ఇంద్రకరణ్‌ను మంత్రి పదవినుంచి తప్పించాలి
సీఎంకు రేవంత్ బహిరంగలేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం– ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో గృహనిర్మాణశాఖ చేపట్టిన జాయిం ట్ వెంచర్లలో అవినీతికి పాల్పడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెం ట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
గత ప్రభుత్వాలు కూకట్‌పల్లి, గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం తది తర ప్రాంతాల్లో ప్రారంభించిన జాయింట్ వెంచర్లలో 10%గృహాలను పేదలు, అల్పాదాయ వర్గాల కోసం నిర్మించాలని అప్పట్లోనే ఒప్పందం జరిగిందన్నారు. అయితే ఈ ఎల్‌ఐజీ ఇళ్లను తొలగించాలని ప్రైవేట్ సంస్థలు ఒత్తిడి తెచ్చినప్పటికీ గత ప్రభుత్వాలు పేదలకు అన్యాయం చేయలేదన్నారు. ఇప్పుడు ఇంద్రకరణ్ ఎల్‌ఐజీ ఇళ్లను తొలగించి పేదలకు తీరనిద్రోహం చేశారన్నారు. ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు.