Sunita Williams: నాటి సెల్ఫీని షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా | Anand Mahindra Recalls Meeting Sunita Williams in Swagatam Message For NASA Astronaut, Tweet Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sunita Williams Earth Return: నాటి సెల్ఫీని షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా

Published Wed, Mar 19 2025 11:25 AM | Last Updated on Wed, Mar 19 2025 12:30 PM

Anand Mahindra Recalls Meeting Sunita Williams in Swagatam Message

న్యూఢిల్లీ: వ్యోమగామి సునీతా విలియమ్స్‌(Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సునీతా విలియమ్స్‌ను స్వాగతిస్తూ, గతంలో తాను సునీతా విలియమ్స్‌తో దిగిన సెల్ఫీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  

తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర(Space travel)కు వెళ్లిన విలియమ్స్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా తొమ్మిది నెలల పాటు జీరో గురుత్వాకర్షణ స్థితిలో ఉండవలసి వచ్చింది. ఇప్పుడు క్రూ-9 మిషన్‌ సాయంతో విలియమ్స్, విల్మోర్‌లు అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగడం ద్వారా తమ అంతరిక్ష ప్రయాణాన్ని ముగించారు.
 

ఈ సందర్భంగా మహీంద్రా  ఒక పోస్ట్‌లో సునీతా విలియమ్స్ ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తూ.. ‘రెండేళ్ల క్రితం స్పేస్‌ ఎక్స్ రెస్క్యూ మిషన్(SpaceX rescue mission) ప్రారంభించినప్పుడు వాషింగ్టన్‌లో @Astro_Suniని కలుసుకున్నాను. కొన్ని గంటల క్రితం ఆమెతో పాటు ఆమె సహచరులు భూమిపైకి విజయవంతంగా తిరిగి వచ్చిన దృశ్యాన్ని చూడటంతో చాలా ఉపశమనం కలిగించింది. స్వాగతం.. సునీత’ అని రాశారు. ఆనంద్‌ మహీంద్రా 2023 జూలైలో వాషింగ్టన్‌లో సునీతతో తీసుకున్న సెల్ఫీని  షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ముఖేష్ అంబానీ, వృందా కపూర్, సునీతా విలియమ్స్‌తోపాటు ఆనంద్‌ మహీంద్రా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్‌ను స్వాగతించిన డాల్ఫిన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement