
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైద్యరంగంలో రెండేళ్ల ప్రగతికి సంబంధించి శనివారం ప్రభుత్వం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆ అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకు రాష్ట్రంలో 95 శాతం ప్రజలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్(మ్యుకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్) చికిత్సలన కొత్తగా చేర్చినట్లు నివేదికలో పేర్కొంది. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 అందజేస్తున్నారు.
నాడు-నేడు పథకం కింద దశలవారీగా మూడేళ్లలో ఆసుపత్రుల ఆధునీకరణ చేసినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకం చేపట్టారు. వీటితో పాటు 108/104 సేవల కోసం 1180 అంబులెన్స్ లు, సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశారు.“వైఎస్సార్ కంటి వెలుగు” పథకం క్రింద ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3,000 నుండి రూ.10 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నారు. వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇక్కడ చదవండి: ఆరోగ్యశ్రీకి పడకలివ్వకుంటే అనుమతులు రద్దు
Comments
Please login to add a commentAdd a comment