- ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఆహ్వానం పలుకుతున్న ప్రభుత్వం
- సీనియూరిటీ, ప్రతిభ ఆధారంగా నియూమకాలకు ఆదేశాలు
- హౌసింగ్‌లో మండలానికి ఇద్దరు చొప్పున నియమకానికి కంకణం
చిత్తూరు(అగ్రికల్చర్) : రండి బాబోయ్... రండి, వచ్చి మళ్లీ సేవలు అందించండి అంటూ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆహ్వానం పలుకుతోంది. ప్రభుత్వ పథకాల అమలులో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలు అవసరం లేదంటూ నెల క్రితం గృహ నిర్మాణ శాఖలోని సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తొలగించిం ది. ప్రస్తుతం ప్రభుత్వం పనులు సకాలంలో చేసుకోలేక ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అవసరాన్ని కోరుకుంటోంది.
గృహ నిర్మాణ శాఖలో తొలగించిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది స్థానే మ రోమారు ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రతి మండలానికీ ఇద్దరు చొప్పున ఔట్‌సోర్సింగ్ కింద అదనపు సిబ్బం దిని ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలను జిల్లా గృహనిర్మాణ శాఖకు పంపింది. 2006లో అప్ప టి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రం లో ప్రతి నిరుపేదకూ గూడు కల్సించాలనే తలంపుతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు.
దాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు వీలుగా మండలంలోని హౌసింగ్ ఏఈలకు సహాయకులుగా అవసరాన్నిబట్టి ఇద్ద రు, ముగ్గురిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అదనపు సహాయక సిబ్బం దిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రభుతం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి గ్రామంలో సకాలంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుకలిగింది. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఏఈల కు ప్రతి పనిలోనూ సహాయకులుగా వ్యవహరించడంతో ఇళ్ల పనులు చురుగ్గా జరిగారుు.
తొలగించబడ్డ సిబ్బంది
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గృహ నిర్మాణశాఖలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలు అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 151 మందిని తొలగించింది. ఏళ్లతరబడి గృహనిర్మాణ శాఖనే నమ్ముకున్న జౌట్‌సోర్సింగ్ సిబ్బంది వీధిన పడ్డారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
అవసరాన్నిబట్టి సిబ్బంది సేవలు
ఇటీవల ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1999 నుం చి ఇప్పటి వరకు పక్కా ఇళ్ల లబ్ధిదారుల జాబి తాలను ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించింది. ప్రతి లబ్ధిదారుడి ఆధార్, రేషన్ కార్డులు, బ్యా ంకు ఖాతాలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ పనులు సత్వరం చేపట్టేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఏమాత్రం చాలడంలేదు. కావున అవసరాన్ని బట్టి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి మండల హౌసింగ్ ఏఈకి ఇద్దరు చొప్పున సహాయకులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే జిల్లాలో సహాయకులుగా 57 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. 65 మండలాలకు ఇద్దరు చొప్పున 130 మంది సహాయకులు కావాలి. రెగ్యులర్ సిబ్బంది 57 మంది ఉండగా మిగిలిన 73 మందిని ఔట్‌సోర్సింగ్ కింద ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. తొలగించబడ్డ సిబ్బందిలోనే సీనియారిటీ, గతంలో వారు చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అవసరాన్ని బట్టి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తీసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, అవసరం తీరాక మళ్లీ వీధి పాలు చేస్తుందో? లేక కొనసాగిస్తుందో వేచిచూడాల్సిందే.