
సాక్షి, విజయవాడ: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 12కు చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదయ్యిందని.. దీంతో కరోనా కేసులు 12కు చేరిందన్నారు. బర్మింగ్ హమ్ నుండి వచ్చిన వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ నెల 17న ఆ వ్యక్తి విశాఖపట్నం వచ్చారని.. 21న ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.
(ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి..)
28,028 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించామని పేర్కొన్నారు. 27,929 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. 385 మంది శాంపిల్స్‌ను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని.. 55 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సిఉందని తెలిపారు. 317 నెగిటివ్, 12 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment