Real Estate Board
-
‘గృహ నిర్మాణం’లో అక్రమాలను నిరూపిస్తా
ఇంద్రకరణ్, ఈటల బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డు పరిధిలో చేపట్టిన హౌసింగ్ జాయింట్ వెంచరు (జేవీ) ప్రాజెక్టుల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తానని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అక్రమాలు జరిగాయని నిగ్గుతేల్చిన విజిలెన్సు నివేదికల ఆధారంగా తాను వాస్తవాలను మాట్లాడుతుంటే.. మంత్రులు తప్పుదారి పట్టించేలా మాట్లాడటం తగదని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అవినీతి జరగలేదని, అక్రమాల్లో తమ పాత్ర లేదని మంత్రులు ఇంద్రకరణ్, ఈటల రాజేందర్ చెబుతున్నదని వాస్తవమే అయితే బహిరంగ చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో పోరులో భాగంగా ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో టీటీడీపీ బుధవారం బహిరంగ సభ నిర్వహించనుంది. -
నీళ్లు లేవు..నియామకాలూ లేవు
దోమలగూడ: నిధులు..నీళ్లు..నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదని పలువురు వక్తలు అన్నారు హౌసింగ్ బోర్డులో తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు రెగ్యులర్ చేయాలని కోరుతూ గృహ నిర్మాణ సంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. దీక్షలకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ డాక్టరు నాగేశ్వర్, సీపీఐ నేత గుండా మల్లేష్, బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, టీజేఏసీ కో చైర్మన్ వెంకట్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు లేవు, నియామకాలు లేవని, ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కడుపులు నింపేందుకు ఉద్యోగుల పొట్టగొడుతున్నారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత సిర్పూర్ కాగజ్‌నగర్ పేపరు మిల్లు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తదితర కంపెనీలు మూతపడి వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. -
బహిరంగ వేలం ద్వారానే కేటాయింపులు జరగాలి
హౌసింగ్ బోర్డు స్థలాలపై హైకోర్టు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్ : హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలను ఎలా పడితే అలా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సాధ్యం కాదని, కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో 1,200 చదరపు అడుగుల స్థలాన్ని తమకు కేటాయించేలా హౌసింగ్ బోర్డును ఆదేశించాలని కోరుతూ ఎ.బాలామణి, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఇంటికి వెళ్లేందుకు మరో దారి లేనందున తమకు ఆ 1,200 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని బాలామణి తదితరులు 2001లో ప్రభుత్వాన్ని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం చదరపు గజానికి రూ.5 వేలు చెల్లిస్తే స్థలాన్ని ఇవ్వాలని హౌసింగ్ బోర్డును ఆదేశిస్తూ ఆ మేరకు జీవో జారీ చేసింది. అయితే బాలామణి తదితరులు రూ. 5 వేలు చెల్లించలేదు. ఆ తరువాత ఈ జీవో అమలు కోసం హైకోర్టులో బాలామణి తదితరులు పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ జడ్జి దానిని తోసిపుచ్చారు. దీనిపై ధర్మాసనం ముందు మరోసారి అప్పీల్ చేశారు. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది. -
దళితులను మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
పాలకొల్లు అర్బన్ : దళితులను టీడీపీ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్ విమర్శించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలోని మాలమహానాడు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది ఎస్సీ రుణాల మంజూరు కోసం నోటిఫికేషన్ జారీ చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారని, వారికి రుణాలు ఇవ్వకపోగా మళ్లీ ఈ ఏడాది రుణాల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించడం దళితులను మోసం చేయడమేనన్నారు. ఎంతోమంది ఎస్సీ నిరుద్యోగులు ఉద్యోగం రాకపోయినా కనీసం స్వయం ఉపాధి ద్వారా బతుకుదామనే ఆశతో ఎదురుచూస్తుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లుజల్లిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో షెడ్యూలు కులాలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఎస్సీ హాస్టల్స్ మూసివేతకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దళితుల సమస్యలపై ఈ నెల 12వ తేదీన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రాజేష్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, యలమంచిలి మండల అధ్యక్షుడు విప్పర్తి నవీన్, పోడూరు మండల ఉపాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మోకా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
జైలు వార్డర్ కిడ్నాప్
రాజమండ్రి రూరల్ : రాజమండ్రి సెంట్రల్ జైలు వార్డర్ను కిడ్నాప్ చేసి రూ.10 వేలు డిమాండ్ చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం రంగంపేట గ్రామానికి కంటిపూడి నరేంద్ర ఉద్యోగాలు వెతుక్కునేందుకు హైదరాబాద్ వెళ్లే నిమిత్తం సోమవారం రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలోని స్నేహితుడు, రాజమండ్రి సెంట్రలు జైలు వార్డర్ అయిన మురళీకిషోర్ ఇంటికి వచ్చాడు. స్నేహితులు ఫణి, ఆనంద్‌లతో కలిసి దివాన్‌చెరువులోని ఓ ధాబాకు వెళ్లాడు. అదే ధాబా వద్ద రాజమండ్రికి చెందిన పైడి శాండీ, కరుటూరి చాణక్య, షకిల్ సునందబాబు, అనిరుది శ్యామ్‌కుమార్‌లు అప్పటికే మద్యం తాగి ఉన్నారు. తాగిన మైకంలో వారు నరేంద్ర, అతడి స్నేహితులను పరుషపదజాలంతో తిడుతూ గొడవపడ్డారు. ఈలోగా నరేంద్ర జైలు వార్డర్ మురళీ కిషోర్‌కు ఫోన్లో విషయం తెలిపాడు. దీంతో ఆయన హుటాహుటిన దివాన్‌చెరువులోని ఆ ధాబావద్దకు వచ్చాడు. ఆయనను శాండీ, అతడి స్నేహితులు బీరు బాటిల్‌తో కొట్టి, బెదిరించి కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నరేంద్రకు వార్డర్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి రూ.10 వేలు ఇస్తే కానీ కిషోర్‌ను వదిలేది లేదని చెప్పారు. ఆ డబ్బులు తీసుకుని ఏవీ అప్పారావు రోడ్డులోకి కానీ, సెంట్రల్ జైల్ పెట్రోలు బంకు వద్దకు కానీ రావాలని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకూ ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. దీంతో ఈ విషయాన్ని నరేంద్ర బొమ్మూరు పోలీసులకు తెలిపాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తామని చెప్పి పెట్రోలు బంకు వద్దకు పోలీసులతో కలిసి వెళ్లాడు. పోలీసులను గమనించిన నిందితులు వార్డర్ మురళీకిషోర్ను విడిచిపెట్టి పరారయ్యారు. నరేంద్ర ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కిషోర్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డర్ కిడ్నాప్ కేసులో శాండీతోపాటు అతడి స్నేహితులు చాణక్య, సునందబాబు, శ్యామ్కుమార్లను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారినుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు యువకులూ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. -
వీడిన గ్రహణం
ఎట్టకేలకు తేలిన హౌసింగ్‌బోర్డు ఇళ్ల పంచాయితీ అగ్రిమెంట్ నాటి రేటుతోనే కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5కోట్ల మేర ఊరట హౌసింగ్‌బోర్డు అధికారులతో హైదరాబాద్‌లో మంత్రులు జగదీశ్, ఇంద్రకరణ్ సమావేశం నల్లగొండ : సొంత ఇంటి కోసం అడ్వాన్సులు చెల్లించి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయితీ ఎట్టకేలకు తేలింది. పాత అగ్రిమెంట్ ప్రకారం హౌసింగ్‌బోర్డు రూపొందించిన కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల సమక్షంలో సోమవారం హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. హెచ్ఐజీ గృహాల ధరను రూ.16.34 లక్షలు, ఎంఐజీ గృహాలను రూ.13.40 లక్షలకు కట్టించి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో గృహాలు నిర్మించి ఇచ్చేందుకు 2011లో నిర్ణయం తీసుకున్నారు. ఈ దేవరకొండ రోడ్డులో కతాల్‌గూడ వద్ద మొత్తం 334 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అందులో 152 హెచ్ఐజీ కాగా, 182 ఎంఐజీ ఇళ్లు. హెచ్ఐజీ ఇళ్లకు రూ.16.34 లక్షలు, ఎంఐజీ ఇళ్లకు రూ.13.40 లక్షలకు నిర్మించాలని 2011లోనే అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నారు. దీంతో లబ్ధిదారులంతా అడ్వాన్సులు చెల్లించారు. చాలామంది ఇళ్లపనులు ప్రారంభించారు. ఆ ఇళ్లలో ఇప్పటివరకు 52 హెచ్ఐజీ, 117ఎంఐజీ ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, అగ్రిమెంట్లో ఉన్న దానికి భిన్నంగా మధ్యలో మార్పులు తెచ్చి హెచ్ఐజీ, ఎంఐజీ ఇళ్లలో బాల్కనీలు ఏర్పాటుకు మరో రూ.3లక్షలు చెల్లించాలని హౌసింగ్ బోర్డు అధికారులు మెలికపెట్టారు. దీంతో భారమవుతుందనే ఆలోచనతో అడ్వాన్సులు చెల్లించిన వారు కూడా నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇందులో రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించిన వారున్నారు. దీంతో అధికారులు వారి అగ్రిమెంట్లను రద్దు చేస్తున్నామని, అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేది లేదని లబ్ధిదారులకు నోటీసులు కూడా పంపారు. దీంతో ఈ హౌసింగ్‌బోర్డు ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది. ఇప్పుడేం జరిగిందంటే.. లబ్ధిదారులు ఈ సమస్యను నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించాలని, ఆర్థికంగా భారం పడకుండా పాత అగ్రిమెంట్ వరకు ఇళ్లు కట్టించి ఇచ్చేలా హౌసింగ్ బోర్డు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో సోమవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి హౌసింగ్‌బోర్డు అధికారులు, లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయించారు. అందులో గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాత రేటుకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అది కూడా కొత్త డిజైన్‌తో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సమావేశంలో మరో అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ గృహాలను కట్టించి ఇచ్చిన చోట మరో 25 ఓపెన్ ప్లాట్లను అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చిన ఒక హౌసింగ్‌బోర్డు అధికారిపై మంత్రులు ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు సమాచారం. -
చోరీ ముఠా పట్టివేత
షాపింగ్ మాల్స్ టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్న సోదరులు ఐదుగురి నిందితుల అరెస్టు నగలు, నగదు స్వాధీనం గచ్చిబౌలి: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని చందనా బ్రదర్స్ షోరూమ్‌కు కన్నం వేసి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ముఠాను కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా టాటా గురువారం తెలిపిన వివరాలు ప్రకారం... ఈనెల 7వ తేదీ తెల్లవారు జామున కేపీహెచ్‌బీలోని చందనా బ్రదర్స్‌లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 6 గంటలకు కూకట్‌పల్లిలోని మలబార్ గోల్డ్ షాపు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పుగోదావరి ఉడుద్రుపాకకు చెందిన కట్టా శివశంకర్ అలియాస్ లడ్డూ(26), ఇతనికి వరుసకు సోదరుడైన కట్టా సత్తిబాబు(24)లను అదుపులోకి తీసుకొని విచారించగా చందనాబ్రదర్స్‌లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. చోరీ చేసిన నగలు, నగదు ఓల్డ్ అల్వాల్‌లో నివాసం ఉండే బంధువులు సోరంపుడి సత్యనారాయణ(50), కట్టా లక్ష్మి(40) చెల్లబోయిన వరలక్ష్మి(33)ల వద్ద దాచిపెట్టామని చెప్పడంతో వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15.50 లక్షల బంగారు, వెండి నగలు, రూ.5.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. ఇలా చోరీ చేశారు... ఓల్డ్ అల్వాల్‌లో నివాసముంటున్న కట్టా శివశంకర్, దోమలగూడలో ఉంటున్న అతనికి సోదరుడైన కట్టా సత్తిబాబు(24) వారం రోజుల పాటు కూకట్‌పల్లిలోని చందనాబ్రదర్స్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఈనెల 6వ తేదీ రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చారు. రాత్రి 2 గంటలకు చందనాబ్రదర్స్ అనుకొని ఖాళీగా ఉన్న భవనంలోని టైపైకి వెళ్లారు. అక్కడి నుంచి లిఫ్ట్‌లోకి కన్నం పెట్టి.. చందనాబ్రదర్స్ లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కేసును ఛేదించినట్లు డీసీపీ వెల్లడించారు. చందనాబ్రదర్స్‌లో విలుైవె న నగలు ఉన్నప్పటికీ నిర్వాహకులు రాత్రి సమయంలో సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఉంచారు. వారి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా డీసీపీ సమాధానం దాటవేశారు. నిందితులపై 12 కేసులు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కట్టా శివశంకర్, కట్టా సత్తిబాబులపై 12 కేసులున్నాయని మాదాపూర్ డీసీపీ తెలిపారు. షాపింగ్ మాల్స్, షాపులలో చోరీ చేయడంలో వీరిద్దరూ దిట్ట అని అన్నారు. రెక్కీ నిర్వహించి ఆ తర్వాత తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 5 గంటల మధ్య చోరీ చేస్తారన్నారు. జైలు నుంచి పాయిపోయి వచ్చి... కట్టా శివశంకర్ 2006,2011, 2014లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పోలీసులు చోరీ కేసులో అరెస్ట్ చేశారు. 2007లో కాకినాడ-3 సీసీఎస్‌లో కేసు నమోదైంది. 2013లో అనపర్తి పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 26 మే 2014లో రామచంద్రాపురం కోర్టులో హాజరు పరిచి వైజాగ్ సెంట్రల్ జైలుకు తీసుకెళుతుండగా కాకినాడ బస్ స్టాప్‌లో పోలీస్ ఎస్కార్ట్ కళ్లుగప్పి ఇద్దరూ పరారయ్యారు. అనంతరం నగరానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఎల్బీనగర్లోని బిగ్ బజార్లో చోరీ యత్రించింది వీరేనని పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో సైబ రాబాద్ క్రైం అడిషనల్ డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ రజినీ పాల్గొన్నారు. -
ఇంజనీర్ దంపతుల ఆత్మహత్య
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో నమ్మిన వారు మోసం చేయడమే కాక వేధింపులకు పాల్పడడంతో ఇంజనీర్ దంపతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... రామనగర జిల్లా ఐజూరు హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న విజయానందశెట్టి(45), లక్ష్మి(37) దంపతులు. బెంగళూరు శివారులోని రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలలో విజయానందశెట్టి బయోమెట్రిక్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని ఆర్థిక లావాదేవీలలో చిక్కుకున్న వీరు పలువురికి పోస్ట్ డెటెడ్ చెక్కులు, నగలు ఇచ్చి, తమ అప్పు తీరిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలని కోరారు. తర్వాత వారికి నగదు చెల్లించినా చెక్కులు, నగలు వాపస్ ఇవ్వకుండా వేధించడమే కాక పరువు తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై మనస్థాపం చెందిన విజయానందశెట్టి బుధవారం రాత్రి ఇంటికి చేరుకుని తన భార్యతో చాలా సేపు చర్చించాడు. సమాజంలో పరువు పోతుందని భావించి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని డెత్ నోట్ రాశారు. అందులో తాము ఎలా మోసపోయింది వివరించి ఇద్దరూ సంతకాలు చేశారు. తర్వాత తన స్నేహితుడికి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విజయానందశెట్టి ఎస్ఎంఎస్ పెట్టాడు. విషం తాగి లక్ష్మి బెడ్‌పై కుప్పకూలిపోయింది. అదే బెడ్రూంలో ఫ్యాన్‌కు విజయానందశెట్టి ఉరి వేసుకున్నాడు. ఎస్ఎంఎస్ అందుకున్న స్నేహితుడు, మరికొందరితో కలిసి హుటాహుటినా అక్కడకు చేరుకునే లోపు ఇద్దరూ మరణించారు. డెత్‌నోట్‌లో తాము ఎవరికి అపకారం చేయలేదని పేర్కొన్నారు. రాజరాజేశ్వరి మెడికల్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఇద్దరి మృతదేహాలను రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలకు అప్పగించాలని రాసిపెట్టారు. డెత్‌నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.