అసెంబ్లీలో లేవనెత్తుతాం
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ప్రస్తుతమున్న వారినే తొలగించడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యగులు రేవంత్‌కు వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత మార్చిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 1,179 మందిని ప్రభుత్వం తొలగించడంతో అంతా వీధుల్లో పడ్డామని ఆ ఉద్యోగులు ఆవేదన వెలిబుచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు.