- ఒక్కొక్కరికి నెలకు రూ.51,468 వేతనం
- ఔట్ సోర్సింగ్‌లో ఏడాదిపాటు..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రచారం కల్పించడానికి ఏకంగా 25 మంది జర్నలిస్టులతో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం ముఖ్యమంత్రి కార్యాలయం బ్యాక్ ఆఫీసు నుంచి పనిచేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో ఇతర పనులను ఈ బృందం చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో జర్నలిస్టుకు నెలకు రూ.51,468 వేతనం చెల్లించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఏడాదిపాటు ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ 25 మంది జర్నలిస్టులను తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రత్యేక వార్తలను ఈ బృందం రూపొందించనున్నట్లు తెలిపారు.
సీఎం ప్రచారం కోసం 25 మంది జర్నలిస్టులు
Published Thu, Dec 8 2016 2:27 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement
Advertisement