పాలు తెలుపు.. డబ్బే నలుపు..!
అమ్మకాల సొమ్ముగా చూపి జమచేస్తున్న వైనం
నల్లధనం మార్పిడికి విశాఖ డెరుురీ మరో ఎత్తుగడ!
విశాఖపట్నం: అక్రమాలకు నిలయంగా మారిన విశాఖ డెరుురీ మరో వివాదానికి తెరతీసింది. ఆర్థిక రంగ నిపుణులను సైతం అబ్బుర పరిచేలా ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ విశాఖ డెరుురీ చైర్మన్, ఆయన కుటుంబ సభ్యులు, అనుయాయులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంతలో కేంద్ర ప్రభుత్వం రూ.500, వెరుు్య నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. డెరుురీ యాజమాన్యం దీనిని కూడా తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం మొదలెట్టింది. అక్కిరెడ్డిపాలెం విశాఖ డెరుురీ ఎదురుగా ఉన్న పార్లర్లలో పాలు, మజ్జిగ, పెరుగు, లస్సీ, ఐస్‌క్రీమ్ వంటి వాటిని రిటైల్‌గా విక్రరుుస్తుంటుంది. రోజూ అక్కడ రూ. లక్షల్లో వ్యాపారం చేస్తోంది. పెద్ద నోట్లు రద్దయ్యాక ఆయా పాల పదార్థాల కొనుగోలు చేసే వారి నుంచి రూ.500, వెరుు్య నోట్లను తీసుకోవడం మానేసింది. దీంతో వినియోగదారులు అభ్యంతరం చెప్పి ఆందోళనకు దిగడంతో ఒకట్రెండు రోజులు పెద్ద నోట్లను తీసుకుంది. ఆ తర్వాత వాటిని తిరస్కరించింది.
కానీ విచిత్రంగా డెరుురీకి అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ముగా చూపుతూ రూ.లక్షలను వివిధ బ్యాంకుల్లో జమ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఇప్పటిదాకా రూ.కోట్లను ఇలా జమ చేశారని అంటున్నారు. మరోవైపు డెరుురీకి రోజు వారీగా వచ్చే కలెక్షన్ల సొమ్మును కూడా రద్దరుున పెద్దనోట్లనే అత్యధికంగా చూపుతూ తమ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు సమాచారం. ఇలా డెరుురీ యాజమాన్యం ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్న వైనాన్ని సాక్షాత్తూ ఉద్యోగులే బాహాటంగా చెప్పుకుంటున్నారు.