‘గృహ నిర్మాణం’లో అక్రమాలను నిరూపిస్తా | Revanth Reddy comments on TRS ministers | Sakshi
Sakshi News home page

‘గృహ నిర్మాణం’లో అక్రమాలను నిరూపిస్తా

Published Wed, Mar 8 2017 3:53 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

‘గృహ నిర్మాణం’లో అక్రమాలను నిరూపిస్తా

‘గృహ నిర్మాణం’లో అక్రమాలను నిరూపిస్తా

ఇంద్రకరణ్, ఈటల బహిరంగ చర్చకు రావాలి: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: హౌసింగ్‌ బోర్డు పరిధిలో చేపట్టిన హౌసింగ్‌ జాయింట్‌ వెంచరు (జేవీ) ప్రాజెక్టుల్లో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తానని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అక్రమాలు జరిగాయని నిగ్గుతేల్చిన విజిలెన్సు నివేదికల ఆధారంగా తాను వాస్తవాలను మాట్లాడుతుంటే.. మంత్రులు తప్పుదారి పట్టించేలా మాట్లాడటం తగదని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.

అవినీతి జరగలేదని, అక్రమాల్లో తమ పాత్ర లేదని మంత్రులు ఇంద్రకరణ్, ఈటల రాజేందర్‌ చెబుతున్నదని వాస్తవమే అయితే బహిరంగ చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో పోరులో భాగంగా ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీటీడీపీ బుధవారం బహిరంగ సభ నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement