
సాక్షి, వరంగల్ అర్భన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అతిరుద్ర యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కళ్యాణానికి దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని కోటిన్నర మాగానికి సాగునీళ్లు అందనున్నాయన్నారు.
కాళేశ్వరంతో పాటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై ఇటివలే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలువురం కలిసి కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మేడారం జాతరలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ వెల్లడించారు.
(చదవండి : ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర)
Comments
Please login to add a commentAdd a comment