నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై! | Indrakaran Reddy challenge over allegations | Sakshi
Sakshi News home page

నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై!

Published Sat, Feb 25 2017 1:06 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై!

నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై!

నిజామాబాద్‌: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు.. ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్న రేవంత్‌రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. డబుల్‌ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. మిషన్‌ భగీరథ పథకం వల్ల ఆలస్యం జరుగుతున్నదని, ఇక ముందు ఆలస్యం జరగనివ్వబోమని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం– ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో గృహనిర్మాణశాఖ చేపట్టిన జాయిం ట్‌ వెంచర్లలో అవినీతికి పాల్పడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన శుక్రవారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement