'దేవాలయ భూములను కాపాడుకుంటాం'
వైఎస్సార్ జిల్లా: అన్యాక్రాంతమైన దేవాలయ భూములను కాపాడుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన... బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరావు స్వగ్రామమైన ఎర్రవారిపాలెంకు విచ్చేశారు.
ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ... సుమారు 20 వేల ఎకరాల భూ ఆక్రమణల అంశం ఇప్పటికే కోర్టుల్లో ఉందని మాణిక్యాలరావు తెలిపారు. 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమంలో భాగంగా దేవాలయ భూములకు సంబంధించి 30వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు లెక్క తేలిందన్నారు. ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, భూములను స్వాధీనం చేసుకుంటామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు.