వాషింగ్టన్: అమెరికాలోని కేపిటల్ భవనంపై జరిగిన దాడిని విచారిస్తున్న హౌస్ కమిటీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరులు క్రిమినల్ ఈ కుట్రలో భాగస్వామ్యులుగా ఉన్నట్టు ఆధారాలున్నాయని వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ నిర్ధారించడాన్ని అడ్డుకునేందుకే ట్రంప్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని కమిటీ ఆరోపించింది. అమెరికా ప్రతిష్టను మంటగలిపేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి కేపిటల్ భవనంపై దాడి జరిగేలా ప్రోత్సాహించారంటూ 221 పేజీల నివేదికను కాలిఫోర్నియా కోర్టులో దాఖలు చేసింది. దీనికి సంబంధించి ట్రంప్‌పై అభియోగాలు మోపేదీ లేనిదీ కమిటీ స్పష్టంగా వెల్లడించలేదు. ఇంకా విచారణ జరగాల్సి ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment