'509 మందికి స్వైన్ ఫ్లూ'
హైదరాబాద్: ఈనెలలో మొత్తం 1398 మందిపై వైద్యపరీక్షలు నిర్వహిస్తే వారిలో 509 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలిందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ తీవ్రతపై ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి 21 మంది మృతిచెందారన్నారు. బుధవారం జరిపిన పరీక్షల్లో మొత్తం 101 మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 42 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు ,నిర్ధారణ అయిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పట్టిందన్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలను వివరిస్తూ..ఎవరికైనా జ్వరంతో కూడిన జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులు కూడా ఉపయోగించవచ్చని సూచించారు.