పారిశ్రామిక విప్లవం సమయంలోనే ఔట్ సోర్సింగ్ అనేది ప్రారంభమైంది. 1970లలో కూడా పెద్ద కంపెనీలు పూర్తిగా స్వయం సమృద్ధి సాధించలేదు. ఆ సమయంలో సంస్థల పనితీరును మెరుగుపరుచుకోవడానికి మార్గాలను అన్వేషించడంలో భాగంగానే ఔట్ సోర్సింగ్ ఎంచుకున్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే ఫిలిప్పీన్స్‌లో ఔట్ సోర్సింగ్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు ఫిలిప్పీన్స్ బీపీఓ పరిశ్రమ కేవలం ఓకే సంప్రదింపు కేంద్రం ఉండేది. నేడు ఆ దేశమే ప్రపంచంలో ప్రముఖ అవుట్‌సోర్సింగ్ హబ్‌గా ఎదిగింది. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం..
👉1992: ఫిలిప్పీన్స్‌లో ఔట్ సోర్సింగ్ ప్రారంభమైంది.
👉1995: ఫిలిప్పీన్ ఎకనామిక్ జోన్ అథారిటీ (PEZA) మొదలైంది. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాలలో తమ వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడంలో విదేశీ పెట్టుబడిదారులకు సహాయం చేయడంపై ఏజెన్సీ దృష్టి సారిస్తుంది.
👉1997: సైక్స్ ఆసియా ఫిలిప్పీన్స్‌లో మొదటి మల్టీనేషనల్ బీపీఓ కంపెనీగా స్థిరపడింది.
👉1999: మల్టినేషనల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మాజీ ఉద్యోగులు జిమ్ ఫ్రాంకే & డెరెక్ హోలీ ఈ-టెలీకాలర్ స్థాపించారు. ఇదే దేశంలో మొట్ట మొదటి కాల్ సెంటర్‌గా ప్రసిద్ధి చెందింది.
👉2000: జీడీపీలో మొత్తం 0.075 శాతం బీపీఓ పరిశ్రమ ద్వారా లభించింది.
👉2005: 2005 నాటికి ఫిలిప్పీన్స్ బీపీఓ పరిశ్రమ మార్కెట్ వాటా 3 శాతానికి చేరింది. ఇది దేశ జీడీపీలో 2.4 శాతంగా ఉంది.
👉2006: 2006లో బీపీఓ పరిశ్రమ భారీగా వృద్ధి చెందింది. 2010లో ఫిలిప్పీన్స్ ప్రపంచానికే బీపీఓ రాజధానిగా మారింది. కాల్ సెంటర్లలో ఏకంగా 525,000 మంది ఏజెంట్లు పని చేస్తున్నారు. 2012లో బీపీఓ ఆదాయం 5.4 శాతానికి పెరిగింది.
👉2018: ఫిలిప్పీన్స్ థోలోన్స్‌లో రెండో స్థానంలో నిలిచింది.
👉2019: ఫ్రీలాన్సర్ల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఫిలిప్పీన్స్ ఆరవ స్థానంలో నిలిచింది
👉2020: థోలన్స్ టాప్ 50 డిజిటల్ నేషన్స్ జాబితాలో ఫిలిప్పీన్స్ ఐదవ స్థానంలో నిలిచింది.
👉2022: ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (BPM) మార్కెట్ గ్లోబల్ మార్కెట్ షేర్‌లో 13 శాతం కలిగి ఉంది. దీని ఆదాయం దాదాపు 30 బిలియన్ డాలర్లు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫిలిప్పీన్ బీపీఓ పరిశ్రమ మాత్రం స్థిరమైన వృద్ధి సాగిస్తూనే.. తమ కార్యకలాపాలను విస్తరించడానికి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఔట్ సోర్సింగ్ విషయంలో ఇండియాకు ఫిలిప్పీన్స్ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ప్రధాన కారణం టైం జోన్ మాత్రమే కాకుండా.. అక్కడి ప్రజలు ఇంగ్లీషులో మనకంటే మరింత ప్రావీణ్యం ఉండడం కూడా అని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ చాలా కాలం పాటు బ్రిటిష్ కాలనీగా ఉండటం కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment