
మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొ న్నారు. బుధవారం మంత్రి నివాసంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ శాలల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2018 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్క రించారు. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిం చటంతో పాటు 2007లో రెగ్యులర్ అయిన టీజీటీలకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సంఘం అధ్యక్షులు కొల్లు వెంకట్‌రెడ్డి, యం.వెంకటేశ్వర్లు కోరారు. రూల్ 28ఏ కింద ఇంక్రిమెంట్ల కోతను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సీఆర్‌కే శంకర్‌దాస్, రఘునందన్‌రావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment