సాక్షి, తిరుపతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మందికి ప్రాణాలను పోశారు. అదే కోవలో ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రత్యేకంగా నిధులు మంజూరుచేసి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను నిలుపుతున్నారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన ఇద్దరికి రూ.28 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుచేశారు.
పులిచెర్ల మండల పరిధిలోని ఎగువబెస్తపల్లికి చెందిన మునినరేష్ గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. శస్త్ర చికిత్స కోసం రూ.18 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆర్థిక స్థోమత లేక మృత్యువుతో పోరాడుతున్నారు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన చిన్నారి రాశం భార్గవ రెడ్డి పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్న ఇద్దరి విషయాన్ని స్థానికులు వైఎస్సార్‌సీపీ లోకసభా పక్షనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం రూ.28 లక్షలు మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment