హైదరాబాద్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం వివిధ సంఘాల ఉద్యోగులు కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోని డీఎంఈ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరేట్, డెరైక్టర్ ఆఫ్‌హెల్త్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ కార్యాల యాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పారామెడికల్, ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్లు, నాలుగవ తరగతి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.
వీరికి ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ), ఏఐటీయుసీ, సీఐటీ యూ, భారతీయ జనతామజ్దూర్ సంఘ్ యూని యన్లు మద్దతు పలికాయి. ఒక్కసారిగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు డీఎంహెచ్‌ఎస్‌లోకి ప్రవేశించడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. ఈ సందర్భంగా టీజీడీఏ ప్రతినిధులు డాక్టర్ రమేష్, జూపల్లి రాజేందర్, పుట్ల శ్రీనివాస్ బృందంతో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ అనురాధను కలసి వారి సమస్యలను వివరించారు. ఈ సమస్యను ప్రిన్సిపాల్ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు యూసుఫ్ మాట్లాడుతూ నాంపల్లి నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై నిరసన
Published Wed, Apr 2 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement