
సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు.
అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్‌లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు.
చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.
గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్ టేబులంటూ ఏమీలేదు.
రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి తన హయాంలో కేలండర్ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు

చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.
మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.
కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.
రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.
ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్‌లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.
గత బడ్జెట్‌లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్‌లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.
రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.
ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.
అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment