Visakha dairy
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు లేకుండా సభా సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేయగా, ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ తీర్మానం మేరకు సభా సంఘం ఏర్పాటు చేయగా, కేవలం అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలతోనే సభా సంఘం ఏర్పాటైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభా సంఘం ఏర్పాటు చేశారు. సభా సంఘం చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష , ఆర్.వి.ఎస్.కే.కె.రంగా రావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. -
ఆయన జీవితం.. స్ఫూర్తివంతం.. ఫలవంతం
రైతుల్లో రైతుగా.. వారికి పెద్దన్నగా నిలిచారు. పొట్ట చేతపట్టుకు వలసపోయే దుస్థితి లేకుండా తమ గ్రామాల్లోనే గౌరవప్రదంగా బతికేట్టు చేశారు. వాళ్లకు ఏ అవసరం వచ్చినా డెయిరీ ఉందంటూ ధీమానిచ్చారు. ఇందుకోసం అహర్నిశలూ శ్రమించారు. పాడిరైతుల పెన్నిధి ఆయన. వారి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం.. వారి పిల్లలకు చక్కని చదువులు.. గ్రామాల్లో వంతెనలు, కల్యాణమండపాల నిర్మాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడారి తులసీరావు చేసిన పనులు, సాధించిన ఘనతలు కోకొల్లలు. పదో తరగతి కూడా పాసవని ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని పనులు చేశారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. స్ఫూర్తివంతం.. ఫలవంతం ఆయన జీవితం. మునగపాక/అనకాపల్లి రూరల్: సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు.. అసామాన్యుడిగా ఎదిగారు.. ఆంధ్రా కురియన్‌గా పిలుచుకునే ఉత్తరాంధ్ర దిగ్గజం ఆడారి తులసీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ. 1986లో విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆయన పగ్గాలు చేపట్టారు. ఆ రంగంలో అపూర్వ విజయాలు సాధించారు. విశాఖ డెయిరీ సామర్ధ్యాన్ని ఇప్పుడు 9 లక్షల లీటర్ల స్థాయికి తీసుకువచ్చారు. ఆయన చైర్మన్‌గా ఎన్నికైనప్పుడు 50 సొసైటీలు ఉండగా ఇప్పుడవి 1700 సొసైటీలు, 3,700 పాలసేకరణ కేంద్రాల వరకూ విస్తరించాయి. రూ.11 కోట్ల టర్నోవర్ ఉన్న డెయిరీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రస్తుతం రూ. 2 వేల కోట్ల టర్నోవర్ కంపెనీగా అభివృద్ధి చేశారు. 40కి పైగా దేశాల్లో పర్యటించి అధ్యయనం చేసి పాడిపరిశ్రమ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు. సేవల్లోను అగ్రస్థానం విశాఖ డెయిరీ అభివృద్ధి విషయంలోనే కాకుండా రైతులకు, డెయిరీ కార్మిక కుటుంబాలకు అవసరమైన సేవలను అందించడంలో కూడా ఆయన ఎల్లప్పుడూ ముందున్నారు. గ్రామాల్లో ఎన్నో రహదారులు, 40 కాలువలు, లెక్కలేనన్ని కల్వర్టులు, రెండు రిజర్వాయర్లు, 20 కల్యాణ మండపాలు నిర్మించారు. పాల ఉత్పత్తిదారులకు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం విషయంలో బాధ్యత తీసుకొన్నారు. రైతుల పిల్లలకు నర్సింగ్‌లో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలను వేయించారు. అంగవైకల్యం ఉన్న అనేకమందికి డెయిరీలో ఉద్యోగాలిచ్చి ఆశ్రయం కల్పించారు. డెయిరీ లాభాల్లో పాల ఉత్పత్తిదారులకు వాటా ఇచ్చారు. రైతులకు పశుగ్రాసం అందించడానికి కృషి చేశారు. మునగపాక మండలంలోని మెలిపాక నుంచి యాదగిరిపాలెం మీదుగా యలమంచిలి చేరుకునేందుకు వీలుగా రూ.8.5 కోట్ల వ్యయంతో తులసీ వారధి నిర్మించారు. మునగపాకలో కళాప్రదర్శనల కోసం తులసీ కళావేదిక ఏర్పాటుకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. అక్కడే రూ.75 లక్షల వ్యయంతో కళ్యాణమండపం నిర్మించారు. మిల్క్ ప్రొడ్యూసర్ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్, హెల్త్–మెడికల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా వైద్యసేవలందించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందించారు. దాదాపుగా 1700 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించారు. 1500కు పైగా గ్రామాల్లో వ్యవసాయ బోర్ వెల్స్ ఉచితంగా ఏర్పాటుచేశారు. ఇంతింతై వటుడింతై... యలమంచిలిలో ఆడారి వెంకట రమణయ్య, సీతయమ్మ దంపతులకు తులసీరావు 1939లో జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తులసీరావు పెద్దగా చదువుకోలేనప్పటికీ ఎన్నో విజయాలు సాధించారు. ఆయన తాత ఆడారి వీరినాయుడు అప్పట్లో విశాఖ జిల్లా బోర్డు సభ్యుడిగా రాజకీయాల్లో వుండేవారు. ఆయన వారసత్వం తులసీరావుకు వచ్చింది. రాజకీయ సువాసనలు ఒంట బట్టించుకున్న తులసీరావు 24 ఏళ్ల పిన్నవయస్సులోనే 1963లో యలమంచిలి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1968, 1981 ఎన్నికల్లో కూడా సర్పంచ్‌గా గెలిచారు. మ«ధ్యలో 11 ఏళ్లు ఎన్నికలు జరగకపోయినా ఆయనే పెద్ద దిక్కుగా వుండేవారు. ఆయన కుమార్తె పిళ్లా రమాకుమారి రెండుసార్లు యలమంచిలి సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయన కుమారుడు ఆనంద్‌కుమార్ విశాఖ డెయిరీకి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దశదిశలా విశాఖ డెయిరీ గాజువాక/అక్కిరెడ్డిపాలెం: తులసీరావు సుమారు నాలుగు దశాబ్దాల కిందట జిల్లాలోని ఏ ఇతర ప్రాంతాలకూ గాజువాక నుంచి రవాణా సౌకర్యం కూడా సరిగ్గాలేని రోజుల్లో డెయిరీని గాజువాకలో ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాల్లోనూ పాల వ్యాపారం విస్తరించేందుకు గాజువాకను ఆనాడే కేంద్రంగా ఎన్నుకున్నారు. ప్రారంభ దినాల్లో ప్రతిరోజు 3 నుంచి 4 వేల లీటర్ల పాలను సేకరించి సరఫరా చేసేవారు. తులసీరావు కృషితో ఆ సేకరణ ప్రస్తుతం రోజుకు 9 లక్షల లీటర్లకు చేరింది. పాల సేకరణతోపాటు విశాఖ డెయిరీని బహుముఖంగా అభివృద్ధి చేశారు. అనేక రకాల పాల ఉత్పత్తులు, నెయ్యి పెరుగు, లస్సీ, మిఠాయిలను అందుబాటులోకి తీసుకొచ్చారు. డెయిరీ విస్తరణలో భాగంగా రాజమండ్రిలో 2013లో మరోప్లాంట్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు పాల ఉత్పత్తుల్లో విశాఖ డెయిరీని నంబర్ వన్‌గా నిలబెట్టారు. దానికి ఆధునిక టెక్నాలజీని జోడించి పాల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. సహజంగా వేసవి కాలంలో పాలకు కొరత ఉంటుంది. ఈ కొరతను అధిగమించడానికి ఎక్కువ పాలను సేకరించి వాటిని పొడిగా చేసి అందిస్తున్నారు. టెట్రా ప్యాక్, నిల్వ ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు నిరంతం అందుబాటులో ఉంచుతున్నారు. విశాఖ డెయిరీ ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. అందుకే ఆయన పాల ఉత్పత్తిలో ఆంధ్రా కురియన్‌గా కీర్తినందుకున్నారు. -
పాడి రైతుకు అండ
మెరకముడిదాం: వ్యవసాయంతో పాటు పాడిరైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. పాడి పరిశ్రమను బలోపేతం చేసి రైతుల తో బాటు సంబంధిత పరిశ్రమలకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన విశాఖ డెయిరీ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ప్రభావంతో అన్ని వర్గాలతో బాటు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పాడిరైతు లు కుదేలవ్వకూడదన్న ఆశయంతో విశాఖ డెయిరీ ఏడాదికి రెండుసార్లు ఇచ్చే బోనస్‌ను ముందుగానే ఇచ్చి వారిని ఆదుకుంటోంది. సాధారణంగా ఏడాదిలో జనవరి, జూన్‌లో బోనస్ ఇవ్వడం ఆనవాయితీ. 2020కు సంబంధించి జనవరిలో పాడిరైతులకు బోనస్ ఒకసారి, మళ్లీ జూన్‌లో ఇవాల్సినది మూడు నెలల ముందుగానే ఇచ్చేసింది. ఇలా జిల్లాలోని 34 మండలాల్లోగల 63,967 మంది రైతులకు రూ.7.62 కోట్లు బోనస్ చెల్లించింది. జిల్లాలో 1,86,798 లీటర్ల పాలసేకరణ జిల్లాలో 862 పాల సేకరణ కేంద్రాల నుంచి విశాఖ డెయిరీ 1,86,798 లీటర్ల పాలను రోజూ సేకరిస్తోంది. 63,967 వేల మంది పాడిరైతులు పాలు పోస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో అత్యధికంగా పాడి రైతులు పాలు పోస్తున్నారు. ఈ నెల 25న మెరకముడిదాం మండలంలో జరిగిన బోనస్ పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నా యకులు జిల్లాలో డెయిరీ పరిశ్రమను స్థాపించాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనందకుమార్‌ను కోరగా దానికి అంగీకరించడంతో పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా పాలు పోస్తున్నాం 20 సంవత్సరాలుగా విశాఖడెయిరీకి పాలు వేస్తున్నాను, అప్పటినుంచి ఇప్పటివరకూ నాకు అన్ని విధాలా తోడ్పడుతోంది. అందరికంటే ఎక్కువ పాలు వేస్తున్నందుకు డెయిరీ యాజమాన్యం బహుమతి కూడా ఇచ్చింది. మేమంతా గతంలో శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా 2012లో గర్భాంలో ఏర్పాటు చేశారు. – చందకసాంబ, రైతు, గర్భాం,మెరకముడిదాం మండలం అభివృద్ధికి తోడ్పడాలి పాడినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న లక్షలాది మంది రైతుల కోసం విశాఖ డెయిరీ ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని విశాఖ డెయిరీ యాజమాన్యాన్ని కోరాం. జిల్లాలో పాడి రైతుల సంక్షేమంతో బాటు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటుకు చొరవ చూపాలని. చీపురుపల్లి నియోజకవర్గంలోని ఎంతో వెనుకపడి ఉన్న మెరకముడిదాం మండలంలో రైతుల కోసం పరిశ్రమతో బాటు కల్యా ణ మండపాన్ని నిర్మించాలని సీఈఓ ఆనందర్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. దానికి సూత్రప్రాయంగా అంగీకరించారు.– మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త పాడి రైతుల అభ్యున్నతే ధ్యేయం జిల్లాలోని పాడి రైతుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ నేతల సూచనల మేరకు అవసరమైన చర్యలు చేపడతాం. పశువిత్తనోత్పత్తి యూనిట్ ను చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం. పాడిరైతుల కోసం మెరకముడిదాం మండలంలో కల్యాణ మండపాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సూచనలు మేరకు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. – ఆడారు ఆనంద్‌కుమార్, సీఈఓ,విశాఖ డెయిరీ, విశాఖపట్టణం -
విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్..!
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డెయిరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్ పరాజయం పాలయ్యారు. స్వార్థం కోసం రాలేదు.. ఆనంద్ కుమార్, రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామినిచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. స్వార్థం కోసం వైఎస్సార్సీపీలో చేరలేదు. మాపై నాన్న ఆశీస్సులు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ జగన్ పాలనపై నమ్మకం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు ఎంతో బాగున్నాయి. రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం తరపున పనిచేద్దామనే పార్టీలోకి వచ్చాం’అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖ డెయిరీలో అశ్లీల నృత్యాలు
విశాఖ, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): విశాఖ డెయిరీ అంటే పాల ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఇక్కడ డైయిరీ యాజమాన్యం ప్రతి ఏటా ఉద్యోగులకు ఒక కానుక ఇస్తుంది. అదేంటంటే దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ, చివరి రోజున వారికి కిక్కు ఇచ్చే రీతిలో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనిని తిలకించే అవకాశం ఒక్క డెయిరీ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. బయట చిన్న బుర్రకథలను ఏర్పాటు చేస్తే స్టేజీపై మహిళలు ఎందుకున్నారని కార్యక్రమాలను ఆపేసే పోలీసులు దీనికి ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
పాలు తెలుపు.. డబ్బే నలుపు..!
అమ్మకాల సొమ్ముగా చూపి జమచేస్తున్న వైనం నల్లధనం మార్పిడికి విశాఖ డెరుురీ మరో ఎత్తుగడ! విశాఖపట్నం: అక్రమాలకు నిలయంగా మారిన విశాఖ డెరుురీ మరో వివాదానికి తెరతీసింది. ఆర్థిక రంగ నిపుణులను సైతం అబ్బుర పరిచేలా ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ విశాఖ డెరుురీ చైర్మన్, ఆయన కుటుంబ సభ్యులు, అనుయాయులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంతలో కేంద్ర ప్రభుత్వం రూ.500, వెరుు్య నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. డెరుురీ యాజమాన్యం దీనిని కూడా తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం మొదలెట్టింది. అక్కిరెడ్డిపాలెం విశాఖ డెరుురీ ఎదురుగా ఉన్న పార్లర్లలో పాలు, మజ్జిగ, పెరుగు, లస్సీ, ఐస్‌క్రీమ్ వంటి వాటిని రిటైల్‌గా విక్రరుుస్తుంటుంది. రోజూ అక్కడ రూ. లక్షల్లో వ్యాపారం చేస్తోంది. పెద్ద నోట్లు రద్దయ్యాక ఆయా పాల పదార్థాల కొనుగోలు చేసే వారి నుంచి రూ.500, వెరుు్య నోట్లను తీసుకోవడం మానేసింది. దీంతో వినియోగదారులు అభ్యంతరం చెప్పి ఆందోళనకు దిగడంతో ఒకట్రెండు రోజులు పెద్ద నోట్లను తీసుకుంది. ఆ తర్వాత వాటిని తిరస్కరించింది. కానీ విచిత్రంగా డెరుురీకి అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ముగా చూపుతూ రూ.లక్షలను వివిధ బ్యాంకుల్లో జమ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఇప్పటిదాకా రూ.కోట్లను ఇలా జమ చేశారని అంటున్నారు. మరోవైపు డెరుురీకి రోజు వారీగా వచ్చే కలెక్షన్ల సొమ్మును కూడా రద్దరుున పెద్దనోట్లనే అత్యధికంగా చూపుతూ తమ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు సమాచారం. ఇలా డెరుురీ యాజమాన్యం ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్న వైనాన్ని సాక్షాత్తూ ఉద్యోగులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. -
ఆడారిపై ఐటీ గురి
విశాఖ డెయిరీ వర్గాల్లో అలజడి నగరంలోనూ, జిల్లాలోనూ సోదాలు పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలు స్వాధీనం! కీలకపత్రాలను రహస్యంగా తరలించిన డెరుురీ సిబ్బంది? విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం : ముప్పై ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా విశాఖ డెయిరీ చైర్మన్ గిరీలో కొనసాగుతున్న ఆంధ్ర కురియన్ ఆడారి తులసీరావు ఆదాయపు పన్ను ఉచ్చులో పడ్డారు. ఇన్నాళ్లూ తనకు ఎదురులేదన్న రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన ఆయన పెను సంకటంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకునిగా కంటే డెరుురీ చైర్మన్‌గానే ఆయన పెంచుకున్న పరపతికి ఐటీ అధికారులు చెక్ పెట్టారు. విశాఖ డెరుురీతో పాటు ఆయన, ఆయన కుమార్తె, కుమారుడు, ఇతర బంధుమిత్రుల ఆదాయం, ఆస్తుల చిట్టాను విప్పుతున్నారు. విశాఖలోనూ, జిల్లాలోనూ తీవ్ర అలజడి రేపుతున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే.. మంగళవారం సూర్యోదయానికి ముందే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయారు. అప్పటికే తమ వద్ద ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఏకకాలంలో ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనూహ్యంగా సాగుతున్న ఈ సోదాలతో చైర్మన్ తులసీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, డెరుురీలో ఆయనకు అనుంగు శిష్యులుగా ఉన్న డెరైక్టరు, డెరుురీ ఉద్యోగులు అవాక్కయ్యారు. నగరంలోని అక్కిరెడ్డిపాలెంలో ఉన్న విశాఖ డెరుురీతో పాటు అక్కడకు సమీపంలో డెరుురీ ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి ఆస్పత్రిలోనూ సోదాలు నిర్వహించారు. ఇంకో బృందం నగరంలోని గ్రాండ్బే హోటల్ వద్ద ఉన్న కుమారుడు ఆనంద్ ఇంటి వద్ద సోదాలు జరిపారు. మరో బృందం తులసీరావు స్వస్థలం యలమంచిలి వెళ్లి అక్కడ ఆయన నివాసంలోనూ, కుమార్తె, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రమాకుమారి ఇంటిలోనూ దాడులు చేశారు. యలమంచిలి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు, ఇతర ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాలపై ఆరా తీశారు. ఆడారి పేరిట 25 ఎకరాల పంట భూములున్నాయని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. అంతేకాదు.. జిల్లాలోని చోడవరం మండలం అంబేరుపురం పాల సొసైటీకి వెళ్లి అక్కడ రికార్డులను తనిఖీ చేశారు. తులసీరావుకు సన్నిహితంగా ఉండే డెరుురీ డెరైక్టర్ గంగరాజును ప్రశ్నించారు. ఇంకా జిల్లాలోనూ, నగరంలోనూ పలుచోట్ల ఐటీ అధికారుల బృందం సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. కీలక పత్రాలు రహస్యంగా తరలింపు.. ఐటీ అధికారుల దాడుల సంగతి తెలుసుకున్న వెంటనే డెరుురీ ఉద్యోగులు జాగ్రత్త పడ్డట్టు తెలిసింది. సుమారు 30 మంది డెరుురీలో క్యాజువల్ వర్కర్లతో ఎరుుర్ బ్యాగులతో ఫైళ్లు, ఇతర ముఖ్య పత్రాలు, దస్త్రాలు, నగదును దొడ్డిదారిలో తరలించినట్టు సమాచారం. అక్కిరెడ్డిపాలెంలోని వివేకానందకాలనీ శివారు ప్రాంతానికి గుంపులుగా చేరుకుని ఆ బ్యాగులను తుప్పల్లో దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరిలో ఇద్దరు యువకులు బహిర్భూమికి వెళ్తున్నట్లు నటించి స్థానికులు ఎవరూ గుర్తించడం లేదని తెలుసుకుని వారు భారీ బ్యాగును చంకన పెట్టుకొని మింది వైపు నుంచి శ్రావణ్ షిప్పింగ్ వైపు రైల్వే ట్రాక్ మీదుగా వెళ్లారని తెలుస్తోంది. కుటుంబీకులకే పెత్తనం.. : విశాఖ డెరుురీకు చెందిన షీలానగర్‌లోని కృషి ఐకాన్ ఆస్పత్రికి తులసీరావు మేనల్లుడు డాక్టర్ పెతకంశెట్టి సతీష్ ఎండీగాను, కుమారుడు సీఎండీగాను, కోడలు మేనేజింగ్ ట్రస్టీలుగాను వ్యవహరిస్తున్నారు. ఇలా తులసీరావు కుటుంబం మొత్తం డెరుురీ ఆస్తుల్లో భాగస్వాములుగా ఉండడం వివాదాస్పదమవుతోంది. కృషి ఐకాన్ ఆస్పత్రి రూ.వందల కోట్లతో నిర్మించి, ఆధునిక పరికరాలను అమర్చి అల్లుడికి తులసీరావు కానుకగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఒంటెత్తు పోకడల వల్లే... : ఆది నుంచి తులసీరావుది ఒంటెద్దు పోకడేనన్న విమర్శలున్నారుు. గత నెల రోజుల క్రితమే డెరుురీ ఛైర్మన్‌గా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయనకు బంగారు కిరీటాన్ని సమర్పించడం, ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ఆహ్వానించకపోవడం పెను దుమారం రేపింది. -
ఎక్కడ చూసినా క్యూలే..
హుదూద్ తుపాను సృష్టించిన భీకర నష్టం విశాఖ నగర వాసులకు అనేక కష్టాలు తెచ్చి పెట్టింది. పాలు, మంచినీళ్లు, హోటళ్లలో టిఫిన్, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు ఇలా ప్రతి చోట భారీ క్యూలో గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం దాకా ఇళ్లలోనే గడిపిన వేలాదిమంది నగరవాసులు ఆ తర్వాతే రోడ్ల మీదకు వచ్చారు. అరకొరగా వచ్చిన కార్పొరేషన్ నీటి ట్యాంకర్ల వద్ద వందలాది మంది క్యూ కట్టారు. పాల ప్యాకెట్లు బ్లాక్‌లో అర లీటరు రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నా వాటిని కొనడానికి జనం బారులు తీరారు. మంగళవారం ఉదయం నగరంలోని హోటళ్ల వద్ద జనం టిఫిన్ కోసం క్యూ కట్టాల్సి వచ్చింది. మూడు రోజులుగా నగరంలోని ఏటీఎం సెంటర్లన్నీ పనిచేయక పోవడంతో, మంగళవారం అక్కడక్కడా పనిచేసిన ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి నగరవాసులు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది. ఇక పెట్రోల్, డీజిల్ కోసమైతే నగరంలోని ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా వందలాది మంది ప్రజలు గంటల కొద్దీ ఎదురుచూడటం కన్పించింది. అనేక చోట్ల తోపులాటలు జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం నుంచి విశాఖ డెయిరీ నగరంలోని పలు చోట్ల మొబైల్ పాల విక్రయ కేంద్రాలు నిర్వహించింది. శనివారం రాత్రి నుంచే ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇన్వర్టర్లలో చార్జింగ్ అయిపోవడం, జనరేటర్లు ఉన్నా డీజిల్ దొరక్క పోవడంతో అనేకమంది ఉదయం ఇళ్లలో గడిపి రాత్రి పూట జనరేటర్ల మీద ఏసీలు, ఫ్యాన్లు పనిచేసే లాడ్జిల్లో దిగారు. ఐదురోజులుగా లాడ్జిలోనే..: కోల్‌కతా విద్యుత్ శాఖ ఇంజనీరుగా పనిచేస్తు న్న జె.ఎన్. ఘోష్ ఐదు రోజుల కిందట విశాఖపట్నం అందాలు చూడటానికి భార్య, కుమార్తెతో కలిసి వచ్చారు. రైళ్లు, బస్సులు, హైవే మీద వాహనాల రాకపోకలన్నీ నిలిపి వేయడంతో ఘోష్ విశాఖలోనే ఆగిపోవాల్సి వచ్చింది. లాడ్జిలో బస చేస్తున్న ఆయన వద్ద డబ్బులు అయిపోవడంతో అవస్థలు పడుతున్నారు. -
‘దేశం’లో భగ్గుమన్న వర్గవిభేదాలు
ప్రహరీ నిర్మాణంపై సర్పంచ్ అభ్యంతరం ఎంపీపీ కార్యాలయం నుంచి సర్పంచ్ గెంటివేత బుచ్చెయ్యపేట : మండల టీడీపీ నా యకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గతంలో మాజీ ఎంపీపీ బత్తు ల తాతయ్యబాబు, ప్రస్తుత మండల ఉపాధ్యక్షుడు దాడి సూరినాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీలు గోకివాడ కోటీశ్వరరావు, వియ్యపు అప్పారావు, విశాఖ డెయిరీ డెరైక్టర్ గేదెల సత్యనారాయణ, తదితరుల మధ్య వర్గవిభేదాలు బయటపడ్డాయి. తాజాగా పోలేపల్లి టీడీపీ సర్పంచ్ సీతా వెంకటరమణ, గ్రామ టీడీపీ పాలసంఘం అధ్యక్షుడు సీతా నర్సింహనాయుడుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల బంజరు భూములకు సర్పంచ్ అనుమతి కోరగా, ఎమ్మెల్యే ద్వారా డి ఫారం పట్టాలు అవ్వకుండా నర్సింహనాయుడు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ అనుమతి లేకుండా పాల సంఘానికి నర్సింహనాయుడు ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టగా, సర్పంచ్ సీతా వెంకటరమణ పంచాయతీ అధికారుల ద్వారా అడ్డుకున్నాడు. దీనిపై సోమవారం బుచ్చెయ్యపేట ఎంపీపీ కార్యాలయంలో ఇరువురిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధి పనులకు ఎవరూ అడ్డరాదని వైస్ ఎంపీపీ, డెయిరీ డెరైక్టర్, మాజీ జెడ్పీటీసీలు సర్పంచ్ సీతా వెంకటరమణకు సూచిం చారు. అయితే తమ గ్రామ రాజకీయాల్లోకి ఎవరు తల దూర్చినా సహించమంటూ సర్పం చ్, మండల నాయకులు సూచించారు. దీనిపై ఇరువర్గాలవారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట వరకు వెళ్లింది. కానీ, డెయిరీ చైర్మన్‌ను, ఎమ్మెల్యేను విమర్శిస్తావా అంటూ సదరు నాయకులు సర్పంచ్ సీతా వెంకటరమణను ఎంపీపీ కార్యాలయం గది నుంచి బయటకు తోసేశారు. తాను తమ గ్రామ నాయకుల్ని విమర్శిస్తే, తనపై తప్పును రుద్దడానికి ఎమ్మెల్యేను, డెయిరీ చైర్మన్‌ను దూషించానని చెప్పడం సిగ్గులేని తనమంటూ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యాలయంలోనే నాయకులు రచ్చకెక్కడంపై మండల అధికారులు ఎవరికి కొమ్ము కాయాలో తెలియక అయోమయంలో పడ్డారు.