ఆడారిపై ఐటీ గురి | Visakha Dairy categories unrest | Sakshi
Sakshi News home page

ఆడారిపై ఐటీ గురి

Published Wed, Oct 26 2016 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ఆడారిపై     ఐటీ గురి - Sakshi

ఆడారిపై ఐటీ గురి

 విశాఖ డెయిరీ  వర్గాల్లో అలజడి
నగరంలోనూ, జిల్లాలోనూ సోదాలు
పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలు స్వాధీనం!
కీలకపత్రాలను రహస్యంగా తరలించిన డెరుురీ సిబ్బంది?


విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం : ముప్‌పై ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా  విశాఖ డెయిరీ చైర్మన్ గిరీలో కొనసాగుతున్న ఆంధ్ర కురియన్ ఆడారి తులసీరావు ఆదాయపు పన్ను ఉచ్చులో పడ్డారు. ఇన్నాళ్లూ తనకు ఎదురులేదన్న రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన ఆయన పెను సంకటంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకునిగా కంటే డెరుురీ చైర్మన్‌గానే ఆయన పెంచుకున్న పరపతికి ఐటీ అధికారులు చెక్ పెట్టారు. విశాఖ డెరుురీతో పాటు ఆయన, ఆయన కుమార్తె, కుమారుడు, ఇతర బంధుమిత్రుల ఆదాయం, ఆస్తుల చిట్టాను విప్పుతున్నారు. విశాఖలోనూ, జిల్లాలోనూ తీవ్ర అలజడి రేపుతున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే.. మంగళవారం సూర్యోదయానికి ముందే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయారు.

 
అప్పటికే తమ వద్ద ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఏకకాలంలో ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనూహ్యంగా సాగుతున్న ఈ సోదాలతో చైర్మన్ తులసీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, డెరుురీలో ఆయనకు అనుంగు శిష్యులుగా ఉన్న డెరైక్టరు, డెరుురీ ఉద్యోగులు అవాక్కయ్యారు. నగరంలోని అక్కిరెడ్డిపాలెంలో ఉన్న విశాఖ డెరుురీతో పాటు అక్కడకు సమీపంలో డెరుురీ ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి ఆస్పత్రిలోనూ సోదాలు నిర్వహించారు. ఇంకో బృందం నగరంలోని గ్రాండ్‌బే హోటల్ వద్ద ఉన్న కుమారుడు ఆనంద్ ఇంటి వద్ద సోదాలు జరిపారు. మరో బృందం తులసీరావు స్వస్థలం యలమంచిలి వెళ్లి అక్కడ ఆయన నివాసంలోనూ, కుమార్తె, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రమాకుమారి ఇంటిలోనూ దాడులు చేశారు. యలమంచిలి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు, ఇతర ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాలపై ఆరా తీశారు. ఆడారి పేరిట 25 ఎకరాల పంట భూములున్నాయని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. అంతేకాదు.. జిల్లాలోని చోడవరం మండలం అంబేరుపురం పాల సొసైటీకి వెళ్లి అక్కడ రికార్డులను తనిఖీ చేశారు. తులసీరావుకు సన్నిహితంగా ఉండే డెరుురీ డెరైక్టర్ గంగరాజును ప్రశ్నించారు. ఇంకా జిల్లాలోనూ, నగరంలోనూ పలుచోట్ల ఐటీ అధికారుల బృందం సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. 

 కీలక పత్రాలు రహస్యంగా తరలింపు..

 
ఐటీ అధికారుల దాడుల సంగతి తెలుసుకున్న వెంటనే డెరుురీ ఉద్యోగులు జాగ్రత్త పడ్డట్టు తెలిసింది. సుమారు 30 మంది డెరుురీలో క్యాజువల్ వర్కర్లతో ఎరుుర్ బ్యాగులతో ఫైళ్లు, ఇతర ముఖ్య పత్రాలు, దస్త్రాలు, నగదును దొడ్డిదారిలో తరలించినట్టు సమాచారం. అక్కిరెడ్డిపాలెంలోని వివేకానందకాలనీ శివారు ప్రాంతానికి గుంపులుగా చేరుకుని ఆ బ్యాగులను తుప్పల్లో దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరిలో ఇద్దరు యువకులు బహిర్భూమికి వెళ్తున్నట్లు నటించి స్థానికులు ఎవరూ గుర్తించడం లేదని తెలుసుకుని వారు భారీ బ్యాగును చంకన పెట్టుకొని మింది వైపు నుంచి శ్రావణ్ షిప్పింగ్ వైపు రైల్వే ట్రాక్ మీదుగా వెళ్లారని తెలుస్తోంది.  

 
కుటుంబీకులకే పెత్తనం.. : విశాఖ డెరుురీకు చెందిన షీలానగర్‌లోని కృషి ఐకాన్ ఆస్పత్రికి తులసీరావు మేనల్లుడు డాక్టర్ పెతకంశెట్టి సతీష్ ఎండీగాను, కుమారుడు సీఎండీగాను, కోడలు మేనేజింగ్ ట్రస్టీలుగాను వ్యవహరిస్తున్నారు. ఇలా తులసీరావు కుటుంబం మొత్తం డెరుురీ ఆస్తుల్లో భాగస్వాములుగా ఉండడం వివాదాస్పదమవుతోంది. కృషి ఐకాన్ ఆస్పత్రి రూ.వందల కోట్లతో నిర్మించి, ఆధునిక పరికరాలను అమర్చి అల్లుడికి తులసీరావు కానుకగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 

 
ఒంటెత్తు పోకడల వల్లే... : ఆది నుంచి తులసీరావుది ఒంటెద్దు పోకడేనన్న విమర్శలున్నారుు. గత నెల రోజుల క్రితమే డెరుురీ ఛైర్మన్‌గా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయనకు బంగారు కిరీటాన్ని సమర్పించడం, ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ఆహ్వానించకపోవడం పెను దుమారం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement