అత్యధికంగా మగవారికే కరోనా!  | Trends Reflect Corona Virus Effects More Men Than Women! | Sakshi
Sakshi News home page

కరోనా: పురుషుల్లో 60 శాతం..మహిళల్లో 40 శాతం 

Published Sat, Mar 27 2021 4:33 AM | Last Updated on Sat, Mar 27 2021 12:14 PM

Trends Reflect Corona Virus Effects More Men Than Women! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పురుషుల్లోనే అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. జన సమూహాల్లోకి ఎక్కువగా వెళ్లడం, ఉపాధి, ఉద్యోగాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండటం.. తదితర కారణాలతో పురుషుల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, అందులో 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.  

ఒక్కరోజులో 518 కేసులు 
రాష్ట్రంలో ఇప్పటివరకు 99,03,125 మందికి పరీక్షలు చేయగా, అందులో 3,05,309 మందికి కరోనా సోకింది. గురువారం 57,548 మందికి పరీక్షలు చేయగా, 518 మందికి కరోనా సోకినట్లు తేలిందని ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 157 మంది కరోనా బారినపడ్డారు. గురువారం 204 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,99,631 మంది కోలుకున్నారు. 


నమోదైన కరోనా కేసుల్లో పురుషులు, స్త్రీలశాతం 

తాజాగా ముగ్గురు చని పోగా, ఇప్పటివరకు 1,683 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,995 ఉండగా, ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 1,767 మంది ఉన్నారు. గురువారం నాటికి 60 ఏళ్లు పైబడినవారు 3,49,989 మంది టీకా వేయించుకున్నారు. వ్యాధిగ్రస్తులు 1,72,928 మంది టీకా పొందారు. ఇప్పటివరకు మొదటి డోస్‌ తీసుకున్నవారు 8,54,509 మంది. రెండో డోస్‌ టీకా తీసుకున్నవారు 2,30,582 మంది ఉన్నారు. గురువారం 60 ఏళ్లు పైబడిన 20,516 మందికి మొదటి డోస్‌ వేయగా, వ్యాధిగ్రస్తుల్లో 13,178 మందికి టీకా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement