House Committee
-
డేటాదొంగ బాబు.. డేరాబాబా కన్నా డేంజర్: మంత్రి రోజా
సాక్షి, అమరావతి: డేటా చోరీపై హౌజింగ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికతో టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల డేటాను ప్రజాసాధికారత సర్వే పేరుతో.. సేవా మిత్ర యాప్ ద్వారా తెలుగు దేశం నాయకులకు అందించిందని, తద్వారా దుష్టరాజకీయానికి తెర తీసిందని ఆమె మండిపడ్డారు. సభాసంఘం కమిటీ ఇవాళ అసెంబ్లీకి సమర్పించిన మధ్యంతర నివేదికలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ నిర్ధారణ కావడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. ‘హౌజ్ కమిటీ నివేదికపై స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే గనుక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా జోస్యం పలికారు. ఈ డేటా దొంగ.. డేరాబాబా కన్నా డేంజర్ అనే విషయం అందరికీ స్పష్టం అవుతోందని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేశారనే విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ధృవీకరించిన విషయాన్ని మంత్రి రోజా గుర్తు చేశారు. ఓటర్లను తొలగించడమే కాకుండా.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష సభ్యులను బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా లొంగదీసుకునే ప్రయత్నం కూడా జరిగిందని మంత్రి రోజా ఆరోపించారు. నారా లోకేష్‌ను చూస్తే జాలేస్తోందని, ఎన్టీఆర్‌గారి మీద లేనిపోని అభిమానం కురిపిస్తూ అన్నాక్యాంటీన్ల మీద రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వం పథకాల పేరుతో దోచుకుందని.. ఇప్పుడు సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాసంక్షేమం గురించి ఆలోచిస్తుందని, లేనిపోని విమర్శలు మాని ఆ పథకాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని ఆమె టీడీపీకి హితవు పలికారు. ఇదీ చదవండి: ఇది టీడీపీ భారీ కుట్రే: ఏపీ అసెంబ్లీ హౌజ్ కమిటీ -
లక్షల ఓట్ల రద్దుకు టీడీపీ యత్నించింది: ఏపీ హౌజ్ కమిటీ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని.. తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ (మంగళవారం) డేటా చోరీ వ్యవహారంపై విచారణ చేపట్టిన హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను ఆయన చదివి వినిపించారు. ప్రాథమిక విచారణలో గత టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చిందని భూమన తెలియజేశారు. 2017-19.. మరీ ముఖ్యంగా 2018-19 మధ్యకాలంలో ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి.. తెలుగుదేశానికి చెందిన సేవా మిత్ర యాప్ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిని తమ విచారణలో సభాసంఘం గుర్తించినట్లు భూమన తెలిపారు. ఓట్లు వేయనివాళ్ల సమాచారాన్ని స్టేట్ డేటా సెంటర్ నుంచి సేవా మిత్ర అనే యాప్ ద్వారా పూర్తిగా చోరీ చేసే యత్నం చేశారని, ఆ చౌర్యం చేసిన చోరులను పట్టుకోవాల్సిన బాధ్యతను తాము లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్‌కు చదివి వినిపించారు భూమన. నివేదిక చదివి వినిపిస్తున్న సమయంలో.. టీడీపీ సభ్యులు గోల చేశారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం: సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు అప్డేట్స్ 02:15 ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విద్యారంగంలో నాడు-నేడుపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఏపీలో విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. రాజకీయ దుర్బుద్దితో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాకా ఎలా ఉన్నాయనేది పరిశీలించాలని తెలిపారు. ‘గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవి. డ్రాప్ ఔట్ రేట్ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదు. కుప్పంలో స్కూళ్లు దీనావస్థలో ఉండేవి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాం. మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం’ అని వ్యాఖ్యానించారు. 1:32PM విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసింది. చైతన్య, నారాయణ సంస్థలకు విద్యా రంగాన్ని ధారాదత్తం చేశారు: సుధాకర్‌బాబు 12:39PM టీడీపీకి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు పథకాలు గుర్తొస్తాయి: ఆదిమూలపు సురేష్ 12:34PM టీడీపీ సంక్షోభంలో ఉన్న పార్టీ. సభను అడ్డుకునేందుకు టీడపీ సభ్యులు వస్తున్నారు.సమస్యలపై చర్చించాలన్న ఆలోచన కూడా టీడీపీకి లేదు: జోగి రమేష్ 12:30PM ►స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల హంగామా ►సభను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యుల ప్రయత్నం ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ►టీడీపీ సభ్యులపై ఒక రోజు సస్పెన్షన్ 12:16PM ►రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారు. సంక్షేమంలో సీఎం జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదు. సంక్షేమ పథకాలు అమలుపై దమ్ముంటే చర్చకు రండి: కన్నబాబు 11:56AM ► డేటా చోరీపై హౌస్ కమిటీ నివేదిక. డేటా చోరీపై మధ్యంతర నివేదికను సభలో ప్రవేశపెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి. ► డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగింది. 30 లక్షలకుపైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ. సేవా మిత్ర యాప్ ద్వారా 30 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు. టీడీపీ సేవామిత్ర యాప్‌ను దుర్వినియోగం చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలి: భూమన 9:18AM విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాం. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చాం. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులు దుబారా చేశారు. చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వైరల్ డిసీజ్‌తో చిన్నారి మృతి. చిన్నారి మృతిని టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. : మంత్రి విడదల రజనీ 9:00AM ►ప్రారంభమైన నాల్గోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు 08:45AM ► ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. నేడు ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ► ఏపీ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం).. విద్యావైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చ కొనసాగనుంది. 08:30AM ► ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. నేడు శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక రానుంది. 85 పేజీల ఆధారాలతో సభ ముందు నివేదిక పెట్టనుంది హౌజ్ కమిటీ. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు ఆరోపణలున్నాయి. -
ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. స్పీకర్‌కు అందజేశారు. చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించినట్టు సమాచారం. చదవండి: మార్గదర్శి కేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు ఈ సందర్భంగా హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రాథమిక నివేదికను స్పీకర్‌కు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. రేపు(మంగళవారం)ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉందని రాజా అన్నారు. -
డేటా చోరీ జరిగింది.. అవసరమైతే కొందరిని హౌజ్ కమిటీ ముందుకు పిలుస్తాం: భూమన
సాక్షి, అమరావతి: పెగాసెస్, ఫోన్ ట్యాపింగ్‌పై హౌజ్ కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. చైర్మన్ భూమన కరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హౌస్ కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. హోం, ఐటీశాఖల నుంచి హౌజ్ కమిటీ సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. 2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేటు భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలు తీసుకుందని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను ఉంచి ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గపు చర్చలు తీసుకుందని మండిపడ్డారు. కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ధి పొందినట్లు స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలో డేటా చోరీ జరిగిందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసిందన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిందని విమర్శించారు. డేటా చోరీ జరిగిందన్న భూమన కరుణాకర్‌రెడ్డి అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సవరణలు -
చంద్రబాబు పెగాసస్ బండారం బయట పెడతాం: భూమన కరుణాకర్‌రెడ్డి
-
పెగాసస్ గుట్టు తేల్చనున్న ఏపీ ప్రభుత్వం
-
టీడీపీకి వణుకు పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ ప్రారంభం
-
భూమన నేతృత్వంలో పెగాసస్ పై నేడు హౌస్ కమిటీ విచారణ
-
ఏపీ: టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై అసెంబ్లీ హౌస్ కమిటీ
సాక్షి, అమరావతి: టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం హౌస్ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు. కాగా రాష్ట్రంలో పెగసస్ స్పైవేర్ బాగోతం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో స్పైవేర్ ఉదంతంపై హౌస్ కమిటీ ఏర్పాటుచేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ హౌస్ కమిటీ వేశారు. చదవండి: మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్ -
కేపిటల్ భవనంపై దాడి... ట్రంప్‌ది కుట్రే: హౌస్ కమిటీ
వాషింగ్టన్: అమెరికాలోని కేపిటల్ భవనంపై జరిగిన దాడిని విచారిస్తున్న హౌస్ కమిటీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరులు క్రిమినల్ ఈ కుట్రలో భాగస్వామ్యులుగా ఉన్నట్టు ఆధారాలున్నాయని వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ నిర్ధారించడాన్ని అడ్డుకునేందుకే ట్రంప్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని కమిటీ ఆరోపించింది. అమెరికా ప్రతిష్టను మంటగలిపేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి కేపిటల్ భవనంపై దాడి జరిగేలా ప్రోత్సాహించారంటూ 221 పేజీల నివేదికను కాలిఫోర్నియా కోర్టులో దాఖలు చేసింది. దీనికి సంబంధించి ట్రంప్‌పై అభియోగాలు మోపేదీ లేనిదీ కమిటీ స్పష్టంగా వెల్లడించలేదు. ఇంకా విచారణ జరగాల్సి ఉందని తెలిపింది. -
వివరాల్లేకుండా సమావేశానికొస్తారా?
అధికారులపై హౌస్ కమిటీ ఆగ్రహం హైదరాబాద్: ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలు, కబ్జాలపై పూర్తి వివరాల్లేకుండా సమావేశానికి హాజరైన అధికారులపై హౌస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. సమావేశంలో గతంలో ఏపీఐఐసీకి కేటాయించిన భూము లు, అందులో జరిగిన అక్రమాల్ని సమీక్షించా రు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్, హన్మకొండ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని అసైన్డు భూములపై సమీక్ష జరిగింది. అయితే, అధికారులు వీటిపై పూర్తి వివరాల్లేకుండా సమావేశానికి హాజరయ్యారు. దీంతో వచ్చే సమావేశానికి అన్ని వివరాలతో రావాలని హౌస్ కమిటీ సభ్యులు వారిని ఆదేశించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. జీఓ 58, 59 ద్వారా బడా బాబుల భూములను క్రమబద్ధీకరించవద్దన్నారు. ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు మాత్రమే ప్రయోజం చేకూరేలా నిర్ణయాలుండాలన్నా రు. ప్రభుత్వ భూములను ఏ ప్రయోజనం కోసం ఇచ్చారో, దానికోసమే వినియోగించాలని, లేనిపక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యుల్లో ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, ఎన్వీవీఎస్ ప్రభాకర్, మిరాజ్ హుస్సేన్, రేఖానాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్ సమావే శానికి హాజరయ్యారు. -
‘కృష్ణపట్నం’ పనుల్లో అక్రమాలు ఇవిగో..
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) పనుల్లో అనేక అక్రమాలు జరిగాయి. టెండర్లు పిలవకుండా పనులను బిట్లుబిట్లుగా విభజించి అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ వారికి కట్టబెట్టారు. దీనివల్ల భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. దీనిపై హౌస్‌కమిటీ వేస్తే అక్రమాలను నిరూపిస్తా’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ పనులను నామినేషన్ పద్ధతిపై ఇవ్వవచ్చా? అని గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. టెండర్ల ద్వారానే పనులు ఇచ్చామని, ఒక్క పని కూడా నామినేషన్‌పై ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమివ్వడాన్ని గోవర్ధన్‌రెడ్డి తప్పుబట్టారు. ‘‘ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే మీ అధికారులే సమాచారం ఇచ్చారు. నామినేషన్ పద్ధతిపైనే పనులు ఇచ్చినట్లు ఇవిగో పక్కా ఆధారాలు (పత్రాలు చూపిస్తూ). మీరు నామినేషన్‌పై పనులు ఇవ్వలేదంటున్నారు. మీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా? ఈ సభ ద్వారా ప్రజలను మంత్రి తప్పుదోవ పట్టించవద్దు. హౌస్ కమిటీ వేయండి లేదా విచారణ జరిపించండి. అక్రమాలు నిరూపిస్తాం. సభకు ఆధారాలతో రావాలని గతంలో సీఎం అన్నారు. అందుకే ఆధారాలు సమర్పిస్తున్నాం.విచారించి చర్యలు తీసుకోండి’’ అని గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఆధారాలిస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మొత్తం ఆధారాలు స్పీకరుకు సమర్పిస్తున్నానని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. -
భూకబ్జాలపై 3 కమిటీలు
* సభా సంఘాలపై కసరత్తు ప్రారంభం * చైర్మన్లుగా ఇప్పటికే తెరపైకి ఇద్దరి పేర్లు * పార్టీల శాసనసభాపక్ష నేతలకు లేఖలు * సభ్యుల పేర్లను సూచించాలని కోరిన అసెంబ్లీ కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: శాసనసభా సంఘాల ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. గత నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివిధ అంశాలపై సభా సంఘాలు వేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల శాసనసభాపక్ష నేతలకు అసెంబ్లీ కార్యదర్శి తాజాగా లేఖలు రాశారు. హౌస్ కమిటీల్లో పనిచేయడానికి ఆయా పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాల్సిందిగా కోరినట్లు సమాచారం. సభా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అంశాలన్నీ భూ సంబంధమైనవే కావడం గమనార్హం. అయితే, వాటిపై మూడు వేర్వేరు కమిటీలు వేయాలన్న నిర్ణయం జరిగింది. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను కమిటీల చైర్మన్లుగా పరిశీలిస్తున్నట్లు అనధికారిక సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని టీఆర్ఎస్ సభ్యులు కాలింగ్ అటెన్షన్ ద్వారా లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆయన 8.39 ఎకరాల ఎస్సీ అసైన్డు భూములను తన కబ్జాలో పెట్టుకున్నారన్న ఆరోపణలపై చర్చ జరిగింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల ప్రభుత్వ అసైన్డు భూములు కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని సభకు వివరించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పది జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు కేటాయించిన అసైన్డు భూముల కబ్జాపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని, దీనిపై సభా సంఘం వేయాలని పేర్కొన్నారు. అదే మాదిరిగా, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఎంఐఎం కాలింగ్ అటెన్షన్ ద్వారా చర్చ జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హౌసింగ్ సొసైటీల అక్రమాలను వెలికి తీయాలని, దీనికోసం మరో సభా సంఘం ఏర్పాటు చేయాలని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, వక్ఫ్ భూములు భారీ ఎత్తున అన్యాక్రాంతమయ్యాయన్న ఎంఐఎం చర్చతో వక్ఫ్, భూదాన్, దేవాదాయ, చర్చి భూములతో పాటు సీలింగ్ భూముల అన్యాక్రాంతంపైనా ప్రత్యేకంగా మరో కమిటీని ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూముల వ్యవహారాలపైనే మూడు కమిటీల ఏర్పాటుకు సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండు కమిటీలకు చైర్మన్లుగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇతర పార్టీల్లోనూ సభ్యుల ఎంపికపై ఎమ్మెల్యేల్లో ఆసక్తి నెలకొంది. అయితే, వీటిని శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిపి ‘జాయింట్ లెజిస్లేచర్ కమిటీ’లుగా ఏర్పాటు చేస్తారా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఉభయ సభల్లోనూ చర్చ జరిగిన కారణంగా ఈ అంశంపై జాయింట్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కమిటీల్లో సభ్యుల సంఖ్యపైనా ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండే అవకాశముంది. అత్యధికంగా 15 మంది వరకు ఉండవచ్చని ఓ సీనియర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే, అధికారికంగా కమిటీలను ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇంకా స్పష్టంకాలేదు. వాస్తవానికి రానున్న బడ్జెట్ సమావేశాల నాటికే సభ ముందుకు నివేదికలు వస్తాయని మొదట అనుకున్నా, వాటి ఏర్పాటులోనే జాప్యం జరుగుతున్నందున ఆగస్టులో జరిగే వర్షాకాల సమావేశాల నాటికి నివేదికలు సిద్ధమయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కానీ, సభాసంఘం ఏర్పాటయ్యాక మూడు నెలల్లోగా నివేదిక అందజేయాల్సి ఉంటుందని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. -
చక్రబంధంలో టీపీసీసీ చీఫ్!
* భూముల విషయంలో పొన్నాలకు ఇరకాటం * సర్కారు వ్యూహంతో ఆత్మరక్షణలో కాంగ్రెస్ * ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టిన అధికారపక్షం * సభాసంఘం ఏర్పాటు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ వ్యూహంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోయింది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను లక్ష్యంగా చేసుకుని అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం చేపట్టిన చర్చ ద్వారా కాంగ్రెస్ శాసనసభా పక్షం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. బుధవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవ ర్ ముగిసిన తర్వాత పొన్నాలకు భూ కేటాయింపుల అంశాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. దీనికి శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ వివరాలను సభ ముందుంచారు. తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి అసైన్డు భూముల వ్యవహారాన్ని చ ర్చకు తీసుకోలేదని, అన్ని రకాల భూముల వ్యవహారంపై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే చర్చంతా పొన్నాల లక్ష్యంగానే సాగింది. దీంతో పీసీసీ చీఫ్‌ను వెనకేసుకువచ్చే పరిస్థితి కాంగ్రెస్ సభ్యులకు లేకపోయింది. మధ్యలో సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని వాదించే ప్రయత్నం చేశారు. అయితే వారి వాదనలో బలం లేకపోవడం, ప్రభుత్వం వద్ద ఆధారాలు బలంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు. వరంగల్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో దళితుల భూమిని పొన్నాల ఎలా దక్కించుకున్నారో ఆధారాలతో సహా హరీశ్‌రావు వివరించారు. దీంతో ఎవరూ పొన్నాలకు అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అసైన్డ్ భూముల విషయంలో ఉన్న నిబంధనలు, పొన్నాల విషయంలో జరిగిన ఉల్లంఘనలు, కోర్టుల మొట్టికాయలు, కాగ్ అక్షింతలు, ఏపీఐఐసీతో అధికార దుర్వినియోగం, అప్పటి కాంగ్రెస్ సర్కారు తీరు వంటి అనేక అంశాలను హరీశ్ ప్రస్తావించడంతో పొన్నాల చక్రబంధంలో చిక్కుకున్నట్లయింది. ‘టీపీసీసీ చీఫ్ పొన్నాల భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను బదనాం చేయాలనుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఒక విధంగా మేం ఈ రోజు ఆత్మరక్షణలో పడ్డాం. అయితే సభాసంఘం పది జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి విచారణ జరుపుతుంది. అదొక్కటే ఊరట’ అని కాంగ్రె స్కు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ‘ఈ వివాదం వల్ల ప్రభుత్వ తీరును పీసీసీ చీఫ్ ఎలా ఎండగడతారు?’ అని అభిప్రాయపడ్డారు. ‘టీపీసీసీ అధ్యక్షునిగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయినప్పుడే, ఆయన తప్పుకొని ఉంటే గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఈ వివాదం వ్యక్తగతమే అయినా, ఆయన టీపీసీసీ అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది’ అని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇప్పుడు పొన్నాల తప్పొప్పుల గురించి చర్చించి లాభం లేదని, పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం తాజా పరిణామంతో ఆనందంలో మునిగిపోయింది. పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని ప్రచారం సాగుతున్న తరుణంలో ఇప్పుడు అసైన్డ్ భూముల వివాదం తెరపైకి రావడం వ్యూహాత్మకమేనని ఆ వర్గం భావిస్తోంది. -
'అసైన్డ్'పై సభాసంఘం
* భూ అక్రమాలపై రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం * భూముల దొంగలందరినీ బయటపెడదామన్న సీఎం కేసీఆర్ * సభాసంఘం ఏర్పాటుకు అన్నిపక్షాల ఏకాభిప్రాయం * విచారణ పరిధిలోకి భూదాన్, దేవాలయ, వక్ఫ్, చర్చి భూములు.. * వచ్చే సమావేశాల నాటికి సభకు నివేదిక అందించాలని గడువు * రాష్ట్రంలో 1.90 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్న సీఎం * వాటిని తిరిగి పేదలకే కట్టబెడతామని అసెంబ్లీలో ప్రకటన * పొన్నాలకు భూ కేటాయింపులపై సభలో దుమారం * చట్ట విరుద్ధంగా భూములు పొందారన్న మంత్రి హరీశ్ * అధికారం అండతో చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్నారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల పంపిణీ, కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని రాష్ర్ట అసెంబ్లీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు సభాసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి బుధవారం శాసనసభలో ప్రకటన చేశారు. దీనిప్రకారం రాష్ట్రం లో దళిత, గిరిజనులు సహా ఇతర వర్గాల వారికి ఇప్పటివరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములతో పాటు పది జిల్లాల్లో అసైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూదాన్, దేవాలయ, వక్ఫ్, చర్చి వంటి అన్ని రకాల భూములపై సభాసంఘం విచారణ జరపనుంది. ఇది అన్ని జిల్లాల్లో పర్యటించి భూ అక్రమాలపై నివేదికను వచ్చే సమావేశాల నాటికి సభ ముందు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. సభాసంఘం చేసే సిఫార్సులు, సూచనలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రకటించారు. నివేదిక సమర్పణకు, దాని అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని మరోమారు సభలో చర్చించి నిర్ణయిద్దామన్నారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జరిపిన 8.39 ఎకరాల భూ కేటాయింపులపై బుధవారం టీఆర్ఎస్ సభ్యుడు ఇంద్రకరణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు సహా ఇతర సభ్యులు ఇచ్చిన సావధాన తీర్మానంపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అన్ని పక్షాల నేతలు మాట్లాడారు. అన్యాకాంత్ర భూములపై సభాసంఘం వేయాలని, ఒక్క ధర్మసాగర్ భూములే కాకుండా, కబ్జాలకు గురైన అన్ని రకాల భూములను సభాసంఘం పరిధిలోకి తీసుకొచ్చి విచారణ జరపాలని గట్టిగా కోరారు. దీనిపై కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తే ప్రయత్నం చేసినా, మిగిలిన పక్షాలన్నీ సభాసంఘం ఏర్పాటుకు అంగీకరించడంతో ఆ పార్టీ కూడా అందుకు సమ్మతించింది. అధికారంతో యథేచ్ఛగా అక్రమాలు సభ్యుల సావధాన తీర్మానంపై మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ‘1971లో దళితులకు కేటాయించిన భూములను తర్వాతి కాలంలో పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల రామ్మోహన్‌లు కబ్జా చేశారు. దీనిపై 2001లో వేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2002లో అప్పీల్‌కు వెళ్లగా సమయం వృథా చేశారంటూ కోర్టు చీవాట్లు పెట్టింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులకు చెందిన 81.13 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి, మరో 8.39 ఎకరాల భూమిని పొన్నాల లక్ష్మయ్యకు ఏపీఐఐసీ ద్వారా కట్టబెడుతూ జీవో ఇచ్చింది. అయితే ఈ భూమిలో పరిశ్రమలను నెలకొల్పకపోవడంతో 2009 నుంచి వరుసగా నోటీసులు కూడా జారీ అయ్యాయి. పొన్నాలకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని 2013లో ఏపీఐఐసీని ఆదేశించినా అది అమలు కాలేదు. పొన్నాలకు భూ కేటాయింపుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. వరంగల్ పట్టణానికి అతి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న భూమిని ఎకరం కేవలం రూ. 25,500 చొప్పున ఇచ్చారు. ఇదీగాక ఈ భూమిని ఇవ్వడం వల్ల ఏపీఐఐసీకి చెందిన మరో మూడెకరాలకు దారి లేకుండా పోయింది. భూ కేటాయింపుల్లో అన్ని చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుంటూ, అధికారం అండతో యథేచ్ఛగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి ఎలాంటి శిక్ష విధించాలో కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి’ అని హరీశ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభలో లేని వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటాన్ని సభా నిబంధనలు ఒప్పుకోవని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత జానారెడ్డి సైతం అభ్యంతరం తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిని ఎండగట్టేందుకు ఉద్దేశించినవిగా ఉన్నాయన్నారు. అయినా హరీశ్ కొనసాగిస్తూ.. ‘ఇడుపులపాయలో భూ ఆక్రమణలపై గతంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి.. దళితులకు చెందిన భూములను ఎవరైనా తిరిగిచ్చేయాలన్నారు. ఆయన స్వయంగా భూములివ్వడమే కాకుండా ఆ మేర కు చట్టాన్ని కూడా తెచ్చారు. దాన్ని కూడా పొన్నాల పట్టిం చుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు హరీశ్ మాట్లాడుతున్నంతసేపు కాంగ్రెస్ సభ్యు లు తీవ్ర అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు అధికారపక్షం వాదనతో పార్టీలన్నీ ఏకీభవించాయి. దళితుల భూ కబ్జాలపై వెంటనే సభా సంఘాన్ని వేయాలని, దీంతో పాటే హన్మకొండ మండలంలోని తిమ్మాపూర్‌లో కబ్జాకు గురైన 200 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు కోరారు. టీడీపీ తరఫున ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ తరఫున రాంచంద్రారావు, ఎంఐ ఎం సభ్యుడు పాషా ఖాద్రి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తది తరులు సైతం సభాసంఘం వేయాలని డిమాం డ్ చేశారు. రాష్ట్రంలో అసైన్డ్ అక్రమాలన్నింటిపైనా విచారణ చేయాలని కోరారు. కాంగ్రెస్ తరఫున సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకునేందుకు దళితులను వాడుకోరాదని హితవు పలికారు. భూములిచ్చినా.. అభివృద్ధిలేదు.. సభాసంఘం ఏర్పాటుపై సభలో ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. పొన్నాలకు భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములను కట్టబెట్టిందని, అది పద్ధతి కాదని ముఖ్యమంత్రి అన్నారు. దళితులకు భూ కేటాయింపులు చేసినా అభివృద్ధి జరగలేదని, ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని పేర్కొన్నారు. ‘దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే 1.90 లక్షల ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని తేలింది. ఇక్కడ ఓ వ్యక్తిని లక్ష్యం చేసుకోవడం కాదు. పొన్నాలకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీకి, దాని స్థానిక జోనల్ మేనేజర్‌ను ప్రభుత్వం ఆదేశించినా అది జరగలేదు. దానిపై చర్యలు తీసుకుందాం’ అని సీఎం అన్నారు. దీంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుంటూ.. అన్యాక్రాంతమైన భూముల విషయంలో సభాసంఘం వేయడం మంచిదేనని, ఇలాంటి భూములు ఎవరి అధీనంలో ఉన్నా పరిశీలించి అందరికీ న్యాయం చేయాలని సూచించారు. అయితే పొన్నాలకు భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వమే దళితుల భూమిని కొనుగోలు చేసి ఏపీఐఐసీకి ఇచ్చింద ని, భూముల కొనుగోలులో గత ప్రభుత్వం తప్పు చేసి ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని సవరిం చాలని అన్నారు. దొంగలందరినీ బయటపెడదాం.. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ కొనసాగించారు. ‘అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కారాదు. భూదాన్తోపాటు లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూములు సహా అన్ని రకాల భూములను ఇందులో చేర్చి దొంగలందరినీ బయటపెడదాం. పేదల నోటికాడి భూములు కొట్టేసిన వారంతా శిక్షార్హులే. సభాసంఘం విషయంలో ఏకాభిప్రాయం ఉన్నందున అది జిల్లాలన్నీ తిరిగి అన్ని భూములపై విచారణ జరిపి వచ్చే సమావేశాల నాటికి సభ ముందు పెట్టాలి. ఆ సిఫారసుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అసైన్డ్ భూములను ఎవరి దగ్గరి నుంచి తీసుకున్నారో తిరిగి ఆ పేదలకే భూములు దక్కేలా నిర్ణయం చేద్దామ’ని సీఎం అన్నారు. దీనిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ గతంలో వక్ఫ్ భూముల ఆక్రమణలపై సభాసంఘం వేసినా.. దానికి నిర్దిష్ట గడువు లేకపోవ డంతో నివేదిక ఆలస్యమైందని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా ప్రస్తుత సభాసంఘానికి గడువు విధించి, నిర్దిష్ట సమయంలో చర్యలు చేపట్టాలని సూచించారు. -
కబ్జాపై సభా సంఘం వేయడానికి అభ్యంతరంలేదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో అసైన్డ్ భూముల ఆక్రమణపై వాడివేడి చర్చ జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలోని పది జిల్లాల్లో అసైన్డ్ భూముల కబ్జాపై సభా సంఘం వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వెల్లడించారు. పొన్నాల లక్ష్మయ్య భూముల అంశంపై ఆయన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వమే పొన్నాల భూమిని రద్దు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 90వేల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాలో ఉందని చెప్పారు. అంతకు ముందు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని, ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పలేదని ఆరోపించారు. ఆ భూముల్లో ఫౌల్ట్రీ ఫామ్‌ను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో పొన్నాల లక్ష్మయ్య భూములపై హరీష్‌రావు చర్చించారు. తక్కువ ధరకు విక్రయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుంటే తమకు అప్పగించాలని 2013లో ఏపీఐఐసీ వెల్లడించిందని గుర్తు చేశారు. కానీ పొన్నాల మాత్రం ఆ భూములు అప్పగించలేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరం రూ. 25,500లకే కేటాయించారని హరీష్‌రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ, విక్రయించడం కాని చేయకూడదని ఆయన వెల్లడించారు. **