వైద్య శాఖలో 3 వేల కొత్త ఉద్యోగాలు.. | 3000 Vacancies In Telangana Health Department | Sakshi
Sakshi News home page

Telangana: వైద్య శాఖలో 3 వేల కొత్త ఉద్యోగాలు..

Published Thu, Jun 24 2021 8:24 AM | Last Updated on Thu, Jun 24 2021 8:25 AM

3000 Vacancies In Telangana Medical Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య శాఖలో కొత్తగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్‌ కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏడు మెడికల్‌ కళాశాలల్లో 2,135, 15 నర్సింగ్‌ కాలేజీల్లో 900 పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ మెడికల్‌ కళాశాలల్లో మొత్తం 33 విభాగాలకు పలు రకాల పోస్టులు మంజూరు చేశారు.

స్టోర్‌ కీపర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టెనో టైపిస్టులు, రికార్డు క్లర్క్‌లు, రికార్డు అసిస్టెంట్లు, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్లు, కార్పెంటర్లు, అటెండర్లు, వార్డు బాయ్స్, డ్రైవర్లు, టెలిఫోన్‌ ఆపరేటర్లు లాంటి పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతినిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 13 నర్సింగ్‌ కళాశా లలు, ఇప్పటికే నడుస్తున్న 2 నర్సింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 15 కళాశాలల్లో మరో 900 పోస్టు ల భర్తీకి అనుమతినిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కళాశాలల్లో కూడా టైపిస్టు లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో), అటెం డర్లు, హౌజ్‌కీపింగ్, శానిటేషన్‌ సిబ్బంది, కుక్‌ లు, కిచెన్‌ బాయ్స్‌.. తదితర పోస్టులున్నా యి. ఈ పోస్టులన్నింటికీ గతంలో ప్రభుత్వం విడుద ల చేసిన ఉత్తర్వుల ప్రకారం వేతనం ఉంటుందని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పోస్టు లు మనుగడలో ఉంటాయని పేర్కొన్నారు.  

ఒక్కో నర్సింగ్‌ కాలేజీకి మంజూరైన పోస్టులు 
టైపిస్టు/డీఈవో (2), రికార్డు అసిస్టెంట్‌ (2), అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ (1), హౌస్‌ కీపర్స్‌ (4), ఎలక్ట్రీషియన్‌/మెకానిక్‌ (1), అటెండర్లు (6), డ్రైవర్లు (4), వాచ్‌మెన్‌ (4), క్లీనర్లు (4), శానిటేషన్‌ సిబ్బంది (13), ల్యాబ్‌ అటెండెంట్స్‌ (5), లైబ్రరీ అటెండెంట్స్‌ (3), కుక్స్‌ (4), కిచెన్‌బాయ్స్‌ (5), ధోబీ (2) 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement