సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అదనంగా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ సౌకర్యాన్ని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా కల్పించాలన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. దీంతో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఆరి్థకశాఖ జీవో నంబర్ 39 జారీచేసింది.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరుచేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే!
Comments
Please login to add a commentAdd a comment