మాట్లాడుతున్న జస్టిస్ చంద్రకుమార్
నీళ్లు లేవు..నియామకాలూ లేవు
Published Tue, Aug 30 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
దోమలగూడ: నిధులు..నీళ్లు..నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదని పలువురు వక్తలు అన్నారు హౌసింగ్ బోర్డులో తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు రెగ్యులర్ చేయాలని కోరుతూ గృహ నిర్మాణ సంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు.
దీక్షలకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ డాక్టరు నాగేశ్వర్, సీపీఐ నేత గుండా మల్లేష్, బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, టీజేఏసీ కో చైర్మన్ వెంకట్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు లేవు, నియామకాలు లేవని, ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కడుపులు నింపేందుకు ఉద్యోగుల పొట్టగొడుతున్నారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత సిర్పూర్ కాగజ్‌నగర్ పేపరు మిల్లు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తదితర కంపెనీలు మూతపడి వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.
Advertisement
Advertisement