health depertment
-
డాక్టర్‌గా మారొద్దు.. మందులు రాయొద్దు
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకుండా ఎవరూ వైద్యం చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2010 ప్రకారం ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోప ణలు వస్తున్నాయని... వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతిచెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆర్ఎంపీలు తమ చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్ అయిడ్ సెంటర్ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని... క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోం, మెడికల్ సెంటర్ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది. ఆర్ఎంపీలకు సూచనలివీ... ఆర్ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్లు చేయడం వంటివి చేయరాదు. రోగులకు వైద్య మందుల చీటీని (ప్రిస్క్రిప్షన్) రాయకూడదు. రోగులకు సెలైన్ బాటిల్స్ ఎక్కించరాదు. ఇన్–పేషెంట్ వైద్యం చేయకూడదు, ల్యాబ్‌లను నిర్వహించరాదు. అబార్షన్లు, కాన్పుల వంటి హైరిస్క్ చికిత్సలు చేయరాదు. రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడం లేదా బలవంతంగా పంపించడం చేయరాదు. -
తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్‘లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్ పద్మజ అవార్డులు అందుకున్నారు. మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటి వరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 ఆస్పత్రుల్లో నియమించింది. ఇక హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించడం, వారిని నిరంతరం పరిశీలించడం ( ట్రాకింగ్), ఉత్తమ చికిత్స అందేలా రిఫర్ చేయడంకోసం వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలతో ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. దీంతో హై రిస్క్ కేసులను ముందుగా గుర్తించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, ఆసుపత్రులకు తరలించి, సరైన చికిత్స అందించే అవకాశం కలిగింది. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహన సేవలు గర్భిణులకు వరంగా మారాయి. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి: హరీశ్ ‘‘సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మరో రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మా వైద్య సిబ్బంది పనితీరుకు నిదర్శనం. 2014లో 92గా ఉన్న ఎంఎంఆర్ ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయం. ఈ ఘనతలు సాధించడంలో క్షేత్రస్థాయిలో ఉండి వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉందని’ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఇదీ చదవండి: Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..? -
ఏపీలో16 చోట్ల హెల్త్ హబ్‌లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌ల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (భారత పరిశ్రమల సమాఖ్య) ఆధ్వర్యంలో సోమవారం రాత్రి న్యూ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ప్రపంచ స్థాయిలో పేరున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ యూనిట్ల అధినేతల సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో మంత్రి విడదల రజినితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్ ఉన్నారు. మేదాంత- ద మెడ్‌సిటీ, మణిపాల్, పనాసియా ఇండియా, పోలీ మెడిక్యూర్ లిమిటెడ్, బాస్క్ మరియు లోంబ్ ఐ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలియన్స్, పారాస్ హాస్పిటల్స్, అపోల్ హాస్పిటల్స్ గ్రూప్, పీడీ హిందూజా హాస్పిటల్స్, చార్నాక్ హాస్పిటల్స్, ఉజాలా సైనస్, ప్రిస్టిన్ కేర్, మ్యాక్స్ హెల్త్ కేర్.... ఇలా దాదాపు 25కుపైగా ప్రఖ్యాత ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, వైద్య పరికరాల తయారీ కంపెనీల అధినేతలు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన అవకాశాలను వారికి వివరించారు. సీఐఐ ప్రతినిధులు సైతం ఏపీలో వైద్య ఆరోగ్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందని ఈ సమావేశంలో ప్రశంసించారు. పేదలకు మరింత మేలు చేసేందుకే హెల్త్ హబ్‌లు మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పేదలకు మరింత మెరుగైన వైద్యం, మరింత చేరువ చేసే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెల్త్ హబ్‌లను ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కనీసం 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎవరైతే ముందుకు వస్తారో.. వారికి ఉచితంగా 5 ఎకరాల స్థలం ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఆస్పత్రులను త్వరగా నిర్మించి, 50 శాతం పడకలను ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల పేదలకు ప్రపంచస్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేవీలు ఏర్పడుతుందని తెలిపారు. హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఆస్పత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా ప్రభుత్వ అనుమతులన్నీ ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. విశాఖపట్టణంలోని మెడ్ సిటీ లో ఇప్పటికే ఎన్నో సంస్థలు ఏర్పాటయ్యాయని, అవి వాటి కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. మెడ్‌సిటీలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదన్నారు. 2200కుపైగా ఆస్పత్రుల్లో 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం ఏపీలో ప్రస్తుతం 2200కుపైగా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోందని మంత్రి తెలిపారు. ఏకంగా 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. ఏటా రూ.3వేల కోట్లు ప్రభుత్వం ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. వైద్యం చేసిన ప్రతి ఆస్పత్రికి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. భారీగా ఖర్చయ్యే 15 చికిత్సలకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే వైద్యం చేయిస్తోందని వివరించారు. వేల కోట్ల ఖర్చు కాదు.. హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు కావాల్సిన భూమి, అన్ని వసతులు కూడా ఇచ్చేందుకు జగనన్న ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెట్టుబడులు పెట్టండి మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్ ల ఏర్పాటు, సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఎమ్ ఆర్ ఐ, సీటీ, క్యాత్ ల్యాబ్‌ల ఏర్పాటు, డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ఏపీలో ఆరోగ్యసేవల డిజిటలైజేషన్లో సహకారం..... లాంటి కీలక అంశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను కోరారు. పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో ఉంటుందని స్పష్టంచేశారు. అత్యాధునిక వైద్య వసతులు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు జగనన్న కట్టుబడి ఉన్నారని తెలిపారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులన్నింటినీ ఆధునికీకరిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పటల్స్) గుర్తింపు కూడా పొందుతున్నాయని తెలిపారు. ఏలూరు లాంటి ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు రావడం తమ ప్రభుత్వ విజయానికి నిదర్శమని వివరించారు. -
ఆరోగ్యశ్రీకి అదనపు బలం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సన్నద్ధమైంది. జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల నిర్వహణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కీలకం కానున్నాయి. ఈమేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన ఉన్నత సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం సమీక్షలోముఖ్యాంశాలు ఇవీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో 754 ప్రొసీజర్లను పథకంలో చేరుస్తున్నాం. కొత్తగా చేర్చే వాటితో కలిపి మొత్తం 3,118 ప్రొసీజర్లకు పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. సెప్టెంబరు 5వతేదీ నుంచి కొత్త ప్రొసీజర్లను అందుబాటులోకి తేవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య కళాశాల కేంద్రంగా.. గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తేవాలి. వైద్య, పరిపాలన కార్యకలాపాలన్నీ వైద్య కళాశాల నుంచే నిర్వహించాలి. పకడ్బందీగా వైద్య సేవలు అందించడంతోపాటు అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయానికే ఈ చర్యలన్నీ. దీనికి సంబంధించి ఎవరెవరు ఏం చేయాలి? విధులు, బాధ్యతలు ఏమిటి? అనే అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించాలి. అన్ని జిల్లాల వైద్య కళాశాలల్లో మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయాలి. వైద్య కళాశాల నేతృత్వంలోనే హబ్స్ పని చేయాలి. హబ్స్ నుంచి కింది స్థాయి ఆస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలి. 6,956 టెలీ మెడిసిన్ స్పోక్స్, 27 హబ్స్ ఏర్పాటు కావాలి. ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్), ఒక ఏఎన్ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు. ఈ లెక్కన ప్రతి విలేజ్ క్లినిక్‌లో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది సమకూరుతారు. విలేజ్ క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఎంఎల్‌హెచ్‌పీలను ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పిలవాలి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్ టీకా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ నియంత్రణ చర్యల్లో అలసత్వం వహించొద్దు. ప్రికాషన్ డోసు టీకా పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రెండు డోసులూ టీకా తీసుకుని అర్హులైన 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ టీకాలు ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్.. 3 అంశాలపై ఫోకస్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల భవనాలు, మానవ వనరులు, తగినన్ని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి తేవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పనులు ఎలా ముందుకు సాగుతున్నాయో రోజూ సమీక్షించాలి. మరో 432 ఎంఎంయూలు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కొత్త విధానాన్ని సంక్రాంతి వరకు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు చెప్పారు. మరోవైపు పీహెచ్‌సీలతో 104 మొబైల్ మెడికల్ యూనిట్ల మ్యాపింగ్ పూర్తైందని వెల్లడించారు. పీహెచ్‌సీలు, సచివాలయాల మ్యాపింగ్ కూడా పూర్తి చేస్తామన్నారు. 104 ఎంఎంయూలు ఇప్పటికే 656 పని చేస్తున్నాయని, మరో 432 వాహనాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, ప్రత్యేక కార్యదర్శి జి.ఎస్.నవీన్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
ఏం లైఫ్ రా అయ్యా.. రోగం వస్తే మింగే మందుల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జబ్బు చేస్తే రాష్ట్ర ప్రజలు మందుల కోసం చేసే ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలసరి మందుల ఖర్చు ఏడాదికి రూ.663 ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయమై దేశంలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచిందని తెలిపింది. కాగా, రాష్ట్ర జనాభా 3.7 కోట్లు అనుకుంటే ఆ ప్రకారం ఒక్కొక్కరు చేసే ఖర్చు మొత్తం కలిపి రూ. 2,453 కోట్లు అవుతుంది. కేవలం మందుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే, ఇక జబ్బుకు ఇతరత్రా చికిత్సకయ్యే ఖర్చులు సరేసరి. తలసరి ఖర్చు రూ. 663 కాగా, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనడం ద్వారా అయ్యే ఖర్చు రూ.122 ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం రూ.7,844 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 69 శాతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులకే సరిపోతుంది. అంటే ఆపరేషన్లు, వైద్య పరీక్షలకు తదితరాలకు అన్నమాట. మిగిలిన 31 శాతం మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోతే అనేక కుటుంబాలు పేదరికంలోకి పోతున్నాయి. కరోనా సమయంలో ఈ పరిస్థితి ఎక్కువగా చూశాం. ఫలితంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. చుట్టుముడుతున్న ప్రమాదకర వ్యాధులు ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు, 2040 నాటికి గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీపీ, షుగర్, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకర వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశుమరణాలు, ఎయిడ్స్, టీబీ, లంగ్ క్యాన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా జనాలను పీడిస్తున్నాయి. అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు 2040 నాటికి మొదటిస్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ క్యాన్సర్ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. ప్రస్తుతం వివిధ వ్యాధులు వస్తున్న 100 మందిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం, శారీరక శ్రమ చేసేవారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్య 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించడం, 80 శాతం వరకు అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గుండెపోట్లను 50 శాతానికి తగ్గించాలని సూచించింది. ఇది కూడా చదవండి: మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా? -
Corona Cases: దేశంలో కరోనా టెన్షన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 30 మంది మృతిచెందారు. 862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,60,086కు చేరింది. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందారు. 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇక, రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. India reports 2,541 new COVID19 cases today; Active cases rise to 16,522 The daily positivity rate stands at 0.84% pic.twitter.com/xApkDrfKrK — ANI (@ANI) April 25, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత.. సీఎం, గవర్నర్ సంతాపం -
ఏపీ: మత్తు వదలాలి.. స్క్రీనింగ్ చేస్తున్న ఏఎన్ఎంలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజస్(ఎన్సీడీ) 2.0 సర్వే ద్వారా పొగాకు వ్యసనపరులను గుర్తిస్తోంది. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేస్తున్నారు. బీడీ, చుట్టా, సిగరెట్‌తో పాటు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 2,13,12,792 మందిని స్క్రీనింగ్ చేసి.. 2,96,226 మంది పొగాకు వ్యసనపరులను గుర్తించారు. వీరిని పొగాకు వినియోగం నుంచి దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వైద్య నిపుణులు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,86,303 మందికి ఫోన్ చేశారు. తొలుత కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ పొగాకు వినియోగించే వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తి ఏం పనిచేస్తుంటారు? ఎన్నేళ్ల నుంచి పొగాకు వినియోగిస్తున్నారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. పొగాకు వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తున్నారు. వ్యసనాన్ని వీడటానికి మొగ్గు చూపిన వారిని కాల్ సెంటర్లోని కౌన్సెలర్‌కు ట్యాగ్ చేస్తున్నారు. వారు పొగాకు వినియోగాన్ని వీడేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అనంతరం జిల్లాల్లోని డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధిత వ్యక్తులను ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,86,303 మందికి గాను 10,066 మంది పొగాకు వినియోగాన్ని వదలిపెట్టేందుకు ముందుకు వచ్చారు. డీ–అడిక్షన్ సెంటర్లలోని వైద్యులు వీరికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. మరోవైపు డీ–అడిక్షన్ సెంటర్‌కు మ్యాపింగ్ అయిన వ్యక్తులకు అక్కడ చికిత్స ఏ విధంగా అందుతోంది? వారిలో మార్పు వచ్చిందా? అనే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. -
ఐదు రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో కేంద్రం కోవిడ్స్ రూల్స్‌ను తొలగించింది. మరోవైపు, చైనా, యూకే కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కాగా, గత వారం రోజులుగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. దీంతో ఆ ఐదు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కేరళ, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు. ఈ సందర్భంగానే దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వెయ్యి కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీంతో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్‌తోపాటు కరోనా మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు. ఐదు రాష్ట్రాలు ఇవే.. - ఢిల్లీలో ముగిసిన వారంలో 826కి పెరిగాయి. పాజిటివిటీ రేటు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది. - కేరళలో ముగిసిన వారంలో 2,321 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 13.45 శాతం నుంచి 15.33 శాతానికి పెరిగింది. - హర్యానాలో ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో పాజిటివ్ కేసుల సంఖ్య 416కి పెరిగింది. కోవివ్ కేసుల పాజిటివిటీ 0.51 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగింది. - మహారాష్ట్రలో ఏప్రిల్ 8తో 794 కేసులు నమోదయ్యాయి. 0.39 శాతం నుంచి 0.43 శాతానికి పాజిటివిటీ పెరిగింది. - మిజోరాంలో వారం వారీ కేసులు 814కి పెరిగాయి. రాష్ట్రంలో పాజిటివిటీ 14.38 శాతం నుంచి 16.48 శాతానికి పెరిగింది. -
ఏపీ: వైద్య ఆరోగ్య శాఖలో నూతన శకం
సాక్షి, అమరావతి : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో పైరవీలు, పలుకుబడుల సంప్రదాయానికి సీఎం జగన్ సర్కార్ చెక్ పెట్టింది. అడ్డగోలు డిప్యుటేషన్లను రద్దు చేసింది. ఉద్యోగులు డీఎంహెచ్‌వో, ఆర్డీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితికి తావివ్వకుండా వైద్య శాఖ చరిత్రలో తొలి సారి ఆన్లైన్ బదిలీలను చేపట్టింది. ఏపీ వైద్య విధాన పరిషత్ మినహా అన్ని విభాగాల్లో ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ఉద్యోగుల్లో 30 శాతం మందిని ఇటీవల బదిలీ చేశారు. సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, స్పౌజ్ కోటా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పోస్టింగ్‌లు వచ్చాయి. ఎలాంటి పైరవీలు లేకుండా రాష్ట్ర చరిత్రలో వైద్య శాఖలో తొలిసారి ఇలా బదిలీలు చేపట్టడం ఓ రికార్డు అని, చంద్రబాబు పాలనలో ఈ తరహాలో ఏనాడైనా బదిలీలు జరిగాయా అని వైద్య శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో అన్ని హోదాల్లో 3,710 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఐదేళ్లు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసుకున్న వారిలో 923 మంది, రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్న 117 మంది.. మొత్తంగా 1,040 మంది బదిలీ అయ్యారు. వీరిలో ఇప్పటికే 1,022 మంది బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేశారు. ప్రజారోగ్య విభాగంలో 104 క్యాడర్లలో 4,761 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. వీరిలో ఇప్పటికే మెజారిటీ శాతం మంది కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక నిర్ణయాలు.. ఉమ్మడి రాష్ట్ర ఆవిర్భావం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెనుమార్పులను సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకువస్తోంది. నాడు–నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మారుస్తోంది. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో మరమ్మతులు చేస్తున్నారు. భవనాలు, ఉపకరణాలు సమకూరుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ, ఉద్యోగుల బదిలీలు, వారికి ఉద్యోగోన్నతుల్లోనూ నూతన శకాన్ని ప్రారంభించారు. గతంలో వైద్య శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు ప్రహసనంలా ఉండేవి. పాలకుల అండ ఉన్న వారికి మాత్రమే అగ్రతాంబూలం దక్కేది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసింది. -
పనిలో ఉంటే మనసూ బాగుంటుంది
స్త్రీలకు రిటైర్మెంట్ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ‘కాని అలా ఉంటే బోర్. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి, సూపర్వైజర్గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది. కష్టమనుకుంటే కుదరదు ‘ఎ.ఎన్.ఎమ్‌గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్ఎమ్ నుంచి సూపర్వైజర్గా చేసి, రిటైర్ అయ్యాను’ అంటుందామె. ప్రయత్నాలు ఫలవంతం ‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను. పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె. మరవని సేవ.. ‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను. అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి. విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
మరో 2,398 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2,398 మందికి కోవిడ్–19 వ్యాప్తి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 7,05,199 మంది కోవిడ్–19 బారిన పడగా, వీరిలో 6,79,471 మంది కోలుకున్నారు. మరో 21,676 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 4,052కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 68,525 నిర్ధారణ పరీక్షలు చేయగా, 10,118 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. కోవిడ్–19 నిర్ధారణ కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. -
ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక ఇదే..: ఆరోగ్య శాఖ
గుంటూరు మెడికల్: ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక సిద్ధం చేశారు. మొట్టమొదటి సూత్రం – విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ఒమిక్రాన్ కేసులు వస్తున్న దృష్ట్యా మొట్టమొదటిగా విమానాశ్రయంలోనే వైరస్ బాధితులను గుర్తించి అక్కడే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన ఏడుగురు వైద్యులు, వైద్య సిబ్బంది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 24?7 విధులు నిర్వహిస్తూ విదేశాల నుంచి జిల్లాకు చెందిన వారు ఎవరైనా కనిపించగానే తక్షణమే వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి కొన్నిరోజులు క్వారంటైన్లో ఉంచుతున్నారు. ఒమిక్రాన్ కేసులు నమోదు ప్రారంభమైన తరువాత జిల్లాకు 1783 మంది వివిధ దేశాల నుంచి వచ్చారు. వీరందరికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి ఒమిక్రాన్ లేకపోవడంతో వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండో సూత్రం.. ప్రతి ఒక్కరికి కోవిడ్–19 వ్యాక్సిన్ వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.జిల్లా జనాభాలో 96 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. మూడో సూత్రం వ్యాక్సిన్ వేసుకోవడంతోపాటు, మాస్క్ పెట్టుకుంటేనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేలా అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించేవారిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న జిల్లాలోని 96,675 మంది నుంచి రూ. 71,02,250లు జరిమానా వసూలు చేశారు. నాల్గవ సూత్రం.. కోవిడ్–19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో వైద్య అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో డిసెంబరు 12 నాటికి 1,79,080 పాజిటీవ్ కేసులను నిర్ధారించి వైద్య సేవలందించగా, 1,77,647 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు, మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రాంతాల్లోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సిబ్బంది కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ను ముందస్తుగానే గుర్తించి కట్టడి చేసేలా వైద్య అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నారు. ఐదో సూత్రం.. వైద్య అధికారులు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఎవరైనా ఇళ్లలోనే ఉంటే, వారి నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా ఇళ్ల వద్దే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంత మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒమిక్రాన్ కేసుల నమోదు దృష్ట్యా ప్రజలు అపోహలు, ఆందోళనలు విడనాడి అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి. అన్నిరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. వైద్య సిబ్బంది సైతం ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు. – డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ చదవండి: ‘బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకే ఈ కుట్ర'! -
Omicron Variant : ఒమిక్రాన్ 2.0 ‘టెస్టు’లకే పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఓవైపు ప్రపంచాన్ని వణికిస్తుండగానే... ఆ తరహా వేరియెంట్ మరోటి బయటపడింది. ఒమిక్రాన్ సంతతికే చెందిన మరో వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకర వేరియెంట్‌గా చెబుతున్న ఒమిక్రాన్... 50 మ్యుటేషన్స్‌తో వేగంగా వ్యాప్తి చెందుతూ కొన్ని దేశాలను భయపెడుతోంది. దీని తీవ్రత ఎంత? దీనిమీద వ్యాక్సిన్లు పనిచేస్తాయా? పిల్లలు, వృద్ధుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి సమాచారం ఏమీ లేదు. ఇలాంటి తరుణంలో దాని లాంటిదే మరో వైరస్ రావడం సైంటిస్టులకు సవాలుగా మారింది. ఈ కొత్త వైరస్‌లో ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఏడు కేసులు నమోదయ్యాయి. నవబంబర్ 24న దక్షిణాఫ్రికాలో బయటపడ్డ B.1.1.529 వేరియెంట్లో మొదటిది BA.1 ఒమిక్రాన్ కాగా... BA.2 రెండోది. ఈ ఆఅ.2లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడాల్లో కేసులు నమోదయ్యాయి. BA.1 వేరియెంట్ కంటే.. BA.2లో మరో 14 మ్యూటేషన్స్ అధికం. దీనివల్ల ఈ రెండు వైరస్లు వేర్వేరుగా స్పందిస్తున్నాయని... యూని వర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాన్స్వాయిజ్ బాలౌక్స్ తెలిపారు. రెండో వైరస్‌లో ఉన్న ఓ ప్రత్యేక గుణం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. అది టెస్టులు సైతం గుర్తించలేని విధంగా వైరస్ ఉండటం. డెల్టా, ఒమిక్రాన్ సహా అన్ని వేరియెంట్స్‌ను ఆర్టీపీసీఆర్ ద్వారా గుర్తించగలిగారు. కానీ సులభంగా స్కాన్ చేయగలిగే ఎస్–జీన్ డ్రాపౌట్ BA.2 లో లేక టెస్టులకు చిక్కట్లేదని అమెరికన్ మైక్రోబయాలజీ సొసైటీ చెబుతోంది. కాగా కరోనాలో మ్యుటేషన్స్ పెరుగుతున్నా కొద్దీ బలహీనపడుతున్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్న తరుణంలో.. ఇలా టెస్టులకు దొరకని వేరియెంట్ బయటపడటంతో∙ఆందోళన వ్యక్తమవుతోంది. అదనపు మ్యుటేషన్స్‌తో తొందరగా వచ్చిన ఈ వైరస్.. ఇప్పటికే యూకేను చుట్టుముడుతోన్న ఒమిక్రాన్ కంటే ప్రమాదకరం కాకపోవచ్చని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ డేవిడ్స్టార్ట్ చెబుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు..! 2020 అక్టోబర్ తర్వాత ఏం జరిగిందో మరవొద్దు..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ‘ఒమిక్రాన్’వేరియెంట్‌ను ప్రజలు తేలిగ్గా తీసుకుంటే మరో ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ సాగుతుండటంతో పాటు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలు వస్తున్నందున మరింత జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా ‘వేరియెంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించిన వాటిలో ఒమిక్రాన్ ఐదోది. ఒమిక్రాన్ వేరియంట్ మానవ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవడంతోపాటు ఎక్కువ మందికి సోకడం, నెమ్మదిగా తీవ్రస్థాయికి చేరుకోవడం ద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశాలివే... డెల్టా కంటే వేగంగా విస్తరణతో పాటు సహజసిద్ధ లేదా టీకాలతో వచ్చిన రోగనిరోధకశక్తిని తప్పించుకోగలగడం, ఇప్పటికే కరోనా బారిన పడ్డవారికి రీఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం, బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు, మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌తో పాటు వేరే చికిత్సలకు లొంగే అవకాశాల తగ్గుదల, ఒక్క డోసూ తీసుకోని వారిలో కరోనా ముదిరే ప్రమాదం ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాదిలాగే ముప్పు.. ‘ఒమిక్రాన్ ఎక్కువ మందికి సోకు తుందే తప్ప అంత ప్రమాదకారి కాదని అజాగ్రత్తగా ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటినుంచైనా జాగ్రత్తలు తీసుకోకపోతే చేజేతులా మరో ఉపద్రవం కొనితెచ్చుకున్నట్టే. 2020 అక్టోబర్ తర్వాత కేసులు పెరిగి ఫిబ్రవరికి సెకండ్‌వేవ్ ఉధృతి తీవ్రమైన విషయం మరవొద్దు. ఒక్కసారిగా కేసులు పెరిగితే ఆస్పత్రులు నిండి వైద్యవ్యవస్థ ఒత్తిడికి లోనైతే ఇబ్బందిగా మారొచ్చు. యాంటీ స్పైక్ యాంటీబాడీస్ బ్లడ్ టెస్ట్‌తో మనలో ఉన్న యాంటీబాడీస్‌పై స్పష్టత వస్తుంది. రెండు డోసుల టీకా తీసుకుని 6 నెలల తర్వాత ఏమేరకు యాంటీబాడీస్ ఉన్నాయో దీనితో తెలుసుకోవచ్చ. దీన్నిబట్టి బూస్టర్ డోసు అవసరమో కాదో నిర్ణయించుకోవచ్చు. యాంటీబాడీస్ తగ్గని వారికి ‘మోనోక్లోనల్ యాంటీ బాడీస్’చికిత్స అందించినా నిష్ప్రయోజనం. అందువల్ల మోనోక్లోనల్ తీసుకోడానికి ముందే ఈ టెస్ట్ చేసుకుంటే మంచిది.’ – డా. విశ్వనాథ్ గెల్లా, ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్ పల్మొనాలజీ, స్లీప్ డిజార్డర్స్ -
వైద్య శాఖలో 3 వేల కొత్త ఉద్యోగాలు..
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖలో కొత్తగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏడు మెడికల్ కళాశాలల్లో 2,135, 15 నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాలల్లో మొత్తం 33 విభాగాలకు పలు రకాల పోస్టులు మంజూరు చేశారు. స్టోర్ కీపర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టెనో టైపిస్టులు, రికార్డు క్లర్క్‌లు, రికార్డు అసిస్టెంట్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్లు, కార్పెంటర్లు, అటెండర్లు, వార్డు బాయ్స్, డ్రైవర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు లాంటి పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతినిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 13 నర్సింగ్ కళాశా లలు, ఇప్పటికే నడుస్తున్న 2 నర్సింగ్ కాలేజీలు కలిపి మొత్తం 15 కళాశాలల్లో మరో 900 పోస్టు ల భర్తీకి అనుమతినిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కళాశాలల్లో కూడా టైపిస్టు లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో), అటెం డర్లు, హౌజ్‌కీపింగ్, శానిటేషన్ సిబ్బంది, కుక్ లు, కిచెన్ బాయ్స్.. తదితర పోస్టులున్నా యి. ఈ పోస్టులన్నింటికీ గతంలో ప్రభుత్వం విడుద ల చేసిన ఉత్తర్వుల ప్రకారం వేతనం ఉంటుందని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పోస్టు లు మనుగడలో ఉంటాయని పేర్కొన్నారు. ఒక్కో నర్సింగ్ కాలేజీకి మంజూరైన పోస్టులు టైపిస్టు/డీఈవో (2), రికార్డు అసిస్టెంట్ (2), అసిస్టెంట్ లైబ్రేరియన్ (1), హౌస్ కీపర్స్ (4), ఎలక్ట్రీషియన్/మెకానిక్ (1), అటెండర్లు (6), డ్రైవర్లు (4), వాచ్మెన్ (4), క్లీనర్లు (4), శానిటేషన్ సిబ్బంది (13), ల్యాబ్ అటెండెంట్స్ (5), లైబ్రరీ అటెండెంట్స్ (3), కుక్స్ (4), కిచెన్బాయ్స్ (5), ధోబీ (2) -
జగన్ ‘ప్రజావైద్యం’లో కాస్ట్రో స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన సిబ్బంది ఏపీలో భారీ స్థాయిలో తలపెట్టిన టీకాల ఉద్యమంవల్ల ఒకే ఒక్కరోజున పదమూడున్నర లక్షల మందికి వ్యాక్సినేషన్ అందడం దేశంలోనే రికార్డుగా నమోదయింది. జగన్ ప్రభుత్వం హాస్పిటల్స్ సౌకర్యాలను, దేశంలో లభించని ఆక్సిజనేటర్స్ను దేశంలో ఏ రాష్ట్రంకన్నా కూడా ముందుగానే సేకరించి ఆసుపత్రులను బలోపేతం చేయడానికి పూనుకుంది. ‘వైరస్లు వస్తాయి, పోతాయి, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్న’ శాస్త్రీయ దృక్పథాన్ని దేశంలోనే తొలిసారిగా వ్యాప్తిలోకి తెచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాని సీఎం వైఎస్ జగన్. ‘రత్నపరీక్ష’ నవరత్నాల ఆవిష్కరణతోనే ప్రారంభమయింది. ఇప్పుడు నడుస్తున్నది నేలవిడవని పటిష్టమైన సాముగరిడీలు! ‘‘అమెరికా లాంటి సామ్రాజ్యవాద, పెట్టు బడిదారీ దేశాలు క్యూబా లాంటి చిన్న దేశా లపై సాగించిన యుద్ధాలు, పచ్చి దోపిడీ ఫలితంగా అనేక త్యాగాలతో జాతీయ పునర్నిర్మాణం అవసరమైంది. ఫలితంగా క్యూబా విప్లవం అనివార్యమై, దేశ ప్రజా బాహుళ్యం జీవితంలో జీవన విధానాల్లో పరి వర్తన కోసం విప్లవాత్మక చట్టాలు అనివార్యమయ్యాయి. ఈ చట్టాలు మా ప్రజాబాహుళ్యంలో సోషలిస్టు చైతన్య దీప్తిని కల్గించడానికి దోహదం చేశాయి. ఈ చైతన్యం వల్లనే ఆదిలో నిరక్షరాస్యులుగా, అర్ధ నిరక్షరాస్యులుగా బతుకులీడుస్తున్న ప్రజలు తమ బిడ్డలకు చదవను, రాయను నేర్పించగల్గారు. ప్రజావైద్య రక్షణ విధానానికి అంకురార్పణ చేశారు... ఏ దేశ ప్రజలూ బలవంతంగా విప్లవకారులు కాజాలరు. ఎందుకంటే, ఆరోగ్యకరమైన సమాజ పరివర్తన విధిగా కోరుకునే సామాజిక శక్తులు ప్రజా బాహుళ్యాన్ని అణచివేయాలని కోరుకోరు’’! - క్యూబా విప్లవనేత ఫిడెల్ కాస్ట్రో ‘‘కోవిడ్–19 ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన సిబ్బంది ఏపీలో భారీ స్థాయిలో తలపెట్టిన టీకాల ఉద్యమం వల్ల ఒకే ఒక్క రోజున పద మూడున్నర లక్షల మందికి వ్యాక్సినేషన్ అందడం దేశంలోనే ఒక రికార్డుగా నమోదయింది. ఇది గ్రామ సచివాలయాల, వార్డుల, జిల్లాల స్థాయిలో గత రెండేళ్లకు పైగా స్థానిక వలంటీర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న నిరంతర సేవాతత్పరత వల్లనే సాధ్యమైంది’’. - పత్రికా వార్తలు (21.6.2021) ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రతిపక్షాల ‘కోణంగి’ చేష్టలను, ప్రకృతి వైపరీత్యాలను, సరికొత్తగా ప్రపంచాన్ని ఊగించి, శాసించ సాహసిస్తు మహమ్మారి కోవిడ్–19ని గత రెండేళ్లలోనూ అనేక సాహస నిర్ణయా లతో వైఎస్సార్సీపీ అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదు ర్కొంటూ వస్తోంది. గత ప్రభుత్వం (టీడీపీ) రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక వనరులను దోచుకుని, లక్షల కోట్ల రూపాయల అఫ్పులతో ముంచే యగా ఖజానా ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం గత రెండేళ్లకుపైగా హుందాగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నెట్టుకుంటూ వస్తోంది. పైగా, గత రెండేళ్లలో అనేక సామాజిక, విద్యా, వైద్య, రైతు, వ్యవసాయ కార్మిక జనాభా మౌలిక అవసరాలను తీర్చడంలో భాగంగా నవరత్నాల ప్రణాళికను అక్షర సత్యంగా ఆచ రణలో పెట్టడానికి సీఎం జగన్ సాహసించి అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చట్టప్రకారమే ప్రత్యేక ప్రతిపత్తిని హామీ పడి వేలు విడిచిన కాంగ్రెస్ పాలకులు, వారు విడిచిపోతూ వదిలి వెళ్లిన పాద రక్షలు తొడుక్కుంటూ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తికి పార్లమెంట్ సాక్షిగా నిండుపేరోలగంలో ‘మేం చూసుకుంటాంగదా’ అంటూ ఆపద్ధర్మంగా ప్రకటించి బట్టలు దులిపేసుకున్న బీజేపీ నాయకత్వం– చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్నదీ, ఆడుతున్నదీ పచ్చి నాటకం! బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగిస్తే తప్ప– ఆ ‘ప్రత్యేక ప్రతి పత్తి’కి రాష్ట్ర ప్రజలు అర్హులు కారేమో! అవకాశం ఉన్నమేరకు పరిమిత మార్గమధ్యనే ముందుగానే వ్యూహాత్మకంగా నిర్దిష్టమైన ప్రణాళికా కేటాయింపులకు తెలివిగా ‘ప్లాన్’ చేసుకొని, ఆ ప్రకారంగా కేటాయింపులలోనే ప్రజాబాహుళ్యా నికి ముఖ్యంగా అణ గారిపోయిన దళిత, పేద, మధ్యతరగతి ప్రజా బాహుళ్య ప్రయోజనాలను సాధ్యమైనంతవరకు నెరవేర్చడానికి ‘నవ రత్నాలకే కాదు, వాటి పరిధిని దాటి కూడా ఎన్ని రంగాలకో ప్రయో జన పథకాలను విస్తరించి అమలులోకి తెస్తున్నారు. ఒకటా రెండా– వ్యవసాయ, సహకార, పశుపోషణ, మత్స్య సంపద, పౌర సరఫ రాలు, గ్రామ, వార్డు సచివాలయాల, గ్రామీణ వలంటీర్ల ఉపాధి, పేదలకు గృహ నిర్మాణాలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం, పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థల, ఆర్టీసీ, గిరిజన సంక్షేమ, నైపుణ్యం(స్కిల్), విద్యుచ్ఛక్తి, జలవనరుల అభివృద్ధి, ‘కోవిడ్’ తొలగే దాకా అవసరమైన తాత్కాలిక సిబ్బంది వగైరా నియామకాల దాకా– జగన్ ఆలోచన, ఆచరణ విస్తరించి శరవేగాన, ‘ఈ మార్పులు నిజమా’ అని ఆశ్చర్యగొలిపేలా అమలులోకి వస్తున్నాయి. బహుశా ఈ పెక్కు మార్పులకు ముఖ్యంగా ఆరోగ్య రంగంలో జగన్‌ను పురిగొల్పింది క్యూబన్ అధినేత ఫిడెల్ కాస్ట్రో అని నా విశ్వాసం. స్వయంగా వైద్యుడు, ప్రజా సమస్యలపై స్పందించగలిగిన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి ఉత్సాహ, ప్రోత్సాహాలు కారణమై ఉంటాయి. క్యూబన్ సామాజిక విప్లవంపైన, కాస్ట్రో విప్లవాత్మక సంస్కరణలపైన స్పందిస్తూ మరె వరో కాదు, క్యూబా శత్రువైన అమెరికాకు ఆరోగ్య సమాచార సాంకే తిక వ్యవస్థ జాతీయ సమన్వయకర్త డాక్టర్ డేవిడ్ బ్లుమెంతాల్ ఇలా అన్నాడు: ‘‘క్యూబా ప్రజారోగ్య వైద్య వ్యవస్థ ప్రజల ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ, రక్షణ విషయంలో క్యూబా విజయాలకు సరిపోలిన ఉదాహరణలు అతి తక్కువ. క్యూబాలో చంటి పిల్లల మరణాల సంఖ్య ప్రతి వెయ్యిమంది పిల్లలకు 37.3 నుంచి 4.3కి పడిపోయింది. అమెరికాలో చంటిపిల్లల మరణాల సంఖ్య 5.8 కన్నా క్యూబా సంఖ్య తక్కువ. ఇక 1970 నుంచి 2016 మధ్య అమెరికా పౌరుని జీవన ప్రమాణం 79.8 సంవత్సరాలయితే, క్యూబాలో 70.04 నుంచి 78.7 సంవత్సరాల దాకా ఉంది’’. ఇక అన్నింటికన్నా, మూడు స్థాయిల్లో అంచెలవారీగా అమలులో క్యూబా ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఉంది. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకు రేయింబవళ్లు సేవలందించడానికి ఒక డాక్టర్, ఒక నర్సు నివసిస్తూ, స్థానిక ప్రజలలో ప్రతి ఒక్క సభ్యుడి ‘ఆరోగ్య వివరాలతో కూడిన పటాన్ని (మ్యాప్) ఉంచుతారు. ఇక రెండోదశలో స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రులలో ద్వితీయ స్థాయి సేవలు అందించే సిబ్బంది ఉంటారు. ఇక మూడోస్థాయిలో అందించే సర్వీసుల్లో 12 సంస్థలుంటాయి. ఇవి మెడికల్, టీచింగ్, రీసెర్చి సేవలు అందించడంతోపాటు అధునాతన సర్వీసులు, స్పెషలైజ్డ్ సర్వీసులు నిర్వహిస్తుంటాయి. చివరికి కోవిడ్–19 వైరస్ నుంచి పౌరుల రక్షణ కోసం అంత చిన్న దేశమైనా (సుమారు 13 కోట్లు జనాభా) 5 రకాల వ్యాక్సిన్లను మూడు దశల పరీక్షలు జయ ప్రదంగా నిర్వహించుకుని సిద్ధంగా ఉంది. ఇప్పుడు క్యూబా, చైనాలు కలిసి కోవిడ్ వైరస్ నిర్మూలనకు, దాని రూపాంతరాల నిర్మూలనకు తగిన వ్యాక్సిన్‌ను రూపొంది స్తున్నాయని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ రాము సూరావజ్జుల వెల్లడిం చారు. ఒకవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య వ్యవస్థను ప్రతి ఒక్కరూ బలోపేతం చేయాలని సంబంధిత సామాజిక చర్యలను పటిష్టం చేయాలనీ మొత్తుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన (20.6.21) వెలువడకముందే జగన్ ప్రభుత్వం హాస్పిటల్స్ సౌకర్యా లను, దేశంలో లభించని ఆక్సిజనేటర్స్ను దేశంలో ఏ రాష్ట్రం కన్నా కూడా ముందుగానే సెక్యూర్ చేసి ఆసుపత్రులను బలోపేతం చేయడానికి పూనుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే– చివరికి కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్ చర్యలు మార్గదర్శకం అయ్యాయంటే ఆశ్చర్య పోనక్కరలేదు. ‘వైరస్లు వస్తాయి, పోతాయి, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్న’ వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాన్ని దేశం లోని రాష్ట్రాలలో మొదటిసారిగా వ్యాప్తిలోకి తెచ్చిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్, దాని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ‘రత్నపరీక్ష నవ రత్నాల ఆవిష్కరణతోనే ప్రారంభమయింది. ఇప్పుడు నడుస్తున్నది నేలవిడవని పటిష్టమైన సాముగరిడీలు! అయినా సంస్కరణవాద ప్రభుత్వాలు నిలదొక్కుకోవాలన్న సమసమాజ వ్యవస్థ అండదండలు అనివార్యమని గుర్తించాలి!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘రూ.కోటి పరిహారం ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విధుల్లో మరణించిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బందికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని వైద్య,ఆరోగ్యశాఖలోని 24 సంఘాల ప్రతినిధులతో కూడిన ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మరణించిన వైద్య సిబ్బంది కుటుంబాల్లో అర్హులైన వారికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, వారి కుటుంబసభ్యులను కూడా ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి తొలి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రజారోగ్య వైద్య సంచాలకులు డా.శ్రీనివాసరావుకు ఐక్యవేదిక నేతలు డా.రవిశంకర్ ప్రజాపతి, డా.కత్తి జనార్దన్, సు జాత, రాజశేఖర్, ఎ.సుజాత శనివారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం కోఠి లోని డైరెక్టర్ హెల్త్ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కో విడ్ బారిన పడిన నర్సులు, ఇతర సిబ్బందికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్స, నిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా 21 రోజుల వేతనంతో కూడిన జీతం ఇచ్చేలా జీవో జారీచేయాలని కోరారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్, ఇతర ఉద్యోగులకు షిఫ్టులవారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసు కోవాలన్నారు. ఇప్పటికే ఆయా సమస్యలు, అంశాలను గురించి మంత్రి హరీశ్ రావు, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి ఫలితం లేదని, వచ్చే వా రం, పది రోజుల్లో తమ సమస్యలపై స్పందించి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యాక్సిన్లపై వారం ఆగమన్నారు.. వైద్యులు, ఇతర సిబ్బంది కుటుంబసభ్యులకు వ్యాక్సినేషన్‌పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని డా.జి.శ్రీనివాసరావు చెప్పినట్లు ఐక్యవేదిక నాయకుడు డా.రవిశంకర్ తెలిపారు. కరోనా విధుల్లో మరణించిన వారికి నష్టపరిహారం, ఇతర సమస్యలు, డిమాండ్ల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పరిధిలోకి 95 శాతం ప్రజలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైద్యరంగంలో రెండేళ్ల ప్రగతికి సంబంధించి శనివారం ప్రభుత్వం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆ అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకు రాష్ట్రంలో 95 శాతం ప్రజలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్(మ్యుకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్) చికిత్సలన కొత్తగా చేర్చినట్లు నివేదికలో పేర్కొంది. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 అందజేస్తున్నారు. నాడు-నేడు పథకం కింద దశలవారీగా మూడేళ్లలో ఆసుపత్రుల ఆధునీకరణ చేసినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకం చేపట్టారు. వీటితో పాటు 108/104 సేవల కోసం 1180 అంబులెన్స్ లు, సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశారు.“వైఎస్సార్ కంటి వెలుగు” పథకం క్రింద ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3,000 నుండి రూ.10 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నారు. వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ చదవండి: ఆరోగ్యశ్రీకి పడకలివ్వకుంటే అనుమతులు రద్దు -
అత్యధికంగా మగవారికే కరోనా!
సాక్షి, హైదరాబాద్: పురుషుల్లోనే అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. జన సమూహాల్లోకి ఎక్కువగా వెళ్లడం, ఉపాధి, ఉద్యోగాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండటం.. తదితర కారణాలతో పురుషుల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, అందులో 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. ఒక్కరోజులో 518 కేసులు రాష్ట్రంలో ఇప్పటివరకు 99,03,125 మందికి పరీక్షలు చేయగా, అందులో 3,05,309 మందికి కరోనా సోకింది. గురువారం 57,548 మందికి పరీక్షలు చేయగా, 518 మందికి కరోనా సోకినట్లు తేలిందని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 157 మంది కరోనా బారినపడ్డారు. గురువారం 204 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,99,631 మంది కోలుకున్నారు. నమోదైన కరోనా కేసుల్లో పురుషులు, స్త్రీలశాతం తాజాగా ముగ్గురు చని పోగా, ఇప్పటివరకు 1,683 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,995 ఉండగా, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఐసోలేషన్‌లో 1,767 మంది ఉన్నారు. గురువారం నాటికి 60 ఏళ్లు పైబడినవారు 3,49,989 మంది టీకా వేయించుకున్నారు. వ్యాధిగ్రస్తులు 1,72,928 మంది టీకా పొందారు. ఇప్పటివరకు మొదటి డోస్ తీసుకున్నవారు 8,54,509 మంది. రెండో డోస్ టీకా తీసుకున్నవారు 2,30,582 మంది ఉన్నారు. గురువారం 60 ఏళ్లు పైబడిన 20,516 మందికి మొదటి డోస్ వేయగా, వ్యాధిగ్రస్తుల్లో 13,178 మందికి టీకా వేశారు. -
వ్యాక్సినేషన్లో ఏపీ ముందంజ
విజయవాడ: కరోనా విరుగుడుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నాలుగో రోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాలలో కోవిడ్ టీకా వేస్తున్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా మూడో రోజు కోవిడ్ టీకా వేసుకున్న వారి సంఖ్య 14,606. మూడు రోజులలో వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి మొత్తం సంఖ్య 46,755. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముందుస్థానంలో ఉంది. వారంలో నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ముందుగా కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. టీకాల పంపిణీని సీఎం జగన్ మోహన్ రెడ్డి వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. మూడో రోజు జిల్లాల వారీగా వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య అనంతపురము 1,276 చిత్తూరు 976 తూర్పుగోదావరి 1,923 గుంటూరు 1,490 కృష్ణా 473 కర్నూలు 860 ప్రకాశం 1,017 నెల్లూరు 1,847 శ్రీకాకుళం 1,193 విశాఖపట్నం 1,474 విజయనగరం 781 పశ్చిమగోదావరి 459 వైఎస్సార్ కడప 837 -
భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : ఇచ్చిన హామీలను అమలుచేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యా ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. డీఎంఈ, వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 5,701 పోస్టులు, అలాగే 804 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. మరో 2,186 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు వివిధ కేటగిరీలలో 1,021 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (అర్హులందరికీ సంక్షేమ ఫలాలు) కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి విద్యా, వైద్యం, ఆరోగ్యం రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి వంటి పరిణామాలు చోటుచేకున్నాయి. దీంతో ఆయాశాఖా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. వీలైనంత త్వరగా ఖాళీలను గుర్తించి.. నోటిఫికేషన్ విడుదల చేయాలని గత సమీక్షా సమావేశంలో సూచించారు. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన వైద్యారోగ్యశాఖ ఖాళీలను గుర్తించి వాటికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా క్లిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఎప్పటికప్పుడు సమాచారం పంచుకున్నాం
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్‌పై సరైన సమయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న చైనా.. తాజాగా వైరస్‌కు సంబంధించి శ్వేత పత్రాన్ని ఆదివారం విడుదల చేసింది. వైరస్ విషయాన్ని దాచిపెట్టలేదని, ఇందులో తమ తప్పు, పొరపాటు ఏమీ లేదని సమర్థించుకుంటూ సమగ్ర వివరణ ఇచ్చింది. ఈ కరోనా వైరస్‌ను తొలిసారి వూహాన్లో గత సంవత్సరం డిసెంబర్ 27న ఒక ఆసుపత్రిలో వైరల్ న్యూమోనియాగా గుర్తించామని వెల్లడించింది. మనిషి నుంచి మనిషికి సోకుతుందన్న విషయాన్ని జనవరి 19న నిర్ధారించామన్నారు. ఆ వెంటనే వైరస్ వ్యాప్తి నిరో«ధ చర్యలు ప్రారంభించామంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రపంచ దేశాధి నేతలు కరోనా మారణకాండకు, ఆర్థిక అస్తవ్యస్తతకు చైనానే కారణమని ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. జనవరి 19కి ముందు, ఆ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదని వైరస్ వ్యాప్తిపై చైనా నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన అత్యున్నత శాస్త్రవేత్తల కమిటీ సభ్యుడు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు వాంగ్ గ్వాంగ్ఫా పేర్కొన్నారు. వూహాన్‌కు తాము వెళ్లినప్పటికే.. అక్కడ జ్వర పీడితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. వైరస్‌ను తొలుత గుర్తించిన మాంసాహార మార్కెట్‌కు వెళ్లని వారికి కూడా ఈ వ్యాధి సోకినట్లు గుర్తించామన్నారు. జనవరి 14 నాటికి వూహాన్ నగరం ఉన్న హ్యుబయి రాష్ట్రం మొత్తం వైరస్ వ్యాప్తి ముప్పు ఉన్నట్లు గుర్తించిన ఎన్‌హెచ్‌సీ.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. నిర్ధారించలేని కారణంతో న్యూమోనియా రావడాన్ని గుర్తించిన తక్షణమే అందుకు కారణాలను అన్వేషించాలని పరిశోధకులను ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. ముప్పును గుర్తించిన చైనా వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థను, అమెరికా సహా ఇతర దేశాలను అప్రమత్తం చేసిందన్నారు. అనంతరం, ఈ కొత్త కరోనా వైరస్ జన్యుక్రమాన్ని పరిశోధించి, ఆ వివరాలను కూడా డబ్ల్యూహెచ్ఓ, ప్రపంచ దేశాలతో పంచుకుందన్నారు. హ్యుబయితో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో దేశంలో కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జనవరి 3 నుంచే వైరస్ సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్ఓతో పాటు ఇతర దేశాలతో పంచుకున్నామన్నారు. -
కరోనా సోకడం నేరమేమీ కాదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైరస్ నియంత్రణపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. 8 జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్ పడకలు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు. (నిరుద్యోగం పెరగకుండా ఈ చర్యలు) వైరస్ ఎవరికైనా సంభవించే అవకాశం ఉందని, పరీక్షలను స్వచ్ఛందంగా ముందుకురావాలిన సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కనీస జాగ్రత్తలు, వైద్య సహాయంతో వైరస్ సోకిన బాధితులు కోలుకోవడం సులభమని అన్నారు. ఈ మేరకు ప్రతి గ్రామాల్లో ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని.. ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైయ్యారు. -
బుసలు కొడుతున్న కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మృత్యుఘోష ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజు వ్యవధిలో 5,609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 132 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటిదాకా పాజిటివ్ కేసులు 1,12,359కి, మొత్తం మరణాలు 3,435కి చేరాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 63,624 కాగా, 45,299 మంది బాధితులు చికిత్సతో కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 40.32 శాతానికి చేరడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గురువారం పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రభుత్వ మర్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆ ఆస్పత్రి.. కరోనా శ్మశానం గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ‘కరోనా శ్మశానం’గా మారింది. గుజరాత్లో కోవిడ్‌తో 749 మంది కన్నుమూయగా, అందులో దాదాపు సగం.. అంటే 351 మరణాలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మరణించారు. ఈ హాస్పిటల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలో రైలు టికెట్లు క్యాన్సిల్ ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రలో మాత్రమే ప్రయాణించే వారి టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
మహమ్మారి కోరల్లో 724 మంది
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నాటికి కరోనా మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 724కు పెరిగిపోయింది. గత 24 గంటల్లో మరో ఏడుగురు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 17కు చేరుకుందని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులతో అన్నారు. కర్ణాటకలో ఇప్పటివరకూ ఇద్దరు మరణించగా మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒకొక్కరు చొప్పున కరోనాకు బలైన విషయం తెలిసిందే. వ్యాధి బాధితుల్లో 47 మంది విదేశీయులు కాగా, 66 మందికి నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క వ్యక్తి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాడని, దీంతో దేశం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 640 అయ్యిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టనున్న సాలిడారిటీ ట్రయల్‌లో భారత్ కూడా భాగస్వామి కానుందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయినా వైద్య పరికరాల కొరత రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 10వేల వెంటిలేటర్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని, వీటికి అదనంగా మరో 30 వేల వెంటిలేటర్లను రానున్న ఒకట్రెండు రోజుల్లో తయారు చేయాల్సిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్‌ను కోరామన్నారు. వలస కార్మికులకు ఆహారం, నీరు, పారిశుధ్య సౌకర్యాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించామని, హోటళ్లు, హాస్టళ్ల వంటివి తెరిచే ఉండాలని, తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ తెలిపారు. వలస కార్మికులను రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఆలోచన ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు. రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం టెలీమెడిసిన్ వినియోగంపై మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. గడచిన రెండు నెలల్లో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు సుమారు 15 లక్షల మంది ఉన్నారని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబా తెలిపారు. కరోనా నేపథ్యంలో వీరందరినీ కచ్చితంగా పరిశీలించేందుకు నిఘా వ్యవస్థలను పటిష్టీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో సార్క్ దేశాలన్నింటికీ ఒక ఉమ్మడి ఎలక్ట్రానిక్ వేదికను ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. సార్క్ దేశాల ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిపాదన చేసింది. అతిక్రమించిన అధికారులపై చర్యలు.. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్న అధికారులపై ప్రభుత్వాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తెలంగాణలో తన కుమారుడి అంతర్జాతీయ ప్రయాణ వివరాలను దాచి ఉంచినందుకు ఓ డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్టుగానే కేరళలో ఓ ఐఏఎస్ అధికారిపై, ఢిల్లీలో ఓ పోలీస్ అధికారిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవలే విదేశాల్లో హనీమూన్ జరుపుకుని వచ్చిన యువ ఐఏఎస్ అధికారి, కొల్లం సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాపై నిబంధనల ఉల్లంఘనకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రయత్నించిన రైల్వే పోలీస్ అధికారిని అధికారులు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు అమ్ముతున్న ఓ కెమిస్టును విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మా విమానాలు వాడుకోండి... భారతీయ పౌరులను దేశంలోకి తిరిగి తీసుకొచ్చేందుకు, అత్యవసర సేవల కోసం తమ విమానాలు, సిబ్బంది, విమానాశ్రయ ఉద్యోగులను వాడుకోవచ్చునని ప్రైవేట్ విమానయాన సంస్థ గో ఎయిర్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇండిగో కూడా ఇటీవలే ఇలాంటి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం ఉండగా.. సరుకుల రవాణా చేసేవి మాత్రం యథావిధిగా చేయవచ్చు. అయితే ఇండిగో, గో ఎయిర్ లాంటి దేశీ విమానయాన సంస్థలు ప్రయాణికుల్లేకుండా, కేవలం సరుకులు మాత్రమే రవాణా చేసేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఉపరాష్ట్రపతి ఒక నెల వేతనం సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు, లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన ఒక నెల వేతనాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. షిర్డీ సాయి సంస్థాన్ రూ.51 కోట్ల విరాళం సాక్షి ముంబై: కరోనా వైరస్‌పై పోరాటంలో మహారాష్ట్ర సర్కారును ఆదుకునేందుకు షిర్డీ సాయి సంస్థాన్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.51 కోట్ల విరాళం ప్రకటించింది. ‘రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే అయిదుగురు మృతి చెందగా, 120 మందికిపైగా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు షిర్డీ సాయి సంస్థాన్ సీఈఓ అరుణ్ డోంగరే పేర్కొన్నారు. గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాధి విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రథమ పౌరులుగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన మార్గదర్శనం చేయడంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పోషించే పాత్ర కీలకమని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం వారు సంయుక్తంగా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలను చైతన్య పరిచే విషయాల్లో చొరవతీసుకోవాలని సూచించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆహారపంపిణీ కేంద్రం వద్ద కొట్లాడుతున్న నిరాశ్రయులు నిర్మానుష్యంగా మారిన కేరళలోని మెప్పుయుర్ రోడ్డుపై పునుగుపిల్లి -
మరో మూడు పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గురువారం మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 16కు చేరింది. సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి (50) దుబాయి నుంచి రాగా, ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ నెల 14న ఆయన దుబాయి నుంచి వచ్చాడు. 17న కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో తక్షణమే గాంధీ ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు చేయగా, కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయనతో కాంటాక్టు అయిన వారిని గుర్తించి హోం క్వారంటైన్లో ఉంచారు. విమానంలో ఆయనతో ప్రయాణించిన వారి వివరాలు గుర్తిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వారిలో ఒకరు ఈ నెల 18న హైదరాబాద్ వచ్చాడు. విమానాశ్రయం నుంచి రాగానే లక్షణాలు గుర్తించి, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక మరో వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అతడికి కూడా పాజిటివ్ లక్షణాలున్నట్లు నిర్దారించారు. వీరిద్దరూ నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలకు చెందిన యువకులు. వారి కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. (ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష) గలేరియా మాల్లో కలకలం.. హైదరాబాద్‌లోని పంజగుట్ట గలేరియా మాల్‌కు వేరే రాష్ట్రానికి చెందిన ఓ కోవిడ్ పాజిటివ్ రోగి ఈ నెల 11న వచ్చాడని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ రోజు ఆ మాల్‌కు వెళ్లినవారెవరైనా ఉంటే వారంతా హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు కోరారు. ఎవరిౖకైనా లక్షణాలున్నా, ఇతరత్రా అనుమానాలున్నా 104 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. అయితే ఆ వ్యక్తి హైదరాబాద్‌లో ఇంకెక్కడెక్కడ తిరిగి ఉంటాడో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనిచేయని కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూం 24 గంటలూ పనిచేస్తుందని చెప్పడమే కానీ, అక్కడ ఎలాంటి సమాచారం కానీ, వివరాలు కానీ లభ్యం కావట్లేదని కొందరు చెబుతున్నారు. దానికి ఒక నంబర్ కూడా కేటాయించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. కోవిడ్‌ను పర్యవేక్షించే అధికారులు తమ బంధువులు, స్నేహితులతో గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుతున్నారే కానీ ఎవరైనా కోవిడ్ సమాచారం అడిగితే చెప్పట్లేదని, ఫోన్లే ఎత్తట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్లల్లో అధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి భరోసా ఇస్తున్నా, అధికారుల తీరు మాత్రం మారట్లేదు. కోవిడ్ నియంత్రణ నోడల్ ఆఫీసర్‌గా విజయ్‌కుమార్ అనే అధికారిని నియమించారు. ఆయనకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. 71,256 మందికి స్క్రీనింగ్ : హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో గురువారం నాటికి మొత్తం 71,256 మందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాదాద్రిలో ఆర్జిత సేవలు బంద్ యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు కొండపై ఉన్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి, అను బంధ ఆలయమైన పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఆర్జిత సేవలు నిలిపి వేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి వెల్లడించారు. -
కరోనా నివారణకు పటిష్ట చర్యలు
-
ఏపీ: కరోనా నిరోధక చర్యలపై బులెటిన్
సాక్షి, అమరావతి: కరోనా నివారణకు రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ (కొవిడ్-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ( విజయవాడలోనే కరోనా పరీక్షలు) కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 812 మంది ప్రయాణికుల్ని గుర్తించామని తెలిపారు. 536 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 247 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని పేర్కొన్నారు. 29 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 82 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 65 మందికి నెగిటివ్ వచ్చిందని..16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యులతో, ఇతరులతో కలవకూడదన్నారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని జవహర్‌రెడ్డి సూచించారు. (కరోనా టీకా కోసం యూఎస్ కుయుక్తులు!) -
ఏపీ: కరోనాపై మరింత అప్రమత్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరింత అప్రమత్తత చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరులో ఇటలీ నుంచి వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదయిందని వెల్లడించారు. బాధితుడు ఉన్న ప్రాంతం చుట్టుపక్కల కిలోమీటరు వరకు ప్రతి ఇంటిని సర్వే చేశామని చెప్పారు. కరోనా బాధితుడి కుటుంబసభ్యులు, పని మనిషికి కూడా వైద్య పరీక్షలు చేయడంతో పాటు.. వైద్యుల పర్యవేక్షణలో కూడా ఉంచామని పేర్కొన్నారు.(ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు) ఏపీలో ప్రస్తుతం మరెక్కడా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదన్నారు. 13 జిల్లాల్లో 56 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 300 బెడ్లను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇటలీ నుంచి ఏపీకి 238 మంది ప్రయాణికులు వచ్చారని.. వారిని గుర్తించి ప్రత్యేక వైద్య పరీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్విమ్స్‌లో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. (కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత) -
ప్రోటోకాల్ ప్రకారమే కరోనా శాంపిల్ సేకరణ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ అనుమానితుల శాంపిల్ సేకరణ మొత్తం ప్రోటోకాల్ ప్రకారమే జరగాలని రాష్ట్ర వైద్యశాఖ తెలిపింది. తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. గురువారం కరోనా వైరస్‌కు ట్రీట్మెంట్ చేసేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్స్‌కు రాష్ట్ర వైద్యశాఖ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఈ మేరకు ‘‘ ప్రతి హాస్పిటల్లో కరోనా అవగాహన కోసం కరపత్రాలు, బోర్డులు ఏర్పాటు చెయ్యాలి. ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్లను ఇతరులతో కలపవద్దు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఎవరైనా విదేశీ పర్యాటకులు హాస్పిటల్స్‌కు వస్తే వాళ్ల పూర్తి డీటెయిల్స్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం కరోనా వార్డులో వేస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలోని డాక్టర్లకు వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించాల’’ ని తెలిపింది. ( కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని ) ఆరుగురు సభ్యులతో కరోనా నిర్థారణ కమిటీ ఆరుగురు సభ్యులతో కరోనా నిర్థారణ కమిటీ ఏర్పాటైంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ కమిటీని వేసింది. కమిటీలో వైరాలజీ ల్యాబ్, మైక్రో బయోలజీ హెచ్ఓడిలు ఉన్నారు. గురువారం డీఎంఈ కమిటీ మెంబర్లతో భేటీ అయింది. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో సరిపడా సిబ్బందిని కేటాయించటం, సాంఫుల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడంలో జాప్య జరగకుండా చూడడం, ఐసోలేషన్ వార్డుకు వచ్చిన వారికి సరైన వసతులు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై డీఎంఈ అండ్ టీం చర్చించింది. ( కరోనా.. కొరియా టు గోదశివారిపాలెం ) -
ఆడపిల్లలు తగ్గిపోతున్నారు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరం కంటే, ఈ ఆర్థిక సంవత్సరం (ఇప్పటివరకు)లో తేడా కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) ఈ నెల దేశవ్యాప్తంగా మగ, ఆడ శిశువుల నిష్పత్తిని ప్రకటించింది. అప్పుడే పుట్టిన శిశువులను ఆధారం చేసుకొని ఈ నిష్పత్తిని అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మగ, ఆడ శిశువుల నిష్పత్తి ప్రతీ వెయ్యి మగ శిశువులకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 932 మంది ఆడ శిశువులు జన్మించారు. అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 934 మంది ఆడ శిశువులు పుట్టారు. అదే కాలంలో తెలంగాణలో చూస్తే దేశ సగటు కంటే ఎక్కువే ఉన్నా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ సంఖ్య రాష్ట్రంలో తక్కువగా ఉండటం గమనార్హం. 2018–19లో తెలంగాణలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 957 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 950 మంది ఆడ శిశువులు జన్మించినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. 2017–18లో తెలంగాణలో మగ, ఆడ శిశువుల నిష్పత్తి మరింత దారుణంగా ఉండేది. అప్పుడు ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 925 మంది మాత్రమే ఆడ శిశువులున్నారు. 2018–19లో మొత్తం 5,30,146 మంది పిల్లలు జన్మించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4,82,097 మంది జన్మించినట్లు నివేదిక వివరించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యల్పంగా.. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలు స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఆదర్శంగా ఉండటం విశేషం. ఖమ్మం జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 1,057 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆ సంఖ్య మరింతగా పెరిగి 1,177కు చేరుకోవడం విశేషం. ఇక పెద్దపల్లి జిల్లాలో వారి నిష్పత్తి 2018–19 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి మంది మగ శిశువులకు 1,031 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,012 ఉండటం గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 885 మంది జన్మించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 850కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువులు తక్కువగా పుట్టిన జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిర్మల్, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. మిగిలిన జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఆడ శిశువుల నిష్పత్తి పెరిగింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కడుపులోనే ఉన్నప్పుడు స్కానింగ్ ద్వారా ఆడ శిశువులను ముందే గుర్తించి భ్రూణ హత్యలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు డాక్టర్లు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు ఈ విషయంలో డబ్బులకు కక్కుర్తిపడి ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంత చైతన్యం తెస్తున్నా ఈ విషయంలో కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఐదారేళ్లతో పోలిస్తే కొంచెం పరిస్థితి మారిందంటున్నారు. -
ఇకపై కరోనా అని పిలవకూడదు..!
బీజింగ్/లండన్/జెనీవా: చైనాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగగా.. వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చైనా ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం మేరకు కరోనా మహమ్మారికి 1,016 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 42, 638కి చేరింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఒకటి మంగశవారం బీజింగ్‌ను చేరుకుని వైరస్ నిరోధక చర్యల్లో సాయం అందించడం మొదలుపెట్టిందని చైనా ఆరోగ్య కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్ కారణంగా ఒక్కరోజే 108 మంది మరణించారని, 2,478 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. సంయుక్త బృందం ఏర్పాటు.. కరోనా వైరస్‌ను కట్టడి చేసే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందానికి చైనా అధికారులు తోడయ్యారు. ఇరువురూ సంయుక్తంగా వ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఇలా ఉండగా ఇతర దేశాల్లో కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య సోమవారానికి 350కు చేరుకోగా, కనీసం ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. యూఏఈలోని దుబాయిలో మరో భారతీయుడు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకూ ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8కి చేరుకుంది. వ్యాక్సిన్ ప్రయోగాలు షురూ? కరోనా వైరస్ చికిత్సకు ఒక టీకాతో జంతు పరీక్షలు మొదలుపెట్టినట్లు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొన్ని నెలల్లో తొలిదశ ప్రయోగాలు పూర్తి చేసి, మానవుల్లో టీకా సామర్థ్యంపై పరీక్షలు చేపడతామన్నారు. ఈ ఏడాది చివరికి ఇది వినియోగంలోకి రానుందన్నారు. కరోనాతో ప్రపంచానికి ముప్పు! చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ను తగువిధంగా కట్టడి చేయని పక్షంలో అది ప్రపంచం మొత్తానికి ముప్పుగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. ఈ వైరస్‌ను కట్టడి చేసే లక్ష్యంతో జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై కోవిడ్–19 ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్–19’గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్ (జబ్బు)ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు. తల్లికి వైరస్.. బిడ్డ క్షేమం! కరోనా వైరస్ బారిన పడ్డ ఓ మహిళ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చినట్లు చైనా అధికారులు మంగళవారం తెలిపారు. షాన్‌క్సీలో 33 ఏళ్ల మహిళ 2.73 కిలోల బరువున్న బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. పుట్టిన బిడ్డకు పరీక్షలు జరిపి కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ చేశామన్నారు. కరోనా కారణంగా తల్లి నుమోనియాతో బాధపడుతోందన్నారు. -
కరోనా వైరస్: అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్లు
సాక్షి, పశ్చిమగోదావరి : కరోనా వైరస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని శుక్రవారం మాట్లాడారు. ఎవరికైనా 28 రోజుల్లోపు జ్వరం, దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే మాస్క్ ధరించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. అత్యవసర సమాచారం కోసం టోల్ ఫ్రీం నంబర్లు..1100, 1102 లేదా 7013387382, 8008473799 మొబైల్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. (ఏపీలో ‘కరోనా’ జాడ లేదు: ఆళ్ల నాని ) విమానాశ్రయాలు, పోర్టులలో కరోనా వైరస్ గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అందుబాటులో స్కానింగ్ పరికరాలు, మాస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చిందని, జిల్లా స్థాయి వరకు గైడ్ లైన్స్ అందాయా లేదా అని ఆరాతీశారు. రాష్ట్ర పరిధిలో ని పోర్టులలో ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. -
ఆరోగ్యశాఖపై నేడు సీఎం సమీక్ష
సాక్షి, అమరావతి:ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా వెయ్యి రూపాయలు బిల్లు దాటితో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం, వైద్యకళాశాలల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, జాతీయ ఆరోగ్యమిషన్ నిధుల వినియోగం వంటి వాటిపై సమీక్షిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు ఆస్పత్రి నాడు–నేడు (అంటే ప్రస్తుత ఆస్పత్రుల పరిస్థితిని ఫొటోలు తీయడం, రెండేళ్ల తర్వాత తిరిగి ఫొటోలతో చూపించడం) పైనా చర్చిస్తారని తెలిసింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తారు. ఇప్పటికే డయాలసిస్ పేషెంట్లకు రూ.10వేల పెన్షన్, ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు వేతనం పెంపు వంటివి అమలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సమీక్ష కోసం ఇప్పటికే అధికారులు పూర్తి నివేదికలు సిద్ధం చేసుకున్నారు. దీనికోసం అన్ని బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాల అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి డా.పీవీ రమేష్ విడివిడిగా సమీక్షలు చేశారు. -
డెంగీ బెల్స్
డెంగీ హైరిస్క్ జిల్లాగా నిజామాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతోనే జిల్లాలో కేసుల నమోదుకు కారణమవుతోంది.జిల్లా కేంద్రంలోనే డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జూన్ నుంచి డిసెంబ ర్ సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే అవగాహన కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. మరోవైపు డెంగీ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ కొనసాగుతోంది. వ్యాధి నిర్ధారణకే రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి డెంగీ నిర్ధారణ కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంది. ఇక్కడ నిర్ధారణ అయితేనే డెంగీ సోకినట్లు అధికారులు గుర్తిస్తారు. నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో డెంగీ కేసులు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. డెంగీ హైరిస్క్ జిల్లాల్లో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం జరగనుంది. జిల్లాలో ప్రతియేటా డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. క్షే త్రస్థాయిలో వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు అమలు కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2017 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 212 కేసులు నమోదు అయితే జిల్లా కేంద్రంలోనే 122 కేసులు నమోదు అయ్యాయి. 2018లో 156 కేసులు నమోదు అయితే జిల్లా కేంద్రంలో 17 కేసులు నమోదు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని మాలపల్లి, అర్సపల్లి, వినాయక్‌నగర్, అంబేడ్కర్‌కాలనీ, అబీబ్‌నగర్, మహాలక్ష్మీనగర్, గౌతంనగర్, నాగారం, నిజాంకాలనీ, సంజీవయ్యకాలనీ, ఎల్లమ్మగుట్ట, డ్రైవర్స్‌కాలనీ ప్రాంతాల్లో ఎక్కువగా డెండీ కేసులు నమోదు అవుతున్నాయి. 2017లో వినాయక్‌నగర్‌లో 2,789 మంది జనాభా ఉండగా 13 కేసులు అత్యధికంగా ఇక్కడే నమోదు అయ్యాయి. డిచ్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 24 కేసులు నమోదు అయ్యాయి. బోధన్ ప్రాంతంలో అత్యధికంగా 29 కేసులు నమోదు అయ్యాయి. ఆర్మూర్ ఆరోగ్యకేంద్రం పరిధిలో 16 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కో కేసుకు రూ. 400 ఖర్చు డెంగీ కేసు నమోదు కాగానే ఒక్కో కేసుకు రూ. 400 ఖర్చు చేస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ అందుబాటులో స్ప్రేమందు లేకుంటే కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒక్కో కేసుకు 500 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇదివరకు లక్షలాదిరూపాయలు ఖర్చు చేశారు. అయిన వ్యాధుల నియంత్రణ జరగడం లేదు. అటకెక్కిన అవగాహన.... ఈ వ్యాధుల నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. సీజనల్ వ్యా ధులు జూన్ నుంచి డిసెంబర్ వరకు వ్యాపిస్తాయి. ఈ కాలంలోనే వ్యాధుల నమోదు అధికంగా ఉం టుంది. ముందస్తు చర్యలు చేపట్టి జాగ్రత్తలు తీ సుకోవాలి. కళాజాత బృందాలచేత గ్రామాల్లో ప్ర చారం చేపట్టాలి. కరపత్రాల పంపిణీ, ఆరోగ్య కేం ద్రాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇటీవల మలేరియా శాఖ ఆధ్వర్యంలో వ్యాధుల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నిర్వహించారు. వాస్తవానికి గ్రామాల్లో నిర్వహిస్తే ఎంతో ప్రయోజనం చేకూరేది. పాఠశాలల్లో నిర్వహిస్తే నివారణ కార్యక్రమాలు విద్యార్థులు ఎలా చేపడుతారని విమర్శలు వచ్చాయి. ప్రైవేట్‌లో దోపిడీ.. మరోవైపు డెంగీ వ్యాధి నిర్ధారణపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ కొనసాగుతుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో ఆస్పత్రికి రాగానే రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. డెంగీ వ్యాధి నిర్ధారణ పేరిట రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపై 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వెరసి రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బాధితులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. వాస్తవానికి డెంగీ నిర్ధారణ కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంది. ఇక్కడ నిర్ధారణ అయితేనే డెంగీ సోకినట్లు అధికారులు గుర్తిస్తారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం అందించి రోగి నివాస ప్రాంతంలో నివారణ చర్యలు చేపడుతారు. కాని ఇదీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. డెంగీ వ్యాధి నమోదు అయితే సమాచారం అందించాలని మలేరియా శాఖ ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కేవలం రెండు ఆస్పత్రులు 2 కేసులు నమోదు అయినట్లు సమాచారం ఇచ్చాయి. మిగతా ఆస్పత్రులు స్పందించలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపడితే తప్ప రోగుల నిలువుదోపిడీ, వ్యాధి నివారణ జరగదని పలువురు పేర్కొంటున్నారు. అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.... అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే నివారణ చర్యలు చేపడుతాం. వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. వైద్యశాఖ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. –డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి నియంత్రణే మేలు... డెంగీ నియంత్రణ ఎంతో మేలు. వ్యాధి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఇంటిపరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకూడదు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – డాక్టర్ జలగం తిరుపతిరావు, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల -
కోరలు చాస్తున్న డెంగీ
సాక్షి, ఆదిలాబాద్: డెంగీ అప్పుడే కోరలు చా స్తోంది. గతేడాది జిల్లాను వణికించిన ఈ వ్యాధి మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాలను హైరిస్క్‌గా గుర్తించగా..ఇందులో ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది. ప్రధానంగా దీని చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడంతో రోగం పేరెత్తితేనే సామాన్యుల్లో వణుకు పుడుతోంది. దీనికితోడు వ్యాధికి గురైన రోగి కొద్ది నెలల పాటు కోలుకోలేని పరిస్థితి ఉండడం ఇబ్బందిగా మారుతోంది. దోమ చెలగాటం.. దోమ చెలగాటం.. మనిషికి డెంగీ సంకటం అన్న రీతిలో ఉంది. వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభిస్తుంది. ఆర్థో వైరస్‌లో వ్యాప్తి చెంది ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. ఎడిస్ ఎజిప్టే అనే దోమ కుట్టడం వలన డెంగీ వస్తుంది. ఈ వ్యాధి సోకిన రోగిని కుట్టి మరో వ్యక్తిని ఈ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఏడాదికేడాది డెంగీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీజన్ లేని సమయంలో కూడా పాజిటీవ్ కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తుంది. ఆదిలా బాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం రిమ్స్ వైద్యుడు డెంగీ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపింది. ప్రాణా లు కాపాడే వైద్యునికే ప్రాణ రక్షణ లేని పరిస్థితులు రిమ్స్ వైద్య కళాశాలలో ప్రస్పుటం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గట్టి చర్యలు చేపడితేనే రోగుల ప్రాణాలకు రక్షణ కలగనుంది. ఒకవైపు సీజనల్ వ్యాధులు.. వర్షాకాలంలో ఒకవైపు సీజనల్ వ్యాధులతో జనాలు సతమతం అవుతుండగా, పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. డయేరియా (నీళ్ల విరేచనాలు), మలేరియా, చికున్‌గున్యా, యెల్లోఫీవర్ వంటి వ్యాధులు మనుషులను చుట్టుముడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా పాజిటీవ్ కేసులు అధికంగా నమోదవుతాయి. గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అయితే గిరిజనులు ఈ తెరలను ఉపయోగించడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన కలిగించేందుకు వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టనుంది. సమన్వయం అవసరం.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం. ప్రధానంగా పంచాయతీరాజ్, విద్య, ఇరిగేషన్, మైనింగ్, ఐసీడీఎస్, మత్స్య శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యాంటీ లార్వ ఆపరేషన్ చేపట్టడం ద్వారా దోమలను నివారించాలని యోచిస్తుంది. ప్రధానంగా చీకటి ప్రదేశాల్లో, నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు ప్రత్యుత్పత్తి ద్వారా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, జిల్లా వైద్యాధికారులతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. జిల్లా నుంచి అధికారులు పాల్గొననున్నారు. జిల్లా పరిస్థితులకు సంబంధించి నివేదిక రూపొందించి మంత్రికి అందజేయనున్నారు. సీజన్లో అప్రమత్తంగా ఉంటాం సీజన్లో అప్రమత్తంగా ఉంటాం. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జిల్లా ప రిస్థితులను నివేదిస్తాం. డీఎంహెచ్ఓ పరిధిలో 52 వైద్యుల పోస్టులకు గాను 48 పొజిషన్లో ఉండగా, నా లుగు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ చే సేందుకు చర్యలు తీసుకుంటాం. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. – డాక్టర్ రాజీవ్‌రాజ్, డీఎంహెచ్ఓ -
జూనియర్లకే అందలం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైద్య ఆరోగ్యశాఖలో అనర్హులనే అందలం ఎక్కిస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.తాము చెప్పిన మాటను కాదనకుండా చేస్తారనే ఉన్నతాధికారుల ఆలోచనే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) నియామకంలో ఈ తీరు కొనసాగుతోంది. అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ వారిని కాదని.. వారి కంటే తక్కువస్థాయి కలిగిన వారిని అధికారులుగా నియమిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విధంగా తమకు ఇష్టం వచ్చిన జూనియర్ అధికారులను నియమించి..ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సివిల్ సర్జన్ (సీఎస్) కేడర్ కలిగిన వారిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో)గా నియమించాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖలోని ఉన్నతాధికారులు డిప్యూటీ సివిల్ సర్జన్ (డీసీఎస్)లను డీఎంఅండ్‌హెచ్‌వోలుగా నియమిస్తున్నారు. ఈ విధంగా కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురంతో పాటు మరో 5 జిల్లాల్లో జూనియర్ అధికారులను అందలం ఎక్కించినట్టు తెలుస్తోంది. సీనియర్ అధికారులు కాస్తా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోలుగా ఉంటూ తమ జూనియర్ల కిందనే పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో జూనియర్లు తమకేమీ చెప్పేదంటూ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోలు ఎదురు తిరుగుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖలో వ్యవహారం కాస్తా కట్టుతప్పుతోంది. దీంతో పరిపాలన పట్టుతప్పి....కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించలేని పరిస్థితి నెలకొంది. అన్నింటిలోనూ అదే తీరే...!: మాతా, శిశు మరణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ చేయాలని మెడికల్ ఆఫీసర్లతో పాటు ఏఎన్ఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఎవరిస్తారనే అంశం కానీ... ఏ బడ్జెట్ నుంచి తీసుకోవాలనే విషయం కానీ స్పష్టంగా పేర్కొనలేదు. ఫలితంగా మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంల సొంత బడ్జెట్ నుంచి ఈ ఖర్చులను భరించాల్సి వస్తోంది. అదేవిధంగా గతంలో కూడా పోలియో దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు కూడా బడ్జెట్‌ను కేటాయించలేదు. మిగిలిన జిల్లాల్లో ఇందుకోసం బడ్జెట్‌ను కేటాయించినప్పటికీ జిల్లాలో మాత్రం నెలలు గడిచినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. వరుసగా ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఖర్చును వైద్య ఆరోగ్యశాఖ చెల్లించింది. మాతాశిశు మరణాలపై ఆడిట్ విషయంలో కూడా ఇప్పటివరకు మెడికల్ అధికారులకు, ఏఎన్ఎంలకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ విధంగా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు ఆడింది ఆట...పాడింది పాటగా సాగుతోంది. -
బాబోయ్ జ్వరాలు..
సాక్షి, గార: మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడం, ఎండలు మండిపోతుండడంతో ఉపాధి వేతనదారులు, చిన్నారులు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు. అయితే అంతా ఎన్నికల బిజీలో ఉండడంతో వీరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మండలంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మండలంలో శ్రీకూర్మం పంచాయతీలో సెగిడిపేట తదితర గ్రామాలతో పాటు, సైరిగాం పంచాయతీ అప్పోజీపేట, రామచంద్రాపురం, గొంటి పంచాయతీల పరిధిలో అధికంగా జ్వర బాధితులు ఉన్నారు. ఏడు రోజులుగా బాధపడుతున్నా.. ఏడు రోజులుగా జ్వరం వస్తోంది. గ్రామంలోని డాక్టరును అడిగితే మందులు ఇచ్చారు. కానీ తగ్గలేదు. మండలంలో పెద్ద డాక్టరు దగ్గరుకు వెళ్లినా ఏమాత్రం మార్పులేదు. మందులు వాడుతున్నా జ్వరం తగ్గడం లేదు. – బరాటం వెంకటేశ్వరరావు, అప్పోజీపేట మరో ఊరెళ్తున్నాం.. ఊర్లో జ్వరం ఉందని చెబితే మందులిచ్చారు. తగ్గలేదు సరికదా ఒళ్లంతా (శరీరమంతా) ఊపేస్తుంది. ఇంకో ఊరెళ్లి వైద్యం చేయించుకుంటున్నాం. అయినా జ్వరం తగ్గడం లేదు. తిండి తినడం లేదు. – కిల్లాన అచ్చెమ్మ, సెగిడిపేట, శ్రీకూర్మం -
కోతల కాన్పులకు ఇక చెల్లుచీటి..!
సాక్షి, పాలమూరు: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుల లెక్క ఇకనుంచి పక్కాగా ఉంటోంది. పుట్టిన ప్రతీ బిడ్డ, తల్లిదండ్రుల వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలను కట్టడి చేయడానికి, బోగస్ పౌరసత్వం తీసుకునే అవకాశం లేకుండా తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జనవరి 1నుంచి జిల్లాలో ఈ–బర్త్ విధానం అమల్లోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు, జనన వివరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేసే విధానం పకడ్బందీగా చేస్తున్నారు. ప్రతీ ఆస్పత్రికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయించారు. ఏ రోజుకారోజు ప్రసవాల సంఖ్య, వివరాలను ఇందులోపూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–బర్త్ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానంలో తల్లీపిల్లల మరణాలను తగ్గించడంలో పాటు నూరుశాతం కాన్పులు ఆస్పత్రుల్లో జరుగుతాయి. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడంతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు సులువుగా పొందుతారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా భ్రూణ హత్యలు అరికట్టవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల వారు ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకున్నా శస్త్రచికిత్స కాన్పులు చేస్తున్నారా.. అనే అంశాన్ని పరిశీలించవచ్చు. ప్రత్యేకంగా ఏదైనా ఒక ఆస్పత్రిలో కేవలం మగపిల్లలే జన్మిస్తుంటే అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయా.. అనే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డుకట్ట వేసి బోగస్ విదేశీయులు దేశంలో చొరబడి తప్పుడు పౌరసత్వం తీసుకొకుండా నిలువరించవచ్చు. జనవరి 1వ తేదీనుంచి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు ఆ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తోంది. సదరు కుటుంబీకులు సైతం ఈ విధానంలో రూపొందించిన పత్రంలోని వివరాల ప్రకారమే మున్సిపాలిటీ, పంచాయతీల్లో జనన ధ్రువపత్రం పొందవచ్చు. ప్రసవాల సంఖ్య.. జిల్లాలో జనవరి 1 నుంచి అమలు చేస్తున్న ఈ–బర్త్ విధానంలో ఈనెల 25వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,251 కాన్పులు జరిగాయి. వాటిలో సాధారణ కాన్పులు 1,661, సిజేరియన్లు 583 జరిగినట్లు నమోదయ్యాయి. అలాగే జరిగిన కాన్పుల్లో ఆడ శిశువులు 1,128, మగ శిశువులు 1,129 ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు జరుగగా అందులో సాధారణం 307, సిజరీయన్ 640 జరిగాయి. వాటిలో ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది ఉన్నారు. ఇలా నమోదు చేస్తారు.. వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ–బర్త్ నమోదు ప్రక్రియను పటిష్టంగా చేసేందుకు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల జాబితా రూపొందించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. తల్లీబిడ్డకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన యూజర్ ఐడీలలో వివరాలు నమోదు చేసే విధంగా పోర్టల్‌ను రూపొందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రతి రోజు ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల వివరాలతో పాటు తల్లీబిడ్డల సమాచారాన్ని అందులో నమోదు చేస్తారు. భ్రూణ హత్యల నివారణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న భ్రూణ హత్యలను ఈ–బర్త్ పోర్టల్ ద్వారా ఆరోగ్య శాఖ ఇట్టే పసిగట్టనుంది. లింగనిర్ధారణ పరీక్షలు చేయించినా, గర్భస్రావం అయినా వెంటనే తెలిసిపోయేలా ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో ప్రతి గర్భిణి వివరాలను ఏఎన్సీ నమోదు చేస్తున్నారు. రెండో నెల నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణి ఆరోగ్యస్థితిపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొనసాగుతుంది. చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వివరాలతో పాటు ఆరోగ్యవివరాలను అందులో పొందుపరుస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారి ప్రతి ఒక్కరి వివరాలను గుర్తిస్తారు. గర్భిణుల వివరాలు పక్కాగా సేకరించి కాన్పులు జరిగే వరకు వారి పట్ల పర్యవేక్షణ చేస్తారు. గర్భిణీతో పాటు శిశువు ఆరోగ్యస్థితిని కూడా పరిశీలిస్తూ తగిన సూచనలు సలహాలు అందిస్తారు. మరో ప్రయోజనం ఈ విధానం వల్ల అకారణంగా శస్త్రచికిత్స కాన్పులను అడ్డుకట్ట వేయవచ్చు. ప్రతి కాన్పు ఇంటర్నెట్లో నమోదు చేసేప్పుడు శస్త్రచికిత్స ప్రసవం చేస్తే ఎందుకు చేశారు.? సర్జరీ చికిత్స చేయడానికి గల కారణాలను వివరంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా జిల్లా అధికారులతో విచారణ చేపడతారు. అకారణంగా సర్జరీలు చేసినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవ వివరాలను ఏరోజుకారోజు ఈ–బర్త్ విధానంలో నమోదు చేయనట్లయితే ఆయా ఆస్పత్రులపై వైద్యశాఖ కేసులు నమోదు చేయించి మూడేళ్ల జైలు శిక్షపడేలా చర్యలు తీసుకోనుంది. -
‘అర్బన్’లో కాన్పులేవి?
కరీంనగర్‌హెల్త్: జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక ప్రసవం కూడా నిర్వహించలేదు. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో రోగుల తాకిడి తగ్గించి స్థానికంగా మెరుగైన చికిత్స అందుబాటులోకి తేవాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ఆరు యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. మాతా శిశు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే నగరంలోని మూడు పాత అర్బన్ పీహెచ్‌సీలకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేసింది. ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా అన్ని రకాల చికిత్స అందించేందుకు 10 పడకలతో సౌకర్యాలు కల్పించింది. అర్బన్ పీహెచ్సీ పరిధిలో నమోదైన గర్భిణులకు అక్కడే సాధారణ ప్రసవాలు జరిపించాలని లేబర్ రూంలను సైతం ఏర్పాటు చేసి సామగ్రి, సౌకర్యాలు కల్పించింది. అదేస్థాయిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని కూడా నియమించింది. అయినా ఇప్పటివరకు ఒక సాధారణ ప్రసవం కూడా జరగలేదు. ఎంసీహెచ్సీపై ప్రభావం పీహెచ్‌సీల మాదిరిగానే నగరంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించకపోవడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంపై విపరీతమైన ప్రభావం పడుతోంది. ఎక్కడి వారికి అక్కడే ప్రసవాలు జరిపించాలని, ప్రసవం ప్రమాదకరంగా మారిన గర్భిణులు, హైరిస్క్ కేసులను మాత్రమే ఇక్కడకు తీసుకురావాల్సి ఉంది. అయితే సాధారణ ప్రసవాలు కూడా జరుపకుండా ఎసీహెచ్సీకి రెఫర్ చేయడంతో వైద్యసేవలు అందించడం ఇబ్బందికరంగా మారుతోందని, రిస్కు కేసులపై దృష్టి సారించలేక పోతున్నామని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో పెరుగుతున్న కేసులు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి వరకు 8554 ప్రసవాలు నిర్వహించారు. 2019 జనవరిలోనే 762 ప్రసవాలు జరిగాయి. మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు చర్యలు చేపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇంటింటికీ సర్వేలు నిర్వహించి గర్భిణుల పేరు నమోదు చేసుకొని ప్రత్యేక వైద్య సేవలు అందిస్తోంది. గర్బం దాల్చి పేరు నమోదు అయినప్పటి నుంచి ప్రసూతి జరిపించి తల్లితోపాటు శిశువును కూడా ఆరోగ్యంగా ఇంటికి చేర్చుతున్నారు. ఇంటికి చేరిన శిశువుకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతినెలా వ్యాధి నిరోధక టీకాలు వేయడం వంటివి పకడ్బందీగా చేపడుతోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ వంటి ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపయింది. 2018లో 9185 ప్రసవాలు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో 2018లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 9185 ప్రసవాలు నిర్వహించారు. 2016లో 3762 ప్రసవాలు నిర్వహించగా, 2017లో దాదాపు సంఖ్య రెట్టింపై 6945కు చేరింది. 2019 జనవరిలో 762 ప్రసవాలు నిర్వహించారు. వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసవాలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో డాక్టర్లు, సిబ్బందికి వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆయా కేంద్రాల్లో జరుగుతున్న గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందుతున్న వైద్యసేవలపై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. గర్భిణుల పేరు నమోదు, వారికి అందుతున్న వైద్య సేవలపై దృష్టి సారిస్తోంది. పేరు నమోదు నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతీవారం ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. తొమ్మిది నెలలు నిండే సమయానికి ముందుగానే పరీక్షలు చేసి సుఖప్రసవం కావడానికి చర్యలు చేపడుతుండంతో ప్రసవాలసంఖ్య రెట్టింపు అవుతోంది. -
ఈఎన్టీ పరీక్షలకు కసరత్తు
నల్లగొండ టౌన్ : జిల్లాలో ఒకవైపు కంటివెలుగు వైద్యశిబిరాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. ఫిబ్రవరి మాసంలో ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతుతోపాటు డెంటల్ ) పరీక్షలను నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో గత ఆగస్టు 15న ప్రారంభమైన కంటివెలుగు శిబిరాలను ఈ నెల 26 వరకు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కొంత ఆలస్యమయ్యే అవకాశం కని సిస్తోంది. ఆ శిబిరాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఈఎన్టీ పరీక్షల శిబిరాలను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించడానికి అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌నుంచి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల స భ్యులందరి ఆరోగ్య వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన శిక్షణను ఏఎన్ఎంలకు పూర్తి చేశారు. ఏఎన్ఎంల వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌ల్లోకి 2014 సమగ్ర కుటంబ సర్వే లెక్కల ప్రకారం కుటుంబాల ఆరోగ్య వివరాలు ఎస్కెఎస్ నుంచి డౌన్లోడ్ ఆయ్యా యి. దీనిలో ఆయా కుటుంబ యజమాని ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే ఆ కుటుంబ సభ్యుల వివరా లు, ఆరోగ్య స్థితిగుతులు తెలిసిపోనున్నాయి. వాటి ఆధారంగా వారి వద్దకు వెళ్లి సభ్యుల ఆరోగ్య స్థితిగతులను ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ కుటుంబంలోని సభ్యులు మరణిస్తే వారి పేరును తొలగించడం, కొత్త సభ్యులు వస్తే నమోదు చేయడం వంటి సదుపాయం కూడా కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గంగవరప్రసాద్ ఈ నెల 16వ తేదీలోగా హెల్త్ ప్రొఫైల్‌ను పూర్తి చేసి తమకు అందజేయాలని ఆయా వైద్యాధికారులకు, డిప్యూటి డీఎంహెచ్ఓలకు, ఏఎన్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏఎన్ఎంలు హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన అన్ని కుటుంబాల హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపించనున్నారు. తదనంతరం అక్కడినుంచి ఇచ్చే గైడ్‌లైన్స్ మేరకు ఫిబ్రవరిలో ఈఎన్టీ పరీక్షల క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. శిబిరాల కోసం అవసరమైన ఈఎన్టీ డాక్టర్లు, ఆడియాలజిస్టులు, డెంటల్ డాక్టర్ల నియామకంతో పాటు పరీక్షలకు కావాల్సిన పరికరాలను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆదేశాలు రాగానే ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈఎన్టీ పరీక్షలు నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పటికే ఆ యా కుటుంబ సభ్యుల హెల్త్ ఫ్రొఫైల్‌ను అన్ని పట్టణాలు, గ్రామాలలో సి బ్బంది సేకరిస్తున్నారు. హెల్త్ ప్రొఫైల్ ఆ ధారంగా కమిషనర్ ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకా రం శిబిరాలను ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ గంగవరప్రసాద్, డీఎంహెచ్ఒ -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోంది. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్యసేవలు అందుబాటులోకి రావాలి. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: వైద్యరంగంలో మన దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు ఒక వరమని అన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (పిమ్స్)లో శనివారం సికిల్‌సెల్, తలసేమియా చికిత్స కేంద్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభించారు. వైద్య విద్యలో అత్యంత ప్రతిభ చూపిన ఐదుగురు మెడికోలకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిమ ఆడిటోయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మెడికోలు, వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. దేశంలో పోలియో, స్మాల్ఫాక్స్ వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని, అదే తరహాలో తలసేమియా వ్యాధి నిర్మూలనకు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్యలో బాలబాలికల నిష్పత్తి పెరగడం సంతోషకర పరిణామమని అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం గల కరీంనగర్‌కు రావడం ఇదే ప్రథమని, ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఒకప్పుడు ఒక్కరే.. ఇప్పుడు మూడు, నాలుగు కోట్ల మంది : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు తలసేమియా దేశాన్ని కంగదీసే వ్యాధి అని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. 1938లో దేశంలో ఒక్కకేసే నమోదైతే... ఇప్పుడా సంఖ్య మూడు నుంచి నాలుగు కోట్లకు చేరిందన్నారు. కేరళలోని ఆదివాసీలలో తలసేమియా అధికంగా ఉందన్నారు. తలసేమియా విషయంలో భారతావని అప్రమత్తం కావాలన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి కోసం 2లక్షల యూనిట్లు అవసరమని తెలిపారు. బాధితులకు ఉచిత రక్తమార్పిడి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మేనరికం వల్ల మాత్రమే తలసేమియా వస్తుందనుకుంటే పొరపాటని, ఇప్పుడు అందరికీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువతీ యువకులు పెళ్లికి ముందు రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. అందరూ కృషి చేస్తేనే ఆరోగ్య తెలంగాణ: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒక మంచి ఆశయం, లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. పట్టణ ప్రాంతాలకు తోడు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణలం తా ఆరోగ్యంగా ఉండాలన్నారు. తలసేమియా, సికెల్‌సెల్ తదితర వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్యోగవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం అందరి కృషి అవసరమన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఆసుపత్రి చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు మందు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్లను హెలిప్యాడ్ వద్ద కలిసి స్వాగతం పలికారు. -
జానంపేట నం.1
సాక్షి, పాలమూరు : జాతీయ స్థాయిలోనే జిల్లా లోని మూసాపేట మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సత్తా చాటింది. జాతీయ ప్రమాణ ధ్రువపత్రం కోసం రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో 29 పీహెచ్‌సీలు పోటీ పడగా జానంపేటకు పీహెచ్సీ 97 మార్కులతో మొదటి స్థానం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నుంచి తాజాగా ధ్రువీకరణ పత్రం అందింది. అంతేకాకుండా జిల్లా లోని మరికల్, మిడ్జిల్ పీహెచ్‌సీలు సత్తా చాటి మెరుగైన మార్కులు సాధించాయి. ఇలా ఒకే జిల్లాలో మూడు పీహెచ్‌సీలు ఒకేసారి ధ్రువీకరణ పత్రాలు అందుకోవడం అరుదైన ఘటనగా వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. 97 మార్కులు ఏటా జాతీయ ప్రమాణ ధృవపత్రం అందజేసేందుకు పీహెచ్‌సీలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు పరిశీలిస్తాయి. ఈ మేరకు రాష్ట్రంలో 29 పీహెచ్‌సీలు దరఖాస్తు చేయగా.. జిల్లా నుంచి జానాపేట, మరికల్, మిడ్జిల్ నుంచి దరఖాస్తులు వెళ్లాయి. ఇందులో భాగంగా ఆగస్టు 10, 11వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆయా పీహెచ్‌సీలను పరిశీలించి వెళ్లారు. తాజాగా జానంపేట పీహెచ్‌సీకి 97 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థానం కేటాయిస్తూ ధృవీకరణ పత్రం జారీ చేశారు. అలాగే, మిడ్జిల్ పీహెచ్‌సీకి 94.6 మార్కులు, మరికల్ పీహెచ్‌సీకి 90.2 మార్కులు కేటాయించి పత్రాలు అందజేశారు. వైద్యులు, ఉద్యోగుల పనితీరుతో పాటు సౌకర్యాల కల్పన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల వారీగా మార్కులు కేటాయించారు. కాగా, జాతీయ ప్రమాణ ధృవీకరణ పత్రాలకు ఎంపికైన జానంపేట, మిడ్జిల్, మరికల్ పీహెచ్‌సీలకు ఏటా రూ.3లక్షల చొప్పున మూడేళ్ల పాటు రూ.9లక్షల నిధులు అందనున్నాయి. ఏయే అంశాల్లో.. పీహెచ్‌సీల పరిశీలన సందర్భంగా కేంద్రప్రభుత్వ అధికారులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు పీహెచ్‌సీలకు వస్తున్న రోగులతో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, ఆప్యాయంగా ఉంటున్నారా అని చూడడంతో పాటు మందులు సక్రమంగా ఇస్తున్నారా, స్వాంతన కలి గించే విధంగా మాట్లాడుతున్నారా అని పరిశీలించారు. అలాగే, ఆస్పత్రిలో మంచాలు, పరుపులు, బెంచీలు, కుర్చీల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందా, లేదా అని చూశారు. ఇలా పలు అంశాల ప్రాతిపదికన మార్కులు కేటాయించారు. -
‘వెలుగు’తోంది..!
ఖమ్మం వైద్యవిభాగం: కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంపై ముందస్తుగా విస్తృత ప్రచారం చేయడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా.. వయసు నిమిత్తం లేకుండా కంటి పరీక్షలు చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. కంటి పరీక్షలు చేయడంతోపాటు సమస్య ఉన్న వారికి మందులతోపాటు కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరం అనుకుంటే నిర్దేశించిన ఆస్పత్రుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 32 బృందాల పర్యవేక్షణలో.. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36 బృందాలు అవసరముంటాయని అంచనాకు రాగా.. 32 వైద్య బృందాల ద్వారా వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరో నాలుగు బృందాలను అత్యవసరం మేరకు అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా సమస్య ఏర్పడినట్లయితే అత్యవసర బృందాలను వినియోగిస్తున్నారు. కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా డీఎంహెచ్ఓ కొండల్రావు పర్యవేక్షణలో వైద్య శిబిరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 14,39,000 జనాభా ఉండగా.. నగరంలో 3,20,000 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక లు తయారు చేసి.. ఆ దిశగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల్లో 1,08,692 మందికి పరీక్షలు జిల్లావ్యాప్తంగా కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 1,08,692 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 47,520 మంది పురుషులు కాగా.. 61,162 మంది మహిళలు ఉన్నారు. 10 మంది ట్రాన్స్‌జెండర్స్ పరీక్ష చేయించుకున్న వారిలో ఉన్నారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామీణ, అర్బన్ ప్రాంతాలుగా విడదీశారు. 25 బృందాలు గ్రామీణ ప్రాంతంల్లో ప్రతి రోజూ పరీక్షలు చేస్తున్నారు. 7 బృందాలు నగరంలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో 447 గ్రామాలు ఉండగా.. ఇప్పటివరకు 108 గ్రామాల్లో పరీక్షలు పూర్తయ్యాయి. అలాగే నగరంలో 50 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 9 డివిజన్లలో పరీక్షలు పూర్తి చేశారు. వారంలో 5 రోజులపాటు శిబిరాలు నిర్వహిస్తుండగా.. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో బృందం 250, పట్టణ ప్రాంతంలో 350 మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పథకం ప్రారంభంలో కొంతమేర మందకొడిగా సాగినా.. ప్రస్తుతం కంటి పరీక్షలు ఊపందుకున్నాయి. 27,580 మందికి కళ్లద్దాల పంపిణీ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 27,580 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కంటి సమస్యతో బాధపడుతూ.. కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి మాత్రమే డాక్టర్లు కళ్లద్దాలు రాస్తున్నారు. మరో 28,223 మందికి కళ్లద్దాలు ఇవ్వాలని డాక్టర్లు రాయగా.. వారికి హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంది. జిల్లాకు 1,60,000 కళ్లద్దాలు పంపించారు. అయితే కంటి సమస్య ఎక్కువ ఉన్న వారికి ప్రత్యేకంగా ఇండెంట్ పెట్టి తెప్పిస్తున్నారు. అయితే నెల రోజుల కాలంలో 13,047 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని గుర్తించారు. అందులో 9,626 మందిని ఖమ్మం, 3,421 మందిని హైదరాబాద్ ఆస్పత్రులకు ఆపరేషన్ కోసం పంపించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. జిల్లాలో కంటి పరీక్షలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. 32 వైద్య బృందాల ద్వారా ప్రతి రోజు 9వేల మందికి పైగా పరీక్షిస్తున్నాం. అత్యవసర బృందాలను కూడా వినియోగిస్తున్నాం. మందులు, కళ్లజోళ్లకు ఎలాంటి కొరత లేదు. నాలుగు నెలలకుపైగా శిబిరాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరినీ పరీక్ష చేస్తాం. ప్రజలు శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలి. – కొండల్రావు, డీఎంహెచ్ఓ -
పడకేసిన పారిశుధ్యం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎడతెరిపిలేని వర్షాలతో గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. మరోవైపు పారిశుధ్య కార్మికులు నెలరోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. ఎటు చూసినా పాత బొందలు, గుంతల్లో నీళ్లు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయి. దోమకాటుతో గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. విషజ్వరాల బారిన పడినవారు ఇంటికో బాధితుడు అన్నట్లు తయారైంది. ఇదిలా ఉంటే గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. వర్షాలు ఒక వైపు దంచికొడుతుంటే.. దోమ కాటుతో విషజ్వరాలు, మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో వైద్యసేవలకు ఉపక్రమించకపోవడంతో బతుకుజీవుడా అన్నట్లు ప్రజలు అల్లాడుతున్నారు. పరిస్థితి చేయిదాటినా ప్రభుత్వం ఇంతవరకు కళ్లు తెరవకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోతున్నారు. పాలనా కొత్తదే.. ఆగష్టు 2తో గ్రామపంచాయితీల పాలకవర్గాల పాలన ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వీరు పాలనకు కొత్త కావడం గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అంతగా అనుభవం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పరిస్థితులు పూర్తిగా తారుమారు కావడంతో స్పెషలాఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. మురుగు, చెత్త నిల్వలు లేకుండా చూసేందుకు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇక చేసేదేమి లేక చేతులెత్తే పరిస్థితి వచ్చింది. తాగునీటికి క్లోరినేషన్ చేసి అందించడంతో పాటు ఎక్కడా మురుగునీరు కలువకుండా, లీకేజీల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై అవగాహన ఉన్న అధికారులు సైతం తక్కువగా ఉండడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. హెల్త్ ఎమర్జెన్సీపై దృష్టేది..? ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో జ్వరపీడితులు పెరుగుతున్నారు. విషజ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి వైద్య సేవలు అందించాల్సిన జిల్లా వైద్య యంత్రాంగం ఏమీ జరగనట్లుగానే ఎప్పటిలాగే వ్యవహరిస్తోంది. ఈ నెల రోజుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వైద్య సేవలు పెంచలేకపోతోంది. గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో వైద్య సేవలు అందించాల్సింది పోయి నెలకోసారి వైద్య సేవలు అందిస్తుండడంతో పల్లెలు రోగాల బారి నుంచి బయటపడలేకపోతున్నాయి. పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మారుమూల గ్రామాల ప్రజలు ఆర్ఎంపీలను నమ్ముకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం, పారిశుధ్యంపై నేడు మంత్రి రాజేందర్ సమీక్ష.. గ్రామాల్లో నెలకొన్ని పరిస్థితులను చక్కదిద్దేందుకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఆరోగ్యం, పారిశుధ్యంపై నగరంలోని పద్మనాయక కళ్యాణమండపంలో ఉదయం 10 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల డీపీవోలు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపరిచి, జ్వరపీడితులకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. -
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై నిరసన
హైదరాబాద్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం వివిధ సంఘాల ఉద్యోగులు కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోని డీఎంఈ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరేట్, డెరైక్టర్ ఆఫ్‌హెల్త్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ కార్యాల యాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పారామెడికల్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్లు, నాలుగవ తరగతి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. వీరికి ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ), ఏఐటీయుసీ, సీఐటీ యూ, భారతీయ జనతామజ్దూర్ సంఘ్ యూని యన్లు మద్దతు పలికాయి. ఒక్కసారిగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు డీఎంహెచ్ఎస్లోకి ప్రవేశించడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. ఈ సందర్భంగా టీజీడీఏ ప్రతినిధులు డాక్టర్ రమేష్, జూపల్లి రాజేందర్, పుట్ల శ్రీనివాస్ బృందంతో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ అనురాధను కలసి వారి సమస్యలను వివరించారు. ఈ సమస్యను ప్రిన్సిపాల్ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు యూసుఫ్ మాట్లాడుతూ నాంపల్లి నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.