హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో పుష్కరాల కోసం 52 ఘాట్లను నిర్మిస్తున్నట్టు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కృష్ణా పుష్కరాలపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలోనూ గతంలో కంటే ఎక్కువ ఘాట్లను నిర్మిస్తామన్నారు. పుష్కర పనులకు డిసెంబర్ లో టెండర్లు నిర్వహిస్తామని తెలిపారు.
కృష్ణా పుష్కరాలపై మంత్రి సమీక్ష
Published Thu, Nov 5 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement