bulletin release
-
RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..
ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ మందగించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్ స్పష్టం చేసింది. భారత్‌లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్ పేర్కొనడం గమనార్హం. ► గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం. తొలి అంచనాలకన్నా ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట పడింది. ► ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది. ► కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్టీఏఆర్టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. -
బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. -
ఏపీలో తాజాగా 11,434 కరోనా కేసులు నమోదు..
అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,434 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన ఏపీలో 64 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 7,055 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా.. 9 లక్షల 47 వేల 629 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 99,446 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,61,43,083 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో ఏపీలో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు శ్రీకాకుళం-1322, విజయనగరం-633, విశాఖ-1067 కేసులు,తూ.గో- 253, ప.గో -424, కృష్ణా -544, గుంటూరు-2028 కేసులు, ప్రకాశం - 497, నెల్లూరు -1237, చిత్తూరు - 1982 కేసులు,అనంతపురం-702, కర్నూలు-474, వైఎస్ఆర్ కడప జిల్లా - 271 కేసులు నమోదయ్యియి. చదవండి: స్వల్ప లక్షణాలున్న బాధితులకు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స -
ఏపీలో తాజాగా 11,698 కరోనా కేసులు నమోదు..
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 50,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన ఏపీలో 37 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,421 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా.. 9 లక్షల 31 వేల 839 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 81,471 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,59,31,722 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో ఏపీలో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు శ్రీకాకుళం-1641, విజయనగరం-592, విశాఖ-947 కేసులు,తూ.గో- 909, ప.గో -292, కృష్ణా -631, గుంటూరు-1581 కేసులు, ప్రకాశం - 462, నెల్లూరు -902, చిత్తూరు - 1306 కేసులు అనంతపురం-1066, కర్నూలు-820, వైఎస్ఆర్ జిల్లా - 549 కేసులు చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం కీలక ప్రకటన -
ఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు!
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,086 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన 14 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 1,745 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం, 9 లక్షల 3వేల 72 మంది కరోనా నుండి కోరుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 31,710 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,55,70,201 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. చదవండి: వ్యాక్సిన్.. రికార్డు: అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్ -
ఏపీలో మరో కరోనా కేసు నమోదు..
సాక్షి, విజయవాడ: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 12కు చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదయ్యిందని.. దీంతో కరోనా కేసులు 12కు చేరిందన్నారు. బర్మింగ్ హమ్ నుండి వచ్చిన వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ నెల 17న ఆ వ్యక్తి విశాఖపట్నం వచ్చారని.. 21న ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. (ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి..) 28,028 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించామని పేర్కొన్నారు. 27,929 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. 385 మంది శాంపిల్స్‌ను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని.. 55 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సిఉందని తెలిపారు. 317 నెగిటివ్, 12 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. -
44 మందిని క్వారంటైన్‌కు తరలింపు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకూ ఏపీలో 10 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ కాగా, 289 కేసులు నెగటివ్‌గా వచ్చినట్లు చెప్పారు. మరో 33 కేసుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. (రాష్ట్రానికి వచ్చే ప్రయత్నాలు చేయొద్దు : ఏపీ ప్రభుత్వం) కాగా విదేశాల నుంచి వచ్చిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా స్క్రీనింగ్ చేస్తోంది. ఇప్పటివరకూ 26,059 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని వాలంటీర్లు గుర్తించారు. మరోవైపు 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 117మందిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకూ 332 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, 289 కేసులు నెగటివ్‌గా, 10 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. మరో 33 కేసుల ఫలితాల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. (భారత్ తొలి దశలోనే అరికడుతుంది: చైనా) ఇక పలు జిల్లాల్లో నిత్యావసరాలను రాష్ట్ర ప్రభుత్వం డోర్ డెలివరీకి ఏర్పాట్లు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరుకులు అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్, నాకా బందీకి సీఎస్, డీజీపీలు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రహదారులను బ్లాక్ చేసి, పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ నుంచి వచ్చి 44 మందిని క్వారంటైన్‌కు తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రజల సందేహాలు తీర్చేందుకు 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఇరవై నాలుగు గంటలు పని చేసేలా నాలుగు టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. -
కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు
సాక్షి, విజయవాడ: కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 135 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా 108 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. 3 కోరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని.. వారికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 24 మంది శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి గృహ నిర్బంధ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. ఏపీలో అన్ని లైన్ డిపార్ట్మెంట్లతో కలిసి సర్వే చేపడుతున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో ఈ సర్వే చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కోటి 41 లక్షల కుటుంబాలకు గాను.. కోటి 33 లక్షల ఇళ్లను సర్వే చేశామని తెలిపారు. ప్రతీ పట్టణ, గ్రామాల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని స్థానిక పీహెచ్‌సీల ద్వారా వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల స్వీయ నిర్బంధంలో తప్పనిసరిగా ఉండాలని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఏపీ: కరోనా నిరోధక చర్యలపై బులెటిన్
సాక్షి, అమరావతి: కరోనా నివారణకు రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ (కొవిడ్-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ( విజయవాడలోనే కరోనా పరీక్షలు) కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 812 మంది ప్రయాణికుల్ని గుర్తించామని తెలిపారు. 536 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 247 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని పేర్కొన్నారు. 29 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 82 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 65 మందికి నెగిటివ్ వచ్చిందని..16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యులతో, ఇతరులతో కలవకూడదన్నారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని జవహర్‌రెడ్డి సూచించారు. (కరోనా టీకా కోసం యూఎస్ కుయుక్తులు!) -
కరోనా వైరస్‌పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ ( కోవిడ్ –19)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్‌పై వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని చెప్పారు. కరోనా లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్‌ను ధరించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలని తెలిపారు.(ఏపీలో 'కోవిడ్' లేదు) ఏపీలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. 153 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి స్థిమితంగా ఉందని తెలిపారు. 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగిటివ్ అని తేలిందని.. ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. (అమ్మో.. చైనా నౌక!) ప్రయాణికులపై నిఘా.. కరోనా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామని జవహర్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ్రస్కీనింగ్ చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ డీజీ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారని తెలిపారు. అధిక ధరలకు మాస్క్ లు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ లు కూడా రద్దు చేస్తామన్నారు. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. (ఆందోళన వద్దు.. అప్రమత్తం కావాలి) -
హుజూర్‌నగర్‌పై బులెటిన్ విడుదల చేసిన ఈసీ
సాక్షి, సూర్యాపేట : హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు. మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104 ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500 సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల కోడ్ ఉల్లంఘన కేసులు: 10 సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15 కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం. అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు: టిఆర్ఎస్ - శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112 కాంగ్రెస్ - పద్మావతి రెడ్డి - రూ.5,27,621 బీజేపీ - కోట రామారావు - రూ.4,22,258 స్వతంత్ర అభ్యర్థి - తీన్మార్ మల్లన్న - రూ.3,73,945. టిడిపి - చావా కిరన్మయి - రూ.3,46,968 స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360 -
'509 మందికి స్వైన్ ఫ్లూ'
హైదరాబాద్: ఈనెలలో మొత్తం 1398 మందిపై వైద్యపరీక్షలు నిర్వహిస్తే వారిలో 509 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలిందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ తీవ్రతపై ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి 21 మంది మృతిచెందారన్నారు. బుధవారం జరిపిన పరీక్షల్లో మొత్తం 101 మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 42 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు ,నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పట్టిందన్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలను వివరిస్తూ..ఎవరికైనా జ్వరంతో కూడిన జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులు కూడా ఉపయోగించవచ్చని సూచించారు.