accelerate
-
పెరుగుతున్న నిపుణుల కొరత..
ముంబై: ఐటీ కంపెనీలు నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటుండగా, కృత్రిమ మేథ (ఏఐ) దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్టు ఎడ్టెక్ కంపెనీ స్కిల్‌సాఫ్ట్ నిర్వహించిన ‘2023 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ సర్వే’లో తెలిసింది. అర్హత కలిగిన నిపుణులు లభించడం కష్టంగా ఉందని ప్రతి ముగ్గురు ఐటీ కంపెనీల ప్రతినిధుల్లో ఒకరు చెప్పారు. నైపుణ్యాల అంతరం, నైపుణ్యాల కొరత, టెక్నాలజీల్లో మార్పు ఐటీ విభాగాలను ప్రభావితం చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. ‘‘ఉద్యోగులకు ఇంతకుముందెన్నడూ లేనట్టు తరచూ మారుతున్న టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏఐ తదితర టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యాల నిర్మాణంలో సంస్థలు చురుగ్గా వ్యవహరించాల్సిన దశలో ఉన్నాయి’’అని స్కిల్‌సాఫ్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఓర్లా డ్యాలీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 5,700 మంది ఐటీ నిపుణులు, కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా స్కిల్‌సాఫ్ట్ తెలుసుకుంది. శిక్షణ ఎంతో అవసరం.. 82 శాతం ఐటీ నిపుణులు శిక్షణ తమ కెరీర్లో ఎంతో ముఖ్యమని చెప్పారు. చేస్తున్న పనిలో ఎలాంటి వృద్ధి లేకపోవడం వల్ల తాము సంస్థను మారాల్సి వచి్చనట్టు ఎక్కువ మంది తెలిపారు. టీమ్ కమ్యూనికేషన్ (40 శాతం), ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ (21 శాతం), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (13) అన్నవి కావాల్సిన మూడు ముఖ్యమైన నైపుణ్యాలుగా ఐటీ రంగ ఉద్యోగులు చెప్పారు. రానున్న రోజుల్లో నాయకత్వ నైపుణ్యాలు కూడా తమ పెట్టుబడుల ప్రాధాన్యతల్లో ఒకటిగా 6 శాతం మంది పేర్కొన్నారు. సాంకేతికేతర నైపుణ్యాల అవసరాన్ని 7 శాతం మంది వ్యక్తం చేశారు. 72 శాతం మంది ఐటీ ఉద్యోగులు తమ టీమ్ నాయకత్వ నైపుణ్యాలు మధ్యస్థం నుంచి తక్కువగా ఉన్నట్టు అంగీకరించారు. ఈ విభాగంలో శిక్షణ పరంగా ఎంతో అంతరం ఉన్నట్టు పేర్కొన్నారు. నాయకత్వంలో శిక్షణ ఇవ్వడం ద్వారా సమగ్రమైన ఐటీ నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు ఇప్పుడు పెద్ద అవకాశం కంపెనీల మందున్నట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. -
India digital ecosystem: ఎయిర్టెల్- మెటా పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత టెలికం మౌలికరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సామాజిక మాధ్యమ రంగ దిగ్గజం మెటా, టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. వేగవంతమైన డేటా, డిజిటల్ సేవలకు భారత్‌లో డిమాండ్ నేపథ్యంలో ఈ విభాగాల్లో సేవలు అందించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఇరు సంస్థలు సోమవారం ప్రకటించాయి. (మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!) అలాగే ప్రపంచంలో అతిపొడవైన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ అయిన 2ఆఫ్రికా పెరŠల్స్ ప్రాజెక్టును భారత్‌కు పొడిగించేందుకు మెటా, సౌదీ టెలికం కంపెనీతో ఎయిర్టెల్ చేతులు కలుపుతుంది. 2ఆఫ్రికా పెరŠల్స్ ప్రాజెక్టును భారతదేశానికి విస్తరించే ప్రణాళికను సెప్టెంబర్ 2021లో మెటా ప్రకటించింది. ముంబైలోని ఎయిర్టెల్ ల్యాండింగ్ స్టేషన్‌కు కేబుల్‌ను విస్తరిస్తారు. నెట్‌వర్క్‌లను నిర్మించడానికి సర్వీస్ ప్రొవైడర్లతో ఆదాయాన్ని పంచుకోవాలన్న టెలికం ఆపరేటర్ల డిమాండ్ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడడం గమనార్హం. -
నిర్మల్ ఈఎస్ఐని వేగవంతం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్‌కు కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. బుధవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన ఇంద్రకరణ్‌రెడ్డి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే నిర్మల్‌లోని ఏరియా ఆస్పత్రిలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన కేంద్ర మంత్రికి అందజేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్రం అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో తదుపరి చర్యలను వేగవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి కందులను కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం ఇదివరకే కొంత మేరకు పంట కొనుగోలు చేసినా, రాష్ట్రంలో భారీ స్థాయిలో పంట సాగుచేసినందువల్ల మిగిలిపోయిన పంటను కూడా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. -
సీతారామ’ వేగం పెంచండి
► అధికారులకు హరీశ్ ఆదేశం ► ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతుండటంపై అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, పంప్ హౌస్‌లు, కాలువలు సహా ఇతర పనుల పురోగతిని ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి హరీశ్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో సమీక్షించారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో తల పెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు మంద కొడిగా సాగుతుండటంపై మంత్రులు ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 5 పంప్‌హౌస్‌లలో ఒక పంప్‌హౌస్ పనులు జరిగాయని, మరో పంప్‌హౌస్ పనులు మొదలవను న్నాయని అధికారు లు తెలపగా మిగతా 3 పంప్‌హౌస్‌ల పనులనూ వెంటనే చేపట్టాలని, వాటి పురోగతిని ఎప్పటి లోగా పూర్తి చేయనున్నారో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తనకు 15 రోజుల్లో తెలియజేయాలని ఆదేశించారు. అటవీ భూముల సేకరణకు డీజీపీఎస్ సర్వేను 10 రోజుల్లో పూర్తిచేయాలని, భూసేకరణ నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లిం చాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషీని హరీశ్‌రావు సూచించారు. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులను వెంటనే సాధిం చేందుకు అటవీ, రెవెన్యూ శాఖలతో సమన్వ యం చేసుకోవాలని అటవీ, పర్యావరణ అనుమతుల సలహాదారు సుధాకర్‌ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో కొత్తగూ డెం జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, జాయింట్ కలెక్టర్ రామకిషన్, ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్రావు, ఖమ్మం సీఈ సుధాకర్ పాల్గొన్నారు. డిసెంబర్‌కు సిద్ధమవ్వాలి... ఉదయ సముద్రం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితు ల్లోనూ డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలని మంత్రిఆదేశించారు. పనుల్లో వేగం పెంచితేనే గడువులోగా ప్రాజెక్టు పూర్తవుతుందని, 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు, 60 చెరువులను నింపేందుకు వీలవుతుందని ఈ ప్రాజెక్టుపై సమీక్షలో పేర్కొన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకల రిజర్వాయర్ల భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతినీ మంత్రి సమీక్షించారు. వాటి పెండింగ్ భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. అవసరమైన మేరకే భూ సేకరణ జరపాలన్నారు. సెప్టెంబర్ నుంచే పెసర కొనండి: హరీశ్ సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 1కి బదులుగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో పెసర కొనుగోళ్లు జరపాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ఖరీఫ్‌కు సంబంధించి కేంద్రం పెసర కొనుగోళ్లు అక్టోబర్ 1న ప్రారంభిస్తుందని, అయితే తెలంగాణలో ఆగస్టు రెండో వారం నుంచే పెసర చేతికి వస్తుందని, కాబట్టి సెప్టెంబర్ 1న కొనుగోళ్లు ప్రారంభించాల న్నారు. కొత్త ఎంఎస్పీ ప్రకారమే కొనుగోళ్లు చేయాలన్నారు. ఈసారి 2.22 లక్షల ఎకరాల్లో పెసర సాగు చేశారని, దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల కేంద్రం రాష్ట్ర పెసర రైతులను ఆదుకోవాల న్నారు. మరోవైపు పెసర సేకరణకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను నియమిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. -
డ్రైవర్ లెస్ టెక్నాలజీ రేసులో చైనా!
బీజింగ్ః భారీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థ గూగుల్ కు పోటీగా ప్రముఖ చైనా సంస్థ స్వయం చోదిత కార్లను సిద్ధం చేస్తోంది. చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థతో కలసి ఇంటర్నెట్ దిగ్గజం బైడు ఈ డ్రైవర్ లెస్ కార్ల తయారీ చేపట్టనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, యంత్ర మేథస్సుల కలయికతో ఈ స్వయం చోదిత కార్లను తయారు చేయనున్నట్లు చైనా క్లౌడ్ కంప్యూటింగ్ సేవల సమావేశంలో బైడు సీనియర్ ఉపాధ్యక్షులు వాంగ్ జిన్ తెలిపారు. చైనా తయారీదారులు, ఇంటర్నెట్ దిగ్గజాలు డ్రైవర్ లెస్ టెక్నాలజీవైపు దృష్టి సారిస్తున్నారు. అమెరికా సంస్థలకు దీటుగా డ్రైవర్ లెస్ కార్ల తయారీకోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే మార్కెట్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికే గూగుల్ స్వయం చోదిత కారును అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్ళుగా బిఎమ్ డబ్ల్యూ, వోల్వో, టయోటాల సహకారంతో గూగుల్ అటానమస్ వాహనాల తయారీ చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం'బైడు' తయారీదారులు 'చంగన్' తో కలసి అదే రేసులో ఎంటరయ్యే ప్రయత్నం చేస్తోంది. దేశ మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి వాహనాల టెస్ట్ లో రాజధానికి నైరుతిలోని పర్వతశ్రేణుల్లో 2,000 కిలోమీటర్ల అత్యధిక దూరం ప్రయాణించిన రెండు స్వీయ డ్రైవింగ్ ఛంగన్ కార్లు ఇప్పటికే బీజింగ్ ఆటో షో లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. దీనికితోడు మరో చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం 'లీ ఎకో' కూడ అటానమస్ టెక్నాలజీలోకి ప్రవేశించి ఓ ఎలక్ట్రానిక్ కారును బీజింగ్ లో ఆవిష్కరించింది. చైనాలో 'బైడు' సంస్థ మొదటిసారి స్థానికంగా రూపొందించిన డ్రైవర్ లెస్ వాహనం గతేడాది చివరల్లో బీజింగ్ లోని వీధుల్లో 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ స్థానికులను ఆకట్టుకుంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో చైనా ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ స్థానిక వినియోగదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి, కీలక మార్కెట్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.