మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఆటోమొబైల్ సీవోఈ కోర్సు పరిస్థితి. ప్రపంచబ్యాంకు ఆలోచనలో నుంచి ఆవిర్భవించిన కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ సాధించినా ఎందుకూ కొరగాకుండా పోతోంది. ఆయా విభాగాల్లో నిపుణులను తీసుకుని కార్మికుల సంఖ్య పెంచడం కన్నా అన్ని విభాగాల్లో నిపుణుడైన ఒక్కరితో పనిచేయిస్తే అన్ని రకాలుగా ఆదా అవుతుందని ప్రపంచ బ్యాంకు భావించింది. ఇందుకు అనుగుణంగానే వృత్తి విద్య కోర్సుల్లో ఆటోమొబైల్ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ) పేరుతో ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ)లో ప్రభుత్వం 2007లో కోర్సును ప్రవేశపెట్టింది. మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలోనే ఈ కోర్సు అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు.
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. కోర్సు కాల పరిమితి రెండేళ్లు ఉంటుంది. మొదటి సంవత్సరం ఆటోమొబైల్ రంగంపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆరు నెలలు ఆటోమొబైల్ రంగంతో అనుబంధంగా ఉండే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్స్‌లో శిక్షణ ఉంటుంది. మరో ఆరు నెలలు స్థానికంగా ఉన్న కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తారు. కోర్సులో భాగంగా వివిధ రకాల వాహనాలకు సంబంధించిన యంత్రాల పనితీరు, డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తారు. కోర్సులో బ్యాచ్‌కు 20 మంది విద్యార్థుల చొప్పున ఆరు బ్యాచ్‌ల్లో 120 మందికి శిక్షణ ఇచ్చారు. 2007 నుంచి ఇప్పటివరకు సుమారు 800 మంది విద్యార్థులు ఈ కోర్సును పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాదిపాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలు ఈ కోర్సు పూర్తి చేసిన వారిని అర్హులుగా గుర్తిస్తూ ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అప్రెంటీస్ ఇవ్వాలనే ఆదేశాలు లేవని తేల్చి చెబుతున్నారు. ఇటు అప్రెంటీస్ చేయలేక.. ఉపాధి లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిధులు వృథా..
ఆటోమొబైల్ సీవోఈ కోర్సు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతోంది. ప్రపంచబ్యాంకు నిధులు విడుద ల చేస్తోంది. డిపార్ట్‌మెంటు ఆఫ్ ఎక్విప్‌మెంటు, ట్రైనింగ్ విభాగం ద్వారా 2007-08లో కోర్సుకు సంబంధించి రూ.2కోట్లతో యంత్రాలు, 3కార్లు, ఒక మినీ బస్సు కొనుగోలు చేశారు. ఐటీఐ ఆవరణలోనే మూడు పెద్ద భవనా లు నిర్మించారు. రూ.70లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది మార్చిలో రూ.27లక్షలు వచ్చాయి. కోర్సు బోధనకు అవు ట్ సోర్సింగ్ కింద ఆరుగురు అధ్యాపకులను నియమిం చారు. వీరికి రూ.18వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. గత ఏడాది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా కాకుండా కాంట్రాక్ట్ పద్ధతికి బదలాయించారు. వేతనం నెలకు రూ.12వేలుగా మార్చారు. ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడా ది ఇద్దరు అధ్యాపకులను నియమించగా వారు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. యంత్రాలు వృథాగా ఉండగా బస్సు, కార్లను సిబ్బంది ఇతర పనులకు వినియోగిస్తున్నారు.
భవితకు దారేది..
Published Mon, Nov 11 2013 2:58 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement