- భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా
- కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 2,101 పారా మెడికల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు తదితర పారామెడికల్ పోస్టులే కావడం గమనార్హం. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. డీఎంఈ పరిధిలో 474, వైద్య విధాన పరిషత్‌లో 270, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో 1,357 పోస్టులున్నాయి. శాశ్వత నియామకాలు జరిపే వరకు ఈ ఉద్యోగులు కొనసాగుతారని ఉత్తర్వులో తెలిపారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొందరు కలెక్టర్ల నుంచి వచ్చిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇవీ...
డీఎంఈ పరిధిలో...
పోస్టులు సంఖ్య
స్టాఫ్ నర్సులు 279
గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 121
గ్రేడ్–2 ఫార్మసిస్టులు 74
మొత్తం 474
వైద్య విధాన పరిషత్ పరిధిలో..
పోస్టులు సంఖ్య
నర్సింగ్ 129
ల్యాబ్ టెక్నీషియన్లు 51
గ్రేడ్–2 ఫార్మసిస్టులు 48
రేడియోగ్రాఫర్లు 42
మొత్తం 270
ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం పరిధిలో..
పోస్టులు సంఖ్య
స్టాఫ్ నర్సులు 1,109
గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 131
గ్రేడ్–2 ఫార్మసిస్టులు 100
ఎల్‌టీ మలేరియా 17
మొత్తం 1,357
వైద్యారోగ్యశాఖలో 2,101 పోస్టులు
Published Sun, Jun 4 2017 3:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
Advertisement
Advertisement