Endowment minister
-
దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు
సాక్షి, విజయవాడ: దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించా. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. నాపై పెట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా. దేవాదాయశాఖ అంటే సంక్లిష్టమైనది. ప్రస్తుతం దేవాలయాల్లో కొనసాగిస్తున్న సేవల కన్నా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను. అధికారులతో సమీక్షించి వారి సలహాలతో ముందుకెళ్తా. ప్రసాద్ స్కీమ్‌లో అన్ని ప్రముఖ దేవాలయాలని అభివృద్ధి చేస్తాం. చారిత్రాత్మకమైన ఆలయాలు ఏపీలో చాలా ఉన్నాయి. ఏపీలో టెంపుల్ టూరిజం సరిగా లేదు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకయాప్ తయారు చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. వీఐపీల కోసమే ఆలయాలు లేవు. భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తాం. ప్రొటోకాల్ ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆలయాలకి సిబ్బంది కొరత అధిగమించడానికి అదనపు సిబ్బందిని తీసుకోవడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. చదవండి: (విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన) ఆలయాలలో అవినీతి అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆలయాల ఆస్తులు, రికార్డులు డిజిటలైజేషన్ చేయాలి. భగవంతుడు ఆస్థులని రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒకే ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీలు చేయాల్సిన అవసరం ఉంది' అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. -
భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా..
తాడేపల్లిగూడెం: భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా.. పదవికి వన్నె తెస్తానని డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన పట్టణానికి వచ్చారు. నియోజకవర్గంలో అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐలాండ్ సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై అభిమానం, తనపై నమ్మకంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురుతర బాధ్యత అప్పగించారని, పారదర్శకంగా పనిచేసి పదవికి వన్నె తెస్తానన్నారు. ఆలయాల్లో రాజకీయాలు చేసే పార్టీలకు గుణపాఠం చెప్పడంతో పాటు ధర్మాన్ని కాపాడాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం ఆలయాల్లో రాజకీయాలు చేస్తున్నాయని ఇది దుర్మార్గం అని అన్నారు. హిందూ ధర్మంపై విశ్వాసం పెంచేలా.. ప్రతిఒక్కరిలో దైవభక్తి, హిందూధర్మంపై విశ్వాసం పెంచేలా కృషిచేస్తానని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. దేవుడిని ప్రజలకు దగ్గర చేయాలనే ప్రభుత్వ ఉద్దేశా న్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తానన్నారు. దేవదాయ శాఖను అత్యంత విశ్వసనీయ శాఖగా మారుస్తానన్నారు. మంత్రివర్గంలో స్థానంతో పాటు తనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన గౌరవంగా భావించాలన్నారు. కాపులకు సముచిత స్థానం కాపు సామాజికవర్గానికి ముఖ్యమంత్రి సముచిత స్థానం ఇస్తున్నారని, దీనిని అందరూ గమనించాలని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. కాపులకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల దుష్ప్రచారం, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు గుర్తించాలని కోరారు. పేదలకు న్యాయం చేస్తామని చెప్పిన కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజాద్వేషానికి గురవుతున్నాయన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో తాడేపల్లిగూడెం ప్రాంత అభివృద్ధికి కృషిచేశారని, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కూడా ఇక్కడి వారిపై ప్రేమ చూపించడం ఆనందంగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రికి కా నుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అపూర్వ స్వాగతం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విజయవాడ నుంచి ఉంగుటూరు మండలం పట్టంపాడులోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా బయలుదేరారు. తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంబపురంలోని ము త్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం భారీ ర్యాలీతో పట్టణ వీధుల్లో ఊరేగారు. కార్యకర్తలు, అభిమానులు క్రేన్ సాయంతో గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. -
కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మంత్రికి షాక్ ఇచ్చిన కూతురు!
ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కూతురని తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. హై ప్రొఫైల్ కేసుగా ఇప్పుడిది మీడియాకు ఎక్కింది. ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె డాక్టర్ జయకళ్యాణి ప్రేమవివాహం చేసుకుంది. బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో సోమవారం సతీష్‌ను ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ పని చేశామని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ కొత్త జంట.. బెంగళూరు సిటీ కమిషనర్ కమల పంత్‌ను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కిడ్నాప్ కేసు! కూతురు కనిపించకుండా పోయేసరికి మంత్రి శేఖర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్ తమిళ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది. ఇంకోపక్క పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ లోపు పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చింది జయకళ్యాణి. బంధించారు.. వేధించారు సతీష్ ఆ ఇంటి డ్రైవర్. పైగా దళితుడు. కొన్ని నెలల క్రితం జయకళ్యాణిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి మంత్రి శేఖర్‌ను అడిగాడు. డ్రైవర్, పైగా కులాంతర వివాహం కావడంతో మంత్రి ఒప్పుకోలేదు. పైగా సతీష్‌ను రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సాయంతో అక్రమంగా నిర్బంధించాడు కూడా. ఇందుకు సంబంధించి గతంలో సతీష్ రిలీజ్ చేసిన ఓ వీడియో మీడియా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది జయకళ్యాణి. The News Minute సౌజన్యంతో వీడియో తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని.. కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటోంది. కాగా తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన శేఖర్‌బాబు.. సీఎం స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. -
'మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తాం'
సాక్షి, వరంగల్ అర్భన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అతిరుద్ర యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కళ్యాణానికి దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని కోటిన్నర మాగానికి సాగునీళ్లు అందనున్నాయన్నారు. కాళేశ్వరంతో పాటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై ఇటివలే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలువురం కలిసి కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మేడారం జాతరలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ వెల్లడించారు. (చదవండి : ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర) -
రాజకీయ మనుగడ కోసమే ఇసుక రాజకీయాలు
సాక్షి, విజయనగరం : రాజకీయ మనుగడ కోసం కొందరు ఇసుక రాజకీయాలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పేపర్‌పై మాత్రమే చూపించిందని, కానీ మా ప్రభుత్వం మాత్రం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్యం, త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందించడమే మా లక్ష్యమని తెలిపారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించడానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. -
దశల వారీగా దేవాలయాల అభివృద్ధి : మంత్రి వెల్లంపల్లి
శ్రీకాకుళం: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించబడిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లా సందర్శనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాసుతో కలసి ఆరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను అర్చకులు శంకర శర్మ మంత్రికి వివరించారు. స్వామి వారి దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని రాబోయే ఐదు సంవత్సరాల్లో జిల్లాను అభివృద్ధి చేసి చూపుతామన్నారు. రాష్ట్రంలో దశల వారీగా దేవాలయాలు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవాలయాల అభివృద్ధిలో భాగంగా అరసవెల్లి , శ్రీకూర్మం దేవాలయాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభమయిందన్నారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాసు కోరిన విధంగా త్వరలోనే శ్రీకూర్మంలో నిత్యఅన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో దశల వారీగా దేవాలయాలు, టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. -
'కృష్ణా పుష్కరాలకు రూ. 825 కోట్లు'
హైదరాబాద్ : ఈ ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలకు రూ. 825 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ దేవాదాయా శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. మార్చి 15వ తేదీ నుంచి పుష్కరాల పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్దిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. ఓ వేళ ఎక్కువ మంది లబ్దిదారులు ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతివారీకీ కల్యాణలక్ష్మి
తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్యాణలక్ష్మి పథకాన్ని మార్చి 31 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పీకేమల్లేపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం ఘాట్ల ఏర్పాటుకు రూ. 8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి వెడల్పునకు రూ. 107 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పాల్గొన్నారు. -
'దేవాలయ భూములను కాపాడుకుంటాం'
వైఎస్సార్ జిల్లా: అన్యాక్రాంతమైన దేవాలయ భూములను కాపాడుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన... బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరావు స్వగ్రామమైన ఎర్రవారిపాలెంకు విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ... సుమారు 20 వేల ఎకరాల భూ ఆక్రమణల అంశం ఇప్పటికే కోర్టుల్లో ఉందని మాణిక్యాలరావు తెలిపారు. 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమంలో భాగంగా దేవాలయ భూములకు సంబంధించి 30వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు లెక్క తేలిందన్నారు. ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, భూములను స్వాధీనం చేసుకుంటామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. -
ఇద్దరి మధ్య ‘ఇగో’ చిచ్చు
ఏలూరు : పోటాపోటీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు తహతహలాడాల్సిన టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ నాయకులు ‘ఇగో’ సమస్యతో కత్తులు దూస్తున్నారు. ఎక్కడికక్కడ తమ వర్గానిదే పైచేయి కావాలంటూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య కొన్నాళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తాజా గా సోమవారం ఆ ఇద్దరూ ఇరు పార్టీల శ్రేణుల సమక్షంలోనే ఆరోపణలు గుప్పించుకున్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, దేవాదాయ శాఖ మం త్రి పైడికొండల మాణిక్యాలరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు వెళ్లారు. అక్కడ పంచాయతీ కార్యాలయంలో వారికి అల్పాహారం ఏర్పాటు చేయగా, అదే సమయానికి జెడ్పీ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. బాపిరాజు మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి ‘నమస్కారం మినిస్టర్ గారూ.. మా పార్టీ వాళ్లను కాస్త చూడండి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి చాలా కష్టాలు పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల ప్రత్తిపాడులో మీరు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు అక్కడ మా ఎంపీటీసీకి కనీస సమాచారం ఇవ్వలేదు. ఇలాగైతే ఎలా’గని అసహనం వ్యక్తం చేశారు. ‘టీడీపీ శ్రేణులను కాకుండా ప్రతిపక్ష పార్టీల వాళ్లను మీరు వెంటేసుకుని తిరుగుతూ ప్రోత్సహిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఏం మాట్లాడుతున్నారు. 35 ఏళ్లు నేను కూడా ప్రజాసేవలో ఉండే రాజకీయాల్లోకి వచ్చాను. నేనేం చేయాలో మీరు చెబుతారా’ అని మాణిక్యాలరావు ఘాటుగానే మాట్లాడినట్టు తెలిసింది. వాగ్వాదం ముదిరి పరిస్థితి ఒకింత ఉద్రిక్తపూరితంగా మారడంతో మంత్రి శిద్ధా రాఘవరావు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు. -
పుష్కర పనులను సమీక్షించిన మంత్రి
దండెంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పుష్కర పనులను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లా దండెంపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఆయన అధికారులతో మాట్లాడారు. పుష్కరాల పనులను జూన్ 15లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. -
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు
తూర్పుగోదావరి: అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రులో కొలువైన శ్రీచౌడేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామిని శనివారం దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యలరావు దర్శించుకున్నారు. మంత్రి వెంట గన్నవరం ఎమ్మెల్యే పి. నారాయణ మూర్తి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. (అంబాజీపేట) -
మంత్రిగా ఐకే రెడ్డి బాధ్యతల స్వీకరణ
ఇంద్రకరణ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తదితరులు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులైన నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సచివాలయంలోని ఆయన చాంబర్లో బాధ్యత లు చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇంద్రకరణ్‌రెడ్డికి చోటు దక్కిన విషయం విధితమే. ఈ మేరకు ఆయన ఈనెల 16న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డికి సహచర మంత్రి జోగు రామన్న పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఏనుగు సురేందర్‌రెడ్డి, పలువురు జిల్లా ముఖ్యనేతలు ఉన్నారు. -
'నెలరోజుల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు'
హైదరాబాద్: టీటీడీ పాలక మండలిని నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మాణిక్యాలరావు తెలిపారు. అలాగే కాణిపాకం, విజయవాడ ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీలపై బుధవారంలోపు నిర్ణయం తీసుకుంటామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. టీటీడీ పాలక మండలి ఇటీవలే రద్దు అయింది. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే చాలా మంది టీడీపీ నాయకులు ఆశగా వేచి చూస్తున్నారు. అయితే దేవాదాయశాఖ కమిషనర్ జేసీ శర్మ అధ్యక్షతన టీటీడీకి ఓ ఆథారటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆథారటీ టీటీడీ పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఆ ఆథారటీ పని చేస్తు ఉంటుంది. -
'పవర్ స్టార్ వల్లే టీడీపీకి పవర్'
ద్వారకాతిరుమల : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మద్దతు వల్లే టీడీపీ పవర్ లోకి వచ్చిందని, చిరంజీవి పార్టీ పెట్టడంతోనే కాపులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకాతిరుమల కాపు కల్యాణ మండపంలో జిల్లా కాపునాడు శ్రీ వేంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభకు ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ వట్టి వెంకటరంగ పార్థసారధి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా కాపు సంఘ అద్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పైడికొండల మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియపై క్యాబినేట్ సమావేశంలో చర్చ జరిగిందని, త్వరలోనే ఇది పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం కాపు వర్గీయులు దుందుడుకు స్వభావంతో, దాడులు చేసేవిధంగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రం విడిపోవడం మన అదృష్టం రాష్ట్ర విభజన జరగడం వల్లే కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదన వేగవంతమైందని, కలిసి ఉంటే జరిగే పరిస్థితి లేదని సమావేశంలో పాల్గొన్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. కాపుల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే ఉపముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారని, కాపులను బీసీ చేర్చే ప్రక్రియ కూడా అమలవుతుందని చెప్పారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపు విద్యార్థులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ కాపుల ఆధ్యుడు, ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఏలూరులో ఏర్పాటు చేస్తానని, ఆయన పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్‌రావు, కాపు నేతలు పిల్లా వెంకటరాయుడు, బొల్లిశెట్టిరావు, వెంకటరత్నం నాయుడు, ఆర్ఎస్ఆర్ మాస్టారు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, మైగాపుల మోహన్ పాల్గొన్నారు. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండ మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీశైలం, అన్నవరం, విజయవాడ దేవస్థానాల్లో 5 వేల మందికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఫైల్‌పై మాణిక్యాలరావు తొలిగా సంతకం చేశారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ... దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. అందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి దేవాలయానికి సంబంధించిన ఆస్తులతోపాటు... దేవాలయాలకు అవుతున్న వ్యయాలను వెబ్సైట్లో పెడతామని పైడికొండల మాణిక్యాలరావు వివరించారు. -
'మాకు సామాన్య భక్తులే విఐపిలు'
తమకు సామాన్య భక్తులే విఐపిలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. రాష్ట్రంలోని దేవాదాయ భూ ములు లీజు వ్యవహారంపై సాధ్యమైనంత త్వరలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దేవాదాయాలకు చెందిన ఆస్తులు ద్వారా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు.