నిర్మల్‌ ఈఎస్‌ఐని వేగవంతం చేయండి | Minister Indrakaran Reddy Meets Union Minister Santosh Gangwar | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ ఈఎస్‌ఐని వేగవంతం చేయండి

Published Thu, Feb 22 2018 4:21 AM | Last Updated on Thu, Feb 22 2018 4:21 AM

Minister Indrakaran Reddy Meets Union Minister Santosh Gangwar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్‌కు కేటాయించిన ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. బుధవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన ఇంద్రకరణ్‌రెడ్డి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు.

అలాగే నిర్మల్‌లోని ఏరియా ఆస్పత్రిలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన కేంద్ర మంత్రికి అందజేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్రం అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో తదుపరి చర్యలను వేగవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి కందులను కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం ఇదివరకే కొంత మేరకు పంట కొనుగోలు చేసినా, రాష్ట్రంలో భారీ స్థాయిలో పంట సాగుచేసినందువల్ల మిగిలిపోయిన పంటను కూడా కొనుగోలు చేయాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement