కొత్తగా తీసుకొనేందుకు టెండర్లు
పక్షం రోజుల్లో భర్తీకి కసరత్తు
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్‌పై పని చేస్తున్న 700 మంది సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడానికి టెండర్ల ప్రక్రియ ద్వారా ఏజెన్సీలను ఆహ్వానిస్తున్న అధికార యంత్రాంగం పక్షం రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటోంది. హెచ్‌ఎండీఏలో పని చేస్తున్న 200 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఇటీవల తొలగించిన అధికారులు.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవటానికి టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అదే తరహాలో జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిని తొలగించిన అధికారులు కొత్త వారిని తీసుకోవటానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్ల ప్రక్రియలో 50 ఏజెన్సీలు పాల్గొన్నప్పటికీ 32 ఏజెన్సీల వైపే అధికారులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.
తొలగించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో కలెక్టరేట్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న వారు 21 మంది ఉండగా, సాంఘిక సంక్షేమ శాఖలో 38 మంది, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో 95, రాజీవ్ విద్యా మిషన్ (సర్వశిక్ష అభియాన్)లో 35 మంది ఉన్నారు. వీరితో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ, విద్యుత్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు, మైనారిటీ, వికలాంగుల, ఎస్టీ సంక్షేమ శాఖలలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల్లో అత్యధికంగా ఔట్ సోర్సింగ్‌పై పని చేస్తున్నారు.
700 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
Published Fri, May 1 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement