'కృష్ణా పుష్కరాలకు రూ. 825 కోట్లు' | Rs. 825 crore for Krishna Pushkaralu, says indrakaran reddy | Sakshi
Sakshi News home page

'కృష్ణా పుష్కరాలకు రూ. 825 కోట్లు'

Published Fri, Feb 26 2016 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

Rs. 825 crore for Krishna Pushkaralu, says indrakaran reddy

హైదరాబాద్ : ఈ ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలకు రూ. 825 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ దేవాదాయా శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. మార్చి 15వ తేదీ నుంచి పుష్కరాల పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు.

స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్దిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. ఓ వేళ ఎక్కువ మంది లబ్దిదారులు ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement