తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతివారీకీ కల్యాణలక్ష్మి | kalyanalaksmi Scheme for Every White Card Holder | Sakshi
Sakshi News home page

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతివారీకీ కల్యాణలక్ష్మి

Published Sun, Feb 21 2016 6:56 PM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM

kalyanalaksmi Scheme for Every White Card Holder

తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్యాణలక్ష్మి పథకాన్ని మార్చి 31 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పీకేమల్లేపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం ఘాట్ల ఏర్పాటుకు రూ. 8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి వెడల్పునకు రూ. 107 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement