సాక్షి, విజయవాడ: విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేయగా, ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ తీర్మానం మేరకు సభా సంఘం ఏర్పాటు చేయగా, కేవలం అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలతోనే సభా సంఘం ఏర్పాటైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభా సంఘం ఏర్పాటు చేశారు.
సభా సంఘం చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష , ఆర్.వి.ఎస్.కే.కె.రంగా రావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment