
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విధుల్లో మరణించిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బందికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని వైద్య,ఆరోగ్యశాఖలోని 24 సంఘాల ప్రతినిధులతో కూడిన ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మరణించిన వైద్య సిబ్బంది కుటుంబాల్లో అర్హులైన వారికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, వారి కుటుంబసభ్యులను కూడా ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి తొలి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రజారోగ్య వైద్య సంచాలకులు డా.శ్రీనివాసరావుకు ఐక్యవేదిక నేతలు డా.రవిశంకర్ ప్రజాపతి, డా.కత్తి జనార్దన్, సు జాత, రాజశేఖర్, ఎ.సుజాత శనివారం వినతిపత్రం సమర్పించారు.
అనంతరం కోఠి లోని డైరెక్టర్ హెల్త్ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కో విడ్ బారిన పడిన నర్సులు, ఇతర సిబ్బందికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్స, నిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా 21 రోజుల వేతనంతో కూడిన జీతం ఇచ్చేలా జీవో జారీచేయాలని కోరారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్, ఇతర ఉద్యోగులకు షిఫ్టులవారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసు కోవాలన్నారు. ఇప్పటికే ఆయా సమస్యలు, అంశాలను గురించి మంత్రి హరీశ్ రావు, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి ఫలితం లేదని, వచ్చే వా రం, పది రోజుల్లో తమ సమస్యలపై స్పందించి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వ్యాక్సిన్లపై వారం ఆగమన్నారు..
వైద్యులు, ఇతర సిబ్బంది కుటుంబసభ్యులకు వ్యాక్సినేషన్‌పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని డా.జి.శ్రీనివాసరావు చెప్పినట్లు ఐక్యవేదిక నాయకుడు డా.రవిశంకర్ తెలిపారు. కరోనా విధుల్లో మరణించిన వారికి నష్టపరిహారం, ఇతర సమస్యలు, డిమాండ్ల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment