
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 50,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన ఏపీలో 37 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,421 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా.. 9 లక్షల 31 వేల 839 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 81,471 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,59,31,722 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
గత 24 గంటల్లో ఏపీలో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు
శ్రీకాకుళం-1641, విజయనగరం-592, విశాఖ-947 కేసులు,తూ.గో- 909, ప.గో -292, కృష్ణా -631, గుంటూరు-1581 కేసులు, ప్రకాశం - 462, నెల్లూరు -902, చిత్తూరు - 1306 కేసులు
అనంతపురం-1066, కర్నూలు-820, వైఎస్ఆర్ జిల్లా - 549 కేసులు
Comments
Please login to add a commentAdd a comment