‘ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు’ | Attack on Trumplord Jagannath Saved his Life | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు’

Published Mon, Jul 15 2024 9:04 AM | Last Updated on Mon, Jul 15 2024 9:38 AM

Attack on Trumplord Jagannath Saved his Life

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దాడి నుంచి ఆ జగన్నాథుడే కాపాడాడని కోల్‌కతా ఇస్కాన్‌ టెంపుల్‌ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్‌ దాస్ వ్యాఖ్యానించారు. దీనికి రుజువుగా ఆయన 1976 నాటి రథయాత్రను ప్రస్తావించారు. ప్రమాదం నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకోవడం దైవికమని ఆయన అభివర్ణించారు.

దీనిగురించి రాధారమణ్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో  ఇలా రాశారు..‘సరిగ్గా 48 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి సహాయం అందించారు. ప్రపంచమంతా జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్‌పై దాడి జరగడం  ఊహించనిది. ట్రంప్‌ను జగన్నాథుడే  కాపాడాడు. 1976, జూలైలో డొనాల్డ్ ట్రంప్.. జగన్నాథ రథాల నిర్మాణానికి తన రైలు యార్డ్‌ను ఉచితంగా అందించి,  రథయాత్రను నిర్వహించేందుకు సహకరించారు.

రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ సహకారంతో 1976లో యునైటెడ్ స్టేట్స్‌లోని ఎన్‌వైసీ వీధుల్లో జగన్నాథుని మొదటి రథయాత్ర జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) న్యూయార్క్ నగరంలో రథయాత్రను నిర్వహించాలనుకున్నప్పుడు అనేక సవాళ్లు  ఎదురయ్యాయి. నాడు రథాలను తయారు చేసేందుకు పెద్ద ఖాళీ స్థలం అవసరమైంది. ఈ నేపధ్యంలో నాడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇస్కాన్‌ సంస్థ సంప్రదించగా, ఆయన తన ఫిష్డ్‌ అవెన్యూను రథాల తయారీ కోసం ఉపయోగించుకునేందుకు అనుమతించారు. ఈ విధంగా ట్రంప్‌ అమెరికాలో జగన్నాథ రథయాత్ర సాగేందుకు సహకారం అందించారని’ రాధారమణ్‌ దాస్‌ పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement