చేసే ఖాళీలు ఇవీ మహబూబ్‌నగర్ కాలేజీలో 2, రంగారెడ్డిలో 2 (ఉర్దూ మీడియంలో మరో 4), హైదరాబాద్‌లో 4 (ఉర్దూ మీడియంలో మరో 4), మెదక్‌లో 2 (ఉర్దూ మీడియంలో మరో 4), నిజామాబాద్‌లో 2 (ఉర్దూ మీడియంలో మరో 2), ఆదిలాబాద్‌లో 5 (ఉర్దూ మీడియంలో మరో ఐదు), కరీంనగర్లో 4 (ఉర్దూ మీడియంలో మరో 5), వరంగల్‌లో 1 (ఉర్దూ మీడియంలో మరో 3), ఖమ్మంలో 2, నల్లగొండలో 1 పోస్టులలో ఔట్‌సోర్సింగ్‌పై గెస్ట్ లెక్చరర్లను నియమిస్తారు. ఇక మహబూబ్‌నగర్ సీటీఈలో 9 పోస్టులను, నాగార్జునసాగర్‌లో 12 పోస్టులను, వరంగల్‌లో 4 పోస్టులను, హైదరాబాద్ ఐఏఎస్ఈలో 6 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌పై భర్తీ చేస్తారు. -
ఖాళీలు భర్తీ చేయరా?
-
ఖాళీలు భర్తీ చేయరా?
ఔట్సోర్సింగ్ రాజ్యాంగ విరుద్ధం.. తక్షణమే రద్దు చేయండి : హైకోర్టు - ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయరా? - ఔట్సోర్సింగ్.. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల చట్టానికి విరుద్ధం - ఉద్యోగ నియామకాలకు ఔట్సోర్సింగ్ సరైన విధానం కాదు - ప్రభుత్వాసుపత్రుల్లో పోస్టులను 6 నెలల్లో భర్తీ చేయండి - నిధుల కొరతతో ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోజాలదు - నర్సింగ్, పారా మెడికల్ సేవలు ఔట్‌సోర్సింగ్‌కు వద్దు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో అవసరమైన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానంలో నియమిస్తుండడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్ విధానాన్ని ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడాన్ని పరోక్షంగా ప్రశ్నించింది. ఉద్యోగ నియామకాలకు ఔట్సోర్సింగ్ సరైన విధానం కాదని తేల్చి చెప్పింది. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన వైద్య రంగంలో ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల చట్ట నిబంధనలకు సైతం ఇది విరుద్ధమని పేర్కొంది. ఖాళీల భర్తీలో ఔట్సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపై వైద్య రంగంలో నర్సింగ్, పారా మెడికల్ సేవలను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వొద్దని తెలిపింది. ప్రభుత్వాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేసిన పోస్టులను ఆరు నెలల్లో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. అక్రమ నియామకాలు వేలాది మంది నిరుద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయంటూ 1994లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాట్రన్ అండ్ పే స్ట్రక్చర్) చట్టంలో ప్రభుత్వం పేర్కొందని న్యాయమూర్తి గుర్తు చేశారు. వైద్య రంగంలో సేవలందిస్తున్న తమను తొలగిస్తూ ఆయా జిల్లాల ఆసుపత్రులు తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తీర్పు వెలువరించారు. తీర్పులోని కీలక అంశాలు.... ఇష్టానుసారంగా నియామకాలా? అధికారులు, ఆయాశాఖల అనధికార అధిపతులు తమ ఇష్టాయిష్టాల మేరకు నియామకాలు చేపట్టడం ఆనవాయితీగా మారిపోయింది. ఇది చివరకు సర్వీసుల క్రమబద్ధీకరణ డిమాండ్లకు దారి తీస్తోంది. రోజువారీ వేతన నియామకాలను, తాత్కాలిక నియామకాలను నిషేధిస్తూ 1994లో అప్పటి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. 2016 ఆగస్టు 8న ఔట్సోర్సింగ్ విధానానికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలతో జీవో 151 జారీ అయింది. వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు సుశిక్షితులైన సిబ్బంది సాయం అవసరం. సరైన వైద్యసాయం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలనుఅందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆసుపత్రుల్లో ఏ సేవ కూడా ‘ముఖ్యమైనది కాదు’ అని చెప్పడానికి వీల్లేదు. ఈ వ్యాజ్యాల్లో ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు కౌంటర్లు దాఖలు చేశారు. వాటిని పరిశీలిస్తే.. కొత్త పోస్టుల మంజూరు, ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు వెళ్లాయని అర్థమవుతోంది. అయితే, ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతినివ్వడానికి బదులు, ఔట్‌సోర్స్ సిబ్బంది సేవలనే ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వం తప్పించుకోజాలదు వైద్య రంగంలో ఖాళీల భర్తీ ఆవశ్యకత గురించి ఇప్పటికే ఇదే హైకోర్టుకు చెందిన ఇరువురు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఔట్సోర్సింగ్ వ్యవస్థనే కొనసాగిస్తోంది. వైద్యం కోసం వచ్చే రోగులకు రాజ్యాంగం ప్రకారం మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిధుల కొరత పేరిట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదు. జిల్లాలోని ఆసుపత్రి అభివృద్ధి సొసైటీలకు కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్నారు. ఆ సొసైటీలకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. పోస్టులు మంజూరు కాక, నిధులు లేక జిల్లాల్లోని ఆసుపత్రులు నామమాత్రంగా తమ మనుగడ కోసం పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు మరో గత్యంతరం లేక మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అధ్యయనం చేయకుండానే... ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న ప్రజా విధులపై చాలా చర్చే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తగిన అధ్యయనం చేయకుండానే ‘ఔట్సోర్సింగ్’పై ఉత్సాహం చూపుతోంది. దీని ఫలితమే సేవల్లో మెరుగుదల లేకపోవడం, ఉద్యోగం విషయంలో అభద్రతాభావం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్‌లో పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ఓ విధానమని ఎక్కడా చెప్పలేదు. తాత్కాలిక పద్ధతిని ప్రోత్సహించరాదు రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం... జీవించే హక్కు అందరికీ ఉంది. అందులో భాగమే ఆరోగ్య హక్కు. ప్రజారోగ్యం మెరుగుపడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. తగిన ఉద్యోగానికి తగిన వ్యక్తుల ఎంపిక అంశంలోనూ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. వైద్య సంరక్షణ విషయంలో తాత్కాలిక పద్ధతిని పోత్సహించరాదు. ఔట్సోర్సింగ్ అనేది ఓ పద్ధతి కానే కాదు.ప్రభుత్వాసుపత్రుల్లో సాంకేతిక, నర్సింగ్ సిబ్బంది సేవలను ఔట్సోర్సింగ్ ద్వారా పొందడం సర్వీసు రూల్స్‌కే కాక ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాట్రన్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం-1994 ఉద్దేశాలకు, లక్ష్యాలకు కూడా విరుద్ధం. సమాన అవకాశాలన్న రాజ్యాంగ అధికరణకు, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల చట్ట నిబంధనలకు కూడా వ్యతిరేకమే. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి ఖాళీల భర్తీకి ఆయా ఆసుపత్రులు ప్రతిపాదనలు పంపినా.. వైద్యం వంటి ముఖ్యమైన రంగంలో కూడా ఔట్సోర్సింగ్ ద్వారానే సేవలు పొందాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత కేసుల్లో పిటిషనర్ల నియామకం విషయానికొస్తే వారు ఔట్సోర్సింగ్ ద్వారా నియమితులయ్యారు. వారు రెగ్యులర్ విధానంలో ఎంపికైన వారు కాదు. అందువల్ల ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ల సేవలను క్రమబద్ధీకరించాలనే ఆదేశాలు ఇవ్వడం లేదు. ఇక సర్వీసులో పిటిషనర్ల కొనసాగింపు విషయానికొస్తే, ఔట్సోర్సింగ్ విధానం ద్వారా వారు కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయా ఆసుపత్రులకు వారి సేవలు అవసరం. సర్వీసు క్రమబద్ధీకరణను దొడ్డిదారిన చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల్లో పోస్టులను భర్తీ చేసే సమయంలో పిటిషనర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికనమంజూరు చేయాల్సిన పోస్టులను గుర్తించడంతోపాటు, ఖాళీలను ప్రాధాన్యతల ఆధారంగా భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేయాలి. ఈ విధానంలో కొనసాగుతున్న పిటిషనర్లను ఖాళీలను భర్తీ చేసేంత వరకూ వారి పోస్టుల్లో కొనసాగనివ్వాలి. పోస్టుల భర్తీ సమయంలో పిటిషనర్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారు అందించిన సేవలకు ప్రభుత్వం వెయిటేజీ ఇవ్వాలి. -
తుది దశకు..
వేగంగా పునర్విభజన ప్రక్రియ ఇందూరు : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. దసరా నుంచే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వేర్వేరుగా పరిపాలన జరిగాలని రాష్ట్ర సర్కారు స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం బిజీగా మారింది. కొత్త జిల్లాల మ్యాపులు, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ, ఇతర జిల్లా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కొత్త మండలాల్లో ఏర్పాటు చేసే మండల కార్యాలయాల పరిశీలనతో మొదలైన ప్రక్రియ ఫైళ్ల విభజన, స్కానింగ్, ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, వాహనాలు, ఫర్నిచర్ వరకు విభజన ప్రక్రియ ఈ పాటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన పది శాతం పని ఆదివారం పూర్తిచేసి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇక కలెక్టరేట్‌కు వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. రెండో శనివారం, ఆదివారం సెలవులు రద్దు చేసి పునర్విభజన పనులను కలెక్టర్ యోగితారాణా చక చకా చేయిస్తున్నారు. ఏ అధికారికి, ఉద్యోగికి సెలవులు మంజూరు చేయడం లేదు. వివరాలు పోర్టర్లో నమోదు చేయాలి.. కొత్తగా ఏర్పాటు కానున్న కామారెడ్డి జిల్లా కార్యాలయం, బాన్సువాడ రెవెన్యూ కార్యాలయం, తొమ్మిది మండల కార్యాలయాల ఫైళ్ల విభజన, స్కానింగ్, పరికరాలు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సమాచారాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్లో జిల్లా అధికారులతో జరిగిన జిల్లాల పునర్విభజన సమావేశంలో కలెక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. సదరు నమోదులపై సంబంధిత శాఖ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, దీంతోపాటు శాఖల్లో పని చేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులను ప్రతిపాదించాలన్నారు. ఉదాహరణకు ఆర్మూర్ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ ఉన్నందున, ఆ యూనిట్లను ప్రోత్రహించేందుకు ఒక పరిశ్రమల విభాగాన్ని ప్రతిపాదించాలని చెప్పారు. అలాగే రాష్ట్ర్ట ప్రభుత్వం అన్ని పాఠశాలలను డిజిటల్ బోధనతో అనుసంధానం చేస్తున్నందున డివిజన్ స్థాయిలో డిజిటల్ బోధనను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఐకేపీ, ఆరోగ్యం, ఐసీడీఎస్ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు డివిజన్ స్థాయిలో వ్యవస్థ పరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయాల్లో వినియోగిస్తున్న ఫర్నిచర్‌కు కూడా వారితో తరలించాలని స్పష్టం చేశారు. ఏ శాఖకు కూడా కొత్తగా ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉన్నదానితోనే పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎ, రవీందర్‌రెడ్డి, డీఆర్వో పద్మాకర్, డీడీ గ్రౌండ్ వాటర్ జగన్మోహన్ ఉన్నారు. 1,150కు చేరిన అభ్యంతరాలు జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మండలాల ఏర్పాటు, గ్రామాల మార్పులు–చేర్పులపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సెల్‌కు అభ్యంతరాలు, వినతులు అందుతూనే ఉన్నాయి. శనివారం వరకు 1,150 నమోదయ్యాయి. వచ్చిన అభ్యంతరాలలో తమ గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని, పాత మండలాల్లోనే కొనసాగించాలని, వద్దని, కామారెడ్డి జిల్లాలోనే మండలాన్ని, గ్రామాన్ని ఉంచాలని, వద్దని ఎక్కువ మొత్తంలో అభ్యంతరాలు, వినతులు అందాయి. ఈ నెల 21 వరకు అవకాశం ఉండడంతో అభ్యంతరాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం కొత్త మండలాలకు డిమాండ్ పెరగడంతో ఏడు మండలాలను పరిశీలన చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అభ్యంతరాలు, వినతులు స్వీకరణ గడువు ముగిసిన తరువాత జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం సర్కారు వాటిని పరిశీలించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పూర్తి స్వరూపంతో తుది జాబితాను ప్రకటించనుంది. -
అసెంబ్లీలో లేవనెత్తుతాం
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ప్రస్తుతమున్న వారినే తొలగించడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యగులు రేవంత్‌కు వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత మార్చిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 1,179 మందిని ప్రభుత్వం తొలగించడంతో అంతా వీధుల్లో పడ్డామని ఆ ఉద్యోగులు ఆవేదన వెలిబుచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. -
నీళ్లు లేవు..నియామకాలూ లేవు
దోమలగూడ: నిధులు..నీళ్లు..నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదని పలువురు వక్తలు అన్నారు హౌసింగ్ బోర్డులో తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు రెగ్యులర్ చేయాలని కోరుతూ గృహ నిర్మాణ సంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. దీక్షలకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ డాక్టరు నాగేశ్వర్, సీపీఐ నేత గుండా మల్లేష్, బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, టీజేఏసీ కో చైర్మన్ వెంకట్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు లేవు, నియామకాలు లేవని, ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కడుపులు నింపేందుకు ఉద్యోగుల పొట్టగొడుతున్నారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత సిర్పూర్ కాగజ్‌నగర్ పేపరు మిల్లు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తదితర కంపెనీలు మూతపడి వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. -
ప్రభుత్వం పునరాలోచించాలి
ముకరంపుర: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారం ముగిసాయి. దీక్షలకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ‘డబుల్ బెడ్రూం’ను ప్రారంభించి అందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోకుండా వారిని తొలగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్నారు. అనంతరం ఏజేసీని కలిసి వినపతి పత్రం సమర్పించారు. సాయంత్రం టీఎన్జీవోలు దీక్షలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి విన్నవించగా 143 మంది ఉద్యోగులను విడతలవారీగా అర్హతలను బట్టి రిక్రూట్ చేసుకుంటామని హామీ ఇచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి, కోశాధికారులు వి.నాగచారి, డి.ప్రభాకర్, సి.హెచ్.జంపయ్య, ఎండీ ఇలియాస్, ఉపాధ్యక్షులు ఇ.రాజయ్య, బి.కుమారస్వామి, లావణ్య, శ్రీనివాసస్వామి, జి.సమ్మయ్య, ఎ.శ్యాంసుందర్, ఎం.కవిత, ఎస్.శ్రీదేవి, సీహెచ్.రమాదేవి, ఎస్.బాబురావు తదితరులు ఉన్నారు. -
పైసాచకుడు
► ఆ ఎమ్మెల్యే పీఏ వసూల్ రాజా! ► పోస్టింగ్‌లు.. బదిలీలు అన్నింటికీ మామూళ్లు ► ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఎర ► ఇప్పటికే రూ.10కోట్ల వసూలు ► వాటా కోసం కాంట్రాక్టర్లకు బెదిరింపులు ► విజిలెన్స్‌కు ఫిర్యాదుల పరంపర అధికార పార్టీ నాయకులే కాదు.. వీరి చాటు ఉద్యోగుల అవినీతి కూడా పరాకాష్టకు చేరింది. నేతల పేరు చెప్పి కొందరు.. ‘వ్యక్తిగత’ ప్రాభవంతో ఇంకొందరు.. దోపిడీకి తెర తీశారు. ఈ కోవలో ఓ ఎమ్మెల్యే పీఏ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రమేయం ఎంత మేరకు ఉందో కానీ.. ఈ సహాయకుడు మాత్రం అందరినీ పీల్చి పిప్పి చేస్తున్నాడు. వసూళ్ల పర్వం వేలు.. లక్షలు దాటి.. కోట్లకు చేరుకుందంటే ఈ ‘పైసా’చకుడు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో అర్థమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు(పర్సనల్ అసిస్టెంట్)పై ఫిర్యాదుల పరంపర మొదలయింది. సదరు పీఏపై విచారణ చేయాలంటూ విజిలెన్స్ విభాగానికి భారీగా ఫిర్యాదులు వచ్చి చేరుతున్నాయి. ఉద్యోగుల పోస్టింగ్ మొదలు బదిలీల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారనేది వాటిలోని సారాంశం. అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో నిరుద్యోగల నుంచి దోచుకుంటున్నట్లు విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు తెలిపారని సమాచారం. ఇక ప్రతి పనిలోనూ వాటాలను అడుగుతున్నారని.. ఇవ్వకపోతే పనులు జరగనివ్వడం లేదని కూడా వాపోయారని తెలిసింది. అయితే, ఇది కేవలం పీఏ పనేనా.. సదరు ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో విచారణ జరపాలని కూడా బాధితులు విజిలెన్స్ అధికారులను కోరినట్టు చర్చ జరుగుతోంది. మొత్తం మీద అధికార పార్టీ నేతలే కాకుండా వారి సహాయ సిబ్బంది అవినీతి కూడా రోజురోజుకీ పెరిగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి నుంచీ అదే తీరు వాస్తవానికి సదరు ఎమ్మెల్యే పీఏ వ్యవహారశైలి మొదటి నుంచీ విమర్శల పాలవుతోంది. అంతా తానే.. అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోని పలువురు కాంట్రాక్టర్లను పీఏ నేరుగా బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేరుగా ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సొంత పార్టీలోని నేతల ఫిర్యాదులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు ఎమ్మెల్యేకు.. ఇప్పుడు పీఏ వ్యవహారం మరింత తలనొప్పిగా మారనుంది. ఇదిగో ఉద్యోగాల జాబితా తాజాగా సదరు పీఏ మునిసిపాలిటీలో ఉద్యోగాల పేరుతో ఏకంగా రూ.10 కోట్ల మేరకు వసూలు చేశారని సమాచారం. ఈ విషయం కూడా విజిలెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులో ఉందని తెలిసింది. మునిసిపాలిటీలో వివిధ రకాల 40 పోస్టులను(డీఈ,ఏఈ, స్వీపరు, వాచ్మెన్, క్లర్క్ వగైరా) భర్తీ చేస్తున్నామని.. ఈ పోస్టులు కావాల్సిన వారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించాలని బహిరంగ బేరం పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి ఏఈ, డీఈ పోస్టులను నేరుగా భర్తీ చేసే అవకాశం లేదు. వీటిని ఏపీపీఎస్సీ భర్తీ చేస్తోంది. అయితే, ఈ పోస్టులను కూడా అవుట్‌సోర్సింగ్‌లో తీసుకుంటున్నామని నమ్మించినట్టు తెలుస్తోంది. ఇలా ప్రధానంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేశారని సమాచారం. ఇక స్వీపర్, వాచ్మెన్ పోస్టులకు కూడా లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. మొత్తం మీద ఉద్యోగాల పేరిట రూ.10 కోట్ల వరకూ వసూలు చేశారని విజిలెన్స్‌కు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీఏపై త్వరలో విజిలెన్స్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే, విచారణ జరగకుండా పైరవీలు కూడా మరోవైపు ప్రారంభమైనట్టు వినికిడి. -
తరాలు మారినా.. మారని తలరాత
♦ పెరగని వేతనాలు.. కరువైన భద్రత ♦ దీనావస్థలో కార్మికుల ‘బతుకులు’ ♦ నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం తాండూరు రూరల్/జవహర్‌నగర్: తరాలు మారినా.. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాత మాత్రం మారడం లేదు. ఎన్నోఏళ్లుగా పని చేస్తున్నా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడంలేదు. శ్రమదోపిడీకి గురవుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో మూడు ప్రధానమైన సిమెంట్ ఫ్యాక్టరీలు, 500లకు పైగా నాపరాతి గనులు, 600లకు పైగా నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. మూడు సిమెంట్ ఫ్యాక్టరీల్లో 600లకు పైగా పర్మినెంట్ ఉద్యోగులు, 3వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల భద్రత గాలిలో దీపంలా మారింది. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన ‘కోల్‌మిల్’ వద్ద నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పని చేస్తున్నారు. రాష్ట్రం వచ్చినా అంతే.. తెలంగాణ ప్రభుత్వంలో కార్మికుల బతుకులు మారుతాయని ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టు కార్మిక వ్యవ స్థే తెలంగాణలో లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కపట ప్రేమను చూపిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలగానే ఈఎస్ఐ ఆస్పత్రి.. వ్యాపార పరంగా పేరుగాంచిన తాండూరు ప్రాంతంలో కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్న ఈఎస్ఐ ఆస్పత్రి కాగితాలకే పరిమితమైంది. పది సంవత్సరాలుగా తాండూరులో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. కనీస వేతనం కరువు.. ఓగిపూర్, మల్కాపూర్ గ్రామ శివార్లలో 500లకు పైగా నాపరాతి గనులు ఉన్నాయి. ఇక్కడ సూర్యోదయంతోనే వడ్డెరబస్తీలో సందడి నెలకొం టుంది. కూలి పనులు కోసం వడ్డెరులు ప్రతి రోజు వందల సంఖ్యలో నాపరాతి గనులకు వెళ్తుంటారు. గనుల్లో కనీస వేతనం కూడా యాజమాన్యాలు చెల్లించడం లేదని వడ్డెర సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రమాదకరమైన నాపరాతి గనుల్లో పని చేస్తే.. కనీసం రోజు వారి కూలీ గిట్టడం లేదని వాపోతున్నారు. -
ఔట్ సోర్సింగ్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
కోల్‌బెల్ట్ : సింగరేణిలో అవుట్ సోర్సింగ్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐ టియూసి) భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో చేపట్టారు. ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద ఏఐటియూసి నాయకులు, కార్మికులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి ఎం. రమేష్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సింగరేణిలోని పలు గనులలో అవుట్ సోర్సింగ్ విధానంతో అండర్‌గ్రౌండ్ గనులలో ప్రైవేట్ సంస్థలతో బొగ్గు వెలికి తీసే ప్రక్రియను అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. యాజమాన్యం చేపడుతున్న చర్యల వల్ల శాశ్వత కార్మికులకు నష్టం జరిగే ప్రమాదముందన్నారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 14,15 తేదీల్లో గనుల వద్ద మేనేజర్లకు నిరసన పత్రాలను అందజేయటం జరుగుతుందన్నారు. రేపు అంబేద్కర్ జయంతి సదస్సు.... భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125 జన్మదినం సందర్భంగా ఈనెల 14న స్థానిక ఏఐటియూసి కార్యాలయంలో జయంతిని నిర్వహిస్తామని బ్రాంచి కార్యదర్శి రమేష్ వెల్లడించారు. సదస్సుకు కార్మికవర్గం అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
ఇరవై ఏళ్లుగా ఉన్నాం.. కనికరించండి...
‘ఎక్సైజ్’ ప్రైవేట్ డ్రైవర్ల విజ్ఞప్తి కొత్త వాహనాలపై నియమించాలని వేడుకోలు వరంగల్ క్రైం : కొత్త వాహనాలు వస్తే తమను పర్మినెంట్ చేస్తామని సంతోషించాం... కానీ తీసివేస్తామంటున్నారు.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖలోని ప్రైవేట్ డ్రైవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మంది ఎక్సైజ్‌శాఖలో ప్రైవేట్ డ్రైవర్లుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఎక్సైజ్ శాఖకు కొత్త వాహనాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అరుుతే, ఈ వాహనాలపై తమను పర్మినెంట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారని ప్రైవేట్ డ్రైవర్లు భావిస్తుండగా.. వీరందరినీ తొలగించాలని మంత్రి సెలవిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎక్సైజ్ డెరైక్టర్అకున్ సభర్వాల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇరవై ఏళ్లుగా శాఖను నమ్ముకున్నందున తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో హైదరాబాద్ తరహాలో వాహనాలను లోన్‌పై ఇప్పించి శాఖలోనే పెట్టుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అందరిపై జాలి చూపకున్నా... రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చిన ఆ శాఖ డెరైక్టర్ వీరినిశాఖలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కూడా వారి పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వం ఉద్యోగం కాకుండా అతి తక్కువ వేతనంతో ప్రైవేట్‌గా పనిచేస్తున్నప్పుడు తమకు బదిలీ ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో.. ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు శాఖలోని ఉన్నతాధికారులకు ప్రైవేటు డ్రైవర్లపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ డ్రైవర్ల కారణంగా తనిఖీ సమాచారం గుడుంబా తయూరీదారులకు వెళ్తోందని, తద్వారా అరికట్టలేకపోతున్నామనేది వారి ఫిర్యాదుల సారాంశం. ఇదే నిజమని న మ్ముతున్న ఉన్నతాధికారులు ప్రైవేట్ డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్ట్రంలోని అనేక ప్రాంతాలలో సీజ్చేసిన గుడుంబా, బెల్లంను కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఎస్సైలు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. హన్మకొండలో అయితే ఏకంగా ఒక సీఐ రెండు లారీల బెల్లాన్ని వ్యాపారికి తరలించి సొమ్ముచేసుకున్నాడు. ఇలా శాఖ ఉద్యోగుల్లో పలువురు తప్పులు చేస్తూ ప్రైవేట్ డ్రైవర్లపై ఫిర్యాదు చేయడంతో వీరి బజారున పడే పరిస్థితి నెలకొంది. -
బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ సేవలు
హన్మకొండ అర్బన్ : ఇంతకాలం ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టి వారితో సంక్షేమ హాస్టళ్లలో పనులు చేయించుకున్న ప్రభుత్వం.. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలకనుంది. హాస్టళ్లలో చేయాల్సిన వివిధ రకాల పనులు కేటగిరీల వారీగా విభజించి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల్లో తొలిసారిగా అమలు చేయనున్న ఈ విధానంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. అయితే ప్రస్తుతం ప్రవేశ పెడతున్న విధానం కొత్తది కావడంవల్ల సాధ్యాసాధ్యాలు, లాభ నష్టాలు అంచనాలతో నివేదికలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పనిలో పనిగా ఈ విద్యాసంవత్సరం ఆఖరులో(మార్చి ఆఖరు) ఈ విధానం క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పనులూ ఔట్ సోర్సింగ్‌కే.. ఈ విధానం ద్వారా హాస్టల్లో ఉన్న పిల్లల సంఖ్య ఆధారంగా ఒక్కో హాస్టల్‌కు విడిగా టెండర్లు పిలవనున్నారు. హాస్టల్ పిల్ల లకు కావాల్సిన అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనా లు, స్నాక్స్ వంటివి టెండరు పొందిన కాంట్రాక్టర్... పిల్లలకు తయారు చేసి అందజేయాలి. ఉదాహరణకు ఒక హాస్టల్లో 50మంది విద్యార్థులు ఉన్నట్లయితో వారికి సంబందించి స రుకులు ప్రతిరోజూ హాజరు ప్రకారం వార్డెన్ సిద్ధంగా ఉంచు తారు. వాటిని కాంట్రాక్టర్ తన సిబ్బందితో హాస్టల్లోనే వం డి విద్యార్ధులకు వడ్డన చేయించాలి. ఇక పారిశుద్ధ్యం విష యంలో కూడా ఇదే పద్ధతి. హాస్టల్లో టాయిలెట్స్, పరిస రాలు శుభ్రం చేసే పనిని కూడా కాంట్రాక్టర్‌కు ఇస్తారు. ఒ ప్పందం ప్రకారం ప్రతి రోజూ పరిశుభ్రత పనులు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు హాస్టల్ విద్యార్థుల రక్షణ కోసం వాచ్‌మన్‌ను ఏర్పాటు చేసి రక్షణ కల్పించే విషయంలో కూడా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు ఇవ్వనున్నారు. 49 హాస్టళ్లలో అమలుకు చర్యలు జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 49 హాస్టళ్లలో ఈ విధమైన ఔట్ సోర్సింగ్ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 49 ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మొత్తం 2800 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు నిబంధనల ప్రకారం ఒక్కో హాస్టల్‌కు ఒక కామాటి, కుక్, వాచ్మెన్ ఉండాలి. మొత్తంగా 96మంది ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నియామకాలే లేని కారణంగా ఉద్యోగ విరమణ చేసి పోతున్నవారి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం 96 మందికి 52 మంది మాత్రమే ఉన్నారు. ఇక వార్డెన్ల విషయంలో 32మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 17పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ సేవల వల్ల సిబ్బంది కొరత సమస్య కూడా తీరుతుందని ప్రభుత్వం లెక్కలేస్తోంది. ఉద్యోగుల్లో ఆందోళన హాస్టల్లో సేవలు పూర్తిగా ఔట్ సోర్సింగ్ ద్వారా పొందాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సిబ్బందిలో ఆందోళన మొద లైంది. ఒకవేళ ప్రభుత్వం ఇదే విధానంతో కొనసాగితే రానున్న రోజుల్లో క్లాస్ ఫోర్త్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థక మే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న వారిని ఎక్క డో ఓ చోట సర్దుబాటు చేస్తామని అధికారులు చెపుతున్నా... కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలపై స్పష్టత లేదు. పను లన్నీ ఔట్ సోర్సింగ్ ద్వారా పొందిన తరువాత ఇక పూర్తి స్థాయి సిబ్బందితో పెద్దగా పని ఉండకపోవచ్చని అంటున్నా రు. ఇదే సమయంలో ప్రయోగాత్మకంగా అమలైదేగానీ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమని స్థానిక అధికారులు అంటున్నారు. త్వరలో టెండర్లు పిలుస్తాం జిల్లాలో మార్చి ఆఖరునుంచి ఔట్సోర్సింగ్ ద్వారా సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. శాఖ మంత్రి, కమిషరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ముందుగా ఇలాంటి విధానం అమలవుతున్న గురుకులాల్లో పరిశీలించాలని నిర్ణయానికి వచ్చాం. ఒకటి రెండు రోజుల్లో ఇది పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. కార్యక్రమం మొదలయ్యాక లాభనష్టాలు పరిశీలిస్తాం. కుకింగ్, శానిటేషన్, సెక్యురిటీ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సేవలు పొందాలని నిర్ణయించాం. - జి.హృషికేష్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అక్రమాలు తగ్గే అవకాశం.. ఒక వేళ భోజనం విషయంలో ఔట్సోర్సింగ్ విధానం ద్వారా పనులు చేపడితే మాత్రం కొంతలో కొంతైనా విద్యార్ధులకు న్యాయం జరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన బీసీ హాస్టళ్లకు ఇచ్చిన మెనూలో 50శాతం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ధరల పెరుగు దల, బిల్లుల చెల్లింపు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధానంతో కొంతమేరకైనా వి ద్యార్ధులకు నాణ్యమైన భోజనం లభించే అవకాశం ఉం దని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాం ఘిక సంక్షేమ గురుకులాల్లో టెండర ్లవిధానం కొంత తేడా గా ఉన్నప్పటికీ విజయవంతంగా విధానం అమలు అవుతోంది. -
హెచ్‌సీఎల్ చేతికి వోల్వో ఐటీ కంపెనీ
డీల్ విలువ రూ.895 కోట్లు! న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్ ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.895కోట్లకు అంతా నగదులోనే కొనుగోలు చేసిందని సమాచారం. అంతేకాకుండా వోల్వో కంపెనీకి ఐదేళ్ల పాటు ఐటీ సేవలు అందించేందుకు అవుట్ సోర్సింగ్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. భారత ఐటీ కంపెనీలు సాధించిన అతి పెద్ద డీల్స్‌లో ఇదొకటి. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం..,వోల్వో కంపెనీకి చెందిన ఐటీ కంపెనీ కొనుగోలుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లోనే రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఐటీ కంపెనీ కొనుగోలు వల్ల యూరోప్‌లోని నార్డిక్, ఫ్రాన్స్ ప్రాంతాల్లో 40 కొత్త వినియోగదారులు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు లభిస్తారు. -
క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలు
ఉద్యోగులకు సంబంధించిన మూడు కీలక నిర్ణయాలపై త్వరలోనే ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేసిన మూడు కీలక నిర్ణయాలపై ఉత్తర్వులు ఈ వారంలో వెలువడుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు డీఏ, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన విషయం తెలిసిందే. కొన్ని సాంకేతిక అంశాల పరిష్కారం తరువాత అధికారులు ఉత్తర్వులు విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ యాక్ట్ 1994 (యాక్ట్2-94)ను తెలంగాణకు అన్వయించుకుంది. ఈ చట్టానికి 10ఏ నిబంధనను చేరుస్తూ మంత్రి మండలి సవరించింది. ఈ చట్టం ప్రకారం పుల్ టైం బేసిస్‌లో ఐదేళ్లు, టెంపరరీ బేసిస్‌లో పదేళ్లు సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు వీలవుతుంది. ఔట్ సోర్సింగ్ జీతాల పెంపుపై త్వరలో ఆదేశాలు అటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాల పెంపు నిర్ణయంపై కూడా త్వరలోనే ఆదేశాలు రానున్నాయి. వీలైనంత ఎక్కువమందికి జీతాలు పెరిగేలా ప్రభుత్వం నాలుగో స్లాబ్‌ను కూడా ప్రవేశ పెట్టడానికి కసరత్తు చేస్తోంది. మొత్తం 40వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వాళ్లకు అందుతున్న జీతాల ఆధారంగా నాలుగు స్లాబ్‌ల్లో లిస్ట్ అవుట్ చేస్తున్నారు. రూ. 6,500 నెలసరి జీతం పొందే వాళ్లకు రూ. 12,000, రూ. 8,400 నెలసరి జీతం పొందేవాళ్లకు రూ. 15,000, రూ. 10,900 నెలసరి జీతం పొందే వాళ్లకు రూ. 17,000 వరకు మూడు స్లాబుల్లో జీతాలు పెరగనున్న విషయం తెలిసిందే. ఐతే 40 నుంచి 50 శాతం జీతం పెరిగే విధంగా ఆర్థికశాఖ అధికారులు నాలుగో స్లాబ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు పంపారు. అక్కణ్నుంచి దస్త్రం సీఎంకు వెళ్లి ఆయన ఆమోదంతో తిరిగి వస్తుంది. తర్వాత ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇటు ఉద్యోగుల డీఏను సైతం 3.14 శాతానికి పెంచుతూ కేబినెట్ నిర్ణయం చేసింది. ఆ ఫైలుపై సీఎం సంతకం కాగానే ఆదేశాలు వెలువడనున్నాయి. -
ఎన్నికల వేళ..వరాల వాన
► మంత్రిమండలి నిర్ణయాలపై సంతోషం ► ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హర్షాతిరేకాలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను.... ప్రజలను... రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు ఆనంద డోలికల్లో ముంచుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను రూ.1,200 లోపు ఉన్న వారందరికీ నామమాత్రంగా రూ.101 మాత్రమే వసూలు చేయనున్నారు. దీంతో సుమారు 5.09 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను దాదాపు రెట్టింపు చేయనున్నారు. దీనివల్ల సుమారు 7,500 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం 6,700 అందుకుంటున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనం రూ.12 వేలకు... రూ.8,400 ఉన్న వారికి రూ.15 వేలకు పెరగనుంది. ఇప్పుడు రూ.10,900 వేతనం ఉన్న వారికి భవిష్యత్తులో రూ.17 వేలు అందుతుంది. ఈ నెల నుంచే ఇవి వర్తింపజేయనున్నారు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల కుటుంబాలకు మేలు గ్రేటర్లో నీటి పన్ను బకాయిలు రూ.450 కోట్లు మాఫీ చేయాలన్న మంత్రిమండలి నిర్ణయంతో 3 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. దీనిపై నగరంలోని అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పాత నగరంలోని నీటి వినియోగదారులు అధికంగా లబ్ధి పొందనున్నారు. నగర శివారులోని శామీర్‌పేట్, రాచకొండల్లో భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించాలనే నిర్ణయంతో గ్రేటర్ ప్రజల దాహార్తి తీరగలదని జలమండలి వర్గాలు చెబుతున్నాయి. -
ప్రైవేట్‌కు ఆస్పత్రులు
నిర్వహణను అప్పగిస్తాం: సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం త్వరలోనే ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్లను నియమిస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టిఆర్ వైద్యపరీక్ష, 102 కాల్‌సెంటర్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, టెలీ రేడియాలజీ సేవలను సీఎం చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో పారిశుధ్యం మొదలు ఇతర నిర్వహణ మొత్తం ఔట్‌సోర్సింగ్‌కు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ బాధ్యత కూడా ఔట్సోర్సింగ్కే ఇస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 40 రకాల వైద్య పరీక్షలు, పీహెచ్‌సీల్లో 19 రకాల వైద్య పరీక్షలను పైసా ఖర్చు కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అందిస్తామన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రసవానంతరం తల్లి, బిడ్డను వారి ఇంటికి తీసుకెళ్లడానికి వీలుగా ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ను ప్రవేశపెట్టామన్నారు. అదేవిధంగా 131 వైద్య కేంద్రాల్లో టెలీ రేడియాలజీ సేవలను వినియోగంలోకి తీసుకువస్తామని, దాని ద్వారా రోగులు వైద్య పరీక్షల ఫలితాలను ఫోన్లలోనే తెలుసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకంపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యం.. రాష్ట్రంలో కొత్తగా 500 మంది డాక్టర్లు, 1,000 మంది నర్సుల నియామకాలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. ఆసుపత్రుల్లో నిర్ణీత వేళల్లో పనిచేయని వైద్యులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. వారి హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అందుబాటులో ఉండాలన్నారు. లేనిపక్షంలో శాశ్వతంగా ఉద్యోగం వదిలి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జపాన్, చైనా దేశాల్లో ఒక్క సంతానం చాలని కుటుంబ నియంత్రణకు పరిమితం కావడంతో ఇప్పుడు అక్కడంతా వృద్ధులే ఎక్కువ కనిపిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మన వద్ద ఆ పరిస్థితి రాకుండా బిడ్డలే ఆస్తులుగా భావించి వారి ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు. రోగులు కోరిన ప్రైవేట్ వైద్యుడితోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించే యోచనలో ఉన్నామని సీఎం అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉన్న ఈ విధానాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రవేశపెడతామన్నారు. ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం గోదావరి జిల్లాల్లో ఈ రబీ సీజన్లో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వబోమని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రైతులకు హామీ ఇచ్చారు. బహిరంగసభ అనంతరం సీఎం ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించి సీలేరు నుంచి అదనంగా జలాలు తీసుకువస్తామన్నారు. ‘అవసరమైతే ఇక్కడే పడుకుంటా.. కానీ ఒక్క ఎకరాకూడా ఎండనిచ్చేది లేదు’ అన్నారు. ‘జనవరి 1 తర్వాత నాట్లు వేస్తే నీరిచ్చేది లేదని జిల్లా కలెక్టర్ భాస్కర్ చెబుతున్నారు. రబీ లక్ష్యం నాలుగున్నర లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికి లక్షన్నర ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు.. మరి నీళ్లు ఎలా ఇస్తారు’ అని ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించగా.. సీఎం కాస్త తత్తరపడ్డారు. ఈ విషయమై పక్కనే ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించారు.రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని కలెక్టర్ చెప్పారు. తర్వాత సీఎం మాట్లాడుతూ.. ‘రబీ పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ సారి సాగు తగ్గే అవకాశముంది. వేసిన నాట్లకు మాత్రం కచ్చితంగా నీళ్లిస్తాం’ అని చెప్పారు. -
బ్రేకప్.. వీజీయే..
♦ దీనికి కూడా ఔట్సోర్సింగ్ ♦ అమెరికా, కెనడాలో కొత్త ఆన్లైన్ సర్వీసు ఓ బంధానికి బ్రేకప్ చెప్పడం.. ప్రియురాలితో విడిపోవడం బాధాకరం.. కష్టతరం.. అయితే.. ఇప్పుడిక నో ఫికర్.. అన్ని సర్వీసుల్ని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేస్తున్నట్లే బ్రేకప్ చెప్పడాన్ని కూడా ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేయొచ్చు! ఇందుకోసం 'ద బ్రేకప్ షాప్'(breakupshop.com) అనే ఆన్లైన్ సర్వీసు ఇటీవలే ప్రారంభించారు. కెనడాకు చెందిన మెకంజీ, ఇవాన్‌లు ఈ వినూత్న సర్వీసు సృష్టికర్తలు. వీళ్లిద్దరూ సోదరులు. ఏమిటీ చిత్రమైన సర్వీసు అని అడిగితే.. తమ సొంత అనుభవమే ఈ సర్వీసు ప్రారంభించడానికి కారణమైందట. వీళ్లలో ఒకరికి అతడి ప్రియురాలు అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పేసిందట. అప్పుడతడు పడిన బాధ వర్ణనాతీతమట. దీంతో బ్రేకప్ సందర్భంగా ఇరు వర్గాలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా.. వారి స్నేహ బంధానికి ఇబ్బంది కలగకుండా చేసేందుకు ఈ సర్వీసును ప్రారంభించారట. చెప్పే పద్ధతిని బట్టి చార్జీలు.. ఇందులో బ్రేకప్ చెప్పడానికి పలు పద్ధతులు ఉంటాయి. ఆయా రకాలను బట్టి చార్జీలు ఉంటాయి. ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ బ్రేకప్‌కు రూ.660, లేఖ ద్వారా అయితే రూ.1,300, స్వయంగా ఫోన్ చేసి చెప్పాలంటే రూ.1,900, ఎస్‌ఎంఎస్‌తోపాటు బొకేను పంపాలంటే రూ.3,100 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి బ్రేకప్ గిఫ్ట్ ప్యాక్ అయితే వస్తువులను బట్టి రకరకాల ధరలు ఉన్నాయి. రూ.5,300 నుంచి ఇది ప్రారంభమవుతుంది. వీటిల్లో చాక్లెట్లు, 'ద నోట్‌బుక్' లాంటి హాలీవుడ్ రొమాంటిక్ సినిమా డీవీడీ, వీడియో గేమ్ వంటివి ఉంటాయి. ఇదెలా పనిచేస్తుంది? బ్రేకప్ సర్వీసు కోసం మనం ఆన్లైన్లో సంప్రదించగానే.. అదనపు సమాచారం నిమిత్తం మనకో ఫోన్ కాల్ వస్తుంది. మనం ఎందుకు ఈ బంధాన్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నాం? విడిపోవడానికి కారణాలేమిటి? వంటి వివరాలు తెలుసుకుంటారు. తర్వాత మనం ఎంచుకున్న బ్రేకప్ పద్ధతిని బట్టి.. ముందుగా ఆ సంస్థకు చెందిన వాళ్లు.. మనం ఎవరికైతే బ్రేకప్ చెప్పాలనుకుంటున్నామో.. వాళ్లకు చాలా మర్యాదగా.. అటువైపు వారు ఎటువంటి ఆగ్రహావేశాలకు గురికాని రీతిలో విషయాన్ని చేరవేస్తారు. ఇందుకు సంబంధించిన కారణాలను వారికి విడమరిచి చెబుతారు. సానుభూతి తెలియజేస్తారు. మీ భవిష్యత్తు ఎంతో బాగుండాలంటూ ఆకాంక్షిస్తారు. ప్రస్తుతానికైతే.. మెకంజీ, ఇవాన్లే ఈ కాల్స్ చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి.. మరింత మందిని రిక్రూట్ చేసుకుంటామని చెబుతున్నారు. ఈ సర్వీసు కొత్త తరహాదని.. చాలా మందికి ఇదో పిచ్చి వ్యవహారంలా అనిపించినా.. భవిష్యత్తులో ఇది బాగా సక్సెస్ అవుతుందని మెకంజీ, ఇవాన్‌లు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా, కెనడాల్లో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంది. -
వేతన వేదన!
సకాలంలో జీతాలందక వైద్య, ఆరోగ్య శాఖలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విలవిల మూడునెలలకోసారి విడుదల చేస్తున్న వైనం జీతాల పెంపుపైనా మీనమేషాలు ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు జిల్లా ఆస్పత్రిలో వీరిదే కీలకపాత్ర సాధారణంగా ఉద్యోగం చేసే సగటు వ్యక్తికి ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు జీతం డబ్బులు చేతికొచ్చేస్తాయి. కానీ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి మాత్రం నెలనెలా వేతనాలు అందని ద్రాక్షే. కనిష్టంగా మూడునెలలు దాటిన తర్వాతే వేతనాలు రావడం వారికి పరిపాటిగా మారింది. సర్కారు నిర్లక్ష్యం.. దానికితోడు అధికారుల ఉదాసీన వైఖరితో వారికి క్రమం తప్పకుండా జీతం రాని పరిస్థితి తలెత్తింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : తాండూరులోని జిల్లా ఆస్పత్రితో సహా పలు క్లస్టర్ ఆస్పత్రుల్లో రెండు వందలకుపైగా ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరికి నెలావారీగా వేతనాలు అందక విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం మూడు నెలలు గా జీతాలు అందలేదు. నాలుగో తరగతి కేటగిరీలోని ఆయా తదితరులకు ఆర్నెళ్లుగా వేతనాలు విడుదల కాకపోవడంతో అప్పులుచేసి పూటగడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి వేతనాలకు సంబంధించి దాదాపు రూ.25 లక్షల బకాయిలున్నట్లు అంచనా. జిల్లాలో వైద్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలక బాధ్యతలే నిర్వర్తిస్తున్నారు. పారిశుద్ధ్యంతోపాటు ఎక్స్‌రే, డార్క్‌రూం అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఈసీజీ టెక్నీషియన్ తదితర కేటగిరీల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందే ఉన్నారు. కొన్నిచోట్ల రెగ్యులర్ ఉద్యోగులున్నప్పటికీ పనిఒత్తిడిని బట్టి వీరిని ఎంపిక చేసుకున్నారు. ప్రాధాన్యత ఉన్న విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతన చెల్లింపుల్లో జాప్యం చేయడంతో వారంతా సమ్మె బాటపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనున్నట్లు సంఘనేత శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. సమ్మె చేపడితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు స్తంభించిపోనున్నాయి. పెంపులోనూ నిర్లక్ష్యమే.. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనపెంపులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిన సమయంలో ఇతర కేటగిరీల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు పెంచాలి. కానీ ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదు. గతంలో రెండుసార్లు పీఆర్సీతోపాటే వేతనాలు పెంచగా.. ఇప్పుడు సర్కారు వేతన పెంపుపై మౌనం వహించిందని ఫార్మసిస్టు అనీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. శమదోపిడీ జరుగుతోంది.. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నప్పటికీ.. వేతనాలు మాత్రం ఉపాధి కూలీల కంటే తక్కువగా చెల్లిస్తోంది. తాండూరు జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగికి రూ.50వేల వేతనం ఇస్తుండగా.. అదే ఆస్పత్రిలో అదే ఉద్యోగం చేస్తున్న నాకు రూ.9,200 ఇస్తోంది. మా ఇద్దరి మధ్య వేతనాల విషయంలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇంతే. గతంలో రెండుసార్లు పీఆర్సీ అమలు చేశారు. కానీ ఈసారి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయకుండా నిలుపుదల చేసింది. - శ్రీనివాస్, డార్క్‌రూమ్ అసిస్టెంట్, తాండూరు ఆస్పత్రి -
కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మట్టి
-
ఔట్ సోర్సింగ్ కు బాలికల హాస్టళ్లు
నిర్వహణలో స్థానికులకే ప్రాధాన్యం, రూ. 10 వేల వేతనం భద్రత సమస్యలపై దృష్టి పెట్టని సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో 102 బాలికల హాస్టళ్లను త్వరలో ప్రారంభించబోతున్న ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తూ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను ఆయా పాఠశాలల్లోని సీనియర్ మహిళా టీచర్‌కే అప్పగించాలని మొదట్లో భావించింది. టీచర్ తన కుటుంబాన్ని వది లేసి బాలికలతోపాటు హాస్టల్లో ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ఔట్‌సోర్సింగ్‌పై ఒక్కో మహిళకు రూ. 10 వేల చొప్పున వేతనమిచ్చే ఏర్పాట్లు చేస్తోంది. డిగ్రీతోపాటు డీఎడ్ లేదా బీఎడ్ చేసి ఉన్నవారికే బాధ్యతలను అప్పగించేలా నిబంధనలను రూపొందిస్తోంది. 25 ఏళ్ల పైబడిన మహిళలకు కేర్ టేకర్ పేరుతో ఈ బాధ్యతలు అప్పగించాలని, స్థానిక మండలానికి చెందినవారికే ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ (ఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో వారిని నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఒక్కో హాస్టల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదివే 100 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ హాస్టళ్లు ఉన్న ప్రాంతాలన్నీ శివారు ప్రాం తాలే. బాలికల భద్రత ఎలా అన్న అంశం ప్రధానసమస్యగా మారింది. జనావాసాలకు దూరంగా ఉన్నందునా రాత్రివేళల్లో మహిళా కేర్‌టేకర్‌కు మొత్తం బాధ్యతను అప్పగించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఏం చేయాలన్న దానిపై సర్కారు దృష్టి పెట్టలేదు. అనుకోని సంఘటనలు జరిగినపుడు కేర్ టేకర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న దానిపైనా స్పష్టత లేదు. బాలికల హాస్టళ్లకు రాత్రివేళల్లో కచ్చితంగా మహిళా కానిస్టేబుళ్ల భద్రత అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. -
మున్సిపల్ ‘రణరంగం’
ఔట్సోర్సింగ్ కార్మికులపై విరుచుకుపడ్డ పోలీసులు పది మందికి గాయాలు విజయవాడ సెంట్రల్ : శ్రమజీవుల రక్తం చిందింది. శాంతియుతంగా సాగుతున్న ర్యాలీపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మహి ళా కార్మికులను మెడలు పట్టి రోడ్డున ఈడ్చారు. దొరికినవారిని దొరికినట్టు ప్రత్యేక వాహనాల్లో కుక్కి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు వర్సెస్ కార్మికుల మధ్య తోపులాటలు, వాగ్యుద్ధాలు, హాహాకారాలతో లీలామహల్ సెంటర్ రణరంగాన్ని తలపించింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 13 జిల్లాల నుంచి సుమారు 9 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులు నగరానికి చేరుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిచేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచిఉదయం 10.30 గంటలకు ర్యాలీగా బయలుదేరారు. లీలామహల్ సెంటర్లోని మనోరమ హోటల్ వద్దకు చేరుకొనేసరికి బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు వాదనకు దిగారు. తమ బాధలు తీరాలంటే పోరాటాలే శరణ్యమన్నారు. పోలీసులు ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. మహిళా కార్మికులపై పోలీసులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఓవైపు రక్తమోడున్నప్పటికీ కార్మికులు పోరాటాన్ని కొనసాగించారు. ఈ ఘటనలో పది మందికి పైగా కార్మికులకు గాయాలయ్యాయి. బాసటగా నిల్చిన యూని యన్, వామపక్ష నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనా ల్లో పడేశారు. వన్‌టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం, త్రీటౌన్, సూర్యారావుపేట, సింగ్‌నగర్ పోలీస్స్టేషన్లకు తరలించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. మా ఉసురు తగులుతుంది టీడీపీ సర్కార్‌కు తమ ఉసురు తగులుతోం దం టూ కార్మికులు శాపనార్ధాలు పెట్టారు. అరెస్ట్‌ల అనంతరం మునిసిపల్ జేఏసీ నాయకులతో హోటల్ గేట్‌వేలో ముఖ్యమంత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంగా రూ.15,432 చెల్లించాలని, ఇం జినీరింగ్ విభాగంలో పని చేసే స్కిల్డ్, సెమీస్కిల్డ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్లపై సీఎంతో చర్చించారు. ఏ ఒక్కదానికి సీఎం అంగీకరించలేదు. మీకు(కార్మికులకు) ఇచ్చేందుకు మా(ప్రభుత్వం) వద్ద డబ్బులు ఉండాలిగా అన్నారు. మీరు అంగీకరిస్తే జీతాలు చెల్లించే బాధ్యత స్థాని క సంస్థలు చూసుకుంటాయని యూనియన్ నేతలు బదులిచ్చారు. ఆ స్థానిక సంస్థల వద్దే డబ్బుల్లేవు. వాళ్లకే మేం ఇస్తున్నాం అంటూ బుకాయించారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది తానేనని సీఎం పేర్కొన్నారు. చర్చలు విఫలమయ్యాయని తెలుసుకున్న కార్మికులు చంద్రబాబు తీరుపై దుమ్మెత్తిపోశారు. ఎత్తుకుపై ఎత్తు.. సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి భారీగా కార్మికులను తరలించడంలో యూనియన్ నా యకులు సఫలమయ్యారు. అయితే పోలీసులు గురువారం నుంచే రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో అరెస్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా అనూహ్యంగా 9 వేల మంది కార్మికులు విజయవాడ చేరుకున్నారు. -
జాబివ్వండి.. ప్లీజ్
ఏలూరు సిటీ : ప్రభుత్వ ఉద్యోగాల ఊసేలేదు. కనీసం అవుట్ సోర్సింగ్‌లో చిన్నపాటి ఉద్యోగమైనా దక్కుతుందేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. ఉద్యోగం దక్కని వారికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగం దొరక్క.. నిరుద్యోగ భృతి అయినా అందక నిరుద్యోగుల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఉన్నత చదువులు చదివినా ప్రయోజనం ఏమిటంటూ యువత నిరుత్సాహంలో కూరుకుపోతోంది. జిల్లాలో 58 వేల 300 మంది ఉద్యోగాల కోసం ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో ఎస్సీలు 18,547మంది, ఎస్టీలు 249 మంది, బీసీలు 28,915 మంది ఉన్నారు. పేర్లు నమోదు చేయించుకున్న అభ్యర్థుల్లో మహిళలు 17,581 మంది కాగా.. వారిలో ఎస్సీలు 3,843 మంది, ఎస్టీలు 58మంది, బీసీలు 6,326 మంది ఉన్నారు. మొత్తంగా వికలాంగులు 5,873 మంది ఉండగా, 378 మంది మూగ, చెవిటి అభ్యర్థులు, 458 మంది అంధులు, 5,005 మంది శారీరక వైకల్యం గలవారు ఉన్నారు. ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోని నిరుద్యోగుల సంఖ్య భారీగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పట్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని, సీఎం హామీ ఇచ్చినట్టుగా కనీసం నిరుద్యోగ భృతి ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. భరోసా ఏదీ : డీఎస్సీ-14 ప్రకటించినా జిల్లాలో కేవలం 506 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. బీఎడ్ అభ్యర్థులు 25వేల మంది ఉంటే వారికి కేవలం వారికి 223 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన అభ్యర్థులంతా నిరుద్యోగులుగానే మిగిలిపోయే పరి స్థితి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో 500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తుండగా వారి ఉద్యోగాలకు నేటికీ భరోసా లేదు. రాజీవ్ విద్యామిషన్‌లో పనిచేస్తున్న సుమారు 1,200 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. గృహ నిర్మాణ సంస్థలో 70మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్ చదివిన నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తోంది. -
700 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
కొత్తగా తీసుకొనేందుకు టెండర్లు పక్షం రోజుల్లో భర్తీకి కసరత్తు సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్‌పై పని చేస్తున్న 700 మంది సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడానికి టెండర్ల ప్రక్రియ ద్వారా ఏజెన్సీలను ఆహ్వానిస్తున్న అధికార యంత్రాంగం పక్షం రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటోంది. హెచ్ఎండీఏలో పని చేస్తున్న 200 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇటీవల తొలగించిన అధికారులు.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవటానికి టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అదే తరహాలో జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిని తొలగించిన అధికారులు కొత్త వారిని తీసుకోవటానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్ల ప్రక్రియలో 50 ఏజెన్సీలు పాల్గొన్నప్పటికీ 32 ఏజెన్సీల వైపే అధికారులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. తొలగించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో కలెక్టరేట్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న వారు 21 మంది ఉండగా, సాంఘిక సంక్షేమ శాఖలో 38 మంది, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో 95, రాజీవ్ విద్యా మిషన్ (సర్వశిక్ష అభియాన్)లో 35 మంది ఉన్నారు. వీరితో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ, విద్యుత్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు, మైనారిటీ, వికలాంగుల, ఎస్టీ సంక్షేమ శాఖలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల్లో అత్యధికంగా ఔట్ సోర్సింగ్‌పై పని చేస్తున్నారు. -
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బందికి ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రులు, హెడ్ ఆఫీసుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1,039 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సహా ఇతర సహాయ సిబ్బందిని మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి31 వరకు వీరిని కొనసాగిస్తారు. -
భారత్‌లో ఎయిర్‌బస్ ‘తయారీ’!
-
భారత్‌లో ఎయిర్‌బస్ ‘తయారీ’!
ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచుతామన్న ఫ్రాన్స్ కంపెనీ - విమాన కర్మాగారాన్ని సందర్శించిన మోదీకి ‘ఎయిర్‌బస్’ వెల్లడి - మొదటి ప్రపంచ యుద్ధం స్మారకాన్ని సందర్శించిన భారత ప్రధాని తౌలోస్ (ఫ్రాన్స్): భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఫ్రాన్స్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ మద్దతు తెలిపింది. భారత్‌లో తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్‌లోని ఎయిర్‌బస్ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్ ఎండర్స్ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్‌బస్‌ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్‌లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో బలమైన పారిశ్రామిక బంధాన్ని నెలకొల్పుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుకు మేం మద్దతిస్తున్నాం. భారత్‌లో తయారు చేయటానికి మేం సిద్ధం’’ అని చెప్పారు. భారత్‌లో ఎయిర్‌బస్ గ్రూపు సంస్థలు ప్రస్తుతం.. పౌర విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించి రెండు వేర్వేరు ఇంజనీరింగ్ కేంద్రాలను, ఒక పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం (ఆర్ అండ్ టీ) కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వీటిలో ప్రస్తుతం 400 మందికి పైగా అత్యంత అర్హతలున్న వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తరించాలన్న తమ నిర్ణయాన్ని టామ్ ఎండర్స్ వెల్లడించారు. విమానాలను తుదిగా అసెంబుల్ చేసే కర్మాగారాలను, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లకు సరఫరా సంస్థలు, సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఎయిర్‌బస్ సంస్థ భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను ప్రస్తుతమున్న 40 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు ప్రధాని మోదీతో చెప్పిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆ తర్వాత ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో భారత అమర జవాన్లకు మోదీ నివాళులు ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా లిల్లె నగరానికి వెళ్లి.. అక్కడి మొదటి ప్రపంచయుద్ధ స్మారకాన్ని సందర్శించారు. 1914-18 మధ్య కాలంలో ఫ్రాన్స్ సరసన జర్మనీతో పోరాడుతూ మరణించిన 10,000 మంది భారతీయ సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పలువురు భారతీయులు సమావేశమై ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే కావటం విశేషం. అనంతరం ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ స్టేట్ స్టడీస్ (సీఎన్ఈఎస్)ను కూడా మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తనచుట్టూ చేరిన యువ విద్యార్థులతో ఆయన ‘సెల్ఫీ’ ఫొటోలు దిగారు. -
రుణ వితరణకు అవుట్సోర్సింగ్ వద్దు
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా న్యూఢిల్లీ: మొండి బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో రుణాల ప్రాసెసింగ్ ప్రక్రియను అవుట్‌సోర్సింగ్‌కి ఇవ్వరాదంటూ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా బ్యాంకులకు సూచించారు. రుణ వితరణ అనేది బ్యాంకు అత్యంత ప్రధాన కార్యకలాపాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. దీన్ని ప్రధానేతర అంశంగా పరిగణించరాదన్నారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా రికవరీ ప్రక్రియ చేపట్టేయాలని ముంద్రా సూచించారు. నిరర్థక ఆస్తి ఏ రూపంలోనిదైనా బ్యాంకింగ్ వ్యవస్థకు భారంగా మారుతుందని, దీని ప్రభావం నిజాయితీగా కట్టే వారిపై పడుతుందని ఆయన చెప్పారు. ఎగవేతదారుల పనిపట్టేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోందన్నారు. అటు, బాండ్ల ద్వారా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు సమీకరిస్తుండటమనేది కార్పొరేట్ డెట్ మార్కెట్ వృద్ధికి అడ్డంకిగా మారుతోందని ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ మరో డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రణాళికలతో ఈ పరిస్థితిలో మార్పు రాగలదన్నారు. అటు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)ను క్రమక్రమంగా తగ్గించే అంశం కూడా కార్పొరేట్ డెట్ మార్కెట్‌కు ప్రయోజనం చేకూర్చగలదని ఆయన తెలిపారు. -
ఉపాధి ఔట్?
75శాతం పనులు సాకుగా చూపిస్తూ.. 500 మంది సిబ్బంది తొలగింపునకు సన్నాహాలు? కొత్త ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక గ్రామ కమిటీలకే ఆందోళనలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పార్వతీపురం: ఉపాధి హామీ పథకంలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలను భారీ సంఖ్యలో తొలగించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు జనవరిలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న ఖాళీలను, ఇప్పుడు తాజాగా లేనిపోని నిబంధనలతో చేస్తున్న ఖాళీలను భర్తీ చేసే అధికారాన్ని, దాదాపు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించి, ఆయా ఖాళీలలో పార్టీ కార్యకర్తలకే స్థానం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భోగట్టా. జిల్లాలోని 925 పంచాయతీలలో సుమారు 200 మంది ఫీల్డు అసిస్టెంట్ల పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 725 మందికి గత ఏడాది పనులపై ఈ ఏడాది 75శాతం పనులు చేయాలంటూ నిబంధనలు విధించారు. అయితే పనులు కల్పిస్తున్న వేతనదారులకు జనవరి నుంచి బిల్లులివ్వకపోవడం, ఇటీవల బడ్జెట్ విడుదలయ్యాక పోస్టల్ సిబ్బంది సమ్మెలోకి దిగడం తదితర కారణాల వల్ల, వేతనదారులు పనులపై ఇష్టం చూపకపోవడ ంతో తాము లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని ఉపాధి సిబ్బంది వాపోతున్నారు. అయితే ఇందులో ఎంపీడీఓలది పూర్తి బాధ్యత అయినప్పటికీ 75శాతం పనులను సాకుగా చెప్పి ఔట్‌సోర్సింగ్‌లో ఉన్న ఫీల్డు అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీఓలను తప్పించి తమ ఉపాధిని పోగొట్టడం తగదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ఫీల్డు అసిస్టెంట్లు, క్లస్టర్ స్థాయిలో టీఏలు, సాంకేతిక సహాయకులను, మండల స్థాయిలో ఏపీఓలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పరిస్థితి ఏమిటంటూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మార్చి పూర్తయితే గానీ చెప్పలేం ఏపీడీ అప్పలనాయుడు అదనపు పథక సంచాలకులు, డ్వామా ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయితే గానీ 75శాతం లేబర్ బడ్జెట్ మీట్ అయ్యారా ? లేదా? అనేది చెప్పలేం. ఏప్రిల్ వస్తేగాని అటువంటి ఎనాలిసిస్కు వెళ్లలేం. అటువంటి ఆదేశాలు ఏవీ రాలేదు. ఒకవేళ వచ్చినా జిల్లాకు అంత ప్రమాదం ఉండదు. రాష్ట్రస్థాయిలో రూ. 2.04కోట్లు లేబర్ బడ్జెట్‌ను చేరుకుని జిల్లా ముందంజలో ఉంది. రూ.1.83కోట్లతో విశాఖ జిల్లా, రూ. 1.78 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దాదాపు 200 మంది ఫీల్డు అసిస్టెంట్లు లేక ఆయా ప్రాంతాలు అవస్థలు పడుతున్నాయి. -
మేడిన్ ఇండియా!
భారత్ ప్రపంచానికి కార్మికులను అందించే కర్మాగారం... ఇండియా అంటే ఒక కాల్‌సెంటర్! ఔట్సోర్సింగ్ తో పొరుగు దేశాలకు సేవలనందిస్తూ పొట్టనింపుకొనే దేశం.. ఇది నాణేనికి ఒక వైపు!అతి తక్కువ ఖర్చుతో అంగారక గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపిన దేశం. ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చు తోనే ఆ అద్భుతాన్ని సృష్టించగలిగారు భారత శాస్త్రవేత్తలు. ఈ విషయంలో నాసా, ఇసాలు కూడా ఇండియాని చూసి ఔరా అనుకొన్నాయి. ఇదీ ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్న ఇండియా రెండో కోణం! అంతేనా... తరచి చూడాలి కానీ ఇంకా ఎంతో ఉంది. కేవలం ఇస్రో చేస్తున్నవి మాత్రమే కాదు ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. గత దశాబ్దాల్లో మేధోవలసతో సతమతమైన దేశంలో ఇప్పుడు స్టార్టప్‌ల మోతమోగుతోంది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని మన మేధావులు వారి వీధుల నుంచే విశ్వవ్యాప్త గుర్తింపు పొందుతున్నారు. అనేక మందికి ఉపాధి చూపగల, మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేయగల వారి ఆవిష్కరణల ద్వారా అబ్బురపరచడానికి సన్నద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి.. వారి ఆవిష్కరణల గురించి... తవుడు నుంచి విద్యుత్! విద్యుత్ కోతల గురించి భారతీయులకు ఉన్నంత విజ్ఞానం ఎవరికీ ఉండదు. మరి అందరికీ అవగాహన ఉన్న ఈ అంశంపై ఒక పరిష్కారమార్గాన్ని కనుగొని వార్తల్లోకి వచ్చాడు జ్ఞానేష్పాండే అనే బిహారీ. ఇతడి ఆలోచన ఇప్పుడు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సరికొత్త పవర్ ప్లాంట్లను ఆవిష్కరించింది. 250 గ్రామాల్లోని 20,000 గృహాల్లో కరెంటు దీపాన్ని వెలిగించింది. తవుడుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఆవిష్కరించాడు పాండే. గ్రామీణప్రాంతాల్లో వరి తవుడు విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. పశువుల దాణాకు ఉపయోగించే ఈ తవుడుతోనే ఇప్పుడు అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మన సమాజాలను ప్రభావితం చేయడానికి ఇంతకన్నా గొప్ప ఆలోచన ఏముంది! వ్యవ‘సాయం’ చేస్తుంది! పంటలకు పురుగుమందులను స్ప్రే చేయడానికి తగిన డ్రోన్‌ను రూపొందించాడు దులాల్ అధికారి అనే బెంగాల్ విద్యార్థి. సాధారణంగా మోటార్స్ప్రేయర్లతో రసాయనాలను స్ప్రే చేస్తారు. ఇది కష్టంతో కూడుకొన్న పని.. ఎక్కువ సమయం తీసుకొనే పని. కొన్ని రకాల పంటలకు మోటార్స్ప్రేతో మందులు చల్లడం కూడా సాధ్యం కాదు. ఈ అవాంతరాలను నివారిస్తుంది ఈ డ్రోన్. గాల్లో విహరిస్తూ పెస్టిసైడ్లను స్ప్రే చేస్తుంది. పూర్తిస్థాయి దేశీయ యంత్రసామగ్రితో దీన్ని రూపొందించారు. దీనికి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉపయోగం మాత్రం అమూల్యమైనది. ఒక మోటార్ స్ప్రేయర్ మూడుగంటల్లో చేయగల పనిని రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే ఈ డ్రోన్ స్ప్రేయర్ కేవలం పది నుంచి పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తుందంటే దీని గొప్పతనాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. పిజ్జా ఇక చల్లారదు! పిజ్జా మన ఆహారం కాదు.. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తినే పిజ్జా ప్యాకింగ్ విషయంలో ఒక భారతీయుడి ఆవిష్కరణకు గొప్ప గుర్తింపు దక్కింది. మంచి ఆదరణ లభిస్తోంది. ముంబైకి చెందిన వినయ్ మెహతా అనే ప్యాకేజర్ ‘వెన్టిట్’ అనే పిజ్జా ప్యాకింగ్బాక్స్ను రూపొందించాడు. పిజ్జాను వేడి వేడిగా ఉంచడటమే దీని ప్రత్యేకత. ప్యాక్ చేసిన పిజ్జాను డెలివరీ అయ్యేంత వరకూ హాట్ హాట్ ఉంచే విన్టిట్ బాక్స్ పిజ్జామేకింగ్సంస్థలకు బాగా నచ్చేసింది. దీంతో మెహతాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. వెన్టిట్ బాక్స్‌కు వందదేశాల్లో పేటెంట్ దక్కిందంటే.. మెహతా సాధించిన విజయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్రినేత్రంతో చూడొచ్చు... దృష్టి సంబంధ సమస్యల పరిశీలనలో త్రినేత్ర ఆవిష్కరణ గొప్ప అభివృద్ధి అని అంటున్నారు నిపుణులు. బెంగళూరు పరిశోధకులు కే చంద్రశేఖర్, శ్యామ్ వాసుదేవరావులు అభివృద్ధి పరిచిన ఈ వైద్యశాస్త్ర పరికరం కంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది. దీనితో కళ్లను పరీక్షించడం ద్వారా ఐదు రకాల దృష్టిదోషాలను ముందుగానే కనుగొనవచ్చు. కాటరాక్ట్, డయాబెటిక్ రెటీనా, కార్నియా వంటి దృష్టి సంబంధ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ముందస్తు చికిత్సకు వెళ్లవచ్చు. ముందుగానే సమస్యలను గుర్తించగల శక్తి ఉన్న ఈ పరికరానికి ’త్రినేత్ర’ అనే పేరు పెట్టారు ఆవిష్కర్తలు. ఇప్పటికే ఈ తరహా పరికరాలు కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ధర విషయంలో త్రినేత్ర వాటిలో ఐదోవంతు మాత్రమే ఉంటుంది. శ్వాసతోనే సౌకర్యం! కేవలం శ్వాసతోనే ఎలక్ట్రిక్ వీల్ చైర్ దిశను మార్చగల అధునాతన ఆలోచనను ఆవిష్కరింపజేసి చూపాడు సుశాంత్ పత్నిక్. శారీరక వైకల్యంతో బాధపడుతూ వీల్ చైర్‌కే పరిమితం అయిన వారి అవస్థ ఈ కుర్రాడిని కదిలింపజేశాయి. వారు వీల్చెయిర్మీద అయినా తమకు నచ్చినట్టుగా కదలడానికి తగిన విధంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇతడు ‘బ్రీతింగ్ సెన్సర్ ఆపరేటస్’ను రూపొందించాడు. వీల్‌చెయిర్‌కు పరిమితమైన వ్యక్తులు చెయ్యి, కాలు కదల్చాన అవసరం లేకుండా శ్వాసను బట్టే వారి చక్రాల కుర్చీ కదిలే ఏర్పాటు చేశాడు సుశాంత్. తన ఆవిష్కరణకు ద్వారా వీల్ చెయిర్‌ను కదిలించలేని శారీరక వికలాంగులకు గొప్పవరాన్ని ప్రసాదించిన సుశాంత్‌కు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి అవార్డు కూడా దక్కింది. పల్లెటూరి ఫ్రిడ్జ్ గ్రామీణ ప్రాంత ప్రజలకు సౌకర్యం కోసం కాదు కానీ.. పండించిన కూరగాయల, ఆకుకూరల కోసం రిఫ్రిజిరేటర్ అవసరం. కాయగూరలు, ఆకుకూరలు, పళ్లు వంటివి సాధారణ వాతావరణంలో తొందరగా పాడైపోతాయి. వాటిని శీతలవాతావరణంలో నిల్వ ఉంచితే మార్కెటింగ్‌కు అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జోధ్‌పూర్ లోని సెంట్రల్ అరిడ్ జోన్ పరిశోధక కేంద్రం వారు కొత్తరకమైన రిఫ్రిజిరేటర్‌ను రూపొందించారు. విద్యుత్ అవసరం లేకుండా పనిచేయడం దీని ప్రత్యేకత. ఇసుక, సిమెంటు, ఇటుకల సాయంతో నిర్మించే ఇది బాష్పీభవనం సూత్రం మీద పనిచేస్తుంది. ఇళ్ల వద్దే నిర్మించుకోగల ఇది మండువేసవిలో కూడా 12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉంటుంది. దీంట్లో ముప్పైనుంచి యాభై కిలోగ్రాముల కాయగూరలను నాలుగైదు రోజుల వరకూ నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -
అవుట్ సోర్సింగ్ నియామకాలు బంద్
హైదరాబాద్: తెలంగాణ వైద్యశాఖలో అవుట్ సోర్సింగ్ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తక్షణం నియామకాలు నిలిపివేసి పటిష్టమైన మార్గదర్శకాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టాలని సూచించింది. -
బంగారు తెలంగాణ కాదు.. కన్నీటి తెలంగాణ
ఖమ్మం మయూరిసెంటర్ : పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం బంగారు తెలంగాణ కాదని, కన్నీటి, కష్టాల, బాధల తెలంగాణగా మారిందని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ అన్నారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. మహిళలపై సామ్రాజ్యవాద విషసంస్కృతిని ప్రేరేపిస్తున్నారని, దేశంలో భ్రూణహత్యలు పెరిగిపోయాయని, వాటిని నిరోధించాల్సిన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దేశంలో బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా మహిళలపై హింస, దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మహిళను ఆట వస్తువుగా చూపుతున్నారని, ప్రభుత్వాలు గృహహింస చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళలు, పురుషుల సమానత్వం కోసం పోరాడాలన్నారు. అనంతరం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 4వేల మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి బలిదానంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల బాధలను మర్చిపోయి హైదరాబాద్ బల్దియా ఎన్నికల కోసం ఆరాటపడుతున్నారని, నిజాం పాలననే పొగుడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మాటే ఉండదని, అందరినీ పర్మినెంట్ చేస్తామని మాటలు చెప్పిన కేసీఆర్ వాటిని మరచి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 59 జీఓ అక్రమార్కులకు అండగా ఉందని, దీనిని వెంటనే రద్దు చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కూలీలకు, రైతులకు రూ.వెయ్యి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గాదె ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు జి.సరోజని, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్‌లు మాట్లాడారు. అనంతరం కదలిరా.. ఓ మహిళా కదలిరా.. అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె.కల్పన, జిల్లా కార్యదర్శి సిహెచ్.శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులపై నేడు సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సోమవారం ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఇప్పటికే వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఈయన ఆధ్వర్యంలోనే సోమవారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. గతంలోనే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలా వద్దా అనే విషయమై గత ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఎంత వేతనం చెల్లిస్తున్నాం? వంటి వివరాలు సేకరించారు. ఇప్పటికే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారా? తొలగిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. -
అమలు కాని హామీలకు 6 నెలలు
అధికారమే పరమావధిగా అవధుల్లేని హామీలు గుప్పించిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి సోమవారానికి ఆరు నెలలు పూర్తయింది. అధికారం చేపట్టాక అమలైన హామీ ఒక్కటీ కానరాదు. రుణమాఫీ అమలుకాక అన్నదాతలు..డ్వాక్రా మహిళల రుణాలు వడ్డీలతో కొండల్లా పేరుకు పోయాయి. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న మాటకు జవాబే లేకుండా పోయింది. తొమ్మిది గంటల వ్యవసాయ విద్యుత్ ఊసే లేదు. ఫించన్ సొమ్ము ఐదు రెట్లు పెంచానని చెప్పి వేలాది మంది అర్హులను జాబితాల నుంచి తొలగించేశారు. ఇక విరుచుకుపడిన హుద్‌హుద్ ధాటికి దెబ్బకు కట్టుబట్టలతో రోడ్డున పడిన లక్షలాది మంది నిరుపేదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నేటికీ సాయానికి నోచుకోక నరకం చూస్తున్నారు. అధికారంలోకి రాకముందు బాక్సైట్‌ను, పీసీపీఆర్ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వాటికి వత్తాసు పలుకుతున్నారు. విశాఖపట్నం: అధికారమే పరమావధిగా అవధుల్లేని హామీలు గుప్పించిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి సోమవారానికి ఆరు నెలలు పూర్తయింది. అధికారం చేపట్టాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ వివిధ వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహ లు చోటుచేసుకుంటున్నాయి. బాబు వస్తే జాబు వస్తుందని కొండంత వీరంతా ఎదురు చూ శారు. ఆర్నెళ్లయినా ఒక్కరికి కూడా ఉద్యోగమొచ్చిన దాఖలాలు లేవు. మరోవైపు ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు, హౌిసింగ్లోని అవుట్సోర్సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో సుమారు ఆరు వేల మంది ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డున పడ్డారు. {పతీ ఒక్కరికి లక్షన్నరతో ఇంటిని నిర్మిస్తామన్న బాబు ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలేదు. పైగా వివిధ దశల్లో ఉన్న వాటికి ఒక్కరూపాయి బిల్లు కూడా మంజూరు చేయలేదు. హుద్‌హుద్‌కు జిల్లాలో 46 మంది చనిపోయినట్టు, మరో 56 మంది క్షతగాత్రులైనట్టుగా నిర్ధారించారు. చనిపోయిన వారిలో 42మందికి రాష్ర్టప్రభుత్వం తరపున రూ.5లక్షల సాయం మాత్రమే అందజేశారు. మిగిలిన నలుగురికి ఎలాంటి సాయం లేదు. కేంద్రంనుంచి అందాల్సిన రూ.2లక్షల సాయం రాలేదు. లక్షా 48వేల ఇళ్లు నేలమట్టమైతే రూ.75కోట్లు విడుదల చేశామంటున్నా కనీసం 10వేలమందికి కూడా పరిహారం అందలేదు. నేటికి లక్షలాది మంది మొండిగోడల మధ్య, ఫ్లెక్సీల మాటున చలిలోనే జీవనం సాగిస్తున్నారు. 86వేల ఎకరాల్లో పంటలు సర్వనాశనమైపోయినా ఒక్కరైతుకూ పరిహారం అందలేదు. ఫిషింగ్ హార్బర్లో 670 మెకనైజ్డ్ బోట్లుంటే దాదాపు అన్నీదెబ్బతిన్నాయి. సగానికి పైగా ధ్వంసమైతే మిగిలిన వాటికి నష్టం వాటిల్లింది. పెనుగాలుల విధ్వంసానికి వలలతో పాటు ఉన్న బోట్లు 391 కొట్టుకుపోతే, వలలతో ఉన్న మరో 190 బోట్స్‌కు నష్టం వాటిల్లింది. మరో 431బోట్లు, 190 వలలు విడివిడిగా కొట్టుకుపోతే..మరో చిన్నా చితకా కలిపి 1301 వరకు దెబ్బ తిన్నాయి. బోట్లు, వలలకు నష్టం రూ. 24 కోట్ల 61లక్షల 14వేలుగా అంచనా. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పరిహారం అందలేదు. రెండున్నర లక్షల మంది రైతులకు చెందిన 3.87లక్షల ఖాతాల పరిధిలో పంట, బంగారు రుణాలు రూ.3,800కోట్ల వరకు ఉన్నాయి. ఎన్నికల ముందు ఇవన్నీ మాఫీ అన్నారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రుణాలు కాదు కేవలం పంట రుణాలే అదీ కుటుంబానికి లక్షన్నర వరకే అంటూ మాట మార్చారు. అలా చూస్తే పంట రుణాలు దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు మాఫీ కావాలి. ఇప్పుడు 50 వేల లోపుపంట రుణాలు మాత్రమే అంటున్నారు. ఆ జాబితాలో ఎవరి పేరుందో తెలియదు. ఇక జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాల పరిధిలో ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉన్నా రు. వీరికి ఉన్న రూ.886 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఇంతకాలం ఎదురు చూశారు. మాఫీ కాకపోగా 14 శాతం వడ్డీ తో కలిపి వీరిపై అప్పుల భారం వెయ్యి కో ట్లు దాటి పోయింది.పదవి చేపట్టకముందు మన్యంలో బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే మనిషి మాట మార్చారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పీసీపీఆర్ ఏర్పాటు చేస్తామని ఎవరైనా వస్తే చెట్టుకు కట్టేసి కొట్టమన్న వ్యక్తి ఇప్పుడు మాట మార్చారు. పీసీపీఐఆర్ ఏర్పాటుకు వేలాది ఎకరాలు ధారాదత్తం చేస్తూ, స్థానికులను నిరాశ్రయిలను చేస్తున్నారు. -
‘హామీ’ లేని ‘ఉపాధి’
ఏలూరు :పల్లెల్లో వలసల నివారణ, గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనుల్లేనప్పుడు స్థానికంగా పని కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి దూరంగా జరుగుతోంది. ఈ పథకం రద్దు చేస్తారన్న ప్రచారం తొలుత జరిగింది. ఇప్పుడు కుదింపు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై కూలీల్లో కలవరం రేగుతోంది. కాగా రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు కుదించేందుకు డ్వామా అధికారులు గ్రామసభలను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఏడాదే ఉపాధి పనులపై ప్రభుత్వ నిర్ణయ ప్రభావం పడుతోంది. దాదాపుగా 48 మండలాల్లోనూ ఉపాధి పనులు నిలిపివేసినట్టు సమాచారం. అధికారులు మాత్రం ఉపాధిని రద్దు చేయలేదని, అవసరం మేరకు పనులు చేసేందుకు గ్రామసభలను నిర్వహిస్తున్నట్టుగా నమ్మబలుకుతున్నారు. రానున్న సంవత్సరంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం నెలనెలా చేసిన ఉపాధి వ్యయంలో 1.25 శాతమే జీతాలుగా విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని 100 మందికి పైగా యంత్రాంగం సాగనంపింది. ఉపాధి నిర్వహణలో 2011-12 నుంచి రాష్ట్ర విభజన వరకు జిల్లా 9, 11 స్థానాల్లో నిలువగా, ఇప్పుడు మాత్రం చివరి స్థానానికి పడిపోరుుంది. రూ. 100 కోట్ల ఖర్చు అనుమానమే జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్లతో 1, 21, 833 పనులకు పరిపాలన ఆమోదం వచ్చింది. మొత్తం 150 రోజుల పని కల్పించే నిమిత్తం 5.99 లక్షల మందికి జాబ్‌కార్డులను డ్వామా అధికారులు జారీ చేశారు. ఈ ఏడాది కొత్తగా 20,184 మందికి జాబ్‌కార్డులను ఇచ్చారు. 2,59,460 కుటుంబాలకు మాత్రం అరకొరగా పనులు కల్పించారు. కేవలం 6,961 కుటుంబాలకు మాత్రమే 100 రోజులు పనులు కల్పించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు రూ.200 వరకు కూలి గిట్టాల్సి ఉండగా కేవలం రూ.116.42 చొప్పున సగటు కూలి గిడుతోంది. ఇప్పటి వరకు ఉపాధి హామీ కింద రూ.82 కోట్ల 85లక్షల 67వేలు ఖర్చు చేశారు. రానున్న రోజుల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరగనుండటంతో ఈ సంవత్సరంలో రూ.100 కోట్ల ఖర్చు చేయడం అనుమానమే. ఆరే ళ్ల నుంచి అరకొర గానే 2008 సంవత్సరం ఏప్రిల్‌లో మూడో విడతగా మన జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి వ్యయం రూ.700 కోట్లు కూడా మించలేదు. ఏటా రూ.500 కోట్ల మేర ప్రతిపాదనలను సిద్ధం చేస్తుండగా, అందులో రూ.150 కోట్లను కూడా ఖర్చు చేయలేక యంత్రాంగం చతికిలపడుతోంది. ఈ నే పథ్యంలో ఉపాధి హామీని మరింత కుదించి అధికారులు నామ్‌కే వాస్తేగా పథకాన్ని నడిపించడానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అనుసంధానం లేనట్టే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ పనులను అనుసంధానం చేస్తామని అధికారంలోకి వచ్చిన మొద ట్లోనే టీడీపీ సర్కారు ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధిని కొన్ని జిల్లాల్లో రద్దు, మరికొన్ని జిల్లాల్లో అవసరం మేరకే చేయాలన్న ఆలోచన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వ్యవసాయానికి ఉపాధిని అనుసంధానించడానికి వీల్లేదంటూ ప్రజాసంఘాలు, రైతుకూలీ సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ మాటెత్తకపోవడం చూస్తుంటే ఉపాధి ఇక పరిమితం అయ్యే అవకాశాలున్నట్టు అర్థమవుతోంది. పేరుకే 32 పనులు... ఇక ఎన్ని చేపడతారో? ఉపాధి హామీ కింద 32 పనుల వరకు గ్రామాల్లో చేపట్టే వెసులుబాటు ఉంది. అయితే ఇందులో 15 రకాల పనులు కూడా యంత్రాంగం చేపట్టడం లేదు. దీంతో కుదింపు వల్ల ఎన్ని పనులు మిగులుతాయో అర్థంకాని అయోమయ స్థితి నెలకొంది. ప్రధానంగా కూలీలు తమ పరిసర గ్రామాల్లో పంటబోదెల పూడిక, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పూడికతీత, పుంతరోడ్లు, శ్మశానవాటికల మెరక, పంటపొలాల గ ట్లపై మొక్కలు నాటుకోవడం, మెట్ట ప్రాంతంలో మంచినీటి చెరువుల పూడికలకే పరిమితం అవుతున్నారు. డెల్టాలోని మంచినీటి పథకాలకు సంబంధించిన చెరువుల పూడిక పనులు చేసే పరిస్థితి లేదు. పండ్లతోటల సాగు, వరద నియంత్రణ, గ్రామీణ రహదారుల అనుసంధానం, చేపల పెంపకం అభివృద్ధి, కరువు నివారణ పనులు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతుల పొలాలకు పూడిక మట్టిని తరలించడం, పశుపక్ష్యాదులకు సంబంధించిన ప్రాజెక్టు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల చేప, రొయ్యల చెరువుల అభివృద్ధి తదితర పనులు చేసే అవకాశ ం కూలీలకు ఈ పథకం కింద ఉండేది. -
‘సెక్యూరిటీ’లేని బతుకులు!
జీహెచ్ఎంసీలో కనీస వేతనాలకు నోచుకోని సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోని పాలకులు, అధికారులు సిటీబ్యూరోః జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు సైతం అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోకాలంగా తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఇటు అధికారులతోపాటు అటు పాలకమండలికి సైతం విన్నవించుకున్నప్పటికీ, పాలకమండలి గడువు ముగిసిపోయినా తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. కనీస వేతనాల మేరకైనా తమకు నెలకు రూ. 8500 వేలు అందాల్సి ఉండగా, ఎవరూ పట్టించుకోలేదని కలత చెందుతున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 6500 వేలలో సైతం పలు కోతలు పోతుండటం, తమను నియమించిన ఏజెన్సీ మరికొంత కోత విధించి కేవలం రూ. 5400 మాత్రమే చెల్లిస్తోందని సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. పెరిగిపోయిన ధరలతో కుటుంబ భారం మోయలేక పలు ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీలో ఎవరినీ అడ్డగించే సాహసం చేయలేకపోతున్నామని, ఏవైనా వస్తువులు గడపదాటుతున్నా ఇదేమని ప్రశ్నిస్తే చేయి చేసుకుంటారని, రాజకీయనాయకులు జులుం చెలాయిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారిగురించి జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపినా స్పందించరని, ఏవైనా ఘటనలు వెలుగులోకి వచ్చినా తమపైనే నిందలు మోపుతారన్నారు. అందుకు దృష్టాంతంగా ఇటీవల జీహెచ్ఎంసీ నుంచి ఫర్నిచర్ మాయం కావడాన్ని ఉదహరిస్తూ ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని బావురుమంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత కార్మికశాఖ ఇకనైనా తమ బాధలు గుర్తించి వెంటనే తమకు కనీస వేతనాలు వర్తింపచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 50 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో వెరసి మొత్తం దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. -
కారుచీకట్లో కాంతిరేఖ
సంగారెడ్డి మున్సిపాలిటీ: దశాబ్ధకాలంగా సాగిన మలివిడత తెలంగాణ ఉద్యమం..చుక్కానిలా మారి ఉద్యమానికే ఊపిరిపోసిన యువత. ఆత్మబలిదానాలు...ఢిల్లీ వీధుల్లో తెలంగాణ పొలికేకలు. ఆరు దశాబ్ధాల స్వప్నం సాకారమయ్యేందుకు, ఆరున్నర కోట్ల ప్రజల గొంతుక గా మారిన కాలేజీ పోరగాళ్లు. రాష్ట్రం సాకారమై సొంత రాష్ట్రం..సొంత పాలనలో జనం మోముల్లో సంతోషం కనిపిస్తుంటే..ఇన్నాళ్లూ జనానికి ధైర్యం నూరిపోసి ఒక్కటి చేసిన యువత జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. సర్కారీ కొలువు పొందే వయసు మీరిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో నిరుద్యోగులంతా కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న సుమారు లక్షా 23 వేల మంది ఇక తమకు ఉద్యోగాలు రావనే భావనతో ఉన్నారు. అంతా కాంట్రాక్ట్...ఔట్ సోర్సింగ్ 1994లో అధికారంలోకి వచ్చిన టీడీపీ వివిధ శాఖల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేసింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భ ర్తీ చేశారు. అయితే 2009లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణానంతరం వచ్చిన పాలకులు ఉద్యోగాల భర్తీని పూర్తిగా పక్కనపెట్టేశారు. వైఎస్సార్ తర్వాత సీఎం అయిన రోశయ్య, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డిలు టీడీపీ హయంలో జరిపిన మాదిరిగానే కాంట్రాక్టు నియమకాలకే మొగ్గు చూపారు. దీంతో సర్కారీ కొలువు అందని ద్రాక్షగా మారింది. పెరిగిన నిరుద్యోగుల సంఖ్య జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలోనిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు వివిధ కేటగిరీల్లో 72 వేల 85 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో డిగ్రీతో పాటు ఇంటర్, సాంకేతిక విద్య సైతం పూర్తి చేసిన వారు ఉన్నారు. కానీ ఇంతవరకు వీరికి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ నుంచి ఒక్క కాల్ లెటర్ కూడా అందలేకపోయింది. దీంతో ప్రస్తుతం చదువులు పూర్తి చేసుకున్న యువత ఎంప్లాయిమెంట్‌లో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అసక్తి చూపడం లేదు. కొత్త సర్కారూ...కొంత తాత్సారం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరు మాసాలకు దగ్గరపడుతున్నా, ఇంత వరకు ఎలాంటి ప్రభుత్వ నియమకాలు చేయలేకపోతున్నారు. కనీసం డీఎస్సీ ద్వారా అయినా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినా, కొంత వరకు నిరుద్యోగుల సమస్య తీరేది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోతోంది. ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం, కొత్త నియామకాలు లేకపోవడంతో వివిధ శాఖలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. 5 ఏళ్ల సడలింపుతో అనందోత్సవాలు సర్కారీ కొలువులకు ఇపుడున్న వయోపరిమితిని మరో 5 ఏళ్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలోని నిరుద్యోగ యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలను పక్కన పెట్టేసిన వారు కూడా మళ్లీ వాటిని ముందేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో డీఎస్సీతో పాటు మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయన్న వార్తల నేపథ్యంలో అందరూ ఇపుడు కోచింగ్‌లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమ బాధలు తెలిసి వయోపరిమితి పెంచిన సీఎంకు, తెలంగాణ సర్కార్‌కు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
అనవసర రాద్ధాంతం వద్దు
‘ఆసరా’పై ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తామని స్పష్టీకరణ 29.11 లక్షల దరఖాస్తుల్లో 24.21 లక్షల లబ్ధిదారులను గుర్తించాం ఇంకా పరిశీలన జరుగుతోంది మూడు గదుల ఇళ్లున్న వారికీ ‘ఆసరా’ అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్, చిరుద్యోగుల కుటుంబాలకు కూడా.. నిబంధనల మార్పునకు అంగీకారం సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలందరికీ ‘ఆసరా’ పథకం కింద పింఛన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి అయోమయం సృష్టించవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేదని.. ధర్మబద్ధంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆసరా పథకంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో పింఛన్ లబ్ధిదారులు 29.11లక్షల మంది ఉం డగా.. ఇప్పటి వరకు 24.21 లక్షల మంది అర్హులను గుర్తించినట్లు కేసీఆర్ చెప్పారు. ఈ లెక్కలు అంతిమం కాదని, జిల్లాల్లో దరఖాస్తులపై ఇంకా పరిశీలన జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ అంశంపై శాసనసభ్యులు మరో వారం రోజులు ఓపిక పట్టాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయి, పూర్తి సమాచారం రాగానే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జాబితాలను ఎమ్మెల్యేలకు అందజేస్తామని సీఎం ప్రకటించారు. మార్గదర్శకాల్లో మార్పులు పింఛన్లకు ఆదాయాన్నే అర్హతగా తీసుకుంటామని.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షన్నర, పట్టణాల్లో రూ.2లక్షలలోపు ఆదాయమున్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అంగన్వాడీలు, ఆయాలు, ఔట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారి తల్లిదండ్రులకు, మూడు గదుల ఇళ్లు ఉన్నవారికి కూడా ‘ఆసరా’ అమలయ్యేలా నిబంధనలు మార్చనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తక్షణమే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. పింఛన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను గురువారం రాత్రే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. పింఛన్ల కోసం క్యూల్లో నిలబడి చనిపోతున్నారంటూ ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేయవద్దం టూ.. ఎండలో నిలుచుంటే చచ్చిపోతారా? అని ప్రశ్నించారు. హెచ్చులు చెప్పొచ్చుగానీ వికారం కాకూడదని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. క్యూలో నిలబడి చనిపోతున్నారు: డీకే పింఛన్ దరఖాస్తుల క్యూలో నిలబడి పలువురు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఆసరా’ పథకం అమలుపై ఆమె చర్చను ప్రారంభిస్తూ.. కాంగ్రెస్ హయాంలో 32 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశామని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ ‘ఆసరా’ పింఛన్లకు దిక్కులేదని పేర్కొన్నారు. పింఛన్ల జాబితాలో తమ పేరు లేదనే ఆవేదనతో వృద్ధులు గుండె పగిలి చనిపోతున్నారన్నారు. పింఛన్ల పంపిణీపై మానవతా కోణంలో ఆలోచించాలని అరుణ ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం తరహాలో ఇవ్వాలి.. ఏపీలోని అనంతపురం జిల్లాలో పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి సైతం పింఛన్లు ఇస్తున్నారని, తెలంగాణ సైతం అనంతపురం తరహాలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా అలాంటి నిబంధనను వర్తింపజేయాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో ఎలాంటి నియంత్రణలు లేకుండా పింఛన్లను రూ. 200కు పెంచి అమలు చేశారని, వికలాంగులకు కూడా రూ. 500 ఇప్పించారని గుర్తు చేశారు. పింఛన్ల పథకాన్ని ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకానికి అనుసంధానం చేయాలని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ సూచించారు. -
పోటీకి వచ్చినందుకు నిర్వాహకులు అవుట్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. తమకు అనుకూల ఏజెన్సీలు ఖరారు కాలేదన్న అక్కసుతో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఈ ప్రక్రియకు ప్రతిబంధకంగా నిలిచారు. కొత్తగా ఖరారైన ఏజెన్సీలకు చేసిన ఉద్యోగాల కేటాయింపుల్ని, ఆ ఏజెన్సీలకు, ప్రభుత్వ శాఖలకు మధ్య జరగాల్సిన అగ్రిమెంట్‌ను అడ్డుకున్నారని తెలిసింది. దీంతో ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులు లేరు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఆయా శాఖలు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నిరుద్యోగులను సమకూర్చుకుంటున్నాయి. ఈ మేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమిషన్‌గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను సమకూర్చే బాధ్యత చేపట్టే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఎంప్లాయిమెంట్ అధికారి కన్వీనర్‌గా, ట్రెజరీ డీడీ, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ టెండర్లను ఖరారు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను కొత్తగా ఖరారు చేసేందుకు జిల్లా కమిటీ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు 28 షెడ్యూళ్లు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికం టీడీపీ నేతలకు చెందిన వారివే. జెడ్పీ గెస్ట్‌హౌస్ వేదికగా సిండికేట్‌గా తయారై షెడ్యూల్ దాఖలు చేశారు. దాఖలు చేసినవన్నీ ఖరారు అయ్యేలా తెరవెనుక పావులు కదిపారు. ఇదే విషయమై సెప్టెంబర్ 20వ తేదీన ‘అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం అప్పట్లో చర్చనీయాంశమైంది. విషయం అందరికీ తెలిసిపోయింది. అర్హతలుంచి రాజకీయేతరంగా షెడ్యూల్ దాఖలు చేసిన వారు అప్రమత్తమయ్యారు. అడ్డగోలుగా ఖరారైతే కోర్టుకైనా వెళ్తామంటూ వారంతా బయటికి సంకేతాలు పంపించారు. రచ్చరచ్చ చేస్తామంటూ బాహాటంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై అధికార పార్టీ నేతలు సూచించిన వాటిలో అర్హత గల వాటిని ఎంపిక చేయడంతో పాటు రాజకీయేతరంగా దాఖలై అర్హత ఉన్న వాటిని ఎంపిక చేశారు. కొత్తగా ఖరారు చేసిన 16 ఏజెన్సీలను అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాన ప్రాతిపదికన శాఖల వారీగా ఉద్యోగాలు కేటాయించారు. అక్టోబర్ 10వ తేదీలోగా ప్రభుత్వ శాఖలతో అగ్రిమెంట్ చేసుకోవాలని కొత్త ఏజెన్సీలకు సూచించారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత కినుక వహించారు. తాము సిఫారసు చేసిన ఏజెన్సీలన్నింటినీ ఎంపిక చేయలేదని ఆగ్రహానికి లోనయ్యారు. తమకు అనుకూల ఏజెన్సీలన్నీ ఎంపిక చేయకపోగా, ఎంపిక చేసిన తమ ఏజెన్సీలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కేటాయింపులు చేయలేదని, అందరిలాగే సమానంగా కేటాయించారని, సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వలేదని బాధపడిపోయారు. ఒకవైపు అధికారులపై ఒత్తిళ్లు చేస్తూనే మరోవైపు కొత్తగా ఎంపికైన రాజకీయేతర ఏజెన్సీలకున్న లోపాలేంటో తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన ఏజెన్సీల్లో కొన్ని నాన్ లోకల్‌కు చెందినవని, టెండర్లలో స్థానిక చిరునామా పేర్కొన్నారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా అధికారులకు ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీంతో ఎందుకొచ్చిన గొడవని అధికారులు తక్షణమే స్పందించి కొత్త ఏజెన్సీలకు చేసిన ఉద్యోగాల కేటాయింపులు తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, కేటాయించిన ప్రభుత్వ శాఖలతో అగ్రిమెంట్లు జరగకుండా ఆపేసినట్టు తెలిసింది. దీంతో కొత్త ఏజెన్సీలు ఖరారు చేసి నెలన్నర దాటినా ఉద్యోగాలు కేటాయింపు గాని, ప్రభుత్వ శాఖలతో ఒప్పందం గాని జరగలేదు. ప్రస్తుతం ఆ ఏజెన్సీలన్నీ గాలిలో ఉన్నాయి. లబోదిబోమంటున్న నిర్వాహకులు గతంలో రూ.50వేలు డిపాజిట్ చేస్తే సరిపోయేది. కానీ ఈసారి రూ.3లక్షలకు డిపాజిట్ పెంచారు. మూడు నెలల(అక్టోబర్, నవంబర్, డిసెంబర్)కే కాంట్రాక్ట్ అని షరతు పెట్టారు. అయినప్పటికీ నాలుగు కాసులు సంపాధించుకోవచ్చన్న ఆశతో పలు ఏజెన్సీలు షెడ్యూల్ దాఖలు చేశాయి. అర్హతలతో ఎంపికయ్యాయి. కానీ, టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ ఏజెన్సీలన్నీ నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అక్టోబర్ నెల ముగిసిపోయింది. నవంబర్ కొనసాగుతోంది. ఇంకా కేటాయింపులు, అగ్రిమెంట్లే జరగలేదు. ఇదంతా ముగిసే సరికి ఎప్పటికి అవుతుందో తెలియదు. ఈ జాప్యం ఇలాగే కొనసాగితే డిసెంబర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ప్రభుత్వం పెట్టిన కాల పరిమితం జాప్యంతోనే గడిచిపోయేలా ఉంది. అదే జరిగితే డిపాజిట్‌గా చేసిన రూ.3లక్షలకు వడ్డీయే రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కొత్తగా ఎంపికైన అర్హత గల ఏజెన్సీల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. -
అవినీతిని సహించను
ఒంగోలు టౌన్ : ‘ఎన్వోసీలు లేకుండా యూనిట్లు నడపడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దు. ఎక్కడైనా అలాంటి యూనిట్లు నడుస్తుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా. కిందిస్థాయి నుంచి అధికారుల పనితీరు గమనిస్తా. గతంలో మాదిరిగా పరిస్థితులు ఉండవు. అవినీతికి ఏ రూపంలో పాల్పడినా సహించను’ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖామంత్రి పీతల సుజాత హెచ్చరించారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల గనులు, భూగర్భ వనరుల శాఖాధికారులతో స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఉదయం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలో గనులు, భూగర్భ వనరులశాఖ ద్వారా ఈ ఏడాది 1,256 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించగా, మొదటి మూడు నెలల్లో 276 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పూర్తిస్థాయిలో లక్ష్యాలు అధిగమించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో మినరల్స్ సమృద్ధిగా ఉన్నా ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారన్నారు. జోన్‌లోని మిగిలిన జిల్లాలతో పోల్చితే నెల్లూరు జిల్లా ఆదాయపరంగా అట్టడుగు స్థానంలో ఉందని అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ స్థాయి నుంచి సిబ్బంది, అధికారులంతా కష్టపడి పనిచేసి లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి 17 కోట్ల రూపాయల బకాయిలు వసూలు కావాల్సి ఉండగా, వారు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, తాను హైదరాబాద్ వెళ్లిన తరువాత ఈ విషయాన్ని పరిశీలించి ఆ సంస్థకు నోటీసులు జారీ చేస్తానని మంత్రి పేర్కొన్నారు. లీజులు ప్రారంభించకుంటే రద్దు చేయాలి... మూడేళ్ల కంటే ముందు గనులు లీజుకు తీసుకుని ఇప్పటికీ ప్రారంభించని యూనిట్లను గుర్తించి రద్దు చేయాలని మంత్రి సుజాత ఆదేశించారు. వాటిని కొత్తవారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనధికార ఇసుక తవ్వకాలను అరికట్టాలని, పర్యావరణానికి హాని జరగకుండా చూడాలని చెప్పారు. గనుల శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేంలో కలెక్టర్ విజయకుమార్, పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు, గనులశాఖ ఉపసంచాలకుడు ప్రసాద్, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
పింఛన్‌దారుల మెడపై సర్వే కత్తి
సాక్షి, చిత్తూరు: గ్రామంలో అర్హులైన వారు ఎందరున్నా ఏ ఐదారుగురికో 75 రూపాయల పింఛన్ వస్తుండేది. అది కూడా నాలుగు, ఐదునెలలకోసారి ఇచ్చేవారు. ఎవరికైనా కొత్త పింఛను ఇవ్వాలంటే తీసుకుంటున్న వారిలో ఒకరు చనిపోవాలి. లేదంటే కొత్త పింఛను రాదు. ...ఇది 2004కు ముందు పరిస్థితి. గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అందరికీ పింఛన్లు అందాయి. అది కూడా 200 రూపాయల చొప్పున ఠంచన్‌గా ఒకటో తేదీ జీతంలాగా ఇచ్చేవారు. కొత్త పింఛన్ కావాలంటే మండలానికి పోతే చాలు అర్హత ఉంటే తక్షణమే ఇచ్చేవారు. ...ఇది 2004 తర్వాత పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చిన టీడీపీ వాటి అమలు కోసం ఉద్యోగులు, సంక్షేమపథకాల లబ్ధిదారుల కడుపు కొడుతోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు పింఛన్దారులవైపు చూస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు అర్హులా? కాదా అని నిర్ణయించేందుకు ప్రభుత్వం అధికారులు కమిటీలను నియమించారు. అయితే కమిటీలో ప్రభుత్వ అధికారులు కాకుండా రాజకీయనేతలకు చోటు కల్పించారు. తద్వారా టీడీపీ సానుభూతిపరులకు పింఛన్లు దక్కేలా చూసి, తమ దారిలో నడవనివారికి నిర్ధాక్షిణ్యంగా పింఛన్లను తొలగిచేందుకు ‘పచ్చ’పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి తనిఖీల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మండల, గ్రామ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసేలా పథకరచన చేశారు. కమిటీలు ఇవే! గ్రామస్థాయిలో: గ్రామ సర్పంచ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు, స్వయంసహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు ఇద్దరు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి. మునిసిపాలిటీల్లో: వార్డు సభ్యుడు అధ్యక్షుడు. ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సామజిక కార్యకర్తలు, ఒక బిల్‌కలెక్టర్. కార్పొరేషన్లో: కార్పొరేటర్ అధ్యక్షుడు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఇద్దరు, సామాజిక కార్యకర్తలు ముగ్గురు, బిల్‌కలెక్టర్ ఒకరు.ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను మండలస్థాయి కమిటీ, ఆపై జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించి లబ్ధిదారుల తుదిజాబితాను ఖరారు చేస్తారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం, శనివారం తనిఖీ లు నిర్వహించనున్నారు. కమిటీల ఏర్పాటు, తనిఖీ ల తేదీలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న వెంటనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. గురువారం పత్రికల్లో కథనాలు వచ్చాయి. శుక్ర, శనివారాల్లో సర్వే ఉంది. ఉన్న ఫళంగా సర్వే నిర్వహిస్తే...లబ్ధిదారుల్లో చాలామంది బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఉంటారు. వీరంతా కమిటీ ముందు హాజరు కాకపోతే పింఛన్లు తొలగి స్తారు. దీంతో ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు నిర్వహించడాన్ని విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అలాగే సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ నేతలు కమిటీలో చోటు దక్కించుకుని కానివారిపై కక్షపూరితంగా వ్యవహరించనున్నారు. పైగా పింఛన్‌దారుడికి తప్పనిసరిగా ఆధార్ ఉండేలా నిబంధన ఉంచారు. ఆధార్ లేకపోయినా, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నా అనర్హుని కింద లెక్కగట్టనున్నారు. కొత్త సమస్యకు తెరతీస్తున్న బీపీఎల్ తనిఖీలో బీపీఎల్(బిలో పావర్టీ లైన్)కొత్త సమస్యగా మారనుంది. రేషన్‌కార్డు ఉన్నవారంతా బీపీఎల్ కిందకు వస్తారు. వీరంతా పింఛన్‌కు అర్హులవుతారు. అయితే సరిపోని వారంతా బీపీఎల్ కిందకు రారని టీడీపీ నేతలు వితండవాదం చేసి పింఛన్లు తీసేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు గదుల ఇళ్లు ఉన్నా పింఛన్ ఇవ్వరని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై కూడా గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 4.01 లక్షల మంది లబ్ధిదారుల్లో సగం మందిని తొలగించాలనే యోచనతోనే తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. -
రండి బాబోయ్ మళ్లీ రండి!
ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఆహ్వానం పలుకుతున్న ప్రభుత్వం సీనియూరిటీ, ప్రతిభ ఆధారంగా నియూమకాలకు ఆదేశాలు హౌసింగ్‌లో మండలానికి ఇద్దరు చొప్పున నియమకానికి కంకణం చిత్తూరు(అగ్రికల్చర్) : రండి బాబోయ్... రండి, వచ్చి మళ్లీ సేవలు అందించండి అంటూ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆహ్వానం పలుకుతోంది. ప్రభుత్వ పథకాల అమలులో ఔట్సోర్సింగ్ సిబ్బంది సేవలు అవసరం లేదంటూ నెల క్రితం గృహ నిర్మాణ శాఖలోని సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తొలగించిం ది. ప్రస్తుతం ప్రభుత్వం పనులు సకాలంలో చేసుకోలేక ఔట్సోర్సింగ్ సిబ్బంది అవసరాన్ని కోరుకుంటోంది. గృహ నిర్మాణ శాఖలో తొలగించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానే మ రోమారు ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రతి మండలానికీ ఇద్దరు చొప్పున ఔట్సోర్సింగ్ కింద అదనపు సిబ్బం దిని ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలను జిల్లా గృహనిర్మాణ శాఖకు పంపింది. 2006లో అప్ప టి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రం లో ప్రతి నిరుపేదకూ గూడు కల్సించాలనే తలంపుతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు వీలుగా మండలంలోని హౌసింగ్ ఏఈలకు సహాయకులుగా అవసరాన్నిబట్టి ఇద్ద రు, ముగ్గురిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అదనపు సహాయక సిబ్బం దిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుతం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి గ్రామంలో సకాలంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుకలిగింది. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఏఈల కు ప్రతి పనిలోనూ సహాయకులుగా వ్యవహరించడంతో ఇళ్ల పనులు చురుగ్గా జరిగారుు. తొలగించబడ్డ సిబ్బంది రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గృహ నిర్మాణశాఖలో ఔట్సోర్సింగ్ సిబ్బంది సేవలు అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 151 మందిని తొలగించింది. ఏళ్లతరబడి గృహనిర్మాణ శాఖనే నమ్ముకున్న జౌట్‌సోర్సింగ్ సిబ్బంది వీధిన పడ్డారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అవసరాన్నిబట్టి సిబ్బంది సేవలు ఇటీవల ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1999 నుం చి ఇప్పటి వరకు పక్కా ఇళ్ల లబ్ధిదారుల జాబి తాలను ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ప్రతి లబ్ధిదారుడి ఆధార్, రేషన్ కార్డులు, బ్యా ంకు ఖాతాలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ పనులు సత్వరం చేపట్టేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఏమాత్రం చాలడంలేదు. కావున అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి మండల హౌసింగ్ ఏఈకి ఇద్దరు చొప్పున సహాయకులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో సహాయకులుగా 57 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. 65 మండలాలకు ఇద్దరు చొప్పున 130 మంది సహాయకులు కావాలి. రెగ్యులర్ సిబ్బంది 57 మంది ఉండగా మిగిలిన 73 మందిని ఔట్సోర్సింగ్ కింద ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. తొలగించబడ్డ సిబ్బందిలోనే సీనియారిటీ, గతంలో వారు చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, అవసరం తీరాక మళ్లీ వీధి పాలు చేస్తుందో? లేక కొనసాగిస్తుందో వేచిచూడాల్సిందే. -
వాయిదా తీర్మానం చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు
-
వాయిదా తీర్మానం చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. అయితే ఈ సమస్యపై జీరో అవర్‌పై చర్చిద్దామని స్పీకర్ సూచనతో సభ్యులు శాంతించారు. దాంతో ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. -
జంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో పారదర్శకత లోపించిందని, బాధ్యతారాహిత్యం పెరిగిందని, సంస్థ పని సామర్థ్యం తగ్గిందని, అవినీతి, పనుల్లో జాప్యం వంటివి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ పనితీరును మెరుగు పర్చుకునేందుకు, పాదర్శక విధానాలను అమలు చేసేందుకు అవసరమైన పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు రెండువారాల గడువునిస్తున్నట్లు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో డీడీఏ పనితీరుపై, సంస్థలో జరుగుతున్న అవినీతిపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో జంగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డీడీఏ సీనియర్ అధికారులతోపాటు ముఖ్యమైన అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో జంగ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో కథనాలు వస్తున్నా కూడా అధికారులు తమ పనితీరును మార్చుకోవడం లేదని, ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. సంస్థ పనితీరు మెరుగుపడాలంటే పునర్నిర్మాణ ప్రణాళిక అవసరమని తాను భావిస్తున్నానని, రెండువారాల్లో ఈ ప్రణాళికను సిద్ధం చేయాలని డీడీఏ పరిపాలనా విభాగం అధికారిని ఆదేశించారు. రెండు వారాల్లో నివేదిక తన టేబుల్‌పై లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంస్థ చేస్తున్న ప్రతి పనిని, అందిస్తున్న సేవల వివరాలను కంప్యూటరీకరించాలని ఆదేశించారు. డీడీఏ పని సామర్థ్యాన్ని కూడా పెంచాలని, చేపట్టే ప్రతి పనికి సంస్థలోని ఎవరో ఒక అధికారి బాధ్యత వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండాలని, ప్రతి పని పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. పై అధికారుల పర్యవేక్షన నిరంతరం కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రణాళిక సిద్ధం... డీడీఏ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశామని, తుది మెరుగులు దిద్ది రెండు వారాల్లో సమర్పిస్తామని జంగ్కు డీడీఏ అధికారులు హామీ ఇచ్చారు. డీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలను కూడా జంగ్కు వివరించారు. భూసేకరణ విభాగం ఇప్పటికే అవసరమైన భూమిని సేకరించిందని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. డీడీఏ పనితీరు మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఇచ్చిన సూచనల మేరకే పునర్నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏప్రిల్ నాటికి ప్రణాళికలు పూర్తిగా అమలయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కౌన్సిల్ ఇచ్చిన సూచనల ప్రకారం... సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనుల్లో కొన్నింటిని ఔట్ సోర్సింగ్ చేయాలి. ఈ విషయమై ఔట్ సోర్సింగ్ సంస్థల కోసం అన్వేషిస్తున్నామన్నారు. పంటలను ఎక్కడైనా అమ్ముకోండి: జంగ్ న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మండీలోనే కాకుండా బయట ఎక్కడైనా అమ్ముకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రకటించారు. ఆజాద్‌పూర్, కిషోర్‌పూర్, షహదరా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలోని వ్యవసాయ ఉత్పత్తుల జాబితా నుంచి కూరగాలు, పండ్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో రైతులు తాము పండించిన పండ్లను, కూరగాయలను ఇకపై తప్పనిసరిగా ఏపీఎంసీలోనే అమ్ముకోవాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఓ నోటీసు కూడా విడుదల చేసింది. ఢిల్లీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్(క్రమబద్ధీకరణ) చట్టం, 1998 ప్రకారం.. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకోవాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నోటీసులో పేర్కొంది. 6 గోడల మీద పోస్టర్లు అతికించినవారిపై కఠిన చర్యలు తీసుకోండి న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం పేరుతో పోస్టర్లను అతికిస్తూ గోడలను పాడు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం పోలీసులను కోరింది. పోస్టర్లను అతికించుకునేందుకు, బ్యానర్లు కట్టుకునేందుకు విశ్వవిద్యాలయం పరిసరాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించామని, అయినా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై, బస్సులు, రైళ్లల్లో కూడా పోస్టర్లు అతికిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇటువంటివారిపై చర్యలు తీసుకోవాలని డీయూ కోరింది. ఢిల్లీ ప్రజా ఆస్తుల రక్షణ చట్టం ప్రకారం పోస్టర్లు అతికించేవారిపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తు జరిపి, నేరం రుజువైతే కఠినంగా శిక్షించాలని డీయూ అధ్యాపకుడు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల(డూసూ) కమిషనర్ డీఎస్ రావత్ పోలీసులను కోరారు. పోలీసులు చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుంటే ప్రజా ఆస్తుల రక్షణ చట్టం నిరుపయోగంగా మారుతుందన్నారు. చట్టం సరిగ్గా అమలు కావాలంటే కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని కోరారు. డూసూ ఎన్నికలు ఈ నెల 12న జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీతోపాటు పలు పలు పార్టీల విద్యార్థి విభాగాలు పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రింటింగ్ పోస్టర్లను ప్రచారం కోసం వినియోగించరాదనే నిబంధన ఉన్నప్పటికీ పోటీదారులు యథేచ్ఛగా పోస్టర్లను అతికిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయమై ఢిల్లీ పోలీసులతో పలుమార్లు సమావేశమయ్యామని, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని రావత్ తెలిపారు. ఎన్నికల బరిలో కొత్త విద్యార్థి విభాగం ఈసారి జరగనున్న డూసూ ఎన్నికల్లో కొత్త విద్యార్థి విభాగం పోటీ చేయనుంది. ఇప్పటిదాకా ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం బీజేపీ మధ్య జరుగుతుండగా సీపీఐ, సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగాలు ఎస్ఎఫ్ఐ వంటివి కూడా పోటీ చేస్తున్నాయి. కాగా ఈ ఏడాది ‘చాణక్య పరిషద్’ పేరుతో ఏర్పాటైన కొత్త విద్యార్థి విభాగం కూడా ఎన్నికల్లో పోటీ చేయనుంది. ‘ఇప్పటిదాకా ఎన్ఎస్యూఐ, ఏబీవీపీల మధ్యే పోటీ జరిగింది. ఈ రెండు విభాగాలు కూడా కండబలం, ధనబలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించాయి. ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నాం. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా కొత్త విద్యార్థి విభాగాన్ని తీసుకురావాలనుకున్నాం. కొత్తగా వ చ్చే విద్యార్థి విభాగం విద్యార్థుల్లో సాధికారత పెంచేదిగా ఉండాలని నిర్ణయించాం. ఈ అవసరాన్ని గుర్తించిన ఎంతోమంది మాతో కలిసి వచ్చారు. అలా ఏర్పాటైందే చాణక్య పరిషద్’ అని అధ్యక్షుడు మంతోశ్ శర్మ తెలిపారు. తాము పోటీ చేయనుండడంతో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల స్వరూపం మారిపోవడం ఖాయమన్నారు. -
జాబ్ పోయిందంటూ బాబు జాబు!
- హౌసింగ్‌లో వర్క్ ఇన్స్పెక్టర్ల తొలగింపునకు రంగం సిద్ధం - ఆలస్యం కానున్న ఇంటి నిర్మాణాలు బద్వేలు: చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబ్ వస్తుందంటూ టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. అయితే హౌసింగ్‌లో వర్క్ ఇన్స్పెక్టర్ల సంగతి తీసుకుంటే తీరా వచ్చింది జాబ్ కాదు ఉద్యోగాలు పోయాయంటూ జాబు వచ్చింది. జిల్లాలోని 51 మండలాల్లో 86 మంది ఔట్ సోర్సింగ్ కింద వర్క్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ఆయా మండలాల్లో ఏఈలకు సహకారమందిస్తున్నారు. సిబ్బంది కొరతతో ఇక్కట్లే ప్రస్తుతం జిల్లాలో దాదాపు 60వేలకు పైగా ఇళ్ల నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 40 వేలు బేస్మట్టం, గోడలు, పైకప్పు వంటి దశల్లో ఉన్నాయి. వీటకి ఈ ఏడాది మార్చి నుంచి బిల్లులు ఆగిపోయాయి. దీంతో పాటు 24 వేల ఇళ్లపై సమగ్ర సర్వే చేస్తున్నారు. ఇంకా 8600 ఇళ్లు రేషన్‌కార్డుతో మ్యాచ్ కాలేదు. ఇవన్నీ ఆయా దశల్లో పూర్తిగా నిలిచిపోయాయి. మరో 9500 ఇళ్లు పూర్తిగా పునాదులు, బేస్‌మట్టంలో ఆగిపోయాయి. వీటన్నింటిని సర్వే చేసి బిల్లులు అందజేయాలి. ప్రస్తుతం వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించడంతో మండలానికి ఉన్న ఒకే ఒక ఏఈ అన్ని పనులను చేయడం సాధ్యం కాదు. దీంతో ఇప్పట్లో బిల్లులు అందే పరిస్థితులు కానరావడం లేదు. న్యాయం చేయాలంటున్న బాధితులు తాము ఏళ్ల తరబడి సంస్థలో విధులు నిర్వహిస్తున్నామని.. వయోపరిమితి దాటిపోయినందున ఇతర ఉద్యోగాలకు అర్హత కోల్పోయామని పలువురు వర్స్ ఇన్స్పెక్టర్లు వాపోతున్నారు. లబ్ధిదారులకు ఇనుము, సిమెంట్, ఇటుకలు అప్పు ఇప్పించామని, బిల్లులు ఆగిపోవడంతో వ్యాపారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని బద్వేలుకు చెందిన ఒక వర్క్ఇన్స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
ఇక సర్కారీ ‘నిషా’
మద్యం షాపుల ఏర్పాటుకు కసరత్తు అవుట్సోర్సింగ్ సిబ్బందితో షాపుల నిర్వహణ విజయవాడ : ఎక్సైజ్‌శాఖ జిల్లాలో ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రకియలో భాగంగా గత లాటరీలో మిగిలిపోయిన వైన్‌షాపుల స్థానంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను తెరచి విక్రయాలు సాగించాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో మిగిలిపోయిన 32 షాపుల ప్రాంతాల్లో 15 సర్కారు వైన్ షాపులను తొలుత ఏర్పాటు చేసి విక్రయాల స్థాయిని పరిశీలించి అవసరమైతే దానికి అనుగుణంగా షాపుల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించింది. దీంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు షాపులు ఏర్పాటు చేయటానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 335 వైన్‌షాపులున్నాయి. వీటిలో ఇప్పటి వరకు నిర్వహించిన ఐదు గజిట్ల ద్వారా 301 వైన్ షాపులకు రెండేళ్ల కాలపరిమితితో లెసైన్స్‌లు మంజూరు చేశారు. ఇప్పటికే రెండు నెలలుగా కొత్త లెసైన్సుల కాలపరిమితి మొదలయింది. మిగిలిన 34 షాపుల్లో రెండు షాపుల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో రెండు షాపులు మినహా మిగిలిన 32 షాపులను మళ్లీ గజిట్ ద్వారా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అయితే చివరి రెండు గజిట్లకు స్పందన రాకపోవడంతో ప్రభుత్వమే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడలో రెండు మద్యం దుకాణాలను గత కొన్నేళ్లుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది బందరురోడ్డులోని చోడవరం, గొల్లపూడి సమీపంలోని గుంటుపల్లిలో ఇప్పటికే ప్రభుత్వ షాపులున్నాయి. వైన్‌షాపుల నిర్వహణ కోసం అవసరమైతే అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. షాపుల పర్యవేక్షణ బాధ్యతలను బేవరేజ్ అధికారులతో పాటు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ సీఐలకు అప్పగించనున్నారు. సర్కారు ఏర్పాటు చేసే షాపులకు అనువైన ప్రాంతం గుర్తించే బాధ్యతను సీఐలపైనే పెట్టారు. ఈ పరిణామాల క్రమంలో తొలుత 15 షాపులు ఏర్పాటు చేసి విక్రయాల స్థాయి అధికంగా ఉంటే మిగిలిన షాపులు ఏర్పాటు చేయాలని లేదంటే అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావించారు.మరో 15 రోజుల వ్యవధిలో జిల్లాలో షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. షాపులు ఇవే.... విజయవాడ డివిజన్ పరిధిలో 10 షాపులు, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 24 షాపులు ఖాళీలున్నాయి. విజయవాడ నగరంలోని 3, 14, 15, 16 డివిజన్లల్లో నాలుగు షాపులు ఖాళీ ఉన్నాయి. అలాగే పెనమలూరు, గంగూరుతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో షాపులు ఖాళీ ఉన్నాయి. వీటి స్థానంలో సుమారు 7 షాపులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మచిలీపట్నం డివిజన్ పరిధిలోని అవనిగడ్డలో ఒక షాపు, మొవ్వ మండలంలో రెండు, గుడివాడలో నాలుగు షాపులు, కైకలూరులో ఏడు షాపులు, మండవల్లిలో నాలుగు షాపులు, గన్నవరంలో ఐదు షాపులు, ఉయ్యూరులో ఒక షాపు ఖాళీ ఉన్నాయి. -
‘ఇంటి’ నుంచి గెంటివేత!
‘బాబు వస్తే.. జాబ్ వస్తుంది’.. ఎన్నికల సమయంలో టీడీపీ వదిలిన ఈ ప్రచారాస్త్రం బాగా పనిచేసింది. బాబుకు అందలం దక్కింది గానీ.. నిరుద్యోగులకు జాబులు రాకపోగా.. ఉన్నవారి జాబులు ఊడిపోతున్నాయి. అధికారంలోకి రాగానే మాట మారిం ది.. తీరూ మారింది. ఫలితం నాటి నినాదం కాస్త తిరగబడి.. ‘బాబు వచ్చారు.. జాబ్ పోయింది’గా మారింది. వేలాది ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు తదితరులను ఇంటికి పంపించిన బాబు సర్కారు తాజాగా గృహనిర్మాణ శాఖ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా గెంటేసింది. శ్రీకాకుళం పాతబస్టాండ్: టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వేలాది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి సరికొత్త రికార్డు సాధించింది. ఇప్పటికే వేలాది ఉద్యోగులపై వేటు వేసిన ఈ సర్కారు తాజాగా గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందిని గెటవుట్ అంటూ ఒక్క జీవోతో గెంటేసింది. రాష్ట్రంలో ఈ సంస్థ పరిధిలో సుమారు ఏడేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలో 165 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీధిన పడ్డారు. వీరిలో గత ఏడేళ్లుగా పనిచేస్తున్న 9 మంది ఇంజినీర్లతోపాటు 100మందికిపైగా వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తదితర సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి వీరి నియామక కాలపరిమితి జూలై 31తో ముగిసింది. పొడిగింపు ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శనివారం జారీ అయిన తొలగింపు జీవో శరాఘాతంలా తగిలింది. దీంతో జూలై 31 నుంచే వీరు ఉద్యోగాలు కోల్పోయినట్టయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖల్లో జరిగిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నియామకాల్లో పలు అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ నాయకుల అనుచరులు, కార్యకర్తలను నియమించుకున్నారని టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ఆ పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇదే ఆరోపణతో ఇప్పుడున్న వారిని తొలగించి.. వారి స్థానంలో పచ్చ చొక్కాల తమ్ముళ్లను నియమించుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన అని ఆరోపణలు వనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఉద్యోగాలనే నమ్ముకొని.. చాలీచాలని జీతాలతో రోజులు నెట్టుకొస్తున్న ఉద్యోగులను తొలగిస్తే పేద కుటుంబాలు రోడ్డున పడుతాయని, అందువల్ల ఉద్యోగుల తొలగింపు ఆలోచన విరమించుకోవాలన్న విన్నపాలు ప్రభుత్వానికి అందాయి. ఇవేవీ చెవికెక్కించుకోని సర్కారు రాజకీయ ప్రయోజనాలు, ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా ఉద్యోగులపై వరుసగా వేటు వేసుకుంటూ వెళుతోంది. గృహనిర్మాణ పథకాలకు విఘాతం ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడటం ఒక ఎత్తయితే.. ప్రభుత్వ నిర్ణయం వల్ల గృహ నిర్మాణ పథకాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల మంజూరు, నిర్మాణాల పర్యవేక్షణ, తదితర కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇప్పటికే గత ఏడాది నిర్మాణ లక్ష్యాలు పూర్తికాలేదు. జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు రూ. 14 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు 20వేల మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బందిని తగ్గించడంతో ఈ గృహ నిర్మాణ పథకాలు పూర్తిగా పడకేసే ప్రమాదముంది. ఉత్తర్వులు అందలేదు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ జారీ అయిన జీవో విషయమమై గృహ నిర్మాణ సంస్థ పీడీ పి.ఎన్.నర్సింగరావు వద్ద ప్రస్తావించగా తమకు ఉత్తర్వులు అందలేదని చె ప్పారు. ఇంతవరకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు గడువు జూలై 31తో ముగిసిందని అన్నారు. జీవో వచ్చిన వెంటనే సిబ్బందికి తెలియజేస్తామన్నారు. -
ఎన్నాళ్లీ కష్టాలు
బాలారిష్టాలు దాటని కృష్ణా యూనివర్సిటీ సొంత భవనాలు లేవు ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత హాస్టళ్లు, ల్యాబ్ సౌకర్యాలు నిల్ రేపు ద్వితీయ స్నాతకోత్సవం మచిలీపట్నం : ఉన్నత ఆశయంతో ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా కృష్ణా యూనివర్సిటీ మాత్రం బాలారిష్టాలను దాటడం లేదు. భూమి కేటాయించినా, నిధులు మంజూరు చేసినా పాలకుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కలగానే మిగిలింది. యూనివర్సిటీ పరిధిలో జిల్లాలోని 143 కళాశాలలు ఉన్నాయి. నూజివీడులో పీజీ సెంటర్ ఉంది. యూనివర్సిటీని ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 42 మంది ప్రొఫెసర్లకు గానూ కేవలం 21 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. 50 మంది సిబ్బందికి గానూ ఇద్దరే పర్మినెంటు ఉద్యోగులు ఉన్నారు. మరో 15 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్నారు. స్థలం, నిధులు కేటాయించినా... జిల్లాకో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో 2008, ఏప్రిల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం యూని వర్సిటీని పట్టించుకునే వారే కరువయ్యారు. వర్సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు బందరు మండలం రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరు మండలంలో 44 ఎకరాలు, ప్రస్తుతం యూనివర్శిటీ నడుస్తున్న ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలో 24 ఎకరాలను కేటాయించారు. భవనాల నిర్మాణానికి రూ.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ విభాగం నిపుణులు భవనాల నిర్మాణానికి నమూనాలు తయారు చేశారు. అయినప్పటికీ భవన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కావటం లేదు. ఏడాది క్రితం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యూనివర్శిటీ పాలకులు అనంతరం ఆ విషయాన్ని మరిచిపోయారు. అయితే గత ఐదేళ్లుగా యూనివర్శిటీ భవనాల నిర్మాణంపై ఎవరూ దృష్టిసారించటం లేదు. యూనివర్శిటీకి భవనాల నిర్మాణానికి బిల్డింగ్ అడ్వయిజరీ ఎక్స్పర్ట్ కమిటీని నియమించినా ఫలితం లేకపోయింది. హాస్టల్ భవనాలు, ల్యాబ్‌లు లేవు యూనివర్శిటీ అభివృద్ధి చెందాలంటే హాస్టల్ భవనాలు ఉండాలి. విద్యార్థినులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ కోసం మూడు వేర్వేరు హాస్టల్స్ ఉండాలి. ఆరేళ్లు గడుస్తున్నా హాస్టల్ భవనాల నిర్మాణం ఊసే లేదు. ఆంధ్ర జాతీయ కళాశాల భవనంలోని 20 గదుల్లో, నిర్మలా కాన్వెంట్ సమీపంలోని ఓ భవనంలో యూనివర్శిటీని నడుపుతున్నారు. తరగతి గదులనే ల్యాబ్‌లుగా మార్చారు. ఆర్గానిక్ కెమెస్ట్రీ విభాగంలో ప్రస్తుతం 60మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్, ఫిజికల్ కెమీస్ట్రీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం నాలుగు ప్రత్యేక ల్యాబ్‌లు ఉండాలి. ఉన్న ఒకే ల్యాబ్‌ను ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు ఉపయోగిస్తున్నారు. బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఎం.ఫార్మసీ విభాగాలకు తరగతి గదులు లేవు. వారికి ల్యాబ్‌లనే తరగతి గదులుగా ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఎం.ఫిల్, పీహెచ్‌డీలో అభ్యర్థులను చేర్చుకున్నారు. వీరికి ప్రత్యేక వసతి గృహం, ల్యాబ్‌లు అవసరం. స్కాలర్స్‌కు యూనివర్శిటీలో పాఠ్యాంశాలు బోధించే అవకాశం కల్పించి వారికి నెలకు కొంత మొత్తాన్ని అందజేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ యూనివర్శిటీలో అమలుకావటం లేదు. పరీక్షల విభాగానికి ప్రత్యేక గది కేటాయించాల్సి ఉండగా, తరగతి గదినే ఇందుకు ఉపయోగిస్తున్నారు. పరీక్షల విభాగంలో రెగ్యులర్ ప్రొఫెసర్లకు బదులు, అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న ప్రొఫెసర్లే విధులు నిర్వర్తిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ప్రొఫెసర్లు క్లాసులు చెప్పిన అనంతరం కూర్చునేందుకు ఒక టేబుల్, కుర్చీ కూడా ఇవ్వకపోవటం ఇక్కడ దుస్థితికి నిదర్శనం. హాస్టల్ భవనాలు, లేబొరేటరీలు సక్రమంగా లేకపోవటంతో ఈ యూనివర్శిటీలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భవనాల నిర్మాణం ప్రశ్నార్థకమే.. యూనివర్శిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రుద్రవరం గ్రామంలో 102 ఎకరాలను కేటాయించింది. ఇక్కడే రూ. 70 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తామని ఈ నెల 21వ తేదీన యూనివర్శిటీ వీసీ వున్నం వెంకయ్య వెల్లడించారు. వర్షాకాలం కావటంతో ఇక్కడ భవనాలు నిర్మించేందుకు అవకాశం లేదు. ఈ 102 ఎకరాల్లో మూడువేల మీటర్ల మేర ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది మట్టి రోడ్లను నిర్మించారు. యూనివర్శిటీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఈ భూమి అభివృద్ధి కోసం ఖర్చు చేయకపోవటం గమనార్హం. ఈ భూమి లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షాకాలంలో నీరు నిలబడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భవనాల నిర్మాణం ఎలా చేపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. గవర్నర్ దృష్టి సారిస్తే మేలు కృష్ణా వర్సిటీ మొదటి స్నాతకోత్సవం 2012, డిసెబర్ 9వ తేదీన నిర్వహించారు. రెండో స్నాతకోత్సవాన్ని ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా యూనవర్శిటీకి ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ అటు యూనివర్శిటీ ప్రతినిధులు, పాలకులు ఈ యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు ఏ మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ద్వితీయ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ కులపతి హోదాలో హాజరువుతున్న గవర్నర్ నరసింహన్ అన్ని అంశాలపై దృష్టిసారించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. గవర్నర్ దృష్టిసారించి యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘ఉపాధి’కి ఎసరు?
కేరళ తరహాలో నిర్వహణకు సర్కారు సన్నాహాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించే యత్నం ఉపాధి పనుల పర్యవేక్షణతో పాటు నిర్వహణ తీరు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేరళ తరహాలో రాష్ట్రంలో సైతం ప్రభుత్వ సిబ్బందితో ఈ పథకాన్ని కొనసాగించి, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తప్పించాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నర్సీపట్నం రూరల్ : పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో 2008 నుంచి ప్రారంభించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌పై ఏపీవోతో పాటు ఇంజినీరింగు, సాంకేతిక సిబ్బందిని, గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. వీటి పర్యవేక్షణ బాధ్యత అప్పట్లో ఎంపీడీవోలకు అప్పగించింది. పనుల ఎంపికతో పాటు ఇతర నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు అప్పగించి, పథకం పర్యవేక్షణతో పాటు నిధులు చెల్లించే అధికారం ఎంపీడీవోలకు ఇచ్చింది. సామాజిక తనిఖీల్లో ఎంపీడీవోలను సైతం బాధ్యులను చేయడంతో గత ఏడాది జనవరిలో బాధ్యతల నుంచి ఎంపీడీవోలు తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పథకం నిర్వహణలో మార్పులు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీడీవోలకు గతంలో మాదిరిగా బాధ్యతలు అప్పగించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగష్టు 5 నుంచి వీరికి డిజిటల్ కీ అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటు కేరళ తరహాలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వ అధికారులతో కొనసాగించాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అక్కడ జడ్పీ సీఈవో పర్యవేక్షణలో ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఇంజినీరింగు అధికారులతో పనులు చేపడుతున్నారు. దీని మాదిరిగా రాష్ట్రంలో పనులు చేపట్టాలని ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ విధంగానే పనులు నిర్వహించి, ఔట్ సోర్సింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం సుమఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాధి పనుల నిర్వహణకు జిల్లాలో సుమారుగా 930 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 500 మంది వరకు సాంకేతిక సిబ్బంది, ఇంజినీరింగు ప్రతినిధులు 50, ఏపీవోలు మరో 39 మంది పనిచేస్తున్నారు. కేరళ తరహా విధానాన్ని అమల్లోకి తెస్తే వీరంతా ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అవినీతి సాకుతో ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోంచి తప్పించాలని చూస్తుండగా, కేరళ తరహా విధానాన్ని అమల్లోకి తెస్తే మిగిలిన ఔట్ సోర్సింగ్ కుటుంబాలన్నీ రోడ్డున పడనున్నాయి. -
ఇక... మన మండలం/జిల్లా
* ప్రణాళికలు రూపొందించాలంటూ ఆదేశాలు జారీ * మండల స్థాయిలో ఇలా... మండల స్థాయిలో 16 అంశాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. మండల పరిషత్ పరిధిలోని ప్రజాప్రతినిధుల వివరాలు, సిబ్బంది వివరాలు (రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్), వివిధ ప్రభుత్వ కార్యాలయాల మౌలిక సదుపాయాల వివరాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు, నిధులు, వ్యయం, ఆదాయ వనరులు, స్వయం సహాయక సంఘాల వివరాలు, మండల పరిషత్‌లోని మొదటి పది ప్రాధాన్యత పనులు, మండల స్థాయిలో శాఖల వారీగా 2013-14, 2014-15 సంవత్సరంలో చేపట్టిన పనుల వివరాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయి సమావేశాలు 21వ తేదీన ప్రారంభించి, 24లోగా పూర్తి చేయాలి. ఇక్కడ రూపొందించిన ప్రణాళికలను మండల సర్వసభ్యసమావేశంలో ఆమోదించాలి. నీలగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘మనఊరు-మన ప్రణాళిక’’ గ్రామసభలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ‘‘మన మండలం- మన జిల్లా’’ ప్రణాళికలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మనఊరు-ప్రణాళిక గ్రామసభలు ఈ నెల 13వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఆదివారంతో ముగియనున్నాయి. రెండు, మూడు మండలాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తిచేశారు. ఈ సభల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున విన్నపాలు వెల్లువెత్తాయి. వీటిని అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను రెండు, మూడురోజుల్లో ఆన్లైన్లో నమోదు చేస్తారు. కాగా గ్రామ ప్రణాళిక ముగింపు దశకు చేరుకోవడంతో ‘మన మండలం-మన జిల్లా ప్రణాళిక’ సిద్ధం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి జిల్లాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవైపు గ్రామ ప్రణాళికల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూనే...మరోవైపు మండల, జిల్లా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి శనివారం రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో, జిల్లా స్థాయిలో ఏవిధంగా వివరాలు సేకరించాలనే అంశంపై అన్ని మండలాలకు నమూనా (ఫార్మాట్) పత్రాలను పంపారు. ఇంటెలీజెన్స్ ఆరా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ఇంటెలీజెన్స్ సైతం ఆరా తీస్తోంది. ఇంటెలీజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బందితో ఫోన్లో మాట్లాడుతున్నారు. నేరుగా గ్రామసభలకు వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామసభలు ఏ విధంగా జరుతున్నాయి..? అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారా..? ప్రజల స్పందన ఏవిధంగా ఉంది..? ప్రణాళికలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారా..? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. -
వారిదంతా అడ్డదారే!
రిమ్స్ క్యాంపస్:ప్రభుత్వ శాఖల్లో.. లేదా సంస్థల్లో ఒక ఉద్యోగం వేయాలంటే కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి.. అనుమతులు పొందాలి. కానీ శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి వీటికి అతీతం. ఎందుకంటే ఇక్కడ చాలా నియామకాలు అధికారుల ఇష్టారాజ్యంగా, అత్యంత గోప్యంగా జరిగిపోతున్నాయి. నియామకాలు జరిగిపోతున్నాయి సరే.. మరి జీతాల మాటేమిటంటే.. ‘నారు పోసినవాడు నీరు పోయడా’.. అన్నట్లు దానికీ రిమ్స్ అధికారులు అడ్డదారులు కనుగొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్) నిధులను అక్రమ నియామకాలు పొందిన ఉద్యోగుల జీతాలకు మళ్లిస్తున్నారు. జిల్లా అంతటికీ పెద్ద దిక్కుయిన రిమ్స్‌లో వైద్యసేవలు, సౌకర్యాల మెరుగుపై పెద్దగా శ్రద్ధ చూపని కొందరు అధికారులు అక్రమార్జనపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడుతోంది. చాలావరకు అనధికారిక నిర్ణయాలే అమలవుతుండటంతో ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధు లు పక్కదారి పడుతున్నాయి. ఇష్టారాజ్యంగా నియామకాలు ఔట్ సోర్సింగ్ ముసుగులో రిమ్స్‌లో ఇష్టారాజ్యంగా నియామకాలు జరుగుతున్నాయి. కొందరు అధికారుల ఏజెన్సీలతో సొంత కాంట్రాక్టులు కుదుర్చుకొని ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఒకవేళ ఏజెన్సీకి సంబంధం లేకపోతే ఆ ఉద్యోగుల వేతనాలను హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ నిధుల నుంచి మళ్లించి ఇస్తున్నారు. కొద్ది నెలల కిందట సూపరింటెండెంట్ కార్యాలయంలో ఇద్దరిని, ఆస్పత్రిలో మరో ఇద్దరిని ఇలాగే నియమించి,ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వేతనాలు చెల్లిస్తున్నట్టు రిమ్స్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీ నిధుల్లో మాయజాలం ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలకు మంజూరవుతున్న నిధులు దారిమళ్లుతున్నా యి. ఆరోగ్యశ్రీ కేసుల్లో పాల్గొన్న వారికి, వైద్య పరికరాల కొనుగోలుకే ఆ నిధుల నుంచి చెల్లింపులు జరపా లి. దానికి విరుద్ధంగా ఉద్యోగుల వేతనాలు, కూర్చీలు వంటి సామగ్రి కొనుగోళ్లకు ఈ నిధులు వెచ్చిస్తున్న ట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారుల మధ్య వివాదం రేగినట్లు తెలిసింది. నిధుల దుర్వినియోగంపై కొందరు వైద్యులు రిమ్స్ అధికారులను నిలదీయడం వివాదంగా మారింది. అదే దారిలో హెచ్‌డీఎస్ నిధులు రోగులకు వైసౌకర్యాలు పెంచే పనులకే వెచ్చించాల్సిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులను అనవసర పనులకు కూడా వినియోగిస్తున్నారు. గత ఏడా ది ఆడిటోరియం మెట్ల పనులకు హెచ్‌డీఎస్ నిధుల నుంచి సుమారు రూ.3 లక్షలు కేటాయించారు. వాస్తవానికి ఈ నిర్మాణం రిమ్స్ ప్లాన్‌లో లేదు. అయినా లక్షల ఖర్చుతో చేపట్టిన ఈ పనుల్లో చాలా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా సూపరింటెం డెంట్ కార్యాలయాన్ని ఆస్పత్రి నుంచి కళాశాలకు మార్చారు. ఇందుకు అవసరమైన మార్పులు చేర్పులకు, ఆస్పత్రిలో సింగల్ విండో వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నిధులను హెచ్‌డీఎస్ నుంచే మళ్లించారు. తాజాగా డెరైక్టర్ ఛాంబర్ వద్ద ఏర్పా టు చేస్తున్న పార్టిషన్ల ఖర్చును కూడా హెచ్‌డీఎస్ నుంచే తీస్తున్నారు. రిమ్స్ భవనాల ప్లాన్‌ను రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు అమోదించారు. దానికి విరుద్ధంగా మార్పులు చేర్పులు చేపట్టడం, వాటికి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. మా ప్లాన్‌లో లేవు రిమ్స్ అడిటోరియం మెట్ల నిర్మాణం గురించి ఇక్కడి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న ఏపీహెచ్‌ఎంఐడీసీ ఈఈ రాంబాబు వద్ద ప్రస్తావించగా మెట్లతోపాటు ఇటీవల చేపట్టిన పలు నిర్మాణాలు తమ ప్లాన్‌లో లేవని స్పష్టం చేశారు. వాటికి సంబంధించి దగ్గరుండి ప్రణాళిక చెప్పమంటే చెబుతున్నామే తప్ప వాటికయ్యే ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి ఇస్తున్నారన్నదానితో తమకు సంబంధం లేదన్నారు. -
‘మీ సేవ’లు అధ్వానం!
కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం సకాలంలో అందని స్టేషనరీ కనీస సౌకర్యాలు కరవు జీతాలందక ఉద్యోగుల సతమతం భోలక్‌పూర్: నగరంలోని ‘మీ సేవ’ కేంద్రాల పనితీరు అధ్వానంగా మారింది. ఆయా కేంద్రాలను మొక్కుబడిగా నడిపిస్తున్నారు. సరైన సేవలందక వినియోగదారులు సైతం ఇబ్బందు లు పడుతున్నారు. జీతాలు రాక ఆపరేటర్లు, మేనేజర్లు, స్వీప ర్లు సతమతమవుతున్నారు. జంట నగరాల్లో 53 మీ సేవ కేం ద్రాలున్నాయి. అందులో ఔట్సోర్సింగ్ పద్ధతిన సుమారు 600 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, మేనేజర్లు, స్వీపర్లు పని చేస్తున్నారు. 2002లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను తొలుత జ్యోతి కంప్యూటర్స్ చేపట్టింది. ఆ తర్వాత స్పాన్కో టెలీ సిస్టమ్స్ సంస్థ ఈ కేంద్రాలను కొనసాగింది. గత ఏడాదినుంచి ఉపాధి టెక్నో సర్వీసెస్ వారు వీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆయా కేంద్రాల్లోని ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు అందడంలేదు. అదేమంటే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదం టూ నిర్వాహకులు చెబుతున్నట్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని బకాయిలు.. ఇదివరకు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన స్పాన్కో టెలీ సిస్టమ్స్ సంస్థ ఉద్యోగులకు 19 రోజుల వేతనాలు బకాయి పడినట్టు తెలిసింది. 2013 మార్చి నెలలో కొత్త సంస్థ ఉపాధి టెక్నో సర్వీసెస్ సంస్థ బాధ్యతలు చేపట్టింది. అదే నెలలో ఈ సంస్థ 11 రోజుల వేతనం చెల్లించగా మిగతా 19 రోజుల వేతనాన్ని పాత సంస్థ చెల్లించాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఆ సంస్థ దాదాపు 600 మంది ఉద్యోగులకు గాను రూ.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. సకాలంలో చేరని స్టేషనరీ.. కేంద్రాల నిర్వహణకు అవసరమైన తెల్ల పేపర్లు, సర్టిఫికెట్ పేపర్లు, రశీదులు తదితర స్టేషనరీ సకాలంలో అందక సిబ్బం ది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిల్లులు చెల్లించిన వారి కి రశీదులు, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్టేషనరీ అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పలువురైతే సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆయా కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పాత బకాయిలు అందక, మూడు నెలలుగా రెగ్యులర్ జీతాలు లేక సతమతమవుతున్నామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. జీతాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను మెరుగు పరచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
‘కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్’ కొనసాగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలాన్ని తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా శాఖల్లో వారి అవసరం తీరే వరకు... లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు... వీటిల్లో ఏదీ ముందయితే దానిని అమలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఆర్థిక శాఖ.. మూడు నెలల పొడిగింపు మాత్రమే ఇవ్వాలంది. ఆలోగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవసరం నిజంగా ఉందా లేదా అన్న అంశంపై పూర్తి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. అధికారులు మూడు నెలల కాలపరిమితికి ఫైలు పంపిం చగా.. సీఎం కె.చంద్రశేఖర్‌రావు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వీరిని కొనసాగించేలా కాలపరిమితి లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలి సింది. దాని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వంలోనే కాక గ్రామ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, డివి జన్లు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కార్యాలయాలు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యక్తిగత, కాంట్రాక్టు ఏజెన్సీలతో కుదుర్చుకునే ఒప్పం దాల కాల పరిమితి ఏడాదికి మించకుండా, నియమ నిబంధనలు స్పష్టంగా పేర్కొంటూ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ‘ఎసరు’
- జిల్లాలో 6వేల మంది ఉద్యోగుల తొలగింపునకు యత్నం - నెలాఖరుతో ముగియనున్న అవుట్ సోర్సింగ్ గడువు ఏలూరు : జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మీద సుమారు 6వేల కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏ శాఖలోనైనా వీరు లేనిదే పని నడవని పరిస్థితి. నెలనెలా సకాలంలో జీతం అందకపోయినా ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నారు. జీతం ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోరాటాలు చేస్తే నాలుగైదు నెలల జీతం ఒకేసారి ఇస్తున్నారు. తమ ఉద్యోగాలకు మంగళం పాడితే కుటుంబంతో సహా రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. వీరి సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో తమను తొలగించడం ఖాయమన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. .దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ దశల్లో ఆందోళనలకు రూపకల్పన చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ సేవలందిస్తున్న ఉద్యోగులు ఇలా గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సుమారు 100 పనిచేస్తున్నారు. రెవెన్యూశాఖలో కలెక్టరేట్ నుంచి ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో 43మంది కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్‌లో ఆరుగురు, జిల్లా నీటి యాజమాన్య సంస్థలో 80మంది ,ఉపాధి హామీ పథకంలో 300 మంది, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 108, 104, జాతీయ ఆరోగ్యమిషన్ లలో 150 మంది ల్యాబ్ టె క్నీషియన్లు, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. మహిళ శిశు అభివృద్ధి సంస్థలో 40 మంది ,విద్యాశాఖలో కంప్యూటర్ టీ చర్లు, టీఆర్సీలు, డ్రాయింగ్ టీచర్లుగా 2000 మంది, జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీల్లో కలిపి సుమారు 1000 మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డేటా ఎంట్రీ, ల్యాబ్ అసిస్టెంట్లు, ఇతర ఆపరేటర్లు 400 మంది, గ్రామాల్లో, పీహెచ్‌సీల్లో సెకండ్ ఏఎన్ఎంలు 600 మంది, ఇరిగేషన్ శాఖ ,పోలవరం ప్రాజె క్టు పరిధిలో హెల్పర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, 200 మంది, పశుసంవర్థకశాఖలో గోపాలమిత్ర, ఇతర సేవల కింద 100 మంది, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల్లో 200 మంది క్షేత్ర స్థాయిలోను సేవలందిస్తున్నారు. ఉద్యాన శాఖలో క్షేత్ర స్థాయిలో 100 మంది, ఇందిర క్రాంతి పథం కింద ధాన్యం కోనుగోలు, భూములు గుర్తింపు పనుల కింద 200 మంది అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరందరికి మంగళం పాడితే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీకాక ఇప్పుడున్న సిబ్బందే నానాపాట్లు పడుతున్నారు. ఇక వీరి కష్టాలు మరింత పెరిగిపోతాయి. ఖాళీలు భర్తీ చేయకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తే ప్రభుత్వ కార్యక్రమాల నివేదికలను అందించటం కష్టం అవుతుందని అన్ని శాఖల్లోను గుబులు రేగుతోంది. క్రమబద్ధీకరించాల్సి వస్తుందని ప్రభుత్వం ఎత్తుగడ! అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలకు పూర్తిస్ధాయిలో మంగ ళం పాడకపోతే వారు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఆందోళన మొదలెడతారని టీడీపీ సర్కార్ ఈ ఎత్తుగడకు దిగిందన్న విమర్శలు వస్తున్నాయి. దశలవారీగా వీరిసేవలకు ఫుల్స్టాప్ పెట్టి, కొత్త వారిని తీసుకుంటారని భావిస్తున్నారు. ఉద్వాసనకు గురయ్యే వారిలో అతి తక్కువ మందికి మాత్రమే తిరిగి ఉద్యోగాలు లభిస్తాయని ప్రస్తుత అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఔట్ !
గృహనిర్మాణ శాఖలో 201 మంది తొలగింపు జూలై 1 నుంచి అమలు ఎండీ ఆదేశాలు బి.కొత్తకోట: ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. కొత్త ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతుందన్న వీరి ఆశలు గల్లంతయ్యాయి. తొలి అస్త్రం గృహనిర్మాణ శాఖపై ప్రయోగించారు. దీంతో 201 మంది ఉద్యోగులు వీధిన పడనున్నారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ఆ శాఖ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. 2004కు ముందున్న ప్రభుత్వాలు నియోజకవర్గానికి 500 నుంచి 1,000 లోపు గృహాలను మంజూరు చేస్తూ వాటి నిర్మాణాల బాధ్యతలను వర్క్ఇన్స్పెక్టర్లకు అప్పగించడం జరిగేది. వర్క్ఇన్స్పెక్టర్లు రెండు లేక మూడు మండలాలకు కలిపి ఒకరుండేవారు. అయితే 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గృహనిర్మాణ శాఖకు ప్రాధ్యాన్యం ఏర్పడింది. ప్రతిపేదకూ పక్కాగృహం మంజూరు చేసేందుకని 2005-06లో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాకు 3,51,104 గృహాలను మంజూరు చేశారు. దీంతో గృహనిర్మాణ శాఖ కీలక శాఖగా మారింది. వేల కోట్లను ఖర్చు చేసే శాఖగా మారిపోవడంతో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మాణల పర్యవేక్షణ, వేగవంతం కోసం చర్యలు చేపట్టారు. మండలాలకు ఏఈలు, కొత్తగా సబ్డివిజన్లను ప్రారంభించారు. అలాగే పాలన, పనుల వేగవంతం, పర్యవేక్షణ కోసం కొత్త ఉద్యోగాల నియామకం చేశారు. మండలాలకు ఔట్సోర్సింగ్ ద్వారా మండల స్థాయి ఏఈల నుంచి వర్క్ఇన్స్పెక్టర్లు, డెటాఏంట్రీ ఆపరేటర్లను నియమించారు. జిల్లాలో 2006 నుంచి వీరి నియామకం సాగుతూ వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 7 మంది మండల స్థాయి ఏఈలతో పాటు 201 మంది ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం గృహనిర్మాణ శాఖ ఎండీ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే వినియోగించుకోవాలని, జూలై1 నుంచి కొనసాగించరాదని ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాలో 201 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వీధిన పడనున్నారు. జూలై 1 తర్వాత ఎవరు ఆదుకుంటారు, కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని శాఖల్లో కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన్
ఈ నెలాఖరుతో ముగియనున్న కాలపరిమితి కొత్తగా టెండర్లు పిలుస్తారో.. పాత వారినే తీసుకుంటారో? చిత్తూరు (టౌన్): జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి ఈనెలాఖరుతో ముగియనుంది. దీంతో ఇటు అధికారులకు అటు ఉద్యోగులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రతి శాఖలోనూ పదుల సంఖ్యలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పట్లో తేల్చే పరి స్థితి కనిపించక పోవడంతో కొన్ని శాఖల అధికారులు డీలాపడిపోతున్నారు. 2013-14కు గాను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న సిబ్బంది కాలపరిమితి గత మార్చి 31వ తేదీతో పూర్తయింది. అయితే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున గవర్నర్ అనుమతితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వారి కాలపరిమితిని మూడు నెలలు పొడిగించారు. ఆ పొడిగింపు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. అయితే పొడిగింపు ఆదేశాలిచ్చిన అధికారులు వారి జీతాల బడ్జెట్ సంగతిని ఇప్పటికీ తేల్చలేదు. కాలపరిమితి పూర్తయ్యే లోగా ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలను క్లియర్ చేయాల్సి ఉంది. పాతవారినే కొనసాగిస్తే ఫర్వాలేదు కానీ టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్తవారిని తీసుకుంటే ఇప్పుడున్న వారి జీతాలను ఎలా క్లియర్ చేయాలనేడైలమాలో అధికారులు ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లే కీలకం జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ తదితర శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా, డేటాఎంట్రీ ఆపరేటర్లుగా చాలామంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని జూలై నుంచి టెండర్ల ద్వారా కొత్తవారిని తీసుకుంటే అప్పుడేం చేయాలనేది ఈ శాఖల అధికారులకు పాలుపోవడం లేదు. కొత్తగా వచ్చేవారు పని నేర్చుకునే వరకు జరగాల్సిన రోజువారి విధులను ఎలా నిర్వర్తించాలనే ప్రశ్న వారిని వేధిస్తోంది. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల్లాంటి కీలక శాఖల్లో విద్యార్థులు, వారికి వర్తించే పథకాలు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బడ్జెట్ తదితరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం, డౌన్లోడ్ చేసుకోవడం తదితరాలను నిత్యం చేపడుతూ రావాలి. ఈ విషయాల్లో నిత్యం జిల్లా ప్రగతిని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలి. అయితే ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తుండడంతో వారు లేకుం టే ఏం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాలోని పలుశాఖల్లో నాలుగు వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా వీరందరి కాలపరిమితి పూర్తికానుంది. దాంతో ఆయా శాఖల అధికారులతోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. -
ఔట్.. సోర్సింగ్
ఆందోళనలో కాంట్రాక్టు సిబ్బంది కాలపరిమితి నెలాఖరు వరకు ఇన్నేళ్ల చాకిరీకి ఇదేనా గుర్తింపు కొనసాగించాలని వినతి విశాఖపట్నం, న్యూస్‌లైన్: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి నెలాఖరుతో ముగియనుండడంతో సిబ్బంది ఆం దోళన చెందుతున్నారు. తెలంగాణలో వీరిని పర్మినెంట్ చేస్తామని చెబుతుంటే సీమాంధ్రలో మాత్రం తొలగి స్తామనడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయని వైనం తెలిసిందే. పలు ప్రభుత్వశాఖలు ఔట్సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. కనీస వేతనానికి నోచుకోకున్నా, నెలల తరబడి జీతాలు అందకపోయినా అంకిత భావంతో పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగి స్తామనడం అన్యాయమని వాపోతున్నారు. ఎప్పటికైనా తమను రెగ్యులర్ చేయకపోతారా అన్న ఆశతో కొనసాగుతున్నారు. వీరికి సెలవులు, ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి అదనపు ప్రయోజనాలు లేవు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారన్న నెపంతో ప్రభుత్వం 2006 నుంచి ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా 150 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లు, క్లాస్-4 ఉద్యోగులు పనిచేస్తున్నారు. విశాఖ నగరంలోని డ్వామా, డీఆర్డీఏ, బీసీ సంక్షేమశాఖ, సాంఘికసంక్షేమశాఖ, జిల్లా మహిళా,శిశు అభివృద్ధిసంస్థ, బీసీ,ఎస్సీ కార్పొరేషన్‌తో పాటుగా వుడా,జీవీఎంసీ తదితర సంస్థల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎంతోమంది పనిచేస్తున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లలో వాచ్‌మన్,కుక్,కమాటీలుగా పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరంతా చాలీచాలని వేతనాలు, నెలల తరబడి చెల్లించకపోవడం వంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్లాస్-4 ఉద్యోగులకు రూ. 6,700లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.9,500 వంతున చెల్లిస్తోంది. పలు శాఖల్లో వీరు రోజూ రాత్రివరకు కూడా పనిచేస్తున్నారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఔట్‌సోర్సిగ్ సిబ్బంది పైనే పనిభారం పడుతోంది. తమను కొనసాగించాలంటూ వీరు మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి జూన్30వరకు పొడిగిస్తూ ఏప్రిల్‌లో 84వ నంబర్ జీవో జారీ అయింది. తెలుగుదేశం ప్రభుత్వం వీరిని కరుణిస్తోందో ఇంటికి పంపుతుందో చూడాలి. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
హైదరాబాద్ : తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీ నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జీహెచ్ఎంసీ తెలంగాణ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ, కార్మికుల జేఏసీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, అది నేటికీ వెంటాడుతుందని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రోస్టర్ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. ఆంధ్రావాళ్లు పోతూపోతూ పోలవరం సమస్యను సృష్టిస్తున్నారని, ఆదివాసులపై చంద్రబాబుకు నిజంగా ప్రేముంటే ఆ ఆర్డినెన్స్‌పై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఔట్ సోర్సింగ్ జేఏసీ చైర్మన్ మహేష్, తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్‌దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. -
పర్మినెంట్ ఆశలు
- తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు - ఆశల పల్లకీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు - 10 వేల మందికి ప్రభుత్వ కొలువులు! - గెజిటెడ్ కేడర్‌కు మినహాయింపు? - ఔట్‌సోర్సింగ్‌పై అధ్యయనం కొత్త రాష్ట్రం కొలువులు తేనుంది. ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వీరిని సర్కారు ఉద్యోగాలు వరించనున్నాయి. మరోవైపు ఉన్న ఉద్యోగుల్లో చాలా మందికి రాష్ట్రం ఏర్పడ్డాక ప్రమోషన్లు రానున్నాయి. సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని.. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. తాజాగా.. ఈ నెల 23న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం తమ తలరాత మార్చుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికా? కొందరికా? పర్మినెంట్ విషయమై కొన్ని క్యాడర్ల ఉద్యోగుల్లో యం పట్టుకుంది. అందరినీ పర్మినెంట్ చేస్తారా? లేక మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకే అవకాశం కల్పిస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదు. ప్రస్తు త పరిస్థితుల్లో గెజిటెడ్ స్థాయిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే.. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని ఓయూ జేఏసీ, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పోస్టులు ప్రకటించి, పరీక్ష ద్వారా భర్తీ చేయాలని వారు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో గెజిటెడ్‌స్థాయి ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు చెప్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌లో ఉత్కంఠ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీల ఆధీనంలో పని చేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలంటే సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. దీంతో వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు వివరించారు. కమిటీ నివేదికననుసరించి నిర్ణయం తీసుకోనున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం కొత్త ప్రభుత్వంలో ఉండబోవని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. కొత్త రాష్ట్రంలో కాంట్రా క్టు సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తే ప్రభుత్వంపై ఆర్థికభారం పెరిగే అవకాశాలున్నాయి. ఎక్కడెక్కడ? ఎందరు? జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల్లో కలిపి 22,670 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న వారి సంఖ్య 12 వేలకు పైనే. ప్రాథమిక విద్యశాఖలో 3 వేల మంది కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందిర క్రాంతి పథం(ఐకేపీ), ఉపాధిహామీ పథకంలో 1500 మంది చొప్పున, మెప్మాలో 700, మున్సిపాలిటీల్లో 2500, వైద్యారోగ్యశాఖలో థర్డ్ పార్టీ ఉద్యోగులు 500, సెకండ్ ఏఎన్ఎంలు 500, ఆర్టీసీలో 800, సింగరేణిలో 4 వేలు, విద్యుత్‌శాఖలో 1200, పంచాయతీరాజ్‌శాఖలో 5 వేలు, డ్వామా, అటవీశాఖలో వంద మంది చొప్పున, ఉన్నత విద్యాశాఖలో 900 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీటితోపాటు గృహనిర్మాణం, పశుసంవర్ధక, వ్యవసాయశాఖల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరందరూ తమకు పర్మినెంట్ అవుతుందనే ఆనందంలో ఉన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. శుభపరిణామం ఎం.ప్రతాపరెడ్డి, టీఆర్టీఎఫ్, జిల్లా అధ్యక్షుడు విద్యాశాఖలో ఏళ్ల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు.. స్వీపర్లు ఉన్నారు. కేసీఆర్ నిర్ణయంతో.. 1989 నుంచి జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న 670 మంది పార్ట్‌టైం స్వీపర్ల ఉద్యోగాలు పర్మినెంట్ కానున్నాయి. కొత్తరాష్ట్రంలో.. వీరిలాంటి వేలాది మంది కలలు నెరవేరనున్నాయి. ఇది శుభపరిణామం. -
చిరుద్యోగుల భవిష్యత్తుపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై రాష్ట్రంలోని సుమారు 3.84 లక్షల మంది చిరుద్యోగుల భవిష్యత్ ఆధారపడి ఉంది. విభజన పంపకాల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు, హోంగార్డులు, ఎన్‌ఎంఆర్‌లను మినహాయింపు ఇచ్చారు. రెగ్యులర్ పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ.. ఆ పోస్టులను ఖాళీగానే చూపించనున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, హోంగార్డులు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో 3.84 లక్షల మంది పనిచేస్తున్నారు. వారి పదవీ కాలాన్ని మే నెలాఖరుకే ముగియనున్నా.. రెండు రాష్ట్రాలు విడిపోతున్నందున వారి పదవీ కాలాన్ని జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించారు. కానీ, వీరి భవిష్యత్ కొత్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు.hh జూన్ 2న రాష్ట్రం విడిపోరుు రెండు ప్రభుత్వాలు ఏర్పడనుండగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాలు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాయూ లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
రెవెన్యూ శాఖకు రాష్ట్ర విభజన పిడుగు
ఇప్పటికే పని భారం.. ఆపై సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖకు రాష్ట్ర విభజన పిడుగుపాటుగా పరిణమించింది. ఈ శాఖ పరిధిలోని భూసేకరణ యూనిట్ల రద్దు నిర్ణయంతో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంగళం పాడగా.. ఉన్న యూని ట్లలోని సిబ్బందిని సైతం కుదించడం.. కొత్త నియామకాలపై నీలినీడ లు కమ్ముకోవడంతో రెవెన్యూ శాఖ కుదేలు కానుంది. ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతరత్రా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనుంది. శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రం ముక్కలు కావ డం.. రెవెన్యూ శాఖను చిక్కుల్లోకి నెట్టింది. ఈ శాఖలోని ఉద్యోగు లు తీవ్ర ఇబ్బందులపాలు కానున్నారు. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న సిబ్బందిపై మరింత బరువు పడనుంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా ఇంటికి పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని పోస్టులు రద్దు కాగా,, కొత్త పోస్టుల మంజూరయ్యే అవకాశాలు లేవు. కొన్నేళ్లుగా అరకొర జీతాలతోనే పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుతో ప్రభుత్వ ఉద్యోగులకు కష్టాల పర్వం ప్రారంభమైంది. ఈ నెల 17న అధికారులు జారీ చేసిన జీవో నెం.67 దీనికి నాంది పలి కింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం త్వరలోనే కొలువుదీరనున్న తరుణంలో ఇప్పటికిప్పుడే ఇటువంటి కీలక ఉత్తర్వుల జారీ చేయడం చర్చనీయాంశమైంది. జీవో నెం. 67లో ఏముంది? సమైక్య రాష్ట్రంలోని 23 భూసేకరణ యూనిట్లు ఎత్తివేయాలని నెం.67 జీవో ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మూడు యూనిట్లు ఉన్నాయి. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఆమదాలవలసతోపాటు శ్రీకాకుళంలోని 3, 4 యూనిట్లకు అధికారులు మంగళం పాడారు. ఈ ఉత్తర్వుల ఫలితంగా 45 మంది వివిధ స్థాయిల సిబ్బంది ఉద్యోగాలు కొల్పోతున్నారు. ప్రస్తుతం భూసేకరణ యూనిట్లలో పది మంది సిబ్బంది పని చేస్తున్నారు. కొన్ని యూనిట్లను ఎత్తివేయడం వల్ల అక్కడ సిబ్బందిని రెవెన్యూ శాఖలోని ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేస్తారు. అక్కడ పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తారు. అంతేకాకుండా మిగిలిన భూసేకరణ యూనిట్లలో కూడా సిబ్బందిని కుదించి ఐదు మందే ఉండేలా చూడాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఐదు భూసేకరణ యూనిట్ల లో మూడింటిని రద్దు చేయడం వల్ల రెండు యూనిట్లే మిగులుతున్నాయి. వీటిలోకి రెగ్యులర్ ఉద్యోగులను సర్దుబాటు చేస్తే.. ప్రస్తుతం పని చేస్తున్న 150 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది ఉపాధి కోల్పోతారు. యూనిట్లు కుదించడం.. సిబ్బందిని తగ్గించడం వల్ల రానున్న రోజు ల్లో పదోన్నతులు ఉండవు. ఇప్పటికే పదోన్నతులు వారు తగిన పోస్టులు లేకపోవడం తో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా డిప్యూటీ తహశీల్దార్(డీటీ) క్యాడర్ అధికారులకు ఇటువంటి ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదముంది. జిల్లాలో 14 డీటీలు పాత స్థానాలకు వెళ్లాలి రావ చ్చు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 10 డీటీలకు కూడా ఈ పరిస్థితి తప్పదు. ప్రస్తుతం రెవెన్యూ, భూసేకరణ విభాగంలో 12 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, 42 మంది త హశీల్దారు, 44 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 30 మంది సీనియర్ అసిస్టెంట్లు, 38 మంది రెవెన్యూ పర్యవేక్షకులు, 114 మంది జూనియన్ అసిస్టెంట్లు 159 మంది అటెండర్లు ఉన్నారు. వీరు కాకుం డా ఔట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ అపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు తదితర క్యాడర్లలో మరో 150 మంది వరకు పని చేస్తున్నారు. యూ నిట్ల రద్దు, ఉద్యోగుల కుదింపు జీవోతో వీరందరికీ ఇక్కట్లు తప్పేలా లేవు. -
నెలరోజుల ముందే ఉద్యోగాలు ఔట్!
అసలే వెట్టి చాకిరీ, ఇప్పుడదీ లేకుండా పోయింది. ఎప్పటికైనా తమను క్రమబద్ధీకరిస్తారని ఆశతో తక్కువ వేతనానికి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మార్చి నెలాఖరుకు తొలగించాలని ఆ శాఖ కమిషనర్ గతంలో ఆదేశాలు చేశారు. అయితే ఉద్యోగు లు ఆందోళన చేయడంతో గవర్నర్ స్పందించి జూన్ వరకూ గడవు ఇచ్చారు. ఇప్పుడు గవర్నర్ హామీని కూడా లెక్క చేయకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో కేంద్రాస్పత్రి, ఘోషా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, బాడంగి, ఎస్. కోట, గజపతినగరం, భోగాపురం ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సి.టి.స్కాన్, ఈసీజీ, టెక్నిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జూనియర్ శానిటరీ వర్కర్ విభాగాల్లో వంద మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో వారి కాలపరిమితి ముగియడంతో అప్పట్లో వారిని తొలగించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. స్పందించిన గవర్నర్ నరసింహన్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను జూన్ నెలఖారు వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. తమ ఉద్యోగాలకు ఢోకా ఉండదని వారు ధీమా పడ్డారు. కానీ వారిని విధుల నుంచి తొలగించాలని సోమవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆస్పత్రుల్లో కాస్తో, కూస్తో వైద్య సేవలు అందుతున్నాయంటే అది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్లే. ముఖ్యంగా సి.టి.స్కాన్ ఈసీజీ, టెక్నీషియన్లను తొలగిస్తే వైద్య సేవలకు అంతరాయం కలుగుతుంది. సి.టి.స్కాన్ టెక్నీషియన్‌ను తొలిగిస్తే స్కాన్లు తీసే నాథుడే ఉండడు. అలాగే జూనియర్ శానిటరీవర్కర్లను తొలగిస్తే రోగులకు ఇబ్బందులు తప్పవు. రోగులకు డ్రెస్సింగ్ చేయడం, వీల్ చైర్‌పై ఆపరేషన్ థియేటర్, ఇతర ప్రాంతాలకు వెళ్లే సేవలు నిలిచిపోతాయి. ఈ విషయమై జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి బి. విజయలక్ష్మి వద్ద ‘న్యూస్‌లైన్’ వద్ద ప్రస్తావించగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం వాస్తవమేనన్నారు. -
ఉద్యోగులు ఔట్
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న రీతిలో రాష్ట్ర విభజన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపమైంది. పది సంవత్సరాల నుంచి కనీస వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్న ఈ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని శాఖల్లో వీరి అవసరం ఉందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఉత్తర్వుల కారణంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3 వేల ఉద్యోగులు ఈ నెల 31 నుంచి రోడ్డున పడనున్నారు. 2005 సంవత్సరం నుంచి వివిధ శాఖల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, స్టెనోలు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లుగా రూ.6000 నుంచి రూ.9500 వేతనానికి పనిచేస్తున్నారు. పదేళ్ల నుంచి పనిచేస్తున్న తమ సర్వీసును కొత్త ప్రభుత్వం పర్మినెంట్ చేస్తుందని, జీతాలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత ఉంటుందని అంతా భావించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత తమ బాధలు విన్నవించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే పిడుగులాంటి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో మున్సిపాల్టీలు, డీఆర్డీఏ, డ్వామా, డీఎంహెచ్ వో, జీజీహెచ్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ వంటి 77 విభాగాలోల ఈ తరహా ఉద్యోగులు ఉన్నారు. వచ్చేనెల 2 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడనుండటంతో కొత్త ప్రభుత్వంపై భారం పడకూడదనే ఉద్దేశంతో వీరిని తొలగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు అరకొర జీతాలతో జీవితాలను నడుపుకొస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్ ఒక్కసారిగా అగమ్యగోచరంగా మారనున్నది. ఈ సమాచారం తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకపోయింది. సాగునీటి ప్రాజెక్టుల సిబ్బందీ తొలగింపు.. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలోని 28 ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 450 సిబ్బందిని కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పులిచింతల, వంశధార, తోటపల్లి బ్యారేజి, ముసురుమిల్లి రిజర్వాయరు, పి.ఎస్.వెలిగొండ, పోలవరం, సింగూరు, చేవెళ్ల, ప్రాణహిత వంటి ముఖ్య ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరిని తొలగిస్తే పనులకు ఆటంకం కలుగుతుందని ఆ ప్రాజెక్టుల ఇంజినీర్లు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఫ్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు ముఖ్యమైన పులిచింతల ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్నాయని, భూసేకరణ, ముంపు బాధితులకు నష్టపరిహారం అందచేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాల్లోని సిబ్బందిని తొలగిస్తే ప్రతిష్టంభన ఏర్పడుతుందని, గుంటూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద పనిచేస్తున్న 38 మంది తొలగించకూడదని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ తొలగింపు ఉత్తర్వులు జారీ కావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం తాము చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగంలోకి తీసుకోవాలని, పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు. -
నెలల తరబడి వెతనాలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒకవైపు సిబ్బంది కొరత.. మరోవైపు పనిభారం. ప్రభు త్వ శాఖలను ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్య ఇది. అయినా ప్రభుత్వం ఖాళీల భర్తీపై పెద్దగా దృష్టి సారించకపోగా.. తాత్కాలిక పని కానిచ్చేసేందుకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను సృష్టించింది. పోనీ వారికైనా సక్రమంగా వేతనాలిస్తున్నారా అంటే.. అదీ లేదు. ఇస్తున్న అరొకర జీతాలు కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో ఈ విధానంలో పని చేస్తున్న వేలాది ఉద్యోగుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. జిల్లాలో మూడు నుంచి ఎనిమిది నెలలుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. ఫలితంగా నానా అవస్థలు పడుతున్న ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయో.. అసలు తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారుగా 20 ప్రభుత్వ శాఖల్లో వేలమంది ఉద్యోగులు ఈ విధానంలో పనిచేస్తున్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి కనీసం రూ.8వేల వేతనం వేసుకున్నా రూ.2 కోట్లు అవుతుందని అంచనా. ఈ లెక్కన ఐదు నెలల వేతన బకాయిలు సుమారు రూ.10 కోట్ల వరకు నిలిచిపోయాయి. జీతాలు విడుదల కాకపోవడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, వెచ్చాలు వంటి రోజువారీ అవసరాలు కూడా తీరక ఇబ్బంది పడుతున్నారు. వరుసగా ఐదు నెలల జీతాలు లేకపోవడంతో ఇప్పటికే పలు చోట్ల అప్పులు చేశారు. ఇక కొత్త అప్పులు పుట్టే అవకాశం కూడా లేక అనేక కుటుంబాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నిన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒక దశలో ఈ ఉద్యోగులను తొలగిస్తామని కూడా తెలిపింది. మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే ఆర్థిక ఇబ్బందులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం వంటి పరిణామాలు ఉద్యోగుల భవిష్యత్తునే అయోమయంలోకి నెట్టేశాయి. కొన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగులు.. వారికి ఎన్ని నెలల వేతన బకాయిలు ఉన్నాయన్న విషయాన్ని పరిశీలిస్తే.. వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 800 మంది ఓట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. వీరందరికీ ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించలేదు. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖల్లో సుమారు 105 మంది పని చేస్తుండగా.. వీరికి కూడా ఎనిమిది నెలలుగా వేతనాలు అందలేదు. ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలో 60 మంది వరకు ఉన్నారు. వీరికి ఆరు నెలలుగా జీతాలు లేవు. రెవెన్యూ శాఖలో 102 మంది తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లుగా, భూసేకరణ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లుగా వీరంతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఎనిమిది నెలలుగా జీతాలు విడుదల కాలేదు. అటవీశాఖలో మూడు నెలలుగా జీతాలు లేవు. ఈ శాఖలో 40 మంది వరకు పని చేస్తున్నారు. విద్యాశాఖ కార్యాలయంతోపాటు వివిధ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా 420 మంది వరకు పని చేస్తున్నారు. వీరికి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదు. రిమ్స్ ఆస్పత్రిలో 180 వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి మూడు నెలలుగా జీతాలు విడుదల కాలేదు. 108, 104 సర్వీసుల్లో సుమారు 130 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి ఆరు నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో 456 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పని చేస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుంచి జీతాలు విడుదల కాలేదు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ, భూసేకర ణ విభాగం, క్షయ నియంత్రణ, తదితర శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవు. -
అవుట్ సోర్సింగ్‌పై ఆందోళన
ఆచి, తూచి వ్యవహరిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు గ్రాంట్థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ సర్వే న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని గ్రాంట్ థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్(ఐబీఆర్) తాజా సర్వే వెల్లడించింది. తమ కార్యకలాపాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలన్న తక్షణ ప్రణాళికలు ఏమీ లేవని ప్రపంచవ్యాప్తంగా 60 శాతం కంపెనీలు భావిస్తున్నాయని ఈ సర్వే పేర్కొంది. ఫలితంగా దేశీయంగా ఉద్యోగాల కోత ఉండే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోందని వివరించింది. 45 దేశాల్లో మొత్తం 3,300 కంపెనీలపై ఈ సర్వేను నిర్వహించారు. అవుట్ సోర్సింగ్ వల్ల కీలకమైన విభాగంపై నియంత్రణ కోల్పోతామోనన్న ఆందోళన అంతర్జాతీయ కంపెనీల్లో పెరిగిపోతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
జాబు ఓ డాబు
బాబు హయాంలో మెడికల్ ఇన్వాలిడేషన్ అర్జీల రద్దు జీవో అన్యాయమైపోయిన వందలాదిమంది ఉత్తర్వు రద్దు చేసిన మహానేత విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ‘జాబు కావాలి... బాబు రావాలి...’ ఇదీ టీడీపీ నేతల ప్రచారం. యువతలోనూ ఇదే నినాదం తీసుకెళ్లి ఊదరగొడుతున్నారు. నిజంగా బాబు వస్తే ఉద్యోగాలొస్తాయో లేదో గానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారని ఆయన పాలన గురించి బాగా తెలిసిన ఉద్యోగులెవరైనా ఇట్టే చెబుతున్నారు. బాబు రాకూడదు బాబోయ్ అంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్లలో పని చేస్తు న్న వారితో బాటు కారు ణ్య నియామక ఉద్యోగాల్లోనూ కోత వేస్తాడని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పినకోటకు చెందిన నూకరాజు వైద్య శాఖలో నాలుగో తరగతి ఉద్యోగం చేసేవాడు. అతడికి ఓ సారి రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయింది. అప్పటి నుంచీ ఆరోగ్యం సహకరించేది కాదు. 54 ఏళ్ల వయస్సులోనూ అన్ని కార్యాలయాలకు తిరిగి ఫైల్స్ మోసుకురావడం కష్టమయ్యేది. వైద్యులు చూసి ఆరోగ్యం సహకరించడం లేదని నిర్ధారించారు. దీంతో తన కుమారునికి ఆ ఉద్యోగం ఇవ్వాలని 2002లో అర్జీ చేసుకున్నాడు. ఇలాంటి వారు జిల్లాలో దాదాపు అయిదారొందల మంది దరఖాస్తులు అప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో వుంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దరఖాస్తులు వేలల్లోనే ఉన్నాయని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వచ్చే అర్జీలకు ఇచ్చే ఉద్యోగాలను రద్దు చేస్తూ 2002 లో జీవో (ఎం ఎస్ నెంబర్ 202, 203) జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వున్న వందలాది మంది తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయించుకున్న వారంతా అన్యాయమైపోయారు. ఒక పక్క జీతం రాక, పిల్లలకు ఉద్యోగం లేక, కేవలం పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్ ఉద్యోగమిచ్చారు...! మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగాలను కల్పించే జీవోలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యం సహకరించక ఉద్యోగం చేయలేకపోతున్న వారికి తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించి తద్వారా కుటుంబ భారాన్ని మోసేందుకు ఉన్న ఏకైక అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్జీవోలంతా ఏకమాయ్యరు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఎన్జీవోలంతా 202, 203 జీవోలను రద్దు చేయాలని కోరడంతో 2008లో అక్టోబర్ 23న జీవో ఎంఎస్ నెంబర్ 661 ద్వారా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2008 నుంచీ ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా వున్న దాదాపు 40 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. బాబు వస్తే జాబు ఎలా..! బాబు వస్తే జాబు ఎలా వస్తుంది. ఇంటింటికీ ఓ ఉద్యోగం అంటూ ప్రచారమే తప్పా ఆచరణ ఎలా సాధ్యం. ఓ ఊళ్లో 100 ఇళ్లుంటాయి. అక్కడ 100 మందికి ఉద్యోగాలిచ్చి ఏం చేయిస్తారో ఆయనే చెప్పాలి. ఇదంతా నిరుద్యోగులను మోసగించడమే. - అశోక్, నిరుద్యోగి, పిఠాపురం కాలనీ పర్మినెంట్ ఉద్యోగులుండరు..! బాబు వస్తే రెగ్యులర్ ఉద్యోగులుండరు. అంతా ఔట్సోర్సింగ్ సిబ్బందే. వారికి జీతాలు ఇవ్వరు..ప్రజలకు పని చేయరు. అంతా జన్మభూమి..మన ఖర్మ భూమి మాత్రమే మిగులుద్ది. - నాగమణి, జీవీఎంసీ ఔట్‌సోర్సిగ్ ఉద్యోగి -
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై నిరసన
హైదరాబాద్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం వివిధ సంఘాల ఉద్యోగులు కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోని డీఎంఈ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరేట్, డెరైక్టర్ ఆఫ్‌హెల్త్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ కార్యాల యాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పారామెడికల్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్లు, నాలుగవ తరగతి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. వీరికి ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ), ఏఐటీయుసీ, సీఐటీ యూ, భారతీయ జనతామజ్దూర్ సంఘ్ యూని యన్లు మద్దతు పలికాయి. ఒక్కసారిగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు డీఎంహెచ్ఎస్లోకి ప్రవేశించడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. ఈ సందర్భంగా టీజీడీఏ ప్రతినిధులు డాక్టర్ రమేష్, జూపల్లి రాజేందర్, పుట్ల శ్రీనివాస్ బృందంతో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ అనురాధను కలసి వారి సమస్యలను వివరించారు. ఈ సమస్యను ప్రిన్సిపాల్ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు యూసుఫ్ మాట్లాడుతూ నాంపల్లి నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
పర్మినెంట్ చేయాలని డిమాండ్ మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ మహారాణిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖ లు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ పి.మణి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. రాష్ట్రంలో 5.5లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నట్టు తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పిం చాలని, వేతనాలు పెంచాలని కోరారు. ప్రసూతి సెలవులు, ఇంక్రిమెంట్లు, డీఏ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. సిటు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభు త్వ సేవలలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామనే రాజకీయ పార్టీలకే మద్దతు తెలపాలన్నారు. వీరి రెన్యువల్ కాల పరిమితిని ఏడాది నుంచి మూడు నెలలకు కుదించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని వాపోయారు. పర్మినెంట్ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పర్యాటక, ఈఎస్ ఐ, 108, యూహెచ్‌సీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీఐఐసీ, హౌసింగ్, ఏయూ, అటవీశాఖ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఐకేపీ, ఐసీడీఎస్, డ్వామా తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు సంఘీభావం తెలిపారు. -
సమ్మెలో పారిశుధ్య ఉద్యోగులు
సాక్షి, రాజమండ్రి : ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం, తదితర తమ డిమాండ్ల సాధన కోసం పురపాలక శాఖా మంత్రితో మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య ఉద్యోగులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు పిలుపు నిచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని పారిశుధ్య సిబ్బంది సమ్మె బాట పట్టారు. ఈ ప్రభావం జిల్లాపై స్పష్టంగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క సమైక్యాంధ్ర నినాదంతో ఏపీ ఎన్జీఓలు సమ్మెలో ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ వేరైనా మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో జిల్లాలో పౌరసేవల నిర్వహణ మరింత స్తంభించనుంది. నిర్మాణాత్మక చర్యలు లోపించి ఇప్పటికే మున్సిపాలిటీలు మురికికూపాలుగా మారుతున్నాయి. ఈ తరుణంలో పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగడం పరిస్థితిని మరింత జఠిలం చేయనుంది. అధికారులు తాత్కాలిక ప్రత్యామ్నాయం చూపుతామంటున్నా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేమనే చెబుతున్నారు. తాగునీటిపై ప్రభావం రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో 2994 మంది సమ్మెలోకి వెళ్తున్నారు. వీరిలో 1388 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా 1606 మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతుగా పర్మినెంట్ ఉద్యోగులు సైతం శనివారం ఉదయం నుంచి విధులకు హాజరు కావడంలేదు. దీంతో ముందుగా తాగునీటి పంపిణీ వ్యవస్థకు విఘాతం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. పారిశుధ్య నిర్వహణ స్తంభించి ఎక్కడికక్కడ రోడ్లపై చెత్త పేరుకుపోనుంది. ప్రధానంగా కాకినాడ, రాజమండ్రి వంటి నగరాల్లోని ప్రధాన కూడళ్లు ఒక్కరోజుకే చెత్తతో నిండిపోతాయి. రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లు వ్యర్థాలతో నిండి ఉంటాయి. తెల్లవారాక వ్యాపార సమయానికల్లా వీటిని పారిశుధ్య పనివారు శుభ్రం చేస్తారు. కానీ శనివారం ఉదయం మార్కెట్లు చెత్తతో స్వాగతం పలకనున్నాయి. ప్రత్యామ్నాయ చర్యల్లో అధికారులు సమ్మె నోటీసుతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో కమిషనర్లు శుక్రవారం రాత్రే ఆ చర్యల్లో పడ్డారు. ఎంతమంది సమ్మెలోకి వెళ్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఎంతమందిని చూడాలన్న అంశంపై దృష్టి సారించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాకు ఉదయం అంతరాయం వాటిల్లకుండా రిటైర్డు ఉద్యోగులు, మహిళా సంఘాలు, రోటరీ, లయన్స్ క్లబ్, తదితర సంఘాల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం రాత్రికి రాత్రి మార్గదర్శకాలు ఇచ్చింది. మురుగుకాలువల్లో నీటి ప్రవాహం, డ్రైన్లు, మంచినీటి పైపుల లీకేజీలు, విద్యుత్తు సరఫరా, రవాణా వంటి అంశాల్లో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే రవాణా, పోలీసు శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని సూచనలు చేసింది. నీటి పథకాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సమ్మెలో ఉన్న సిబ్బంది స్థానంలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చే వారిని గుర్తించి వారికి రాత్రికి రాత్రి శిక్షణ ఇవ్వాలని ఆదేశించడంతో ఇప్పుడెలా అంటూ జిల్లా అధికారులు తలలు పట్టుకున్నారు. కాగా సమ్మె ప్రభావం ఎలా ఉంటుంది. ఎంతమంది సమ్మెలో ఉంటారన్న విషయాలు శనివారం కానీ నిర్థారణ కాదని మున్సిపల్ ఆర్డీ రవీంద్రబాబు చెప్పారు. -
గ్రేటర్లో సమ్మె సైరన్
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ సేవలన్నీ శుక్రవారం నుంచీ నిలిచిపోనున్నాయి. జీహెచ్ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ పిలుపు మేరకు ‘గ్రేటర్’లో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు ఇరవైవేల మంది నిరవధికంగా విధులకు డుమ్మాకొట్టి సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా చెత్త తరలింపు.. వీధులూడ్చటం.. దోమల నివారణ మందులు చల్లడం.. తదితర సేవలన్నీ స్తంభించనున్నాయి. మునిసిపల్ పరిపాలన, పట్ణణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ మేరకు ఈ నెల 10వ తేదీ నాటికి ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనం నెలకు రూ.16,500కి పెంచాల్సి ఉండగా పెంచలేదని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్, గౌరవాధ్యక్షుడు అమరేందర్‌లు విలేకరులకు తెలిపారు. మెగాసిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ తదితర హామీలు అమలుకు నోచుకోనందున గురువారం అర్ధరాత్రి నుంచే సమ్మెలో పాల్గొననున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు, పారిశుధ్య విభాగంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఈఎఫ్‌ఏలకు ఇంధన అలవెన్సు, కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, రెయిన్కోట్లు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సదుపాయాలు తదితరమైనవి యూనియన్ డిమాండ్లలో ఉన్నాయి. కొనసాగుతున్న ఇంజనీర్ల నిరసన మరోవైపు సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవమానానికి నిరసనగా జీహెచ్ఎంసీ ఇంజనీర్లు ప్రారంభించిన నిరసన కొనసాగుతోంది. గురువారం సామూహిక సెలవులతో విధులకు హాజరుకాని ఇంజనీర్లు.. శుక్రవారం సైతం సామూహిక సెలవు పెట్టి గైర్హాజరు కానున్నట్లు తెలిపారు. -
14 నెలలుగా జీతాల్లేవ్..
మార్కాపురం, పెద్దారవీడు, న్యూస్‌లైన్: తహశీల్దార్ కార్యాలయాల్లో కీలక విధులు నిర్వర్తించే కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒక నెలో.. రెండు నెలలో కాదు. ఏకంగా 14 నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో కుటుంబ పోషణ జరగక అప్పుల పాలవుతున్నారు. మార్కాపురం, కందుకూరు, ఒంగోలు రెవెన్యూ డివిజన్లలో 50 మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వీరిని అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించింది. మండల పరిధిలోని నివాస, ఆదాయ, జనన, మరణ తదితర సర్టిఫికెట్లను కంప్యూటరీకరించి జారీ చేయాల్సిన పని వీరిదే. ఒక్కో కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ 11,013 వేతనం నిర్ణయించారు. అయితే వివిధ పథకాల కింద వేతనంలో కొంత భాగం పోను రూ 8,400 చెల్లించాలి. వీరంతా తహశీల్దార్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అవుట్ సోర్సింగ్ విభాగం కావడంతోనే చిన్నచూపునకు గురవుతున్నారు. సుదీర్ఘ కాలంగా జీతాలు రాకపోయినప్పటికీ విధుల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా కార్యాలయానికి ప్రతి రోజూ హాజరవుతున్నారు. అప్పులు తెచ్చుకొని పొట్ట నింపుకుంటున్నారు. ఇలా మొత్తం 50 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ 58.80 లక్షల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. నిధులు విడుదల చేయాలి: శ్రీనివాస్: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు తహశీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు చాలా కాలంగా వేతనాలు విడుదల కాలేదు. ఒక నెలకు మాత్రమే జీతాలు విడుదల చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చాం. కొంత మంది ఆపరేటర్లు డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల తహశీల్దార్లు బదిలీ కావడంతో సర్టిఫికెట్లు అందడంలేదు. నిధులు విడుదల అయితే అందరికీ బకాయిలతో కూడిన వేతనాలు అందిస్తాం. -
అక్రమాల ‘సోర్సింగ్’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపు బాధ్యత గతంలో ఐకేపీ ఆధ్వర్యంలోని జిల్లా సమాఖ్య నిర్వహించేది. 2008 మార్చి నుంచి 2013 మార్చి వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జిల్లా సమాఖ్య వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. ప్రతిఫలంగా ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి నాలుగు శాతం మొత్తం కమీషన్ రూపంలో జిల్లా సమాఖ్య ఖాతాకు ఆయా ప్రభుత్వ శాఖలు చెల్లించేవి. జిల్లా సమాఖ్య నివేదిక ప్రకారం ఒక్క 2012- 13 ఆర్థిక సంవత్సరంలోనే 44 ప్రభుత్వ శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.4.95 కోట్లు వేతనంగా చెల్లించారు. కేవలం 2013 మార్చి నెలను పరిగణలోకి తీసుకుంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ద్వారా జిల్లా సమాఖ్యకు రూ.2.27 లక్షలు కమీషన్ లభించింది. అయితే జిల్లా సమాఖ్య ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వహించరాదనే ఉత్తర్వులను కొందరు అక్రమార్కులు ఆసరాగా తీసుకున్నారు. జిల్లా సమాఖ్యను ఔట్ సోర్సింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధికారుల అండతో కొత్త ఎత్తు వేశారు. జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నాలుగు ఏజెన్సీలతో కూడిన ఎంప్యానెల్ జాబితా తయారు చేసి ఆమోద ముద్ర వేయించుకున్నారు. నిబంధనల మేరకు సదరు ఏజెన్సీలకు లేబర్ కాంట్రాక్టు లెసైన్సు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ లెసైన్సు సక్రమంగా ఉందని విచారణ నివేదిక సిద్ధం చేశారు. ఈ నాలుగు ఏజెన్సీలకు 46 ప్రభుత్వ విభాగాల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వాటాలుగా పంపిణీ చేశారు. అయితే ఏ ప్రభుత్వ విభాగంతో ఏయే ఏజెన్సీలు ఒప్పందం కుదుర్చుకున్నాయనే వివరాలు మాత్రం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం వెల్లడించడం లేదు. ఒక్కో ఏజెన్సీ పరిధిలో ఎన్ని ప్రభుత్వ శాఖలు, ఎందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో సదరు ఏజెన్సీలనే అడగండంటూ ఉచిత సలహా ఇస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా! ఎంప్యానెల్ జాబితా తయారీలో అధికారులు అత్యంత గోప్యత పాటించినట్లు స్పష్టమవుతోంది. అర్హులైన ఏజెన్సీలను గుర్తించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం కనీసం పత్రిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఏజెన్సీల ఎంపికకు అనుసరించిన ప్రాతిపదిక ఏమిటనే అంశంపైనా ఉపాధి కార్యాలయ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. 46 ప్రభుత్వ శాఖల పరిధిలో సుమారు 1200కు పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కుదుర్చుకున్న ఒప్పందం వివరాలపై కూడా అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులోనూ పారదర్శకత లోపించినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అడ్డదారిలో కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీలు కేవలం వేతనం చెల్లింపు ద్వారా వచ్చే కమీషన్‌తో సరిపెట్టుకోవడం లేదు. ఉద్యోగుల వేతనాల్లోనూ అడ్డగోలుగా కోతలు విధిస్తూ లక్షలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నాయి. ఎంప్యానెల్ జాబితాలోని ఏజెన్సీల ఎంపిక వ్యవహారంపై దృష్టి సారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముంది. -
భవితకు దారేది..
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఆటోమొబైల్ సీవోఈ కోర్సు పరిస్థితి. ప్రపంచబ్యాంకు ఆలోచనలో నుంచి ఆవిర్భవించిన కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ సాధించినా ఎందుకూ కొరగాకుండా పోతోంది. ఆయా విభాగాల్లో నిపుణులను తీసుకుని కార్మికుల సంఖ్య పెంచడం కన్నా అన్ని విభాగాల్లో నిపుణుడైన ఒక్కరితో పనిచేయిస్తే అన్ని రకాలుగా ఆదా అవుతుందని ప్రపంచ బ్యాంకు భావించింది. ఇందుకు అనుగుణంగానే వృత్తి విద్య కోర్సుల్లో ఆటోమొబైల్ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ) పేరుతో ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ)లో ప్రభుత్వం 2007లో కోర్సును ప్రవేశపెట్టింది. మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలోనే ఈ కోర్సు అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. కోర్సు కాల పరిమితి రెండేళ్లు ఉంటుంది. మొదటి సంవత్సరం ఆటోమొబైల్ రంగంపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆరు నెలలు ఆటోమొబైల్ రంగంతో అనుబంధంగా ఉండే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్స్‌లో శిక్షణ ఉంటుంది. మరో ఆరు నెలలు స్థానికంగా ఉన్న కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తారు. కోర్సులో భాగంగా వివిధ రకాల వాహనాలకు సంబంధించిన యంత్రాల పనితీరు, డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తారు. కోర్సులో బ్యాచ్‌కు 20 మంది విద్యార్థుల చొప్పున ఆరు బ్యాచ్‌ల్లో 120 మందికి శిక్షణ ఇచ్చారు. 2007 నుంచి ఇప్పటివరకు సుమారు 800 మంది విద్యార్థులు ఈ కోర్సును పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాదిపాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలు ఈ కోర్సు పూర్తి చేసిన వారిని అర్హులుగా గుర్తిస్తూ ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అప్రెంటీస్ ఇవ్వాలనే ఆదేశాలు లేవని తేల్చి చెబుతున్నారు. ఇటు అప్రెంటీస్ చేయలేక.. ఉపాధి లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు వృథా.. ఆటోమొబైల్ సీవోఈ కోర్సు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతోంది. ప్రపంచబ్యాంకు నిధులు విడుద ల చేస్తోంది. డిపార్ట్మెంటు ఆఫ్ ఎక్విప్మెంటు, ట్రైనింగ్ విభాగం ద్వారా 2007-08లో కోర్సుకు సంబంధించి రూ.2కోట్లతో యంత్రాలు, 3కార్లు, ఒక మినీ బస్సు కొనుగోలు చేశారు. ఐటీఐ ఆవరణలోనే మూడు పెద్ద భవనా లు నిర్మించారు. రూ.70లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది మార్చిలో రూ.27లక్షలు వచ్చాయి. కోర్సు బోధనకు అవు ట్ సోర్సింగ్ కింద ఆరుగురు అధ్యాపకులను నియమిం చారు. వీరికి రూ.18వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. గత ఏడాది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా కాకుండా కాంట్రాక్ట్ పద్ధతికి బదలాయించారు. వేతనం నెలకు రూ.12వేలుగా మార్చారు. ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడా ది ఇద్దరు అధ్యాపకులను నియమించగా వారు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. యంత్రాలు వృథాగా ఉండగా బస్సు, కార్లను సిబ్బంది ఇతర పనులకు వినియోగిస్తున్నారు. -
బెల్లంపై తీపి ఆశలు
=ఈ ఏడాది రూ.30 కోట్ల లావాదేవీలు =ఊపందుకోనున్న క్రయవిక్రయాలు అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి మార్కెట్ కమిటీ అధికారుల సమ్మె విరమణతో లావాదేవీలపై ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం లావాదేవీలు బాగానే ఉన్నా, బెల్లం ధరలలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. రెండు నెలల పాటు మార్కెట్ కమిటీ అధికారులు విధులకు గైర్హాజరుతో ఔట్సోర్సింగ్ సిబ్బంది బెల్లం బీట్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఈ సమయంలో బెల్లం క్రయవిక్రయాలలో ఆటంకాలు ఏర్పడనప్పటికీ ఉత్పత్తి చేసే రైతులు మాత్రం వెనుకంజ వేశారు. 2012-13లో మొదటి ఆరు నెలల లావాదేవీలు రూ.19.46 కోట్లు జరగ్గా 2013-14లో తొలి ఆరు నెలలు రూ.30.86 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2011-12లో రూ.161 కోట్లు, 2012-13లో రూ.143.50 కోట్ల వ్యాపారం జరిగింది. రూ.17 కోట్ల లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో 2013-14 పై కూడా ఇదే తరహా ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశా యి. కానీ 2013-14 మొదటి అర్థ సంవత్సర లావాదేవీలతో గత ఆర్థిక సంవత్సరాన్ని పోలిస్తే రూ.11 కోట్ల లావాదేవీలు అదనంగా జరిగినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు.. బెల్లం పరిమాణంలోనూ పు రోగతి కనిపిస్తోంది. ఈ ఆగస్టులో మాత్ర మే లావాదేవీలు తగ్గగా, సెప్టెంబర్‌లో కాసింత పెరుగుదల కనిపించింది. ఆగస్టులో తగ్గుదల గత ఏడాది ఆగస్టులో అనకాపల్లి మార్కెట్లో 2408 క్వింటాళ్ల లావాదేవీలతో 66 లక్షల 93 వేల 72 రూపాయల వ్యాపారం జరిగింది. 2013 ఆగస్టులో బెల్లం లావాదేవీలు 1207 క్వింటాళ్లకు పడిపోయి, 27 లక్షల 91 వేల 329 రూపాయలకు తగ్గింది. అక్టోబర్ తొలిపక్షంలోనూ నెమ్మదిగా లావాదేవీలు కొనసాగుతున్నాయి. సమ్మె విరమణ నేపథ్యంలో బెల్లం లావాదేవీలు ఊపందుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నా, ధరలు మాత్రం ఆశాజనకంగా లేవని రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు గత అక్టోబర్ 19న ఈ మార్కెట్లో 1715 బెల్లం దిమ్మలు క్రయవిక్రయాలు జరగ్గా, మొదటిరకం బెల్లం గరిష్టంగా 3480 రూపాయల ధర పలికింది. కాగా శనివారం అనకాపల్లి మార్కెట్‌కు 3512 బెల్లం దిమ్మలు రాగా, మొదటిరకం గరిష్టంగా 3410 రూపాయలు పలికింది. అంటే బెల్లం ధర గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే 70 రూపాయలు తగ్గినట్లయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల 17 వేల 958 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరగ్గా, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల 89 వేల 685 క్వింటాళ్లకు పడిపోవడంతో మార్కెట్ వర్గాలు డీలాపడ్డాయి. ఈ ఏడాది తొలి అర్థ భాగంలో లక్షా 24 వేల 102 క్వింటాళ్ల లావాదేవీలు జరగడంతో బెల్లం సరఫరా తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో జరిగే వ్యాపారంపైనే టర్నోవర్ ఆధారపడి ఉంటుంది. -
పండుగ పూట ఆకలికేకలు
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, సిబ్బంది పరిస్థితి దీనంగా ఉంది. నెలల తరబడి వేతనాలు అందక, కుటుంబపోషణ భారమై అప్పుల పాలవుతున్నారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా పాలకులు గుర్తించడం లేదు. వేతనాల కోసం ఆందోళనలు చేపట్టాలని ఉన్నా ఉద్యోగాలు పోతాయనే భయంతో బాధిత ఉద్యోగులు, సిబ్బంది వెనుకంజ వేస్తున్నారు. ఈ నెల 14న దసరా, 16న బక్రీద్, నవంబర్ 2న దీపావళి పండుగల సందర్భంగానైనా పాలకులు వేతనాలు విడుదల చేస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల దుస్థితిపై ‘న్యూస్‌లైన్’ కథనం. చితికిన సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లు గ్రామీణ మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పర్యవేక్షణ బాధ్యత వయోజన విద్యాశాఖకు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా 52 మంది మండల కో-ఆర్డినేటర్లు, గ్రామ పంచాయతీకి ఇద్దరి చొప్పున 1,732 గ్రామ కో-ఆర్టినేటర్లు ఉన్నారు. మండల కో-ఆర్టినేటర్లకు నెలకు రూ.6 వేలు, గ్రామ కో-ఆర్డినేటర్లకు రూ.2 వేల వేతనం. వీరికి 11 నెలలుగా వేతనాలు అందడం లేదు. మండల కో-ఆర్టినేటర్లకు రూ.34.32 లక్షలు, గ్రామ కో-ఆర్డినేటర్లు రూ. 3,81,04,000 మొత్తం రూ.4,15,36,000 ప్రభుత్వం బకాయి ఉంది. నిరాశలో ‘ఆయుష్’ జిల్లావ్యాప్తంగా 91 ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయి. ఒక్కో డిస్పెన్సరీకి ఒక్కో వైద్యుడి చొప్పున 91 మెడికల్ ఆఫీసర్ల పోస్టులున్నాయి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద కాంట్రాక్టు పద్ధతిలో 10 మంది వైద్యులు, 23 మంది కాంపౌండర్లు, 39 మంది ఎస్‌ఎన్‌వోలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఆగస్టు, సెప్టెంబర్ వేతనం రావాల్సి ఉంది. వైద్యులకు ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేల చొప్పున రూ.3.60 లక్షలు, కాంపౌండర్లకు రూ.9,200 చొప్పున రూ.4,23,200, ఎస్ఎన్వోలకు రూ.6,700 చొప్పున రూ. 5,22,600.. అందరికి కలిపి రూ.13,05,800 రావాల్సి ఉంది. అధ్యాపకులకు అందని వేతనాలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరతతో ప్రభుత్వం 150 మంది కాంట్రాక్టు అధ్యాపకులను నియమించింది. వీరికి నెలకు రూ.21 వేలు వేతనం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు రావడం లేదు. 150 మందికి కలిపి నెలకు రూ.31.50 లక్షల చొప్పున మూడు నెలలకు రూ.94.50 లక్షల వేతనం రావాలి. పంచాయతీ కార్మికులు పస్తులే.. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కారోబార్లు, ఎన్‌ఎంఆర్‌లు, పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, పంపు మెకానిక్‌లు, అటెండర్లు 3 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో 2,490 మందికి నెలల తరబడి వేతనాలు లేవు. అత్యధికంగా రూ.3,500.. అత్యల్పంగా రూ.1000 వరకు వేతనాలు ఉంటాయి. సగటున రూ.1500 తీసుకుంటే నెలకు 2,490 మందికి రూ. 37.35 లక్షలు, మూడు నెలలకు కలిపి రూ.1,12,05,000 బకాయి ఉంది. ఐకేపీ వీవోఏ మండల సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్(విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్లు) ఇందిరాక్రాంతి పథంలో కీలక ప్రాత పోషిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,600 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.2 వేలు ఇవ్వాల్సి ఉంది. కానీ మూడు నెలల నుంచి వేతనాలు అందలేదు. నెలకు రూ.32 లక్షల చొప్పున, మూడు నెలలకు కలిపి రూ.96 లక్షలు రావాలి. 104కు ఆగిన వేతనం, డీఏ.. 104 సర్వీసులు జిల్లా వ్యాప్తంగా 25 ఉన్నాయి. ఫార్మసిస్టు, డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 80 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో వేతనం ఉంటుంది. అందరికీ కలిపి ప్రతి నెల రూ.25 లక్షల వేతనం రావాలి. దీంతోపాటు ప్రతి సిబ్బందికి రోజుకు రూ.75 చొప్పున నెలలో 24 రోజులపాటు రూ.1,800 డీఏ రావాల్సి ఉంది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనం, జూలై నుంచి డీఏ అందలేదు. రూ.50 లక్షల వేతనం, రూ.4.32 లక్షల డీఏ కలిపి రూ. 54.32 లక్షలు రావలి. విద్యుత్ ఆపరేటర్లదీ గోసే.. 33/11 కెవి విద్యుత్ స్టేషన్లు జిల్లావ్యాప్తంగా 130 వరకు ఉన్నాయి. ఆపరేటర్లకు ప్రతి నెల రూ.7,400, వాచ్మెన్లకు రూ.3,500 వేతనం. ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. ఆపరేటర్లకు రూ.2,30,88,000, వాచ్మెన్లకు రూ.27.30 లక్షలు, మొత్తం రూ. 2,58,18,000 రావాలి. బోధకులకు తప్పని తిప్పలు జిల్లాలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుణంగా అధ్యాపకులు లేవు. దీంతో ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే ఇంటర్ కాలేజీల్లో 500 మంది.. డిగ్రీ కాలేజీల్లో 99 మంది కాంట్రాక్టు లెక్చరర్లను నియమించింది. ఇంటర్ అధ్యాపకులకు ప్రతి నెల రూ.18 వేలు, డిగ్రీ అధ్యాపకులకు రూ. 21 వేలు ఇవ్వాలి. మూడు నెలల నుంచి నయాపైసా విదిల్చలేదు. ఇంటర్ అధ్యాపకులకు రూ.2.70 కోట్లు, డి గ్రీ అధ్యాపకులకు రూ.62.37 లక్షలు రావాలి. పంపు మెకానిక్‌ల బాధలు.. జిల్లావ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 55 మంది పంప్ మెకానిక్‌లు పనిచేస్తున్నారు. వీరికి ఆర్‌డబ్ల్యూఎస్‌కు వచ్చే గ్రాంట్ల నుంచి వేతనాలు ఇవ్వాలి. ఒక్కొక్కరికి ప్రతి నెల రూ.5 వేల చొప్పున రూ. 2.75 లక్షల వేతనం. కొందరికి 16 నెలల నుంచి వేతనాలు అందకపోతే ఇంకొందరికి ఆరు నెలల నుంచి లేవు. వేమనపల్లి మండల కార్యాలయంలో పని చేసే సిబ్బందికి, కోటపల్లి సిబ్బందికి 15 నెలల నుంచి వేతనాలు అందలేదు. సగటున 8 నెలల వేతనాలు లెక్కిస్తే.. దాదాపు రూ. 22 లక్షల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పులతో నెట్టుకొస్తున్న.. నా పేరు గాందర్ల సాయిబాబ. రెబ్బెన మండల సాక్షరభారత్ కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్నా. పీజీ వరకు చదివా. చేసేందుకు ఎన్నో ఉద్యోగాలున్నా నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రారంభించిన సాక్షరభారత్లో మండల కో-ఆర్డినేటర్‌గా చేరా. నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ 11 నెలల నుంచి అందలేదు. నాకు పెళ్లయింది. వే తనాలు అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నా. దసరా, దీపావళి పండుగ ఉంది. ఇప్పటికే అప్పులు చేశా. పండుగ జరుపుకోవాలంటే మళ్లీ అప్పు చేయక తప్పదు. అధికారులు చర్యలు తీసుకుని మాకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. ఆరు నెలలుగా రావడం లేదు.. నా పేరు ఆత్రం బాపు. బెజ్జూరు మండల పరిషత్ కార్యాలయం లో బోరు మెకానిక్‌గా పని చేస్తు న్నా. గ్రామాల్లో బోర్లు పాడైతే వెళ్లి మరమ్మతు చేస్తా. అధికారు లు ప్రతిరోజు రూ.285 ఇస్తారు. కానీ అవి ప్రతి నెల అందవు. ఆరు నెలలకోసారి వస్తాయి. అప్పటి వరకు అప్పులు చేయక తప్ప దు. బోర్లు మర మ్మతు చేసినప్పుడు సర్పంచులు రూ.50, రూ.100 ఇస్తారు. అవి పెట్రోల్‌కే అయిపోతాయి. కుటుంబ పోషణ భారంగా ఉంది. ప్రతి నెల వేతనాలందేలా చర్యలు తీసుకోవాలి. -
‘గ్రేటర్’లో ఉత్కంఠ
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర మంత్రిమండలి తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పలు చర్చలు జోరుగా సాగాయి. జీహెచ్ఎంసీలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే దానిపై గురువారం ఉద్యోగులు, సిబ్బందిలో ఉత్కంఠ నెలకొంది. నగరంలోని ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో దాదాపు పది వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరిలో ఉన్నతాధికారుల్లో ఎక్కువమంది డిప్యుటేషన్లపై పనిచేస్తుండటంతో వారంతా ఇక ఇక్కడే ఉంటారా? వారి ప్రాంతాలకు వెళ్లిపోతారా? అనే చర్చలు మొదలయ్యాయి. కీలక పోస్టుల్లోని కమిషనర్, అడిషనల్, జోనల్ కమిషనర్ల పోస్టుల్లో ఇప్పటి వరకు తెలంగాణ వారికి తగిన ప్రాధాన్యం లేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడంతో తమ పరిస్థితేమిటనే యోచనలో తెలంగాణేతర అధికారులున్నారు. ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకునే వెసులుబాటు ఉన్నా.. ఎటు మొగ్గు చూపాలో చెప్పే పరిస్థితి లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్నవారు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు. తమ ఉద్యోగాలు ఇక రెగ్యులర్ అవుతాయన్న ఆనందం తెలంగాణకు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ నోట్ ఆమోదంపై జీహెచ్ఎంసీలో మిశ్రమ స్పందన కనిపించింది. -
ఆర్టీసీలో శ్రమ దోపిడీ
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :పట్టణంలోని ఆర్టీసీ డిపోలో సుమారు 30 మంది వరకు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతం తక్కువగా ఇస్తూ వారితో వెట్టిచాకిరీని చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. 10 సంవత్సరాలుగా ఈ డిపోలో ఔట్ సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నప్పటికీ నేటికీ వారిని పర్మనెంటు చేయడం లేదని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. డీఎం కార్యాలయంతో పాటు గ్యారేజీవర్కర్లు, స్వీపర్లు, బస్సులను శుభ్రం చేసేవారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు పీఎఫ్ గత కొంత కాలంగా చెల్లించడం లేదు. ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన ఇతర సౌకర్యాలు కూడా అందడం లేదు. 2012 జూన్ 27వ తేదీన ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఏకే ఖాన్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అన్ స్కిల్డ్ వర్కర్లకు ప్రతి నెలా రూ.5821 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.3600 మాత్రమే ఇస్తున్నారు. అలాగే కార్మికులు నెలలో ఒకటి రెండు రోజులు విధులకు హాజరు కాకపోతే ఆ రోజుల్లో కూడా హాజరైనట్టు అధికారులు హాజరుపట్టికలో నమోదు చేసుకొని డబ్బులను కాజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ప్రతి కార్మికుడికి 13.61 శాతం పీఎఫ్ డబ్బులు చెల్లిస్తే, కార్మికుడు 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఈఎస్ఐకి 4.75 శాతం కాంట్రాక్టర్ చెల్లిస్తే కార్మికుడు 1.75 శాతం డబ్బులు చెల్లించాలి. కానీ కాంట్రాక్టర్ ఈ మొత్తాన్ని జమ చేయడం లేదు. రెండేళ్లుగా పని చేస్తున్న అన్‌స్కిల్డ్ వర్కర్లను స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని, కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి నెలలో నాలుగు సెలవులు ఇవ్వాలని, ప్రతి ఏడాది రెండు జతల దుస్తులు, చెప్పులు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. -
హోర్డింగ్స్ తొలగించి.. ఇనుము తీసుకెళ్లండి
సాక్షి, సిటీబ్యూరో: వివిధ పనులకు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సంస్థలపై ఆధారపడుతున్న జీహెచ్ఎంసీ.. చివరకు అక్రమ హోర్డింగ్‌ల కూల్చివేతలను సైతం కాంట్రాక్టుకిచ్చేందుకు సిద్ధమైంది. కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న అక్రమ హోర్డింగులు పలు ప్రమాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. కొద్దినెలల క్రితం నిజాం కాలేజీ వద్ద హోర్డింగ్ కుప్పకూలడంతో, హోర్డింగ్‌ల సామర్ధ్యంపై కళ్లు తెరచిన అధికారులు.. అదే సమయంలో అక్రమ హోర్డింగ్లపైనా దృష్టి పెట్టారు. అక్రమ హోర్డింగ్స్‌లో ఇప్పటికే కొన్ని తొలగించగా.. ఇంకా 162 ఉన్నట్లు గుర్తించారు. వీటి ని తొలగించే పనులను కాంట్రాక్ట్‌కు ఇవ్వడంతో పాటు సదరు హోర్డింగుల ఇనుమును కూడా వారికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ఇనుము విక్రయించగా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని.. కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి ఎంతమేర తిరిగి చెల్లించగలరో కోరుతూ టెండర్లను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇనుము విలువ పెరిగిపోవడంతో..ఒక్కో హోర్డింగ్ ఏర్పాటులో ఎంత ఇనుము వినియోగించారనేది తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఒక్కో హోర్డింగ్‌కు వినియోగించిన ఇనుము రెండున్నర నుంచి మూడు మెట్రిక్ టన్నుల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ అంచనాతో హోర్డింగ్స్ తొలగింపు పనుల్ని కాంట్రాక్టుకిస్తే.. తమకు వాటిని తొలగించే శ్రమ తప్పడంతో పాటు జీహెచ్ఎంసీకి అంతో ఇంతో ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే టెండర్లకు సిద్ధమవుతున్నారు. అధికారుల ఈ ఆలోచన ఏ మేరకు ఫలితాలిస్తుందో వేచి చూడాల్సిందే. ఇది ఫలితమిస్తే.. భవిష్యత్తులో అక్రమ భవనాల కూల్చివేతలకు సైతం జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ఆలోచనలే చేస్తారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి -
అక్రమాలకు ‘మోడల్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూళ్ల)ల్లో ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో ఏజెన్సీలు భారీ అక్రమాలకు తెరతీశాయి! రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లాంటి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు దిగాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సరిగా అవకాశం ఇవ్వకుండా, ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వకుండానే ముడుపులు మింగుతూ పోస్టును బట్టి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లకు సిద్ధం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 355 మోడల్ స్కూళ్లకుగాను ఈ ఏడాది 321 మోడల్ స్కూళ్లు ప్రారంభించారు. వీటిల్లో ఒక్కో స్కూల్లో 14 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌పై భర్తీ చేయాల్సి ఉంది. అందులో భాగంగా తొలుత ఒక్కో స్కూల్లో 3 పోస్టుల చొప్పున 963 పోస్టుల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలను జిల్లాలకు అప్పగించింది. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను తీసుకొని వాటి ద్వారా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. ఒక్కో స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఎస్‌యూపీడబ్ల్యూ టీచర్(ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్), యోగా టీచర్, ఫిజికల్ డెరైక్టర్, ఆరు అటెండర్ (అటెండర్, వాచ్మెన్), కంప్యూటర్ టీచర్, ప్రోగ్రామర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వెంటనే ప్రతి స్కూల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్, 1 అటెండర్, 1 వాచ్మెన్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఔట్సోర్సింగ్ సంస్థలను ఎంపిక చేసిన అధికారులు పత్రికా ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను నుంచి దరఖాస్తులను స్వీకరించి, నిబంధనల ప్రకారం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారు. దళారులతో కుమ్మక్కైన ఏజెన్సీలు భారీగా వసూళ్లకు దిగాయి. నిబంధనలు పక్కనబెట్టి కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు రూ. లక్ష వరకు, అటెండరు, వాచ్మెన్ పోస్టులకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నాయి. -
కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలు
కేఎంసీ, న్యూస్‌లైన్ : వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్లంబర్, టైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి ఆరు నెలల క్రితమే రూ. 4 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ పేరుతో ప్రత్యేకంగా నోట్‌ఫైల్ (681-26.2.2013) తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా కలెక్టర్‌కు పంపించారు. నోట్‌ఫైల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా సోషల్వెల్ఫేర్ ఆఫీసర్, కేఎంసీ ప్రిన్సిపాల్‌తో కూడిన కమిటీని నియమించి నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ, కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మహిళకు టైలర్పోస్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి ప్లంబర్ పోస్టు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. టైలర్పోస్టు ఇవ్వనున్న మహిళ భర్త అదే ఆస్పత్రిలో పనిచేస్తుండడం గమనార్హం. నిజానికి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేసే జీఓ కాలపరిమితి జూన్‌లోనే పూర్తయింది. రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం రెండు పోస్టుల కన్నా ఎక్కువగా ఉంటేనే బ్యాక్లాగ్ కిందికి వస్తాయి. ఒక పోస్టు ఉంటే జనరల్‌గా భర్తీయాలి. పోస్టులు భర్తీచేయాలని గతంలో లంబాడ హక్కుల పోరాటసమితి నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో ఎలాంటి బ్యాక్లాగ్ పోస్టులు లేవని 30-12-20011న ఫైల్ నంబర్ ఈ1-681 విడుదల చేసి వివరణ ఇచ్చారు. 12-01-2012 తేదీన తమ ఆస్పత్రిలో టైలర్, ప్లంబర్, రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్‌కు ఫైల్ పంపించారు. 20 రోజుల్లోనే ఇంటర్వ్యూ సైతం నిర్వహించారు. దీంతో టైలర్ పోస్టు కోసం ఇంటర్వ్యూకు హాజరైన సౌజన్య అనే మహిళ కోర్టుకు వెళ్లింది. ట్రిబ్యునల్ నంబర్ (5874/2012)తో కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. అయితే ఈమెతో పాటు ఇంటర్వ్యూకు హాజరైన స్వరూప, పరంజ్యోతిని కాదని అర్హతలేని వేరే మహిళను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్లంబ ర్ పోస్టు కోసం ఇమ్మానియేల్, రాజు, నవీన్ హాజరయ్యారు. కాగా, అదే ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి వద్ద డబ్బులు తీసుకుని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నియామకం చెల్లదని గతంలోనే కోర్టు సైతం కొట్టివేసింది. నిజానికి ఐ ఆస్పత్రిలో ప్లంబర్, ఓ టైలర్ పోస్టు భర్తీకి 25-1-1990లో జీఓ 73 విడుదలైంది. తమకు అనుకూలమైన వారితో భర్తీచేయాలని అధికారులు 23 సంవత్సరాలుగా వేచిచూశారనే విమర్శలు వస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయొద్దని నెల రోజుల కిత్రం డీఎంఈ నుంచి ప్రత్యేక జీఓ ఆస్పత్రికి జారీ అయింది. గతంలో పనిచేసిన వారికి అన్యాయం.. నెల రోజుల క్రితం ఎవరికి తెలియకుండా ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఆంకోను నియమించినట్లు తెలిసింది. గతంలో పనిచేసిన వారిని కాదని డబ్బులు వసూలు చేసి ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా కంటి ఆస్పత్రిలో ప్రతి సంవత్సరం సుమారు 10 అక్రమ పోస్టులు నియామకం చేపడుతున్నారని గతంలో పనిచేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, డీఎంఈ అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు, యూని యన్ నాయకులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారమే : పాండురంగజాదవ్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ నింబంధనల ప్రకారమే నియామకాలు చేస్తున్నాం. కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ పంపించాం. ఆయన అనుమతితోనే పోస్టుల భర్తీ ఉంటుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు. -
దద్దరిల్లిన జీహెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్సీ నాగేశ్వర్ తదితరుల ఆందోళనలు.. పోలీసులతో వాగ్వాదం.. ఔట్‌సోర్సింగ్‌పై గుర్తింపు యూనియన్ కార్మికుల గడబిడ.. ఈ ఘటనలతో సోమవారం జీహెచ్ఎంసీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ప్రజావాణి’ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర గందరగోళం రేపింది. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని పలు పార్కులు, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల పరం కావడంపై ఫిర్యాదు చేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ (ఫాకా) గౌరవాధ్యక్షులైన ఎమ్మెల్సీ నాగేశ్వర్‌తో సహా పలువురు సభ్యులు, కాలనీవాసులు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యంపై నినదిస్తూ వారు ప్రజావాణి జరిగే ‘ఫేస్ టు ఫేస్’ హాల్లోకి వెళ్లబోగా ద్వారం వద్ద సెక్యూరిటీగార్డులు అడ్డుకొని గేటు మూసివేశారు. దాంతో ధర్నాకు దిగారు. వాగ్వాదాలు, ఘర్షణల అనంతరం ఐదుగురిని మాత్రం లోనికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు వస్తే.. అడ్డుకోవడమే కాక, కమిషనర్ తనను అవమానపరిచారని నాగేశ్వర్ మండిపడ్డారు. కబ్జారాయుళ్లకు రెడ్‌కార్పెట్ పరిచే అధికారులు.. ప్రజల కోసం వచ్చిన తమను అడ్డుకొని అవమానించారని ధ్వజమెత్తారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా కింద బైఠాయించారు. ప్రజావాణిలో కమిషనర్ కృష్ణబాబు లేకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు. అడిషనల్ క మిషనర్ (ప్లానింగ్) రోనాల్డ్‌రాస్.. తగిన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చి శాంతింపచేశారు. కాగా గేటు వద్ద గొడవ, ధర్నా జరుగుతుండటంతో కమిషనర్ కృష్ణబాబు వేరే ద్వారం నుంచి సచివాలయంలో జరిగే సమావేశానికి వెళ్లినట్లు సమాచారం. ఇవీ కబ్జాలు.. ఎల్బీన గర్ సర్కిల్లోని సహారా లేఔట్లో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాన్ని ఎకరానికి పైగా తగ్గించి ఫైనల్ అప్రూవల్ ఇచ్చారని ఫాకా ప్రతినిధులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రీన్ ఎస్టేట్‌కాలనీ పార్కును కబ్జాచేసిన వారికి ఎల్ఆర్ఎస్ ఇచ్చారని ఆరోపించారు. ఔట్సోర్సింగ్ ఆపకుంటే ఆమరణదీక్ష జీహెచ్ఎంఈయూ హెచ్చరిక పన్నులు, ఫీజుల వసూళ్లను ప్రైవేటుకిచ్చే ప్రక్రియను అధికారులు వెంటనే రద్దుచేయాలని, టెం డర్లను ఉపసంహరించుకోవాలని జీహెచ్ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. ఓవైపు ఫేస్టు ఫేస్ హాల్లో ప్రజావాణి జరుగుతుండ గా, యూనియన్ అధ్యక్షడు యు.గోపాల్ ఆధ్వర్యంలో అక్కడకు చేరుకున్న కార్మికులు.. అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. గోపాల్ మా ట్లాడుతూ జీహెచ్ఎంసీ ఉద్యోగులు కాని వారెవరికీ పన్నులు, ఫీజుల వసూళ్ల బాధ్యతలివ్వరాదని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని సేవలూ నిలిపివేసి ఆమరణ దీక్షలు చేస్తామని హెచ్చరించారు.