సాక్షి, విజయనగరం : రాజకీయ మనుగడ కోసం కొందరు ఇసుక రాజకీయాలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పేపర్‌పై మాత్రమే చూపించిందని, కానీ మా ప్రభుత్వం మాత్రం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్యం, త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందించడమే మా లక్ష్యమని తెలిపారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించడానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment