Employee issues
-
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఎన్జీవో ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో పీఆర్సీ సమస్య పరిష్కరిస్తామని స్వయంగా సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ఈలోపే ఉద్యోగ సంఘాల నేతలు కొందరు బ్లాక్ మెయిల్‌కు దిగటం ఏమిటని ప్రశ్నించారు. తమ వద్ద 60 లక్షల ఓట్లు ఉన్నాయని ఉద్యోగ నేత అనడం దేనికి సంకేతమని అన్నారు. సీఎం జగన్ అడిగిన 10 రోజులు గడువు ముగియకముందే అల్టిమేటం ఎందుకు ఇచ్చారని, సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకొంటే బాగుంటుందని చెప్పారు. ఉద్యోగులే ప్రభుత్వ రథ సారథులని, వారు బాగా పనిచేస్తున్నారని సీఎం జగన్ చెప్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగ నేతలు ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ అన్ని విధాల కృషి చేస్తారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఎక్కడ రావడంలేదో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పాలన్నారు. నాయకులు సంయమనం పాటించాలని కోరారు. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లే ఇక్కడా జరుగుతుందని చురకలు అంటించారు. తర్వాత ఉద్యోగ సంఘాల నేతలే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులను ఇంత మంచిగా చూసుకొనే సీఎం ఎక్కడా ఉండరని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ చాలా విషయాల్లో పెద్ద పీట వేశారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు ఆలోచించి అడుగులు వేయాలన్నారు. -
‘వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఈ శాఖ కమిషనరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో నాగేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్య సేవల పరంగా ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం 22 ఏళ్లుగా భరోసా కల్పించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కె.యాదానాయక్, సెక్రటరీ జనరల్ కె.బలరాం, వి.విజయవర్ధన్ రాజు, ఎ.కవిత పాల్గొన్నారు. -
గురుకుల సమస్యలకు త్వరలో పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొ న్నారు. బుధవారం మంత్రి నివాసంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ శాలల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2018 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్క రించారు. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిం చటంతో పాటు 2007లో రెగ్యులర్ అయిన టీజీటీలకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సంఘం అధ్యక్షులు కొల్లు వెంకట్‌రెడ్డి, యం.వెంకటేశ్వర్లు కోరారు. రూల్ 28ఏ కింద ఇంక్రిమెంట్ల కోతను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సీఆర్‌కే శంకర్‌దాస్, రఘునందన్‌రావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషొత్తమ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాదులో ఉన్న ఏపీ ఎన్జీవో సంఘ కార్యాలయం.. ఏపీ ఎన్జీవోలు డొనేట్ చేసి నిర్మించుకున్న కార్యాలయం అని, అది ప్రైవేటు ఆస్తి అన్నారు. దీనిపై హైదరాబాదులోని కలెక్టర్ పెత్తనాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం రెండు డీఏ బకాయిలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఐదేళ్లుగా ఎంతో కష్టపడి సాధించుకున్న హెల్త్‌కార్డులు విషయంలో.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం వేతనం ఇస్తామని చెప్పారని, ఇది ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో తెలియడం లేదన్నారు. ఈ జీవోను తక్షణమే సరిదిద్దాలన్నారు. ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూనే ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు 20శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని చెప్పి ఏడాదిన్నర అయిందని, సీఎం హామీకే దిక్కులేదన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘ ప్రతినిధులు చల్లా శ్రీనివాసరావు, బమ్మిడి హరికృష్ణ, ఆర్.వేణుగోపాల్, ఎల్.జగన్మోహనరావు, బమ్మిడి నర్సింగరావు, రామ్మోహనరావు, బి.పూర్ణచంద్రరావు, ఏజెఎం రాధాకృష్ణ, బి.మధుసూధనరావు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో లేవనెత్తుతాం
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ప్రస్తుతమున్న వారినే తొలగించడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యగులు రేవంత్‌కు వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత మార్చిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 1,179 మందిని ప్రభుత్వం తొలగించడంతో అంతా వీధుల్లో పడ్డామని ఆ ఉద్యోగులు ఆవేదన వెలిబుచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. -
‘108’ కమిటీతో జీవీకే చర్చలు
సభ్యులకు అభిప్రాయాలు వెల్లడించిన ప్రతినిధులు నివేదికలోని అంశాలు అవాస్తవమని స్పష్టీకరణ హైదరాబాద్: ‘108’ నివేదికపై జీవీకే-ఈఎంఆర్ఐ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఏకపక్షంగా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ‘108’ నిర్వహణ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇద్దరు ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీతో జీవీకే-ఈఎంఆర్ఐ ప్రతినిధులు హైదరాబాద్‌లో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘ప్రభుత్వాన్ని, ప్రజలను, ఉద్యోగులను మోసం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న జీవీకే సంస్థను తక్షణమే 108 నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించాలి.’ అని కమిటీ సర్కారుకు సిఫారసు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జీవీకే-ఈఎంఆర్ఐ ప్రతినిధులు ఆగమేఘాల మీద కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, గాదరి కిశోర్‌లతో చర్చలు జరిపారు. ఉద్యోగుల ఆరోపణల ఆధారంగానే నివేదిక తయారు చేశారని, ఉద్యోగుల సంక్షేమాన్ని తాము గాలికి వదిలేశామని అనడంలో వాస్తవం లేదని వారు అన్నట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ రూ.కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లుగా నివేదికలో ప్రస్తావించడంపట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో మరోమారు నివేదికలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఇదిలావుండగా...ద్విసభ్య కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ‘108’ బాధ్యతల నుంచి జీవీకేను తప్పిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఒప్పందం ప్రకారం తొలగించడానికి వీలులేదని జీవీకే వర్గాలు పేర్కొంటున్నట్లు తెలిసింది. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాకే విమానాశ్రయాల ప్రైవేటీకరణ
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తమ ఆధ్వర్యంలోని నాలుగు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను మానవ వనరులపరమైన సమస్యలను పరిష్కరించిన తర్వాతే చేపట్టనున్నట్లు ఏఏఐ చైర్మన్ ఆర్కే శ్రీవాస్తవ చెప్పారు. ఇందుకోసమే అర్హత దరఖాస్తుల సమర్పణ కు ఆఖరు తేదీని మార్చి 24 నుంచి మే 26కి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగులలో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం తొలగిస్తుందని, వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూస్తుందని ఆయన చెప్పారు. కోల్‌కతా, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించడం వల్ల ఏఏఐ ఆదాయం మరింత తగ్గిపోతుందని, ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోతపడుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. -
త్వరలోనే మెరుగైన పీఆర్సీ
సంగారెడ్డి క్రైం: బడ్జెట్ సమావేశాల అనంతరం ఉద్యోగులు ఆశించిన రీతిలోనే మెరుగైన పీఆర్ సీ రానుందని టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. సంగారెడ్డిలోని టీఎన్జీఓ భవన్లో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మెరుగైన పీఆర్సీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఏ రాష్ర్ట్రంలో లేని విధంగా పరిమితి లేని చెల్లింపులతో కూడిన హెల్త్ కార్డులు ఇవ్వడం హర్షణీయమన్నారు. కానీ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం రేట్లు పెంచాలని హెల్త్ కార్డులు తీసుకోవడం లేదన్నారు. వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసరంగా శస్త్ర చికిత్సలు జరిగినట్లయితే రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ర్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 65 సంవత్సరాలు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు 65 శాతం పెన్షన్ ఇవ్వాలని కోరారు. అనంతరం టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్యామ్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు ఎం.రాజేందర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌రావు, విజయలక్ష్మి, మనోహర, జయరామ్ నాయక్, సుశీల్‌బాబు, జావెద్ అలీ, సుధాకర్, మంజులత, రవి, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలకన్నా ఉద్యోగుల సమస్యలే మిన్న
సిద్దిపేట టౌన్ : రాజకీయాల కన్నా తనకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమని రాష్ట్ర టీఎన్జీవోల సంఘం చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో తనకు టిక్కెటు ఇవ్వని అంశాన్ని రాజకీయ దురుద్దేశంతో వాడుకోవడం తగదన్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చే యాలన్నారు. స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పుడే తెలంగాణలో పాలన వేగవంతమవుతుందన్నా రు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నారు. జిల్లా, జోన్ స్థాయి అధికారులను వారి ప్రాంతాలకు పంపిం చాలన్నారు. దసరా లోగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులను, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. బంగారు తెలంగాణలో తాము సైతం భాగస్వామ్యం అవుతామన్నారు. సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నేతలు విక్ర మ్, శ్రీహరి, మజీద్ పాల్గొన్నారు. -
దద్దరిల్లిన సచివాలయం
విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన అడ్డుపడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగుల నిరసన సాక్షి,హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి రావడంతో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలతో బుధవారం సచివాలయం దద్దరిల్లింది. సీమాంధ్ర ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో దూకుడుగా వెళుతోందని సీమాంధ్ర ఉద్యోగులు ఆరోపించగా.. చివరి దశలో ఉన్న తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా 140 రోజులుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర సచివాల ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 159 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేల నుంచి విభజనకు వ్యతిరేకంగా ‘అఫిడవిట్లు’ తీసుకోవాలని నిర్ణయించామన్నారు. విభజనపై నిరసన తెలిపేందుకు వచ్చిన సీమాంధ్ర విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని.. వారిని పరామర్శించడానికి వెళ్లిన సంఘం కోశాధికారి వరలక్ష్మిని కూడా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ తథ్యం: తెలంగాణ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్న దశలో అడ్డుకోవడం ద్వారా విద్వేషాలు పెరగడమే తప్ప వేరే ప్రయోజనం ఉండదని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత శ్రావణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిల్లులో తెలంగాణ ప్రాంత వాసులకూ అభ్యంతరాలు ఉన్నాయన్నారు. అక్రమంగా వచ్చిన 70 వేల మంది సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను ఇక్కడే కొనసాగించేటట్లయితే ‘తెలంగాణ’కు అర్థమే లేదన్నారు. ‘371 డి’ని తెలంగాణకు వర్తింపచేయకపోతే స్థానికులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.