indrakaran reddy
-
జానారెడ్డితో ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆయన హైదరా బాద్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డితో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇంద్రకరణ్‌రెడ్డి చేరికపై గతంలోనూ ప్రచారం జరిగినా, గురువారం జానా నివాసానికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరపడంతో కచ్చితంగా పార్టీ మారతారని భావిస్తున్నారు. -
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దగాకోరులు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-
ఆదర్శప్రాయుడు పీవీ: ఇంద్రకరణ్
నిర్మల్‌టౌన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు నిర్మల్‌కి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావుకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పీవీ హయాంలో 1991 నుంచి 1996 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం తన అదృష్టమన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానమంత్రి అవుతున్నారనే ఉద్దేశంతో తనతోసహా ఏడుగురు టీడీపీ ఎంపీలం ఆయనకు మద్దతు తెలిపామని చెప్పారు. పీవీ చాణక్యనీతితో దేశాన్ని బ్రహ్మాండంగా పాలించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కేశవరావు మాట్లాడుతూ పీవీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, మేధావులు విద్యార్థులకు, పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రముఖుల జీవిత చరిత్ర తెలియజేయాలని సూచించారు. -
ఇంద్రకరణ్‌కు బిగ్ షాక్.. శిష్యుల తిరుగుబాటు
-
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్‌ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
ఇంకా రుణమాఫీ అందని రైతులు..1.6 లక్షలు రాష్ట్ర ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీరికి వెంటనే రుణమాఫీ సొమ్ము అందజేయాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... రుణమాఫీకి సంబంధించి ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యక్రమంలో రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లు ఆర్థికశాఖ విడుదల చేసిందన్నారు.17.15 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయన్నారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లు క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లు మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు ఆయనకు అధికారులు వివరించారు. చర్చించిన అనంతరం మూడు పరిష్కారమార్గాలు కనుగొన్నారు. ఆధార్ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం, దీనివల్ల సుమారు మరో లక్షమందికి రుణమాఫీ డబ్బు అందుతుంది. ఎన్పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు. మిగతా 16 వేల మందికి సంబంధించి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌సెల్ రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేయాలి.. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు ముందుగా బ్యాంకుస్థాయిలో సంప్రదిస్తారు..అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరపున జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. కొత్త రుణాలు మంజూరు చేయాలి రుణమాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని చెప్పారు. రుణమాఫీ పొందినవారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యూవల్ పూర్తి కావాలన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9,654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యూవల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణమాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబంధిత అన్ని సమస్యలు పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. -
మన పాలకులకు ప్రేమ, భక్తి ఉన్నాయి
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. -
ప్రతి నియోజకవర్గానికీ ఓ అటవీ పార్కు
మణికొండ: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికీ ఓ అటవీ పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 109 పార్కులకు గానూ 73 పూర్తి చేశామని, మంచిరేవులలో 74వ పార్కు అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నగర శివారు చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మంచిరేవుల ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకుని 360 ఎకరాలలో రూ.7.38 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ట్రెక్ పార్కును ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, మంత్రులు పి.సబితారెడ్డి, పి.మహేందర్‌రెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే లక్ష్యాన్ని దాటి 270 కోట్ల మొక్కలను నాటామన్నారు. అందులో 80శాతం మొక్కలు బతుకుతున్నాయని, ఈ ఏడాది 30 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నామని వివరించారు. హైదరాబాద్‌లో 60నుంచి 70 పార్కులు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అర్బన్ లంగ్ స్పేస్‌లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో ఈ ట్రెక్ పార్కును అభివృద్ధి చేశామన్నారు. ఇందులో 50 వేల రకాల మొక్కలు, 2 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ట్రాక్, 4 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, యాంఫీ థియేటర్, ట్రీ వాటర్ ఫాల్, వాచ్ టవర్ లాంటి అనేక సౌకర్యాలను కల్పించామనీ స్థానిక ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. పార్కును ప్రారంభించి సఫారీ వాహనంలో పర్యటించి, మొక్కలు నాటారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి కోట్లాది మొక్కలు నాటడం ఎంతో మంచి కార్యక్రమమని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతో‹Ùకుమార్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం చూసుకున్నా పచ్చదనం తగ్గుతుంటే రాష్ట్రంలో మాత్రం 7.3శాతం పెరగటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి. ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రతాప్‌రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ హరీశ్, బండ్లగూడ మేయర్ మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్‌లో ‘మాస్టర్’ ఫైట్
నిర్మల్/బాల్కొండ/ఇందల్వాయి/సాక్షి, హైదరాబాద్: మాస్టర్‌ప్లాన్ వ్యవహారంతో నిర్మల్ ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో బీజేపీ ఆదివారం రెండోరోజూ ఆందోళనకు దిగింది. నిర్మల్ బైల్‌బజార్ చౌరస్తా వద్ద పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. దీనితో మహిళలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు ఏలేటి దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, మంత్రి ఇంటి ముట్టడికి ప్రతిగా తాము సోమవారం బీజేపీ నేత ఏలేటి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భారీగా బలగాలను మోహరించారు. ఆమరణ దీక్షలోనే ఏలేటి.. నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్ పూర్తిగా రద్దయ్యేవరకూ పోరాటం చేస్తానంటూ మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చినా నిరాకరించారు. దీక్షకు సంఘీభావంగా వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను నిజామాబాద్–నిర్మల్ జిల్లాల సరిహద్దు వద్దే పోలీసులు నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్ వద్ద నిజామాబాద్ జిల్లా మెండోరా, నిర్మల్ పోలీసులు సంయుక్తంగా అరుణను అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అరుణ సోన్‌లో, అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏలేటిని పరామర్శించడానికి వెళ్తున్న తనను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అమిత్‌షా, కిషన్‌రెడ్డి ఆరా.. మహేశ్వర్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమరణ దీక్ష, పోలీసులు లాఠీచార్జి చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్లో ఆరా తీశారని తెలిపారు. కాగా సోమవారం కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు నిర్మల్ రానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. మరోపక్క మాస్టర్‌ప్లాన్ రద్దు చేసేదాకా రిలే నిరాహార దీక్షలను ఆపేది లేదంటూ బాధిత రైతులు భీషి్మంచుకుని కూర్చున్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో ఉన్నవారిని ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. -
నిర్మల్ నియోజకవర్గం ఘన చరిత్ర
నిర్మల్ - నాలుగోసారి గెలిచి మళ్లీ మంత్రి అయిన ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ నాయకుడుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన నాలుగోసారి తన సమీప ప్రత్యర్ది మహేష్‌రెడ్డిపై 9271 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. గతంలో ఎమ్.పిగా, జడ్పి చైర్మన్‌గా కూడా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి టిడిపితో రాజకీయాలలోకి వచ్చారు. తదుపరి కాంగ్రెస్ఐలోకి వచ్చారు. 2014లో అనూహ్యంగా ఆయన బిఎస్పి టిక్కెట్‌పై గెలుపొంది, ఆ తర్వాత టిఆర్ఎస్లో విలీనం అయ్యారు. దాంతో ఆయన మంత్రి అయ్యారు. 2018లో టిఆర్ఎస్ గెలిచి కెసిఆర్ క్యాబినెట్లో మరోసారి స్థానం సంపా దించుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి 79985 ఓట్లు రాగా, మహేష్ రెడ్డికి 70714 ఓట్లు వచ్చాయి. కాగా బిజపి పక్షాన పోటీచేసిన డాక్టర్ ఇండ్ల సువర్ణారెడ్డికి 16900 ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో ఎ.ఇంద్రకరణ్ రెడ్డి 8497 ఓట్ల మెజార్టీ సాధించి తన సత్తా చాటుకున్నారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్దిగా రంగంలోకి వచ్చిన మహేష్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయినా తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి వరసగా రెండుసార్లు విజయం సాధించడం విశేషం. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవడంతో మహేష్ రెడ్డి కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే అయ్యారు. ఇంద్రకరణ్ కొంతకాలం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావంతో తిరిగి కాంగ్రెస్ ఐలోకి వచ్చారు. కాని 2014లో టిక్కెట్ రాదని అర్ధం అవడంతో బిఎస్పి టిక్కెట్ లపై నిర్మల్ నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. నిర్మల్‌లో అత్యధికంగా పదమూడుసార్లు రెడ్లు ఎన్నిక కాగా, మూడుసార్లు బ్రాహ్మణులకు అవకాశం వచ్చింది. ఒక ఎస్.సి కూడా ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు గెలిచారు.నిర్మల్ నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు సోషలిస్టు పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, బిఎస్పి, టిఆర్ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. ఒక ఇండి పెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి పి.నర్సారెడ్డి మూడుసార్లు గెలిస్తే ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నర్సారెడ్డి లోక్‌సభకు కూడా ఎన్నిక య్యారు. 1985 నుంచి టిడిపి సీనియర్ నేతగా ఉండి ఎస్. వేణుగోపాల్‌చారి మూడుసార్లు ఇక్కడ గెలిచి, ఆ తరువాత మూడుసార్లు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన చరిత్రను ఈయన సొంతం చేసుకున్నారు. 2009లో ముధోల్ నుంచి పోటీచేసి వేణుగోపాలాచారి గెలిచారు. తదుపరి టిఆర్ఎస్లో చేరి 2014లో ముధోల్‌లో తిరిగి పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయిన వారిలో వేణుతో పాటు ఇంద్రకరణ్‌రెడ్డి, నర్సారెడ్డి, గంగారెడ్డిలు కూడా ఎమ్.పిలుగా ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్కు చెందిన లోక్‌సభ సభ్యుడు రాజీనామా చేసిన కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ ఐ తరుఫున పోటీ చేసి గెలుపొందడం విశేషం. కాని 2009లో శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రులైన వారిలో నర్సారెడ్డి, వేణుగోపాలాచారి, పి.గంగారెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. గంగారెడ్డి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో ఉండగా. నర్సారెడ్డి అప్పట్లో పి.వి., జలగం క్యాబినెట్లలో పనిచేసారు. జిల్లా పరిషత్ ఛ్కెర్మన్గా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి గతంలో టిడిపి తరుఫున లోక్‌సభకు ఎన్నికైనా, ఆ తరువాత పి.వి. నరసింహారావు ప్రభుత్వాన్ని రక్షించడం కోసం పార్టీ మారినవారిలో ఉన్నారు. నిర్మల్‌లో గెలిచిన మరో నేత ఎ.భీమ్‌రెడ్డి 1983లో డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు. నిర్మల్ గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బీజేపీలోకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి? మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నిర్మల్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల్లో సీట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ ఇస్తారో లేదోనని కొందరు, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఓటమి తప్పదని మరికొందరు పార్టీలు మారుతుండటం సహజం. కానీ, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తున్నారనే సమాచారం మాత్రం పెద్ద వార్తే అవుతుంది. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంద్రకరణ్‌రెడ్డి కమలం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి తమ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారని, ఆ మేరకు తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు మహేశ్వర్ రెడ్డి. (మైనార్టీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు, త్వరలో జీవో!) నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన స్నేహితుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారన్నారు. కావాలంటే తనవద్ద రుజువులు ఉన్నాయన్నారు. బీజేపీలో చేరితే ఇంద్రకరణ్‌రెడ్డికి ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తామన్నారు. కానీ, ఇతరులపై విమర్శలు చేయవద్దని మంత్రికి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఓటమి తప్పించుకోవడానికి మంత్రి దారులు వెతుకున్నారని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. (అనాగరిక చర్య.. విచారకరం: మణిపూర్ ఘటనపై కేటీఆర్ స్పందన) -
నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌కు కొత్త కళ
సాకక్షి, నిర్మల్: నిర్మల్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ అభివృద్ధిపై దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో శనివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మల్ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్, జి-ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, నిర్మాణం చేయాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ ద్వారా రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్ఘా నిర్మించేందుకుగా తీసుకోవాల్సిన నిర్ణయాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించారు. ఆర్టీసీ సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునీకరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్‌కు నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడుపుతున్నారు. టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని బాజిరెడ్డి తెలిపారుజ నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్మల్‌లో నిర్మించే టీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవే.. 1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం. 3. నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మాణం చేయడానికి 35 కోట్ల నిధుల ఖర్చు. 4. కమర్షియల్ కాంప్లెక్స్ శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం. 5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను ఏర్పాటు. 6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సీడీ తెరల ఏర్పాటు 7. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. 8. మరో 10 తరాలకు అడ్వాన్స్‌గా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 9. టీఎస్ఆర్టీసీ బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక రాయితీలు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. 10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు. -
Rega Kantha Rao Vs Podem Veeraiah: స్టేజీపైనే బాహాబాహీ.. నీకు మైండ్ ఉందా.. నువ్వు నోర్మూసుకో..!
దుమ్ముగూడెం: తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకురావడంతో పాటు గల్లాలు పట్టుకునేందుకు రెడీ అయ్యారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అక్కడే ఉన్న కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారులు సర్దిచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడులో బుధవారం తునికాకు బోనస్ చెక్కుల పంపిణీకి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ కాంతారావు, ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని, రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థేనంటూ తన ప్రసంగం కొనసాగించారు. దీనికి వేదికపై ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య(కాంగ్రెస్) జోక్యం చేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమమని..ఇక్కడ రాజకీయాలెందుకంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాంతారావు మరింత దూకుడుగా ప్రసంగం కొనసాగిస్తూ ప్రతిపక్షాలనుద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం ముగించి తన సీట్లో కూర్చునే సమయంలోనూ ప్రభుత్వ పథకాల గురించి చెబుతుంటే బాధెందుకు అంటూ పోదెంను ఉద్దేశించి అన్నారు. ఇందుకు వీరయ్య ‘నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడితే కుదరదంటూ’హెచ్చు స్వరంతో బదులిచ్చారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీకు మైండ్ ఉందా అంటూ పోదెం అనగా.. నువ్వు నోర్మూసుకో అంటూ విప్ అన్నారు. ఇలా అభ్యంతరకమైన పదాలతో దూషించుకుంటూనే ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిశ్చేషు్టడై చూస్తుండిపోయారు. ఇద్దరూ భౌతికదాడులకు దిగే విధంగా పరిస్థితి నెలకొనడంతో అక్కడే ఉన్న కలెక్టర్ అనుదీప్, పీసీసీఎఫ్ డోబ్రియల్ కల్పించుకుని రేగా చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టగా ఎస్పీ వినీత్ ఎమ్మెల్యే పొదెంను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. -
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై గులాబీ పార్టీ నేతల అసంతృప్తి
-
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
-
Telangana: సంవత్సరాంతంలో రాజకీయ ఒడిదుడుకులు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ పరిణామాలు విపరీతమైన రాజకీయ ఒడిదుడుకులకు కారణమవుతాయి. అక్టోబర్ 31కి రాహువు, కేతు గ్రహాలు మారుతున్నందున.. ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది’అని శృంగేరీ ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. అధికార పక్షంలోని కొందరినుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో అధికారంలోని పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. ఈ ఏడాది బుధుడు రాజుగా ఉన్నందున.. ఈ పరిణామాలను ప్రభుత్వం నిలువరించగలదన్నారు. సప్తమాధిపతి అయిన గురువు అష్ట్టమంలో మౌఢ్య స్థితిలో ఉన్నందున ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం బాగా కష్టపడాల్సి వస్తుందని వెల్లడించారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఉదయం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పక్షాన ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగాన్ని పఠించారు. కొన్నేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నా..సామాజిక అశాంతి నెలకొంటుందని వెల్లడించారు. అశాంతి ఏర్పడ్డా, పోలీసు శాఖ సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గురుడు జలాశయ కారకుడు అయినందున రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలుగా మారతాయి. కేంద్ర, రాష్ట్రాలు విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. వర్సిటీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలకు అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు కీలక తీర్పులు ఇవ్వబోతున్నాయి. వచ్చే మార్చిలో ప్రకృతి ఉపద్రవాలు, మత ఘర్షణలు, సామాజిక అశాంతికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. బుధుడు భాగ్యమందు మంచి స్థితిలో ఉన్నందున రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుంది. ధన భాగ్యాధిపతి శుక్రుడు కావటంతో ఆర్థిక రంగం కొంత పురోగమిస్తుంది. కీలక పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారు. విద్య, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధనలు సాగుతాయి. ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన ఎండలు కాసే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లలో భారీ వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి. గురు, శుక్ర మౌఢ్యాలు 40 రోజులు మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో శుభకార్యాలు విపరీతంగా జరుగుతాయి. పాల ఉత్పత్తి బాగా పెరగనున్నా.. పాలల్లో, ఆహారపదార్థాల్లో కల్తీ సమస్య కూడా పెరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఏర్పడతాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోవాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన కర్కాటక రాశికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నా యని సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఆదా యం 11 వ్యయం 8 రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుందని, రాహువులో రవి దశ ముగిసి చంద్ర దశ నడుస్తోందని, జనవరి 17న అష్టమ శని దోశం ఏర్పడినందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోగలిగితే అవాంతరాలను అధిగమించే వీలుంటుందన్నారు. కాగా, మంచి వానలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగం సూచించటం పట్ల ఆనందంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పండితులను సన్మానించారు. -
'పేపర్ లీకేజీలు సర్వసాధారణం.. దీనికే మంత్రి కేటీఆర్ దోషా?'
నిర్మల్/నిర్మల్ టౌన్: ‘పేపర్ లీకేజీలు సర్వసాధారణంగా జరుగుతుంటాయ్.. అప్పుడప్పుడూ ఇంటర్, టెన్త్‌లో ఎన్నో రకాలుగా జరుగుతాయి. దీనికే మంత్రి కేటీఆర్‌ను దోషి అంటున్నారు. సీఎంకే నోటీసులు ఇవ్వాలంటున్నారు. కేటీఆర్ పీఏ తిరుపతికి చెందిన గ్రామంలోనే 100 మందికిపైగా నూరు మార్కులపైనే వచ్చాయని రేవంత్‌రెడ్డి అంటే ‘సిట్’ ఆయనకు నోటీసులిచ్చింది. ఆధారాలుంటే చూపెట్టాలి. నిజంగా ఉంటే తప్పు జరిగిందని ఒప్పుకోవచ్చు. ఆధారాలు చూపెట్టమనడంలో తప్పేంలేదు’ అని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆయన మాటలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. ఎమ్మెల్సీ కవిత విచారణ, పేపర్ లీకేజీ, పార్టీ ఆత్మీయ సమ్మేళనాలపై నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇందులో పేపర్ లీకేజీ అంశంపై మాట్లాడే సందర్భంలో సర్వసాధారణంగా క్వశ్చన్ పేపర్ల లీకేజీలు జరుగుతుంటాయని ఆయన అనడం చర్చనీయాంశమైంది. కవితను కేంద్రం వేధిస్తోంది.. తెలంగాణ కోసం ఉద్యమించిన కల్వకుంట్ల కవితను ఓ మహిళ అని కూడా చూడకుండా ఈడీ ద్వారా కేంద్రం వేధిస్తోందని ఇంద్రకరణ్ ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో విచారణ పేరుతో మళ్లీమళ్లీ పిలుస్తోందని విమర్శించారు. దేశంలోకెల్లా ప్రధాని మోదీపై ఎదురుదాడి చేసే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆరేనని చెప్పారు. కేంద్రానికి దమ్ముంటే సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవాలని, ఇలా మహిళలను అడ్డుపెట్టుకొని ఆటలడటం సరికాదని సూచించారు. బీజేపీ వాళ్లంతా సత్యపూసలా? బీజేపీలో ఎవరూ కూడా తప్పు చేయడం లేదా? వాళ్లంతా సత్యపూసలు, వేరే పారీ్టల వాళ్లే దోషులా? అని ఇంద్రకరణ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రజల కోసం చేసిన బిల్లులను నామినేటెడ్‌గా వచి్చన గవర్నర్ అట్టిపెట్టుకుంటే బీజేపీ నేతలు ఉత్సవాలు చేసుకుంటున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాజీనామా చేయమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లకు చెప్పుకోవడం రాదు కానీ.. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ 12 ఏళ్లు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. నా మాటలను వక్రీకరించారు.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాలుక కరుచుకున్నారు. తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. ‘బీజేపీ, కాంగ్రెస్ హయాంలో పేపర్ లీకేజీలు సర్వసాధారణమయ్యాయనే సందర్భంలోనే నేను మాట్లాడాను’అని వివరణ ఇచ్చారు. పేపర్ లీకేజీ దురదృష్టకరమని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. చదవండి: కొలువుల కలవరం -
‘ఢిల్లీలో దీక్ష.. అందుకే కవితకు ఈడీ నోటీసులు.. కేసీఆర్ అట్లాంటి వ్యక్తి కాదు’
సాక్షి, నిర్మల్: ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతులో కీలుబొమ్మలుగా మారాయని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం స్పందించారు. నిర్మల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని ద్వజమెత్తారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని నిర్ణయించారని, ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేయడం బీజేపీ కక్ష్యసాధింపు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, సీఎం కేసీఆర్ ఎవరికీ తలవంచే రకం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల నాయకులను టార్గెట్ గా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలచే దాడులు చేయిస్తుందని, మరి బీజేపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని, వారందరూ నీతిమంతులేనా అని సూటిగా ప్రశ్నించారు. -
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఎఫ్డీసీకి జర్మనీ ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు(ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్డీసీకి కౌన్సిల్ అనుమతినిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను ఉన్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు మంత్రికి వివరించారు. దీనివల్ల అంతర్జాతీయంగా ఎఫ్డీసీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ఐకియా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు జర్మన్ కౌన్సిల్ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందని వెల్లడించారు. ఐదేళ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్ వుడ్‌పేపర్, ప్యాకింగ్ పరిశ్రమల కోసం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు అధికధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్ఎస్సీ ఆమోదం లభించిందని తెలియజేశారు. గుర్తింపు రావడం గొప్ప విషయం: మంత్రి అరణ్యభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో భాగంగా ఇలాంటి గుర్తింపు రావడం గొప్ప విషయమన్నారు. మెరుగైన పద్ధతుల్లో సాగు చేస్తుండటం వల్ల మన అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌తోపాటు 30 శాతం రెవెన్యూ పెరిగిందని తెలిపారు. భవిష్యత్‌లో అటవీ ఉత్పత్తులను మరింత పెంచుకుని, వీటితో వచ్చిన ఆదాయంతో అడవుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.యం.డొబ్రియల్, అటవీ శాఖ అదనపు కార్యదర్శి ఎం. ప్రశాంతి, ఎఫ్డీసీ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
భైంసా: నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీక్షేత్రంలో వసంత పంచమి జరుçపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచే ఆలయంలో పూజలు జరిగాయి. గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా వేలాదిగా భక్తులు బాసరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస పూజలు జరిపించారు. వెంకటేశ్వర సేవాసమితి సభ్యులు, అఖిల భారత పద్మశాలి సంఘంతోపాటు పలువురు వ్యక్తులు బాసర వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్ఐటీకి చెందిన 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఆలయంలో సేవలు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బాసర భక్తజనంతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి 4 గంటలు, అక్షరాభ్యాసానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిరావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడ్డారు. -
ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్తో కలసి మన్ననూరులో కొత్తగా నిర్మించిన ట్రీహౌస్, అదనపు కాటేజీలతోపాటు 8 సఫారీ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల్లోని పులుల సంరక్షణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2018లో 12గా ఉన్న పులుల సంఖ్య 2021లో 21కి పెరిగినట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్ నమో దు చేస్తున్నామని, సమాచారం తెలిపిన వారికి బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఎకో టూరిజంలో భాగంగా ప్యాకేజీలు.. టైగర్ స్టే ప్యాకేజీలో భాగంగా రెండ్రోజులు అడవిలో ఉండి టైగర్ సఫారీతోపాటు ట్రెక్కింగ్, కాటేజీల్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే ఉన్న కాటేజీలకు మరో ఆరు కాటేజీలతోపాటు ఇటీవల నిర్మించిన ట్రీహౌస్æ కాటేజీ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఈనెల 26 నుంచి టైగర్ స్టే ప్యాకేజీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. సాధారణ కాటేజీలో ఇద్దరికి రూ.4,600, మడ్ హౌస్‌లో రూ. 6 వేలు, ట్రీ హౌస్‌లో రూ. 8 వేలతో ప్యాకేజీని ఖరారు చేశామన్నారు. బుకింగ్‌ల కోసం www.amrabadtigerreserve.com సంప్రదించొచ్చన్నారు. పులుల అభయారణ్యాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రీయాల్ చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కలెక్టర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
కంటి‘వెలుగు’ షురూ
సాక్షి నెట్వర్క్: రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో దీనిని ప్రారంభించగా, గురువారం నుంచి రాష్ట్రంలోని 1,500 కేంద్రాల్లో కంటి పరీక్షలు చేపట్టారు. తొలిరోజు 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 72,580 మంది పురుషులు, 87,889 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 70 వేల మందిలో సమస్యలు గుర్తించారు. 37 వేల మందికి దగ్గరి చూపు లోపానికి సంబంధించి అద్దాలు అందజేశారు. మరో 33 వేల మందిలో ఇతరత్రా సమస్యలు గుర్తించి అద్దాల కోసం సిఫారసు చేశారు. అతి తక్కువ మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. మొత్తం మీద తొలిరోజు పరీక్షించిన వారిలో 43.75 శాతం మందికి రకరకాల చూపు సమస్యలు ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రాంతాల్లో రద్దీ తక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 40 ఏళ్ల పైబడ్డ వారితో క్యూ లైన్లు నిండిపోయాయి. పలువురు ప్రముఖులకు అద్దాలు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో కంటి పరీక్ష చేసుకోగా, ఆయనకు దగ్గరి చూపు (షార్ట్ విజన్) లోపం ఉన్నట్లు గుర్తించి అద్దాలు అందజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వేములపల్లి మండల కేంద్రంలో పరీక్ష చేసుకోగా లోపం ఉందని గుర్తించి రీడింగ్ గ్లాసులు అందజేశారు. సూర్యాపేటలో పరీక్ష చేయించుకున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలాంటి అద్దాలు అవసరం లేదని నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పరీక్షలు చేయించుకున్నారు. వీరిద్దరికీ అద్దాలు అందజేశారు. ఎక్కడ కావాలంటే అక్కడికే.. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు.. ఎక్కడ సేవలు కావాలన్నా ట్విట్టర్ లేదా వెబ్సైట్లో రిక్వెస్ట్ పెడితే అక్కడికే కంటి వెలుగు బృందాలు వస్తాయని మంత్రి హరీశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఏపని చేపట్టినా ప్రజల మంచి గురించి ఆలోచించి చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. టీఎస్‌ఎంఐడీసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి హైదరాబాద్ అమీర్‌పేటలో కంటి వెలుగు పరీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంధత్వ రహిత తెలంగా ణ కంటి వెలుగు లక్ష్యమని చెప్పారు. ఎవరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో 2018లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో 8 నెలల పాటు కంటి వెలుగు నిర్వహిస్తే ఈసారి 100పనిదినాల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ దఫా కంటి వెలుగు ద్వారా 55 లక్షల కళ్ళ జోళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా న్యాయవాదుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నిధుల నిర్వహణ బాధ్యతను అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. అరణ్యభవన్‌లో శనివారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, కౌన్సిల్ సభ్యులు కలిసి న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమనిధికి ప్రతి ఏడాది రూ.10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, దీనివల్ల సభ్యులకు, మరణించిన లాయర్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రికి వివరించారు. మరణించిన న్యాయవాది నామినీకి న్యాయవాదుల సంక్షేమం నిధి ద్వారా రూ.4 లక్షలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వం తరఫున అదనంగా మరో రూ.4 లక్షలు, జూనియర్ న్యాయవాదులకు మూడేళ్ల కాలపరిమితికి ప్రతీ నెల రూ.ఐదువేలు ఉపకార వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హమీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, రాజేందర్‌రెడ్డి, కిరణ్ పాలకుర్తి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్ తదితరులు ఉన్నారు. -
కొత్త ఏడాదిలో అటవీ ఆక్రమణలకు చెక్
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల చివర్లోగా పోడుభూములపై క్లెయిమ్స్ పరిష్కరించే ప్రక్రియ పూర్తవుతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇది ముగిశాక కొత్త ఏడాది నుంచి అక్రమంగా అడవుల్లోకి ప్రవేశించకుండా, ఆక్రమణలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. పోడుభూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే నిమిత్తం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని మంత్రి తెలిపారు. ఈ భూములపై అందిన క్లెయిమ్స్‌పై ఈ నెలాఖరులోగా సర్వే పూర్తవుతాయని చెప్పారు. ఆ తర్వాత వివిధ కమిటీల ద్వారా సమావేశాలు నిర్వహించి భూమి అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆ తర్వాత అటవీభూముల జోలికి ఎవరూ వెళ్లకుండా, అక్రమణలు చోటుచేసుకోకుండా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోడుభూముల వివాదాల పరిష్కారం, పులుల దాడుల ఘటనలు, టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు తదితర అంశాలపై శుక్రవారం ‘సాక్షి’తో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో గుంపులుగా శబ్దాలు చేస్తూ... అటవీ ప్రాంతాల్లోని పత్తిచేన్లకు గుంపులుగా వెళ్తూ శబ్దాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. పులుల కదలికలున్న చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను అటవీశాఖ అప్రమత్తం చేసిందని తెలిపారు. ఇటీవల పెద్దపులి దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఆదేశాలు జారీచేశారని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో జనసంచారం లేనిచోట్ల తమకు అనువైన ప్రాంతాల్లో పులులు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయని చెప్పారు. ఇటీవల కాలంలో ప్రజలపై పులులు దాడులు చేసిన ఘటనలు తగ్గిపోగా తాజాగా ఈ ఉదంతం చోటుచేసుకుందన్నారు. మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్, తడోబాలలో పులుల సంతతి పెరిగిపోవ డంతో రాష్ట్రంలో టైగర్ కారిడార్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి అడుగు పెడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని రాంపూర్, మైసంపేట గ్రామాలను మంచి పునరావాస ప్యాకేజీ అందించి బయటకు తీసుకొచ్చి నట్టు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఇది జరిగిందని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం, ఇళ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాల్లోనే ఈ గ్రామాలు కొనసాగితే విద్యుత్, మంచినీళ్లు, రోడ్డు వంటివి, స్కూల్, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే జూన్ నెల కల్లా ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉండిపోయిన కొన్ని గ్రామాలు పూర్తిగా బయటకు తీసుకువస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించిన కుమురంభీమ్ 82వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కుమురం సూరు, భీమ్ స్మారక విగ్రహాలకు, సమాధి వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన గిరిజన దర్బార్‌లో మాట్లాడారు. అటవీ భూములు సాగు చేస్తున్నవారిలో అర్హులను గుర్తించి పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో 3ను న్యాయపరంగా పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. జిల్లాలోని కుమురంభీమ్, వట్టివాగు, చలిమెల తదితర ప్రాజెక్టుల నీటిని పంటచేలకు మళ్లిస్తామని హామీనిచ్చారు. వంద గిరిజన దేవాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. జోడేఘాట్ వరకు రోడ్డు సౌకర్యం, స్థానికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఆదివాసీలు వలస వచ్చిన వారితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని, జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు రాహుల్‌రాజ్, సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు, కుమురంభీమ్ మనవడు సోనేరావు, పాల్గొన్నారు. రద్దైన కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం జోడేఘాట్‌కు మంత్రి కేటీఆర్ వస్తారని భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దవడంతో అక్కడున్నవారంతా నిరుత్సాహపడ్డారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్ పట్టణ అభివృద్ధి శిలాఫలకం, కలెక్టర్ రాహుల్‌రాజ్ కుమురం భీమ్‌పై రాసిన పాట ఆల్బం సీడీని మంత్రి ఆవిష్కరించారు. -
ఆ భూములు ఉదాసీన్ మఠానివే
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్ద కాలంగా ఉదాసీన్ మఠం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. మఠం భూములపై గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)తో ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకూ పోరాడి విలువైన భూమి అన్యాక్రాంతం కూడా చేశాయి. హైదరాబాద్ కూకట్పల్లి జంక్షన్‌లోని 540 ఎకరాల 30 గుంటల భూమి దేవాదాయ శాఖ పరిధిలోని ఉదా సీన్ మఠానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ మఠం భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా. నిజాం ఇనాం భూమి... నిజాం రాజు 1873లో కూకట్‌పల్లిలో ఉదాసీన్ మఠానికి 540 ఎకరాల 30 గుంటల భూమిని ఇనాంగా ఇచ్చారు. అనంతరం 1964, 1966ల్లో ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ (గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్)కు ఉదాసీన్ మఠానికి చెందిన మహంత్ బాబా సేవా దాస్ 143 ఎకరాలు, 257 ఎకరాల 19 గుంటలు చొప్పున, 1969లో మహంత్ బాబా జ్ఞాన్ దాస్ 2 ఎకరాల 32 గుంటలు, 1978లో ఐడీఎల్ కెమికల్ లిమిటెడ్‌కు మహంత్ బాబా ధ్యాన్‌దాస్ 137 ఎకరాల 19 గుంటల్ని 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. నవంబరు 2006లో మహంత్ బాబా సాగర్ దాస్ తొలగింపు వరకు ఎలాంటి వివాదం లేదు. తదనంతరం మహంత్ అరుణ్ దాస్ జీ 24.8.2007న మఠం భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ లీజుదారులకు నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆ భూముల్లో శ్మశాన వాటిక వచ్చిందని, లీజుదారుడిని ఖాళీ చేయించాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు లేఖ రాశారు. తనిఖీ అనంతరం మూడు లీజు పత్రాలకు ప్రభుత్వ అనుమతి లేదని దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. 1978 నాటి లీజు దస్తావేజు మాత్రమే ప్రభుత్వ అనుమతితో ఉందని తేలింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందు మత సంస్థలు, దేవాదాయ చట్టాల ప్రకారం నాలుగు లీజులు కూడా చెల్లవని తేలింది. దీంతో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఆయా భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ మఠం, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. భూముల లీజును ట్రిబ్యునల్ 2011లో రద్దుచేయడంతో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పును 2013లో హైకోర్టు సమర్థించడంతో కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు యథాతధ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరి నుంచి సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డి, మఠం తరఫున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్, గల్ఫ్ ఆయిల్ తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, పరాగ్ త్రిపాఠిలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం, మఠం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అనంతరం ఆ భూములు దేవాదాయ శాఖ పరిధిలోని మఠానికే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభినందన ఆ భూమి దేవాదాయ శాఖ ఆధీనంలోని మఠానిదేనన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను, న్యాయవాదులను అభినందించారు. తీర్పు నేపథ్యంలో ఆ భూమిని పూర్తిస్థాయిలో తన ఆధీనంలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాని చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆ శాఖ, రూ.కోటి వ్యయంతో గోడ నిర్మాణం ప్రారంభించనుంది. సర్వే చేసి పూర్తి భూమి అందుబాటులో ఉందా, ఏమైనా కబ్జాలకు గురైందా అన్న విషయాలను తేల్చనున్నట్టు శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ఆ భూముల్లో ఉదాసీన్ మఠం నిర్వహించే కార్యక్రమాలతో వచ్చే ఆదాయంలో 21 శాతం దేవాదాయ శాఖకు సంక్రమించనుంది. -
గత లోక్‌సభ ఎన్నికల్లో సరైన వ్యూహం లేకనే.. మరి ఈసారి?
ఆదివాసులు, సింగరేణి కార్మికులే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నేతల తలరాతలు మారుస్తున్నారు. జిల్లాలో పోడు భూముల విషయంలో అటవీ అధికారులు, ఆదివాసుల మధ్య యుద్ధమే జరుగుతోంది. అయినా రాష్ట్ర మంత్రులు స్పందించరు. ఆదివాసీ అయిన ఎంపీ స్పందించరు. సింగరేణి కార్మికుల సమస్యలను ఎవరూ పట్టించుకోరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. వీటిలో ఏడు సెగ్మెంట్లు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోకి, మిగిలిన మూడు నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం పరిదిలోకి వస్తాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఏడు అసెంబ్లీ సీట్లు సాధించిన గులాబీ పార్టీ...2018 ఎన్నికలలో తొమ్మిది సీట్లలో విజయం సాదించింది. ఒక్క ఆసిఫాబాద్‌లో మాత్రం అతి తక్కువ మెజారటీతో కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సక్కు విజయం సాదించారు. ఆ తర్వాత ఆయన కూడా హస్తానికి హ్యాండిచ్చి కారు పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటిన టిఅర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది. బిజెపి అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించారు. ఈ ఓటమి గులాబీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. బలం..బలగం లేని కాషాయపార్టీ అభ్యర్థి సోయం విజయం జిల్లాలో సంచలనంగా మారింది. అయితే జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఎంపి సోయం బాపురావుకు ప్రతికూలంగా మారుతున్నాయట. సోయంకు గతంలో అదివాసీల్లో ఉన్న పలుకుబడి ఇప్పుడు లేదంటున్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆ సామాజికవర్గంలో సోయంపై వ్యతిరేకత బాగా పెరిగిందట. అదివాసీల హక్కులను ఎంపీ కాపాడడం లేదని ఆయన జాతి జనులే భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకు పదవీభాగ్యం ఉండదేమో అనే గుబులు ఎంపీలో మొదలైందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అదివాసీలు పోడు భూములు కోసం పోరాటం సాగించారు. కాని ఎంపీ సోయం బాపురావు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆదివాసులకు సంఘీబావం అయితే ప్రకటించారు గాని..ఆయా ప్రాంతాలకు వెళ్ళకపోవడంతో అడవిబిడ్డలు తమ ఎంపీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి ఆదివాసులు సోయంకు అండగా నిలిచే పరిస్థితులు లేవంటున్నారు. తుడుందెబ్బ సంఘం అద్యక్ష పదవికి రాజీనామా చేసిన సోయం ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నారని అదివాసీలు ఆగ్రహంతో ఉన్నారట. అయితే సోయం మాత్రం అదివాసీల అదరణ తగ్గినా మోదీ ప్రభావంతో గెలవడం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి మంత్రైనా నియోజకవర్గానికే పరిమితమై వ్యవహరిస్తున్నారని ఇంద్రకరణ్ మీద ఆరోపణలున్నాయి. భూముల కోసం అదివాసీలు ఉద్యమిస్తున్నా అటవీ శాఖమంత్రిగా ఉండి కనీసం పట్టించుకోవడం లేదని మంత్రి మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వినిపిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విషయంలోను..సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జిల్లా మంత్రి కనీసం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదంటున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని జిల్లాను అభివృద్ధి చేయాల్సిన మంత్రి.. గ్రూప్ లను పెంచిపోషిస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. మంత్రి తీరు వల్లనే కొందరు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మంత్రి సరైన వ్యూహం అమలు చేయనందువల్లే బిజెపి అభ్యర్థి సోయం విజయం సాధించారు. ఇంద్రకరణ్ ఇలాగే ముందుకు సాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్టీకి నష్టం తప్పదని టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్‌లో ‘వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ’రూపొందించిన వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్‌ను మంత్రి ఆవిష్కరించారు. కిట్ పని తీరు, శాంపిల్స్ సేకరణ, వైల్డ్‌లైఫ్ డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ తదితర అంశాలను సొసైటీ ప్రతినిధులు వివరించారు. వన్యప్రాణుల వధ జరిగినపుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, అవి సహజ మరణం పొందినప్పుడు వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాలను సేకరించి వాటి డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ కోసం పంపుతామన్నారు. విచారణ సమయంలో న్యాయస్థానాలకు ఈ పరీక్షల రిపోర్టును సమర్పిస్తే, వాటి ఆధారంగా వేటగాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. నేర పరిశోధనలో ఆధారాల సేకరణలో ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమైందన్నారు. బయోలాజికల్ ఎవిడెన్స్ ద్వారా వేట గాళ్ళకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుందన్నారు. ఉపయోగించే తీరుపై అటవీ అధికారులకు శిక్షణ ఇచ్చి కిట్లను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి వరద సాయమేదీ?
సాక్షి, హైదరాబాద్: వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. వరదలతో రూ.1,400 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా, ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేదని విమర్శించారు. నాలుగేళ్లుగా వివిధ రాష్ట్రాలకు వరద సహాయం అందించిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. పాలు, పప్పు, ఉప్పులపై జీఎస్టీ రూపంలో సామాన్యులపై పన్నుల భారం మోపిందని విమర్శించారు. తక్షణ సహాయం కింద వెంటనే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
Kadem Project: ‘కడెం’ దడ
నిర్మల్/కడెం: మంగళవారం అర్ధరాత్రి.. జోరు వాన.. పెద్ద శబ్ధంతో సైరన్ మొదలైంది. ఇదేమిటని జనం ఇళ్లలోంచి బయటికి వచ్చేప్పటికే డప్పు చాటింపు చప్పుడు.. ‘‘ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఉన్నఫళంగా అందరూ ఇళ్లు వదిలి మన ఊరి బడి కాడికి రావాలహో..’అంటూ వినపడిన చాటింపు అంత వానలోనూ ఊరివాళ్లకు చెమటలు పట్టించింది. వెంటనే ఊరు ఊరంతా అన్నీ వదిలి బయటికి వచ్చేశారు. నిర్మల్ జిల్లా కడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి పరిస్థితి ఇది. ఇక్కడి కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తింది. గేట్లన్నీ ఎత్తివేసినా.. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. దానికితోడు మంగళవారం సాయంత్రం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీళ్లూ కడెం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి. మహారాష్ట్రలోని వాగుల సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలిసే పరిస్థితి లేకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అవాక్కయ్యారు. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. అయితే ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తేసినా విడుదలయ్యే నీరు మూడు లక్షల క్యూసెక్కుల లోపే కావడం.. ఇన్‌ఫ్లో మాత్రం ఐదు లక్షల క్యూసెక్కులు ఉండటం.. ఇది 1955లో కట్టిన పాత ప్రాజెక్టు కావడంతో.. అధికారులు అర్ధరాత్రి దాటాక ప్రమాద ఘంటికలు మోగించారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో కడెం పరీవాహక ప్రాంతంలో పంటచేలన్నీ కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల పొడవు రోడ్లు తెగిపోయాయి. అర్ధరాత్రి అప్రమత్తమై.. కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి వచ్చిందన్న విషయం తెలియగానే కలెక్టర్ ముషరఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, పలు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రే కలెక్టర్, ఇతర అధికారులు నిర్మల్ నుంచి బయలుదేరారు. ఖానాపూర్ మీదుగా వెళ్లే 61 నంబర్ జాతీయ రహదారి తెగిపోవడంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా చుట్టూ తిరిగి కడెం చేరుకున్నారు. అప్పటికే స్థానిక అధికారులకు సమాచారమిచ్చి.. ప్రాజెక్టు దిగువన ఉన్న కడెం, దస్తురాబాద్ మండలాల్లోని 12 గ్రామాలను ఖాళీ చేయించడం మొదలు పెట్టారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఉదయమే కడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎడమ కాలువకు గండి పడటంతో.. పరిమితికి మించి వచ్చిన వరదతో ప్రాజెక్టు ఎడమ కాల్వ గేట్లపై నుంచి నీళ్లు పొంగి పొర్లాయి. దీనితో బుధవారం మధ్యాహ్నం ఎడమ కాల్వ వద్ద గండిపడి.. నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. అయితే ఈ గండి వల్లే ప్రాజెక్టుపై భారం తగ్గిందని అధికారులు చెప్తుండగా.. ఆ గండి పెరిగి ప్రమాదకరంగా మారొచ్చన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టిందని, ఇంకా తగ్గితే ప్రమాదం తప్పినట్టేనని కలెక్టర్ ప్రకటించారు. అయితే వానలు పడుతూనే ఉండటం, మరింత పెరగొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. -
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు విఫలం
-
చర్చలు సఫలం.. కాదు విఫలం
నిర్మల్/బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఐదోరోజుకు చేరింది. సమస్య పరిష్కారంపై అధికార వర్గాలు, విద్యార్థుల నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. శనివారం ట్రిపుల్ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. వర్సిటీలోని సాక్ భవనంలో శనివారం విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న మంత్రి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులందరూ సోమవారం నుంచి తరగతులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 12 డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరారని, అయితే రేపటిలోగా కేటీఆర్ లెటర్ అందేలా చూస్తామన్నారు. మరోపక్క.. శనివారం నాటి చర్చలు విఫలమయ్యాయని, తమ ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని విద్యార్థులు మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. ఏవోను తొలగిస్తూ ఉత్తర్వులు కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీ ఏవోగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావును తొలగించి బాధ్యతలను నూతన డైరెక్టర్ సతీశ్‌కుమార్‌కు అప్పగించినట్లు వర్సిటీ వీసీ రాహుల్ బొజ్జా శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళనల వ్యవహారంలో బాధ్యతాయుతంగా పనిచేయకపోవడంతో రాజేశ్వరరావును విధుల నుంచి తొలగించారనే ఆరోపణలున్నాయి. మోదీజీ మీరైనా స్పందించండి.. ‘నాలుగు రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లకు సమాధానం ఇవ్వట్లేదు. మీరైనా స్పందించండని కోరుతున్నాం..’ అంటూ బాసర విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర విద్యాశాఖ మంత్రితోపాటు సీఎంవో, కేటీఆర్, సబితారెడ్డికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అమ్మలా బాధేస్తోంది: సబితారెడ్డి విద్యార్థులు ఆందోళన విరమించాలంటూ మంత్రి సబితాఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ఓ లేఖను పంపించారు. ‘కోవిడ్‌తో సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉంటే.. మంత్రిగానే కాకుండా ఓ అమ్మలా బాధేస్తోంది, ఇప్పటికైనా ఆందోళన విరమించాలి’ అని కోరారు. ట్రిపుల్ ఐటీ.. ఉద్యమంలో ‘క్రియేటివిటి’ ఐదోరోజైన శనివారం విద్యార్థులు వినూత్నంగా ఆందోళన కొనసాగించారు. అందరూ పుస్తకాలు పట్టుకుని వచ్చారు. తమ సమస్యల్ని ఆర్ట్స్, బ్యానర్స్, డూడుల్స్, మీమ్స్, కవితలు, పాటల రూపంలో ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కట్టించేలా కళను ప్రదర్శించారు. వాటిని తమ ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ చానళ్ల ద్వారా సోషల్‌మీడియాలో ఉంచారు. రోజంతా ఎర్రటి ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినా విద్యార్థులు దీక్షను కొనసాగించారు. ఐదురోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన సాగిస్తున్న విద్యార్థుల్లో పలువురు నీరసిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. -
దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. డిమాండ్లు ఫలించేనా ??
-
Basara IIIT: పట్టు వదలని విద్యార్థులు.. కొలిక్కిరాని చర్చలు
సాక్షి, నిర్మల్: బాసర ఐఐఐటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు చర్చలు జరిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టూడెంట్ ఆక్టివిటి సెంటర్లో వెయ్యి మంది విద్యార్థులతో ఈ సమావేశం నిర్వహించారు. విద్యార్ధులతో తమ డిమాండ్లపై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ భేటీలో మంత్రితో పాటు కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ఐఐఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. విద్యార్థుల 12 డిమాండ్లలో 60శాతం నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం తమ బాధ్యతని పేర్కొన్నారు. అయితే సమస్యల పరిష్కారానికి పట్టుబడుతున్న విద్యార్థులు రెగ్యులర్ అధ్యాపకులు, వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. కానీ వీసీ నియామకం ఇప్పట్లో కుదరదని అధికారులు చెప్పారు. దీంతో మంత్రి, అధికారులు హామీపై స్పష్టత లేదని విద్యార్థులు చెబుతున్నారు. కాగా 12 డిమాండ్ల పరిష్కారం కోసం ఐఐటీ విద్యార్థులు గత అయిదు రోజుల నుంచి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సానుకూలంగా ఉన్నారు: మంత్రి సబితా అదే విధంగా ఆందోళన విరమించాలని బాసర ఐఐఐటీ విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించాలని, విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ‘విద్యార్థులు ఎండలో ఎండుతున్నారు. వానలో తడుస్తున్నారు. వారిని చూస్తుంటే బాధేస్తోంది. కోవిడ్ కారణంగా సమస్యలు పరిష్కరించడం జాప్యమైంది. మీ సమస్యలను తక్కువగా చూపే ఉద్దేశం లేదు. ట్రిపుల్ ఐటికి డైరెక్టర్‌గా సతీష్ కుమార్‌ను నియమించింది. మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్నత విద్యశాఖ వైస్ చైర్మన్ వెంకటరమణను పంపింది. సమస్యలను పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. అందోళన విరమించండి’ అంటూ పిలుపునిచ్చారు. అయిదోరోజు ఆందోళనలు మరోవైపు రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ఐటీ అయిదు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ ట్రిపుల్ఐటీ విద్యార్థులు అయిదో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ప్రధాన ద్వారం వద్దనే రోజంతా బైఠాయించి, మౌనదీక్ష కొనసాగించారు. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ రావాలంటూ ప్లకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు విద్యార్థులుగా వచ్చి ఆందోళనను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. -
మహంకాళికి ఆన్లైన్లో ‘బోనం’
సాక్షి, హైదరాబాద్: దేశ, విదేశాల్లోని భక్తులు సైతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్ ద్వారా బోనాలు సమర్పించుకునేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు గురువారం అరణ్య భవన్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఆన్లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం పంపిణీ చేస్తారని, ఆ బియ్యాన్ని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చని వివరించారు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు –కుంకుమ పంపిస్తారని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్లో బోనం సమర్పించాలనుకునే భక్తులకు జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మీ సేవ, ఆలయ వెబ్ సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు రూ.300, ఇతర దేశాల భక్తులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్ సేవల ద్వారా దేశీయ భక్తుల ఇంటికి చేరవేస్తారని వెల్లడించారు. ఆన్లైన్లో ఎల్లమ్మ కల్యాణ సేవలు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆన్లైన్ సేవలను కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జూలై 5న ఎల్లమ్మ కల్యాణం నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్లైన్లో కల్యాణం సేవలను బుక్ చేసుకోవాలని తెలిపారు. అమ్మవారి కల్యాణానికి సంబంధించి ఆన్లైన్ సేవలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు కుంకుమ, డ్రై పూట్స్ ఇంటికి పంపిస్తారని చెప్పారు. మీ సేవ, ఆలయ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ కల్యాణ సేవలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
ప్రాణహిత పుష్కర సంబరం
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలకు నదీతీరం, త్రివేణి సంగమం సంసిద్ధమైంది. నదులకు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నదికి బుధవారం నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తనున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్లను ఏర్పాటు చేశాయి. ఈనెల 24 వరకు జరిగే ఈ పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచ, నగు రంలో ఈ ఘాట్లు ఉన్నాయి. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద విధుల నిర్వహణ కోసం సుమారు ఆరువేల మంది పోలీసులు, ఇతర శా ఖల సిబ్బంది పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాణహిత జననం, పయనం: గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. పెన్‌గంగా, వార్దా నదిలో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుంది. ఈ నది తుమ్మిడిహెట్టి నుంచి 113 కి.మీ. ప్రవహిస్తుంది. బెజ్జూర్ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి, వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి, కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా పయనిస్తుంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి, ఇందారం, తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట, కొత్తూర్, తేకడా, గిలాస్పేట, రాయిపేట, రంగాయపల్లి, హమురాజీ, సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వరులుగా వెలిసిన పరమేశ్వరుడి పుణ్యక్షేత్రం) వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. పుష్కర ఘాట్లు ఇవే.. ►కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా ►తుమ్మిడిహెట్టి– కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ►అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ►వేమనపల్లి – మంచిర్యాల జిల్లా మండల కేంద్రం ►సిరోంచ, నగురం – మహారాష్ట్ర ఇలా చేరుకోవచ్చు.. ►కాళేశ్వరం: హైదరాబాద్ నుంచి కాజీపేట, వరంగల్ వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా యి. వరంగల్ నుంచి రోడ్డుమార్గన భూపా లపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. ►అర్జునగుట్ట: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి చెన్నూరు మీదుగా అర్జునగుట్ట ఘాట్‌కు చేరుకోవచ్చు. ►తుమ్మిడిహెట్టి: కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి ఘాట్‌కు వెళ్లాలంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల మీదుగా రైళ్లు కాగజ్‌నగర్ వరకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిర్పూర్ టీ మీదుగా తుమ్మిడిహెట్టికి చేరుకోవచ్చు. ►వేమనపల్లి: నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాల నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల చేరుకుని అక్కడి నుంచి వేమనçపల్లికి వెళ్లవచ్చు. -
నేత్రపర్వం.. సీతారామ కల్యాణం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తితో గత రెండేళ్లుగా ఆంతరంగికంగానే సాగిన ఈ వేడుక తిరిగి ఎప్పటిలాగానే మిథిలా స్టేడియంలో భక్తుల జయజయ ధ్వానాల నడుమ కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో కల్యాణ మండపం మార్మోగింది. స్వామి వారి కల్యాణం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచారు. రామయ్యకు సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళా శాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షణ నిర్వహించి కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం రాగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాలకు మాంగల్య పూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగల్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం తరఫున ఆలయ వైదిక కమిటీ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకలో మంత్రు లు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ పాల్గొన్నారు. ఇక భద్రగిరి, బాసర అభివృద్ధి:మంత్రి రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యాన భద్రాచలంతోపాటు బాసర క్షేత్రం అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రామయ్య కల్యాణోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. నేడు భద్రాచలానికి గవర్నర్ శ్రీరామ నవమి తర్వాత రామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుక నిర్వహించడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో రాములవారి కల్యాణాన్ని చూసి తరించేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం అట్టహాసంగా, కన్నులపండుగగా జరుగుతోంది. స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక, టీటీడీ తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. కాగా, సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భద్రాద్రి రామయ్య పెళ్లికి రండి
భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 10, 11వ తేదీల్లో జరిగే సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం అధికారులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులను ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఈవో శివాజీ ఆధ్వర్యంలో వేదపండితులు శాలువాతో సత్కరించి ఆహ్వానపత్రాన్ని అందించారు. అలాగే, ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు రామయ్య వివాహా ఆహ్వానపత్రిక అందచేసి వేదాశీర్వచనం అందజేశారు. స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అర్చకులు మురళీ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. గవర్నర్‌కు కల్యాణోత్సవ ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు సీఎం కేసీఆర్‌కు యాదాద్రీశుడి ఆశీస్సులు యాదగిరిగుట్ట: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌కు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులను ఆలయ ఆర్చకులు అందజేశారు. శనివారం ఉదయంప్రగతిభవన్‌లో యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, వేద పండితుడు శ్రీనివాస్‌శర్మ వెళ్లి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానాలయం ఉద్ఘాటన తరువాత భక్తుల రాక ఎలా ఉందనే అంశాన్ని కేసీఆర్ ఈవో గీతారెడ్డితో చర్చించినట్లు తెలిసింది. -
కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదగిరీంద్రుని తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తమున బాలాలయంలో లక్ష్మీదేవితో యాదగిరీంద్రునికి తిరుకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామివారిని శ్రీరామ అలంకారం చేసి హనుమంత వాహన సేవ నిర్వహించారు. హనుమద్వాహనరూఢుడైన శ్రీస్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అనంతరం పంచరాత్రా ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి, అమ్మవార్లను అలంకరించి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన కల్యాణంలో ప్రధాన ఘట్టమైన జీలకర్రబెల్లం పెట్టే కార్యక్రమం 12.50కి పూర్తికాగా.. మాంగళ్య«ధారణ మహోత్సవం 12.57 గంటలకు జరిగింది. కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు మొదలైన కల్యాణ ఘట్టాలను ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు కల్యాణోత్సవం పూర్తయ్యింది. స్వామి వారిని మల్లె, మందార, పున్నాగ, జాజి, వకుళ, కేతకి, చంపక, మల్లిక వంటి పుష్పాలతో.. చంద్రహారం, పగడాలు, ఇతర హారాల వంటి బంగారు కంఠాభరణాలతో అలంకరించి గజవాహనసేవ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి వైవీ స్వర్ణలతారెడ్డి స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. యాదాద్రీశుడి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం మంత్రి దంపతులు, కుటుంబ సభ్యులు, తన నియోజకవర్గ ప్రజల తరఫున రూ.99,08,454 ఈవో గీతారెడ్డికి అందజేశారు.శ్రీస్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా మహామండపంలోని కల్యాణమూర్తు ల ముందు మంత్రి రూ.36,01,454 చెక్కులు, రూ.63,07,000 నగదు రూపంలో ఈవోకు ఇచ్చారు. టీటీడీ తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేస్తున్న స్వర్ణలతారెడ్డి సీఎం పర్యటన రద్దు యాదాద్రీశుడి సన్నిధికి ఉదయం రావాల్సిన సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. స్వామివారి తిరు కల్యాణంలో సతీసమేతంగా పాల్గొని, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారని ముందుగా అధికారులు ప్రకటించారు. అయితే, అనారోగ్య సమస్యతో సీఎం పర్యటన 10 గంటలకు రద్దయినట్లు ప్రకటించారు. -
ప్రభుత్వ సలహాదారుగా శోభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, పదవీ విరమణ సందర్భంగా అరణ్యభవన్‌లో పువ్వులతో అలంకరించిన జీప్‌లో శోభను నిలుచోబెట్టి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తాళ్లతో లాగి ఆమెకు వీడ్కోలు పలికారు. అంతకు ముందు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శోభను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్‌గా నియమితులైన ఆర్ఎం డోబ్రియల్ తదితరులు అభినందించారు. అడవులతో, అటవీశాఖతో ఎంతో అనుబంధమున్న శోభ సేవలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, సలహాదారు రూపంలో ఆమె సేవలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. అటవీశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, పీసీసీఎఫ్‌గా బాధ్యతలు నిర్వహించడం ద్వారా శాఖలో అనేక మార్పులకు తాను కారణం కావడం గర్వంగా ఉందని శోభ పేర్కొన్నారు. అటవీ శాఖలో ఆమె అందించిన సహకారం మరువలేనిదని, అనేక అంశాల్లో తమను ప్రోత్సహించారని డోబ్రియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. -
అభయారణ్యాల్లో ‘అండర్‌పాస్’లకు అనుమతి
నిర్మల్/నిర్మల్‌టౌన్/సాక్షి, హైదరాబాద్: అభయారణ్యాల్లో రహదారులు వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా, అవి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్‌పాస్‌లు నిర్మించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. నిర్మల్‌లోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్మల్ నుంచి మంత్రి పాల్గొనగా, అరణ్య భవన్ నుంచి అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. అభయారణ్యాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేలా రహదారుల వద్ద ముఖ్యమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణం, వాహనాల వేగ నియంత్రణ, రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం, పులుల గణన.. తదితర అంశాలపై సమావేశాలో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసమే అండర్‌పాస్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర వన్యప్రాణి మండలి నుంచి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిలో వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నెహ్రూ జూపార్క్ అభివృద్ధికి చర్యలు.. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ‘నెహ్రూ జూలాజికల్ పార్కు’ను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి అధ్యక్షతన జాపాట్ (జ్యూస్ అండ్ పార్కస్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) కార్యవర్గ సమావేశాన్ని కూడా వర్చువల్ విధానంలో నిర్వహించారు. నెహ్రూ జూలాజికల్ పార్కుతోపాటు రాష్ట్రంలోని 8 పార్కుల్లో వన్యప్రాణుల సంరక్షణ, పార్కుల అభివృద్ధి, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రత్యేక చర్యలపై చర్చించారు. కాగా, నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. టికెట్ బుకింగ్, విరాళాలు, వన్యప్రాణుల దత్తత వంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డొబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎ.కె. సిన్హా, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే కోనప్ప, రాఘవ, జూ పార్క్ డైరెక్టర్ ఎంజే అక్బర్, సీఎఫ్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం
Medaram Aerial View 2022: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వైభవోపేతంగా జరుగుతుంది. మేడారంలో కీలక ఘట్టంమైన సమ్మక్క ఆగమన ప్రక్రియ కొనసాగుతోంది. సమ్మక్క తల్లి రాకకు వేళ అవ్వడంతో మేడారం జనసంద్రంగా మారింది. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపములో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీసుకురానున్నారు. మాఘశుద్ద పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్కను ఆదివాసీ గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి మేళ తాళాలతో గద్దెలపైకి తరలిస్తారు. చదవండి: దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది.. ఈ క్రమంలో జాతర పరిసర ప్రాంతాలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. జంపన్నవాగు, కన్నెపల్లి, చిలుకలగుట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమ్మక్క తల్లి ఆగమనంతో వనదేవతల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జాతరకు 70 లక్షల మంది భక్తులు వచ్చారని, మూడు రోజుల్లో మరో 50 నుంచీ 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసిఆర్ బర్త్ డే సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 60 కేజీల తెల్లబంగారం సమర్పించారు . కేసిఆర్ ఆయురారోగ్యాలతో జాతీయ రాజకీయాల్లో రాణించాలని అమ్మవారులను వేడుకున్నానని తెలిపారు. జాతీయ స్థాయిలో కేసిఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవేనలతో రాష్ట్ర సాధన తోపాటు రెండు సార్లు కేసిఆర్ సీఎం అయ్యారని తెలిపారు. సీఎం కేసిఆర్ రేపు మేడారం వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఏర్పాట్లను పరిశీలించారు. జాతరపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మేడారం జాతరకు జాతీయ హోదా లభించాలని అమ్మవారులను వేడుకున్నానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంపై కేంద్రం కనిపించదు, వినిపించదు అన్నట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే రెండు రోజులు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. -
బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి..
శ్రీరాంపూర్/బెల్లంపల్లి/మందమర్రి రూరల్: సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బుధవారం రణ దీక్ష చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే దివాకర్‌రావు శ్రీరాంపూర్‌లో, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మందమర్రిలో రణ దీక్ష చేశారు. మందమర్రి, శ్రీరాంపూర్‌లలోని దీక్షా శిబిరాలను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారికి సఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమిస్తామన్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందన్న మంత్రి, కేంద్రం ఏక పక్షంగా గనులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వేలంలో పెట్టిన బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీక్షల్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, టీఆర్ఎస్, టీబీజీకేఎన్ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. -
తెలంగాణలో కమలం... కమిటీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధం కావడంలో భాగంగా పార్టీలో చేరికలు, సమన్వయం, ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మూడు కమిటీలను నియమించారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ మంత్రులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్, డి.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మహిళా మోర్చా నాయకురాలు బండారి రాధిక ఉన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు తదితరులను చేర్చుకొనేటప్పుడు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేసే వారిని, ప్రజాదరణ ఉన్న వారిని గుర్తించి చేర్చుకొనే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ‘ముందస్తు’ఉండొచ్చనే... శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది చివర్లో జరగాల్సి ఉన్నా అంతకంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల మధ్య 119 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న, బలమైన పార్టీ ముఖ్య నేతలు పోటీకి అవకాశమున్న స్థానాలను మినహాయించి మిగతా సీట్లలో ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ఆ 31 సీట్లపై ప్రత్యేక దృష్టి... రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆయా స్థానాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. ఈ స్థానాల్లో కనీసం 20–25 సీట్లు గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాల్లోని బలాబలాలు, సమస్యలపై ఎస్సీ ముఖ్యనేతలతో బండి సంజయ్ అధ్యక్షతన ఇటీవలే రాష్ట్ర స్థాయి సమీక్ష జరిగింది. ఈ స్థానాల్లో విశ్లేషణ నిమిత్తం తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్ నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జైపాల్, ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహేచ్ విఠల్, ఎస్సీ మోర్చా నాయకురాలు కాంచన కృష్ణ ఉన్నారు. అలాగే ఎస్టీ స్థానాల్లో బలబలాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల అంశాల పరిశీలనకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు చైర్మన్‌గా ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలంగౌడ్, సీనియర్ నేత చింతా సాంబమూర్తి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఉన్నారు. -
అనాథలకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్, వెంగళరావునగర్: రాష్ట్రంలోని అనాథలను సంరక్షించేందుకు దేశం గర్వించేలా సమగ్ర చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిలా ఉన్న తెలంగాణ అనాథల విషయంలో తల్లిదండ్రులుగా మరో అద్భుత విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో అనాథలు ఉండొద్దనే సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తామన్నారు. అనాథల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించి జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక రక్షణ కల్పిస్తామన్నారు. సబ్ కమిటీ సమావేశం అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రిగార్డెన్ను కేటీఆర్ సందర్శించి కమిషనర్‌ను అభినందించారు. సబ్ కమిటీ సూచనలు... ♦అనాథ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందించాలి. ♦అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడంతోపాటు వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలి. ఈ కార్డులు ఉంటే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ముస్లింలలో అనాథలను చేరదీసే విధంగా నిర్వహిస్తున్న యతీమ్ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలబడాలి. ♦ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ చానల్లో పెట్టాలి. ఆ ఏడాది నిధులు ఖర్చుకాకపోతే వచ్చే ఏడాది ఉపయోగించుకొనే విధానం పెడితే వారికి శాశ్వత ఆర్థిక భద్రత లభిస్తుంది. ♦ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ హోమ్స్‌లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. -
యాదాద్రికి రూ.50 లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం సుంకిశాల దేవస్థానం వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆయన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యాదాద్రి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. -
‘పోడు’కు బదులు సర్కారీ భూమి
సాక్షి, హైదరాబాద్: అడవుల లోపల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా సమీపంలోని ప్రభుత్వ భూములను కేటాయించాలని.. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే అడవుల అంచున భూమిని ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితోపాటు వారికి నీరు, విద్యుత్, నివాస సదుపాయాలు కూడా కల్పించాలని.. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. పోడు సాగుచేస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల నుంచి దరఖాస్తుల స్వీకరణను వచ్చే నెల 8న ప్రారంభించాలని.. డిసెంబర్ 8 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వచ్చేనెల 8లోగా అన్నిస్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని.. రెండు, మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. అడవులకు శాశ్వత సరిహద్దులు అటవీ భూములకు శాశ్వత సరిహద్దులను నిర్ణయించి, ప్రొటెక్షన్ ట్రెంచ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ట్రెంచ్‌లపై గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలని.. ట్రెంచ్ ఏర్పాటుకు అటవీ, ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. పోడు భూముల ఆక్రమణల్లో 87శాతందాకా భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర 12 జిల్లాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. పీడీ చట్టం ప్రయోగించండి గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుంచి వచ్చేవారే అడవిని నాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల ప్రజలు అడవికి నష్టం చేయరన్నారు. అడవిపైనే ఆధారపడి బతికే వీరికి మేలు చేయాలని, బయటి శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలో కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అడవుల రక్షణ చర్యల్లో సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్నిజిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటివరకు పోడు సాగు చేస్తున్న గిరిజనులు, ఇతరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పించడంతోపాటు.. ఇక ముందు అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణకు గురికావొద్దన్న అంశంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. గంజాయి సాగు చేస్తే జైలుకే.. గంజాయి సాగుచేస్తే రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతోపాటు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగుచేస్తే ఆర్వోఎఫ్ఆర్ పట్టాల రద్దుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిగా అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానం.. సామాజిక వనాల పెంపకంలో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా అడవితో సమానం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్ తరహాలో అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అడవులు లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో చెట్లను పెంచాలన్నారు. -
TS Special: బాసర ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి, గంగాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఇతర సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్‌రావు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిత్యకైంకర్యాలకు 3,645 ఆలయాల్లో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం ద్వారా గౌరవ వేతనం, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, కామన్ గుడ్‌ఫండ్ నిధుల ద్వారా పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ప్రస్తుతం రూ. 8.40 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో అతిథి గృహాలు, షెడ్స్, ప్రహరీగోడ ఇతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. డిసెంబర్ 2021 నాటికి ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, మిగిలిన పనులను డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో రూ. 30 లక్షలతో గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో షెడ్స్, రోడ్ల నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. రూ. 50 లక్షల అంచనా వ్యయంతో గంగాపూర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మండపం, విమాన గోపుర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 239.87 కోట్ల మొక్కలు నాటాం: ఇంద్రకరణ్ హరితహారంలో భాగంగా 2014–15 నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు రూ.6,555.97 కోట్లు రాష్ట్రంలో ఖర్చు చేసినట్టు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఇప్పటివరకు 239.87 కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అడవులున్న ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పచ్చదనం పెంచేందుకు ఎంపీ సంతో‹Ùకుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ చెట్లు నాటడానికే కాకుండా వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, కానుగ చెట్ల పెంపకం అధికం చేయడంతోపాటు రోడ్ల వెంట ఇతర చోట కాయలు కాసే చెట్లకు అధికప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీ‹Ùకుమార్, సయ్యద్ అమీనుల్ జాప్రీ పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్లస్థలాలు !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు ఇళ్లస్థలాలను ఇచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూంఇళ్లను పూర్తి ఉచితంగా ఇస్తున్నందున, హౌసింగ్ బోర్డు ద్వారా అఫర్డబుల్(తక్కువ ధర) ఇళ్లను నిర్మించి విక్రయించే ప్రతిపాదనలు లేవన్నారు. రాజీవ్ స్వగృహ పథకం విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. డబుల్బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో పట్టణ ప్రాంతాల్లో మైనారిటీలకు 10 శాతం కోటాను తప్పనిసరిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వారి సేవలుS కొనసాగిస్తాం: ఉద్యానవన శాఖలో 550 మంది మండలస్థాయి అధికారులు, 190 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను పూర్తిస్థాయిలో తొలగించలేదని, సంబంధిత ప్రాజెక్టు అమలు కాలపరిమితి ముగియడంతో వారి సేవలను నిలిపివేశామని వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వారి సేవలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉద్యానవన డిప్లొమా, పీజీ కోర్సులకు అవకాశం కల్పించడానికి మంత్రి ప్రతిపాదించిన కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన వర్సిటీ సవరణ బిల్లు–2021ను శాసనసభ ఆమోదించింది. -
నేడు సభ ముందుకు సవరణ బిల్లులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న సమావేశమైన శాసనసభ, శాసనమండలి ఇటీవలి కాలంలో మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఉ«భయ సభలు ప్రారంభమైన వెంటనే.. శుక్రవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో తీసుకున్న నిర్ణయాలను సమర్పిస్తారు. అనంతరం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 2018–19 వార్షిక నివేదికను ఉభయ సభలకూ సమర్పిస్తారు. ఆదిలాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో కొన్ని గ్రామాల విలీనానికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ పత్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమర్పిస్తారు. ఇక తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021, కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టీకల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2021 శాసనసభ ముందుకు రానున్నాయి. అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2021, నల్సార్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2021 కూడా ప్రస్తావనకు వస్తాయి. కాగా సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. -
ఆలయ ఆభరణాలతో ఆదాయం
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో వినియోగంలో లేని బంగారు ఆభరణాలను ఎస్బీఐ గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో చాలా దేవాలయాలకు ఆదాయం భారీగా పడిపోయింది. ఉత్స వాల నిర్వహణ, దేవాలయాల నిర్వహణ ఖర్చులు ప్రస్తుతం ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందడానికి వీలుగా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాలయాల అధీనంలో ఉన్న బంగారు నగలలో వినియోగించకుండా ఉన్న వాటిని సేకరించి బంగారు కడ్డీలుగా మార్చి స్టేట్ బ్యాంకు గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయనున్నారు. ఏయే దేవాలయాల్లో ఎంత బంగారం దీని పరిధిలోకి వస్తుందో లెక్కలు తేల్చాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో సమావేశమయ్యారు. కాగా, పెద్ద మొత్తంలో ఉన్న వెండిని కూడా బ్యాంకులో తొలుత బంగారంలోకి మార్చి ఆ బంగారాన్ని గోల్డ్ బాండ్ పథకం కింద ఎస్బీఐలో ఉంచనున్నారు. దేవుడి పేరుతో పాసు పుస్తకాలు.. దేవాలయాలభూములకు దేవుడి పేరుతో పట్టా తీసుకోనున్నారు. చాలా భూములు అన్యాక్రాంతమైన నేపథ్యంలో కమిషనర్ కొద్దినెలలుగా ఇతరుల చేతుల్లోని భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టి సారించారు. 2,622 ఎకరాల భూమిని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఆయా దేవాలయాల్లోని దేవుడి పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. -
అబ్బురపడేలా రాజన్న ఆలయం
సాక్షి, హైదరాబాద్: దేశం అబ్బురపడేలా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో వేములవాడ ఆలయ, పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి ఆరా తీశారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారని, వేములవాడ ఆలయాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. వీటీడీఏ, దేవాదాయ, పురపాలక, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, స్తపతులను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు సమాంతరంగా పట్టణాభివృద్ధి జరగాలని సూచించారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పుష్కరిణి, కల్యాణకట్ట, కల్యాణ మండపం, క్యూ కాంప్లెక్స్, కళాభవనం పనుల్లో వేగం పెరగాలని చెప్పారు. టెంపుల్ టూరిజంగా వేములవాడ దేవాలయ పర్యాటకంలో భాగంగా వేములవాడను సమగ్ర అభివృద్ధి చేయాలని, చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించాలని, బోటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేములవాడ, మిడ్‌మానేరులో పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, స్థల సేకరణ వెంటనే చేపట్టాలని, విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. వేములవాడలో దశల వారీగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని, బ్రిడ్జి నుంచి గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉచిత ప్రయాణం కల్పించాలని, దానికి అనుగుణంగా మినీ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
రేవంత్ జైలు పాలయ్యే రోజు దగ్గరలోనే ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసులో కొద్ది రోజులు జైలుకు పోయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శాశ్వతంగా జైలుకు పోయే రోజు దగ్గరలోనే ఉంది. రేవంత్‌వి బుడ్డరఖాన్ మాటలు. కాంగ్రెస్ డ్రామా కంపెనీ, ఆయన అందులో ఓ డ్రామా ఆర్టిస్టు. సమైక్యవాదుల పంజరంలో చిలుక రేవంత్.. వాళ్లు చెప్పేదే పలుకుతారు. చంద్రబాబు మేనేజ్‌మెంట్‌తోనే టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. హుజూరాబాద్‌లో ఓడితే టీపీసీసీ అధ్యక్ష పదవి పోతుం దని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, జి.విఠల్‌రెడ్డి, మాజీ ఎంపీ గెడాం నగేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చిచంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆదివాసీలకు స్మారక స్తూపం కడతా మని ప్రకటించడం విడ్డూరంగా ఉందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పూటకో పార్టీ మార్చిన రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా నమ్ముతారని, సోనియాని బలిదేవతగా రేవంత్ గతంలో అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘నా మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తా అని గతంలోనే హెచ్చరించినా రేవంత్ భాష మారడం లేదు. మరో 25 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది. పోడు భూములపై కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటార’ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేమూ తిట్టడం మొదలు పెడితే..! ‘ఆర్టీఐ రెడ్డిగా పేరొందిన రేవంత్ సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించారు. భూమికి జానెడు లేవు.. బిడ్డా మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకుని చస్తావ్, ద మ్ముంటే హుజూరాబాద్‌లో ఏదైనా మండల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకో, ఎవరు గెలుస్తారో చూ ద్దాం’అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ చేశారు. ‘కాంగ్రెస్ నేతలు ఇంద్రవెల్లిలో సభ పెట్టి పుండుమీద కారం చల్లారు. ఆదివాసీలతో చెలగాటం ప్రమాదకరం, విల్లు ఎక్కుపెడితే కోలుకోలేవు. ఒక్క సభతోనే రేవంత్ రెచ్చిపోతున్నాడు. టీఆర్ఎస్ ఇలాంటి సభలు వందలు పెట్టి ఉంటుంది. దళితబంధు ఆట ఇప్పుడే మొదలైంది క్లైమాక్స్ మిగిలే ఉంది’అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ జరిగిన చోట ఆదివాసీలు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని, తెలంగాణ వచ్చిన తర్వాతే ఆదివాసీల బతుకులు బాగుపడ్డాయని మాజీ ఎంపీ జి.నగేశ్ చెప్పారు. బ్లాక్మెయిలర్లకు బ్రాండ్ అంబాసిడర్ ‘బ్లాక్మెయిలర్లకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి, చంచల్‌గూడలో ఖైదీనంబరు 1779, చర్లపల్లిలో 4170. టీపీసీసీ అధ్యక్షుడు కాగానే రేవం త్‌కు వసూళ్లు పెరిగాయి, తమను వేధిస్తున్నారని బిల్డర్లు ఫిర్యాదు చేస్తున్నార’ని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఏ.జీవన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణకు రేవంత్ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం చప్రాసీ కూడా కాలేరు. తాను జైలుకు వెళ్లివచ్చి అందరూ జైల్లో ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్ అధికారం గురించి కలలు కనడం మానేయాలి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ భూస్థాపితం చేస్తారు’అని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
ఆదిలాబాద్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగ
-
సహాయక చర్యల పర్యవేక్షిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి
-
Indrakaran Reddy: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన తెలంగాణ డయగ్నోస్టిక్ హబ్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లతో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. 19 జిల్లాల్లో డయగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 57 రకాల నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. రూ.2.40 కోట్లతో రిమ్స్ ఆవరణలో డయగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, విందులు, వినోదాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గతేడాది రూ.40వేల కోట్ల ఆదాయం నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లు మాట్లాడారు. జిల్లాలో నాలుగు రూట్లు ఏర్పాటు చేసి 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను తెలంగాణ డయగ్నోస్టిక్ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం పంపించడం జరుగుతుందన్నారు. వైద్యం కంటే ప్రైవేటులో నిర్ధారణ పరీక్షలకే అధిక డబ్బులు ఖర్చవుతున్నట్లు తెలిపారు. చాలా మంది అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని, పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం నిర్ధారణ పరీక్షలు తీసుకొచ్చే వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. చదవండి: Telangana: ఎంసెట్ వాయిదా! -
ఈసారీ మంచి వానలు
సాక్షి, హైదరాబాద్: ప్లవ నామ సంవత్సరంలో మంచి వానలు కురుస్తాయని, రైతుల మోములో చిరునవ్వు వస్తుందని శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణి కులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి చెప్పారు. కొత్త ఏడాది మహిళల ఆధిపత్యం అన్ని రంగాల్లో విస్తరిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వం–ప్రజల మధ్య సమన్వయం, సఖ్యత వల్ల పాలన సాఫీ సాగుతూ ప్రజలకు మేలు జరుగుతుం దని వివరించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ‘ప్లవ’నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగాయి. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..‘‘ప్లవ అంటే పడవ. నీటి పక్షి అన్న అర్థం కూడా ఉంది. అగ్ని పురాణం ప్రకారం.. ఇప్పుడు ముగిసిన సంవత్సరం శార్వరి. శార్వతి అంటే చీకటి రాత్రి.. వచ్చే సంవత్సరం శుభకృతి అంటే శుభం. చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లేదే ప్లవ నామ సంవత్సరం. ఈ ఏడాది పర్వతాకారం లాంటి నల్లని మేఘాలతో ఆకాశం ఆవృతమై ఉంటుంది. రాజు- ప్రజలు సమైక్యంగా జగతికి కాంతులనిస్తా రని శాస్త్రం చెబుతోంది. ధనధాన్యాల వృద్ధి అద్భు తంగా ఉంటుంది. వర్షాలు కురుస్తాయి, పంటలు పండేందుకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. విశేష శుభ ఫలితాలను పొందుతాం. ఈ సంవత్సరానికి దైవం రుద్రుడు. అందువల్ల ఈశ్వరారాధన శుభాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి గురువు, అర్ఘాధిపతి, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. కుజుడికి ఆధిపత్యం రావటం, మేష లగ్నంలో సంవత్సరం ప్రారంభం కావడం వల్ల ప్రజలకు– ప్రభుత్వానికి మధ్య సానుకూలాంశాలు నెలకొంటాయి. సమర్థ పాలన మన రాష్ట్రాధిపతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకరీత్యా బుధ మహాదశలో పుట్టారు. ఆయనది మేష లగ్నం. ఆయన గ్రహస్థితిలో అద్భుతంగా యోగించిన కుజుడు ఈ సంవత్సరం రాజు కావడం.. ఈ పోలికల ఆధారంగా పంచాంగాన్ని విశ్లేషిస్తే.. సమర్థవంతమైన పాలన సాగుతుంది. శనికుజుల పరస్పర వీక్షణం వల్ల ముఖ్యమంత్రి వేగాన్ని మిగతా మంత్రులు, అధికారులు అందుకోలేకపోవచ్చు. దీనివల్ల సమన్వయ లోపం కొంత ఏర్పడి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి వ్యయస్థానంలో రవి బుధ చంద్రుల కలయిక వల్ల పాలనాపరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రజలు ఆడంబరాలకు పోయి స్థాయికి మించిన ఖర్చు చేస్తారు. అందుకే ప్లవ నామ సంవత్సరంలో ప్రజలు దుబారా, ఆడంబరాలను తగ్గించుకోవాలి. ప్రభుత్వానికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. రక్షణ శాఖ ఉత్సాహంగా పనిచేస్తుంది, కొత్త ఆయుధాల ఆవిష్కరణ జరుగుతుంది. ప్రభుత్వానికి ప్రజల అండ ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఉండదు. ప్రభుత్వానికి ప్రజల అండదండలు మెండుగా ఉంటాయి. రాజ్యాంగ నిర్ణయాలు ప్రజలకు సంతృప్తినిస్తాయి. ప్రస్తుత గ్రహస్థితి వల్ల జూలై 13 నుంచి ఆగస్టు 16 మధ్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మే తర్వాత కరోనా ఉధృతి బాగా తగ్గుతుంది. కానీ ప్రజలు నిర్లక్ష్యాన్ని వదిలేయాలి. సెప్టెంబరు 14 నుంచి నవంబరు 20 మధ్య గురు శనిల కలయిక వల్ల మరోసారి భయాందోళన పరిస్థితి నెలకొంటుంది. డిసెంబరు 4 నుంచి కాలసర్పదోషం వల్ల కొన్ని అరిష్టాలు ఏర్పడుతాయి. మకర రాశిలో శనైశ్వర సంచారంతో భయం, అతివృష్టి ఏర్పడతాయి. 2022 మార్చి మొదటివారంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. ముందుజాగ్రత్తలు అవసరం. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష పురోగతి ఉంటుంది. రియల్ ఎస్టేట్ పురోగమిస్తుంది కుజుడికి చాలా ఆధిపత్యాలు రావటంతో రియల్ ఎస్టేట్‌లో భారీ పురోగతి ఉంటుంది. భూముల ధరలు పెరుగుతాయి. 3,4 రియల్ ఎస్టేట్ సంబంధిత భూ కుంభకోణాలు వెలుగుచూస్తాయి. ప్రజలు భూములు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది సింధూ పుష్కరాలు నవంబర్ 21 నుంచి డిసెంబరు 2 వరకు సింధూ నది పుష్కరాలు ఉంటాయి. మనదేశంలో తక్కువ ప్రాంతంలో ఆ నది ఉన్నందున సింధూ నదిని తలుచుకుని మిగతా నదుల్లో స్నానం చేస్తే పుష్కర పుణ్యం కలుగుతుంది. ఈ సంవత్సరం మనకు గ్రహణ ప్రభావాలు లేవు. ఈసారి ముహూర్తాలు ఎక్కువ గతేడాది మౌఢ్యముల వల్ల ముహూర్తాలు తక్కువగా ఉండటంతో జనం ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషంగా పెళ్లిళ్లు జరుగుతాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాలసర్పదోషం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఆధ్యాత్మిక భావనతో గడిపితే మంచి జరుగుతుంది. కాళేశ్వరం పరిపూర్ణంగా నిండి జలవనరులతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. యాదాద్రి దేవాలయం ప్రారంభమై దివ్యమంగళ దర్శనం కలుగుతుంది.’’ -
మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది
సాక్షి, హైదరాబాద్: ప్రతిసారి తెలుగు నూతన సంవత్సరం ఉగాది విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఈసారి అలాంటిదేమీ లేకున్నా ఉగాది పండుగ విషయంలో మత్రం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈనెల 13వ తేదీన ఉగాది పండుగ చేసుకోవాలని మంత్రి ప్రకటించారు. ఆ రోజుల ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఉగాది పండుగ నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన ఉగాది పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి దేవస్థాన ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరిస్తామని వివరించారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. -
ఈసారీ రాములోరి భక్తులకు నిరాశే..ఎందుకంటే!
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని స్వయంగా వీక్షించాలనుకునే భక్తులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆంతరంగిక వేడుకగానే ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి సంతృప్తి చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనటం, ఆ తర్వాత ఆలయ సిబ్బంది, అర్చకుల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటం తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మతాలకతీతంగా అన్ని బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించింది. వేడుకలు నిరాడంబరంగా, ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ జరుపుతామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా అర్చకులు, వేదపండితులు, అధికారులు, పోలీసులు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ప్రభుత్వ ప్రతినిధులు మినహా సాధారణ భక్తులకు అనుమతి ఉండే అవకాశం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధించిన ఈ ఆంక్షలకు భక్తులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులెవరూ భద్రాచలం రావద్దని, ఇప్పటికే కల్యాణ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు డబ్బు వాపస్ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్లో చర్చించారు. ఇతర దేవాలయాల్లోనూ భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే దర్శనాలు చేసుకోవాలని కోరారు. దేవాలయాలకు వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు. అన్ని మతాల పండుగల విషయంలో కోవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించారు. శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవ స్థానంలో ఆదివారం స్వామివారి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. చిత్రకూట మండపంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆ తర్వాత కల్యాణంలో పాల్గొనే రుత్వికులు, వారి సతీమణులు పెళ్లి పనులకు అవసరమైన పసుపు దంచారు. అనంతరం పసుపు, అత్తరు, ఇతర సుగంధద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేశారు. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవాలను వైభవంగా జరిపించారు. కాగా, కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్వామివారి కల్యాణ వేడుకలను అంతరాలయంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. -
భైంసా ఘటనలు దురదృష్టకరం
భైంసా/ భైంసా టౌన్/ భైంసా రూరల్: నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, రాజకీయ లబ్ధి కోసమే కొందరు టీఆర్ఎస్పై బురద జల్లుతున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకీతో కలసి శనివారం ఆయన భైంసా మండలం మహాగాంలో పర్యటించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనలో ఆస్తులు నష్టపోయిన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి భైంసాకు చేరుకుని స్థానిక బస్టాండ్ వద్ద దహనమైన దుకాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అల్లర్ల వెనుక ఏ రాజకీయ పార్టీకి చెందినవారు ఉన్నా ఉపేక్షించేది లేదని అన్నారు. తరచూ జరుగుతున్న ఘర్షణలు ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో భైంసా పట్టణంపై దృష్టి సారించిందని తెలిపారు. ఇలాంటి సమయంలో భైంసా ప్రజలకు అండగా నిలిచేది పోయి రాజకీయం చేయడం పద్ధతి కాదన్నారు. -
యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొండగట్టు దేవస్థానం ఆవరణలో రూ.90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపానికి మంగళవారం భూమిపూజ చేశారు. అంతకుముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్సీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఆలయాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తోంది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇప్పటికే రూ.వెయ్యికోట్లు వెచ్చించి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని బ్రహ్మాండంగా పునర్ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే హనుమాన్ జయంతిలోపు స్తూపం పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ నెల 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించి.. కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పెద్దహనుమాన్ జయంతిలోపు స్తూపం సిద్ధం అవుతుందని తెలిపారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, భక్తులు ఆధ్వర్యంలో కొండగట్టు సేవాసమితి పేరుతో అఖండ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం హనుమాన్ చాలీసా పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఈవో చంద్రశేఖర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఎంపీపీలు విమల, స్వర్ణలత పాల్గొన్నారు. రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కోవిడ్–19 నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శానిటైజర్లు, మాసు్కలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులు భౌతికదూరం పాటించేలా అధికారులు సమన్వయం చేసుకుంటూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భక్తుల భద్రతకు భారీపోలీసు బందోబస్తు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే పాల్గొన్నారు. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై రాహుల్ పాట
సాక్షి, హైదరాబాద్: పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె అనే నినాదంతో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" మూడో దశ విస్తృతంగా వ్యాపిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రాముఖ్యతను చాటిచెప్తూ రాహుల్ సిప్లిగంజ్ ఓ పాటను చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వనజీవి రామయ్య ఈ స్పెషల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ పాటలో ప్రాణవాయువును పెంచే చెట్లతో చెలిమి చేయండని సందేశాన్ని పొందు పరిచారు. మనిషికో మూడు మొక్కలు నాటండని చెప్తూనే, చంటిపాపను కాపాడినట్టుగా చెట్లను సంరక్షించండని పిలుపునిచ్చారు. (చదవండి: అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్) -
కోతులకూ కుటుంబ నియంత్రణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగాపూర్ మండలం చించోలి (బి)వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రం మొదటిది కాగా, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది కావడం గమనార్హం. రూ.2.25 కోట్ల అటవీ శాఖ నిధులతో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం చేస్తారు? రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు. విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు అక్కడ తొలుత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అడవుల్లో వదిలేస్తారు. ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆపరేషన్ థియేటర్, డాక్టర్స్ రెస్ట్ రూమ్స్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారు చేశారు. అలాగే సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు. 2017లో దీని నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. -
పండుగలను ఇళ్లలోనే జరుపుకోండి
సాక్షి, హైదరాబాద్: జన సమూహాలు లేకుండా వినాయకచవితి ఉత్సవాలతోపా టు మొహర్రంను ఎవరి ఇం ట్లో వారే నిర్వహించుకోవాలని, సామూహిక నిమజ్జనా లు, ప్రార్థనలు వద్దని ప్రజలకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఈ రెండు పండుగలను నిరాడంబరం గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మంత్రి తన క్యాంప్ కా ర్యాలయం నుంచి మీడియా ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధన లను ప్రజలు తప్పకుండా పాటించాలని, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పక ధరించాలని, ఈ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పండుగలు జరుపుకోవాలని కోరారు. -
నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక..
సాక్షి, సిద్దిపేటజోన్: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధా ని పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణలకు నాం ది పలికిన వ్యక్తి అని, నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీకగా నేటి సమాజానికి పీవీ స్ఫూర్తిగా నిలుస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో పీవీ జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పట్టణంలో పలు చోట్ల హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ ఏడాదిని పీవీ శతజయంతి సంవత్సరంగా ప్రకటించారని పేర్కొన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఈ ఏడాది పొడవునా నిర్వహించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో పీవీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సంకల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ వ్యక్తిగాపీవీకి మద్దతిచ్చా: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వ్యక్తి కావడమే కాకుండా ప్రధానిగానూ ఉండడంతో పీవీకి ఎంపీగా తాను మద్దతునిచ్చినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 1991లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన తాను, 1993లో పీవీ ప్రభుత్వం మైనారిటీలో పడినపుడు ఇతర టీడీ పీ, జేఎంఎం ఎంపీలతో కలిసి మద్దతివ్వడం వ ల్ల నాడు ఆ ప్రభుత్వం నిలబడిందని గుర్తుచేశారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో మంత్రి నివాళులర్పించారు. దేశం విపత్కర స్థితిలో ఉన్నపు డు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి గాడిన పెట్టి న మొట్టమొదటి ప్రధాని పీవీ అని కొనియాడారు. ఈ సందర్భంగా పీవీతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. -
పచ్చదనంలో దేశానికే ఆదర్శం
చౌటుప్పల్: పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాన్ని సాధించిన మాదిరిగానే సీఎం కేసీఆర్ హరిత ఉద్యమాన్ని సైతం విజయవంతం చేస్తారని ఆకాంక్షించారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో రూ.3.45 కోట్ల వ్యయంతో నిర్మించిన తంగేడువనం పార్కును మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (మియావాకీ) విధానంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మంత్రులు పార్కు అంతా కలియతిరిగారు. అలాగే ధర్మోజిగూడెంలోని లక్కారం –1 బ్లాక్‌ను సందర్శించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి 30 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో ఇప్పటికే 60 అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అడవులకు పునర్జీవం పోసేందు కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు విస్తరిస్తామన్నారు. హైదరాబాద్–విజయ వాడ 65వ నంబర్ జాతీయ రహదారి వెంట నాటిన విధంగానే గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట సైతం మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.శోభ, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, కలెక్టర్ అనితారామచంద్రన్, అటవీశాఖ సీసీఎఫ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాముల కోసం రెస్క్యూ సెంటర్
దుండిగల్: జీవ వైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతే ప్రధానంగా తోడ్పడుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా భౌరంపేట్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన స్నేక్ రెస్క్యూ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా 35 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మరో నెల రోజుల్లో నిర్మల్‌లో కోతుల సంరక్షణ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. పాములను చూసి భయపడొద్దని, స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారమిస్తే వాటిని సురక్షితంగా ఈ కేంద్రానికి తరలిస్తారన్నారు. చెన్నైలోని గిండి స్నేక్ పార్క్‌కు దీటుగా భౌరంపేట్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 180 మంది స్నేక్ సొసైటీ సభ్యులు సహకారం అందిస్తున్నారని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి ఆర్.శోభ, మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అటవీశాఖ అ«ధికారులు మునీంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఈ ఏడాది ఆషాడ బోనాలు లేనట్టే
-
వలస కూలీల లారీ బోల్తా
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వలస కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలో మొత్తం 73 మంది ఉండగా, వీరిలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 48 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన వారిని నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూపీ, బిహార్‌కు చెందిన ఈ కూలీలు హైదరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, మేడ్చల్ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలకు సడలింపు ఇవ్వడంతో వీరంతా లారీలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు బయలుదేరారు. లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నిద్రమత్తులో అతివేగంగా నడపడం వల్లే అదుపుతప్పి, రోడ్డుపక్కకు దూసుకుపోయి బోల్తాపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. కూలీలకు రూ.10 వేల సాయం అందించారు. -
ప్రగతిబాటలో పట్టణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని 3,456 మున్సిపల్ వార్డుల్లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది. పలుచోట్ల మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం–పరిశుభ్రత విజయవంతమవుతుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు నిర్వహించాలని సూచించారు. హరితహారం, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ పదవి మీరు పెట్టిన భిక్ష: ఈటల ‘‘నాకు మంత్రి పదవి మా అమ్మ ఇవ్వలే. హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన భిక్ష. నా కారులో మీరు పెట్రో లు పోస్తే నేను తిరుగుతున్నాను అని ప్రతిక్షణం గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నాను’’అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నడిచే ఎద్దును పొడుస్తారని, పనిచేసేవాడి దగ్గరికే ప్రజలు వస్తారని.. ఈ నేపథ్యంలో ప్రతి కౌన్సిలర్ రోజూ ఉదయం వార్డుల్లో తిరగాలని సూచించారు. పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత వరకు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మనదని వ్యాఖ్యానించారు. గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్ల కింద ఉన్నవారికి ముందుగా 500 డబుల్ బెడ్రూం ఇళ్లు రెడీ అవుతున్నాయని చెప్పారు. అలాగే సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ప్రజలు కూడా తమ బాధ్యత మరవకుండా అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ అధికారులు చెత్తా చెదారం లేని, మురికినీరు లేని, పచ్చని చెట్లతో ఉన్న పట్టణం తయారు చేయాలని సూచించారు. సైకిల్‌పై తిరిగిన పువ్వాడ... ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ మాణిక్యనగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. మురికి కాలువలో పూడిక తొలగించి, మొక్కలు నాటారు. అనంతరం సైకిల్‌పై పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. పచ్చదనం పెంపునకు నిధులు: సీఎస్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పెంపొందించేందుకు మున్సిపల్ బడ్జెట్లలో పదిశాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌గా కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టణ ప్రగతిలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించేందుకు ప్రతి మున్సిపల్ వార్డులో ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులతో మొత్తం నాలుగు కమిటీలు నియమించినట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్‌నగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
పనులవుతవా..కావా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘మేడారం మహా జాతరకు నెల సమయం కూడా లేదు.. ఎన్ని సార్లు సమీక్షలు చేసినా మీ తీరు మారడం లేదు.. రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, ఆర్డబ్ల్యూఎస్ పనుల తీరు చూస్తే జాతర మొదలయ్యే వరకు పూర్తి అవుతాయన్న నమ్మకం లేదు’ అని సంబంధిత అధికారులపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు ఇన్చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మేడారం హరిత హోటల్లో జాతర పనులు, ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జాతర మొదలయ్యే వరకు పను లు పూర్తయ్యేలా లేవని ఫైర్ అయ్యారు. ఆయా పనుల్లో లోపాలను ఎత్తి చూపారు. మహబూబాబాద్, నర్సంపేట మధ్య రోడ్డు పనుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ పీవో శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణలపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గాలిమాటలు చెప్పకు.. పనుల్లో వేగం పెరగకపోతే ఇంటికి పోతరు’ అని మందలించారు. ఈ నెల 26లోగా అన్ని పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రులు మేడారం అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. -
అడవిలోని అనుభూతి కలిగించే జంగల్ క్యాంపు
మహేశ్వరం: నగరవాసులకు మానసికోల్లాసంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం జంగల్ క్యాంపులో లభిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండలం హర్షగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మజీద్‌గడ్డ రిజర్వు ఫారెస్టులో 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను ఇంద్రకరణ్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగల్ పార్కులో వినోదంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నగరవాసులు కుటుంబంతో వచ్చి రోజంతా గడిపేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. జంగల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగల్ క్యాంపు ప్రత్యేకతలు ఫైర్ (చలికి కాచుకునే ప్రదేశం) క్యాంపును పరిశీలిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, అధికారులు నగర ఉద్యాన యోజన, కంపా, అటవీశాఖ నిధులతో జంగల్ క్యాంపును అభివృద్ధి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా అడ్వెంచర్ జోన్, జంగల్ క్యాంపు సెక్టార్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాకింగ్, రన్నింగ్ సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు క్యాంపింగ్ సౌకర్యాలు, సాహస క్రీడలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆటస్థలం, గజీబోలు, మల్టీపర్పస్ షెడ్స్, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్పాట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పార్కులో వంట చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలాలు ఉన్నాయన్నారు. సందర్శకుల రక్షణ చర్యలో భాగంగా క్యాంపింగ్ ఏరియా చుట్టూ చైన్‌లింక్డ్ ఫెన్సింగ్, పాములు చొరబడకుండా ప్రూఫ్ ట్రెంచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పార్కులో ఉన్న రోడ్లకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అటవీవీరుల పేర్లను పెట్టి వారి త్యాగాలకు స్మరించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. నగరవాసులకు వరం హైదరాబాద్ శివారులో మంచి వాతావరణం కల్పించేందుకు జంగల్ క్యాంపు పార్కును ఏర్పాటు చేశామని, ఈ పార్కు నగరవాసులకు వరంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్ కాంక్రీట్ జంగల్‌గా మారొద్దనే ఉద్దేశంతో అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో జంగల్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రులు జంగల్ క్యాంపును ప్రారంభించి, అడ్వెంచర్ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సాహస క్రీడలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ హరీష్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభ, జిల్లా అటవీశాఖ అధికారి భీమ, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డివిజనల్ ఫారెస్టు అధికారి శివయ్య, మంఖాల్ ఫారెస్టు రేంజ్ అధికారి విక్రంచంద్ర తదితరులు ఉన్నారు. -
అడవుల సంరక్షణకు కృషి
మహేశ్వరం: అడవుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోం దని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని హర్షగూడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మజీద్‌గడ్డ రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. నగరానికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న రిజర్వ్ ఫారెస్టు బ్లాకులను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో అర్బన్ ఫారెస్టు పార్కును ఒక్కో థీమ్‌తో మొత్తం 94 పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలో 60 పార్కులు, ఇతర పట్టణాల్లో 34 పార్కులను రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. -
'మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తాం'
సాక్షి, వరంగల్ అర్భన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అతిరుద్ర యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కళ్యాణానికి దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని కోటిన్నర మాగానికి సాగునీళ్లు అందనున్నాయన్నారు. కాళేశ్వరంతో పాటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై ఇటివలే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలువురం కలిసి కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మేడారం జాతరలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ వెల్లడించారు. (చదవండి : ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర) -
సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసిఫాబాద్ జిల్లాలోని ఎల్లాపటార్‌లో గత నెల 24న ముగ్గురు యువకులు దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. దిశ ఘటన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించిందని మంత్రి గుర్తు చేశారు. సమత కేసులో కూడా సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందని వెల్లడించారు. దోషులకు వెంటనే శిక్షలు పడేలా, భాదితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. (చదవండి: వివాహితపై అత్యాచారం.. హత్య) -
‘ఆ పరిస్థితి ఎక్కడా రాకూడదని కోరుకుంటున్నా’
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ‘దేశంలో పర్యావరణ పరిరక్షణ-అడవుల రక్షణ మొక్కల పెంపకం’ పై సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1.175 కోట్ల మొక్కలను నాటామని వెల్లడించారు. అటవీ శాఖలో పోస్టుల భర్తీ.. 24 శాతానికి తగ్గిపోయిన అడవులను 33 శాతానికి పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటవీ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాక భూగర్భ జలాలు, అడవులు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు దేశంలో ఎక్కడా రాకూడదని కోరుకుంటున్నానన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి జూట్, పేపర్ బాగ్స్ ను వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. -
ప్రపంచ ప్రమాణాలతో అటవీ విద్య
సాక్షి, హైదరాబాద్: అటవీశాస్త్ర పరిజ్ఞానంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంతోపాటు విద్యాప్రమాణాలను పెంపునకు ఆబర్న్ వర్సిటీతో కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవో యూ) మైలురాయి కాగలదని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్లో ఆయన సమక్షంలో రాష్ట్ర ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ), అమెరికా అలబామా రాష్ట్రంలోని ఆబర్న్ వర్సిటీ మధ్య ఎంవో యూ కుదిరింది. ఆబర్న్ యూనివర్సిటీ డీన్ జానకి రాంరెడ్డి, ఎఫ్సీఆర్ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డిలు ఎంఓయూపై సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. విద్యా విధానం ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల ఎఫ్‌సీఆ ర్‌ఐ విద్యార్థులకు మేలు జ రుగుతుందని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పరిశోధన వల్ల కలిగే ప్రయోజనంతో ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేశ్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి.పర్గెయిన్ పాల్గొన్నారు. -
ప్రాణవాయువు కొనుక్కునే దుస్థితి రావొద్దు: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: మనుషులకు ప్రాణాధారమైన గాలిని (ఆక్సిజన్) కొనుక్కోవాల్సిన దుస్థితి రాకుండా ఉండేందుకు అడవులను పరిరక్షించుకుని జాగ్రత్త పడాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అర్బన్‌పార్కు ప్రారంభంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొ ని మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ సంరక్షణ చర్యలతో ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. అడవుల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోతున్న తరుణంలో ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’పేరుతో రిజర్వ్ ఫారెస్టులను అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంద్రకరణ్ తెలిపారు. -
మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణం
రాంగోపాల్‌పేట్: స్వచ్ఛమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే మొక్కల పెంపకం విస్త్రతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. వాతావరణం కాపాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. చెట్లను పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 33 శాతం ఉన్న అడవులు 24 శాతానికి తగ్గిపోయాయని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు సుమారు రూ.230 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం చేపడుతున్నట్లు తెలిపారు. మినిస్టర్ రోడ్లో రసూల్‌పుర చౌరస్తా నుంచి రాణిగంజ్ వరకు పాఠశాల, కళాశాలల విద్యార్థులు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలసి సుమారు 2 వేల మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఉప కమిషనర్ నళిని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.