సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్సీ నాగేశ్వర్ తదితరుల ఆందోళనలు.. పోలీసులతో వాగ్వాదం.. ఔట్‌సోర్సింగ్‌పై గుర్తింపు యూనియన్ కార్మికుల గడబిడ.. ఈ ఘటనలతో సోమవారం జీహెచ్‌ఎంసీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ప్రజావాణి’ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర గందరగోళం రేపింది. ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోని పలు పార్కులు, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల పరం కావడంపై ఫిర్యాదు చేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్‌మెంట్స్ (ఫాకా) గౌరవాధ్యక్షులైన ఎమ్మెల్సీ నాగేశ్వర్‌తో సహా పలువురు సభ్యులు, కాలనీవాసులు వచ్చారు.
అధికారుల నిర్లక్ష్యంపై నినదిస్తూ వారు ప్రజావాణి జరిగే ‘ఫేస్ టు ఫేస్’ హాల్‌లోకి వెళ్లబోగా ద్వారం వద్ద సెక్యూరిటీగార్డులు అడ్డుకొని గేటు మూసివేశారు. దాంతో ధర్నాకు దిగారు. వాగ్వాదాలు, ఘర్షణల అనంతరం ఐదుగురిని మాత్రం లోనికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు వస్తే.. అడ్డుకోవడమే కాక, కమిషనర్ తనను అవమానపరిచారని నాగేశ్వర్ మండిపడ్డారు. కబ్జారాయుళ్లకు రెడ్‌కార్పెట్ పరిచే అధికారులు.. ప్రజల కోసం వచ్చిన తమను అడ్డుకొని అవమానించారని ధ్వజమెత్తారు.
తనకు జరిగిన అవమానానికి నిరసనగా కింద బైఠాయించారు. ప్రజావాణిలో కమిషనర్ కృష్ణబాబు లేకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు. అడిషనల్ క మిషనర్ (ప్లానింగ్) రోనాల్డ్‌రాస్.. తగిన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చి శాంతింపచేశారు. కాగా గేటు వద్ద గొడవ, ధర్నా జరుగుతుండటంతో కమిషనర్ కృష్ణబాబు వేరే ద్వారం నుంచి సచివాలయంలో జరిగే సమావేశానికి వెళ్లినట్లు సమాచారం.
ఇవీ కబ్జాలు..
ఎల్‌బీన గర్ సర్కిల్‌లోని సహారా లేఔట్‌లో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాన్ని ఎకరానికి పైగా తగ్గించి ఫైనల్ అప్రూవల్ ఇచ్చారని ఫాకా ప్రతినిధులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రీన్ ఎస్టేట్‌కాలనీ పార్కును కబ్జాచేసిన వారికి ఎల్‌ఆర్‌ఎస్ ఇచ్చారని ఆరోపించారు.
ఔట్‌సోర్సింగ్ ఆపకుంటే ఆమరణదీక్ష
జీహెచ్‌ఎంఈయూ హెచ్చరిక
పన్నులు, ఫీజుల వసూళ్లను ప్రైవేటుకిచ్చే ప్రక్రియను అధికారులు వెంటనే రద్దుచేయాలని, టెం డర్లను ఉపసంహరించుకోవాలని జీహెచ్‌ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. ఓవైపు ఫేస్‌టు ఫేస్ హాల్‌లో ప్రజావాణి జరుగుతుండ గా, యూనియన్ అధ్యక్షడు యు.గోపాల్ ఆధ్వర్యంలో అక్కడకు చేరుకున్న కార్మికులు.. అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. గోపాల్ మా ట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు కాని వారెవరికీ పన్నులు, ఫీజుల వసూళ్ల బాధ్యతలివ్వరాదని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని సేవలూ నిలిపివేసి ఆమరణ దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
దద్దరిల్లిన జీహెచ్‌ఎంసీ
Published Tue, Aug 20 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement
Advertisement