సాక్షి, అమరావతి: కరోనా నివారణకు రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ (కొవిడ్-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ( విజయవాడలోనే కరోనా పరీక్షలు)
కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 812 మంది ప్రయాణికుల్ని గుర్తించామని తెలిపారు. 536 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 247 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని పేర్కొన్నారు. 29 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 82 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 65 మందికి నెగిటివ్ వచ్చిందని..16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యులతో, ఇతరులతో కలవకూడదన్నారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని జవహర్‌రెడ్డి సూచించారు.
(కరోనా టీకా కోసం యూఎస్ కుయుక్తులు!)
Comments
Please login to add a commentAdd a comment