'నెలరోజుల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు'
హైదరాబాద్: టీటీడీ పాలక మండలిని నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మాణిక్యాలరావు తెలిపారు.
అలాగే కాణిపాకం, విజయవాడ ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీలపై బుధవారంలోపు నిర్ణయం తీసుకుంటామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. టీటీడీ పాలక మండలి ఇటీవలే రద్దు అయింది. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే చాలా మంది టీడీపీ నాయకులు ఆశగా వేచి చూస్తున్నారు. అయితే దేవాదాయశాఖ కమిషనర్ జేసీ శర్మ అధ్యక్షతన టీటీడీకి ఓ ఆథారటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆథారటీ టీటీడీ పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఆ ఆథారటీ పని చేస్తు ఉంటుంది.