వారిదంతా అడ్డదారే! | Srikakulam rims Hospital Efficient recruitment Regulations | Sakshi
Sakshi News home page

వారిదంతా అడ్డదారే!

Published Thu, Jul 10 2014 1:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

వారిదంతా అడ్డదారే! - Sakshi

వారిదంతా అడ్డదారే!

రిమ్స్ క్యాంపస్:ప్రభుత్వ శాఖల్లో.. లేదా సంస్థల్లో ఒక ఉద్యోగం వేయాలంటే కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి.. అనుమతులు పొందాలి. కానీ శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి వీటికి అతీతం. ఎందుకంటే ఇక్కడ చాలా నియామకాలు అధికారుల ఇష్టారాజ్యంగా, అత్యంత గోప్యంగా జరిగిపోతున్నాయి. నియామకాలు జరిగిపోతున్నాయి సరే.. మరి జీతాల మాటేమిటంటే.. ‘నారు పోసినవాడు నీరు పోయడా’.. అన్నట్లు దానికీ రిమ్స్ అధికారులు అడ్డదారులు కనుగొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్) నిధులను అక్రమ నియామకాలు పొందిన ఉద్యోగుల జీతాలకు మళ్లిస్తున్నారు.  జిల్లా అంతటికీ పెద్ద దిక్కుయిన రిమ్స్‌లో వైద్యసేవలు, సౌకర్యాల మెరుగుపై పెద్దగా శ్రద్ధ చూపని కొందరు అధికారులు అక్రమార్జనపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడుతోంది. చాలావరకు అనధికారిక నిర్ణయాలే అమలవుతుండటంతో ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధు లు పక్కదారి పడుతున్నాయి.
 
 ఇష్టారాజ్యంగా నియామకాలు
 ఔట్ సోర్సింగ్ ముసుగులో రిమ్స్‌లో ఇష్టారాజ్యంగా నియామకాలు జరుగుతున్నాయి. కొందరు అధికారుల ఏజెన్సీలతో సొంత కాంట్రాక్టులు కుదుర్చుకొని ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఒకవేళ ఏజెన్సీకి సంబంధం లేకపోతే ఆ ఉద్యోగుల వేతనాలను హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ నిధుల నుంచి మళ్లించి ఇస్తున్నారు. కొద్ది నెలల కిందట సూపరింటెండెంట్ కార్యాలయంలో ఇద్దరిని, ఆస్పత్రిలో మరో ఇద్దరిని ఇలాగే నియమించి,ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వేతనాలు చెల్లిస్తున్నట్టు రిమ్స్ వర్గాలే పేర్కొంటున్నాయి.
 
 ఆరోగ్యశ్రీ నిధుల్లో మాయజాలం
 ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలకు మంజూరవుతున్న నిధులు దారిమళ్లుతున్నా యి. ఆరోగ్యశ్రీ కేసుల్లో పాల్గొన్న వారికి, వైద్య పరికరాల కొనుగోలుకే ఆ నిధుల  నుంచి చెల్లింపులు జరపా లి. దానికి విరుద్ధంగా ఉద్యోగుల వేతనాలు, కూర్చీలు వంటి సామగ్రి కొనుగోళ్లకు ఈ నిధులు వెచ్చిస్తున్న ట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారుల మధ్య వివాదం రేగినట్లు తెలిసింది. నిధుల దుర్వినియోగంపై కొందరు వైద్యులు రిమ్స్ అధికారులను నిలదీయడం వివాదంగా మారింది.
 
 అదే దారిలో హెచ్‌డీఎస్ నిధులు
 రోగులకు వైసౌకర్యాలు పెంచే పనులకే వెచ్చించాల్సిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులను అనవసర పనులకు కూడా వినియోగిస్తున్నారు. గత ఏడా ది ఆడిటోరియం మెట్ల పనులకు హెచ్‌డీఎస్ నిధుల నుంచి సుమారు రూ.3 లక్షలు కేటాయించారు. వాస్తవానికి ఈ నిర్మాణం రిమ్స్ ప్లాన్‌లో లేదు. అయినా లక్షల ఖర్చుతో చేపట్టిన ఈ పనుల్లో చాలా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా సూపరింటెం డెంట్ కార్యాలయాన్ని ఆస్పత్రి నుంచి కళాశాలకు మార్చారు. ఇందుకు అవసరమైన మార్పులు చేర్పులకు, ఆస్పత్రిలో సింగల్ విండో వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నిధులను హెచ్‌డీఎస్ నుంచే మళ్లించారు. తాజాగా డెరైక్టర్ ఛాంబర్ వద్ద ఏర్పా టు చేస్తున్న పార్టిషన్ల ఖర్చును కూడా హెచ్‌డీఎస్ నుంచే తీస్తున్నారు. రిమ్స్ భవనాల ప్లాన్‌ను రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు అమోదించారు. దానికి విరుద్ధంగా మార్పులు చేర్పులు చేపట్టడం, వాటికి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.
 
 మా ప్లాన్‌లో లేవు
 రిమ్స్ అడిటోరియం మెట్ల నిర్మాణం గురించి ఇక్కడి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న ఏపీహెచ్‌ఎంఐడీసీ ఈఈ రాంబాబు వద్ద ప్రస్తావించగా మెట్లతోపాటు ఇటీవల చేపట్టిన పలు నిర్మాణాలు తమ ప్లాన్‌లో లేవని స్పష్టం చేశారు. వాటికి సంబంధించి దగ్గరుండి ప్రణాళిక చెప్పమంటే చెబుతున్నామే తప్ప వాటికయ్యే ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి ఇస్తున్నారన్నదానితో తమకు సంబంధం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement